Friday, 4 September 2015

పిల్ల నచ్చిందా?

పర్సనల్ సెక్రటరీ గా పది రోజులు పని చేసిన కామేశం కి
బాసు యాపిల్ ఫోన్ , డైమండ్ రింగు, ఆడి కారు కొనిచ్చి
ఆత్మహత్య చేసుకున్నాక యస్సై వార్నింగ్ ఇచ్చి పంపాడు.
..
" మరెప్పుడయినా ఆడ్ గా బిహేవే చేస్తే ,
లాకప్పు లో వేసి మర్యాదలు చేసే అవకాశం ఉందని"
కొన్నాల్టికి అతను నార్మల్ అయ్యాడు.
..
కామేశానికి బార్యని వెతికే పనిలో పడ్డాడు తండ్రి.
చాలా ప్రయత్నం మీద ఒక అమ్మాయిని వెతికి పెళ్లి చూపులు
ఏర్పాటు చేశారు . కామేశానికి భయం పట్టుకుంది.
ఆ అమ్మాయికి నచ్చితే సరి , నచ్చకపోతే ఎలా చెప్పటం?
ఒకవేళ నచ్చలేదు అని చెబితే తండ్రి ఎగరేసి తన్నేట్టు ఉన్నాడు.
..
ఇలాటి విషయాలకి మిత్రుల వద్ద ఎప్పుడూ ఇంస్టంట్ సలహాలు ఉంటాయి కాబట్టి మిత్రులని ఆశించాడు ..
..
"సింపుల్ పిల్ల నచ్చితే గోడవే లేదు నచ్చలేదా? ..
గట్టిగా ఊపిరి పీల్చి ఆస్తమా రోగి లాగా పిల్లి కూత సౌండ్ ఇవ్వు .
మేము ఏదో రకంగా నిన్ను కాపాడతాము " మిత్రులు సలహా ఇచ్చారు ..
..
మొత్తానికి కామేశం పెళ్లి చూపులకి వచ్చాడు...
..
ఫార్మాలిటీస్, పరిచయాలు అయ్యాక అమ్మాయి.. ట్రే లో టీ కప్పులు పెట్టుకుని తీసుకు వచ్చి కామేశానికి ఇచ్చింది.
ఒరకంట ఒక సారి అతన్ని గమనించింది.
...
"అంతే గట్టిగా ఊపిరి పీలుస్తూ ఆస్తమా రోగి లాగా పిల్లి కూత సౌండ్ గట్టిగా ఇచ్చింది"...

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...