Tuesday 8 September 2015

బులుగు రంగు పొలిటీషియన్

రాష్ట్రపతి భవనం లో పావురాళ్ల బెడద ఎక్కువయ్యింది.
చుట్టూ ఉన్న చెట్లు దాని కింద నున్న బెంచీలు అన్నీ వాటి రెట్టలతో నిండి పోతున్నాయి. 
ఉద్యానవనం లోకి వెళ్ళే బాట పొడవునా పక్షుల వ్యర్ధాలే.
రోజు వాటిని శుభ్రం చేయటం కష్టం అయిపోతుంది సిబ్బందికి.
పక్షులని హింసించడం కలాం గారికి ఇష్టం లేక పోయింది.
..
పరిష్కారం కోసం అంధరు ఆలోచించి పేపర్ ప్రకటన ఇచ్చారు.
ఎవరయినా నివారణ మార్గం చెప్పమని...
..
రెండో రోజు ఒక మెజీషియన్ వచ్చారు .
కలాం గారిని కలిసి "నేను పక్షులని తరిమి వేస్తాను. డబ్బేమి వద్దు.
కానీ మీరేదయినా ప్రశ్న వేసి నానుండి సమాధానం ఆశిస్తే మాత్రం కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది "..
..
అతని తమాషా అయిన ప్రతిపాదనకి కలామ్ గారు
ఒప్పుకున్నారు ఒకింత ఆశ్చర్యంతో ....
..
మర్నాడు అతనో పెద్ద పెట్టె తో వచ్చాడు .
రాష్ట్రపతి భవనం పైకి చేరి పెట్టేలోంచి ఒక బులుగు రంగు మిరుమిట్లు గొలిపే పావురాన్ని బయటకు తీశాడు. ..
..
దానిని చేత్తో ఒక్క సారి నిమిరి గాల్లోకి వదిలాడు. .
అది అన్నీ చెట్ల చుట్టూ తిరిగి దూరంగా వెళ్లిపోయింది. ఆశ్చర్యం ..
చెట్ల మీద పావురాళ్ళన్ని బులుగు పావురం వెంట గుట్టగా వెళ్లిపోయాయి. కొంత సేపటి తర్వాత అది ఒక్కటే తిరిగోచ్చింది.
..
అతనికి లోపలి నుండి పిలుపోచ్చింది.
ఎడంకెలు వేసి ఉన్న చెక్కు మెజీషియన్ కి ఇస్తూ ఆయన అడిగాడు.
" మీ వద్ద బులుగు రంగు పొలిటీషియన్ ఉన్నారా?"

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...