Monday 14 September 2015

అతడు ఆమె ఒక రైలు ప్రయాణం

హుద్ హుద్ తర్వాత ఇంకా నార్మల్ అవని విశాఖ రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ బొగిల నెంబర్లు డిస్ప్లే బోర్డు ల మీద వెలగటం ఇంకా మొదలవలేదు.
రాత్రి 11-26 కి మూడో నెంబరు ఫ్లాట్ ఫార్మ్ మీదకి 17821 వచ్చినప్పుడు,
S1 కోచ్ ని వెతుకుతూ వెళుతుంటే ' ఆమె' తారస పడింది 'అతనికి'.
చూడగానే మళ్ళీ చూడాలనిపించే ప్రౌడ అందం. ఎత్తుగా నిండుగా తెల్లటి సిల్క్ క్లాత్ మీద వంగరంగు చుక్కల చీర. క్లిప్ తో బందించిన పొట్టి రింగుల జుట్టు, చంకలో హండు బాగు, ట్రాలి బాగ్ ని లాక్కుంటూ 'ఆమె' రెండో వైపు నుండి S1 ఎక్కింది. 53 బెర్తు లో అతను రెండు కూపేళ ఇవతల 62 లో ఆమె.
పగలంతా అలిసిన అతను నిద్ర లోంచి మేలుకునే సరికి ట్రైన్ ఆకివీడు దాటింది. లేచి ప్రకృతికి సమాదానం చెప్పి వాష్ బెషిన్ వద్ద పళ్ళు అరగ దీస్తుంటే విండో సీటు వద్ద కూర్చున్న ఆమెని గమనించాడు అతను. గబాలున ముగించి సోప్ తో ముఖం కడుక్కుని తడి చేత్తో జుట్టు ముందుకు లాక్కుని , ఆమె ముందుగా బోగీకి రెండో వైపు నడిచాడు. విజయవాడ చేరేలోపు గా ఆమె ఒక్కతే ప్రయాణిస్తుందని కనిపెట్టేశాడు.
7-40 కి విజయవాడ చేరేసరికి ట్రైన్ చాలా వరకు ఖాళీ అయ్యింది.
అతని ఉనికిని ఆమె గమనించింది. మగాళ్ల బండ చాష్టాలు మూడో మనిషికి వెంటనే పట్టిస్తాయి గాని ఆడవాళ్ళ అంగీకారం ఒక పట్టాన అర్ధమని చావదు. ఇది తర తరాల సమస్య frown emoticon
అతను ఆమెను అతి తక్కువ జనం మిగిలిన బోగీ లో దగ్గరగా గమనించడానికి కొంత మొరటు ప్రయత్నం చేశాడు . మామూలుగా అయితే ఆమె ముఖం చిట్లించడం ద్వారా అతడిని ఆమడ దూరం లో ఉంచొచ్చు కానీ అలాటి ప్రయత్నం ఏమి చేయలేదు. అతను తనని దాటుకుంటూ వెళ్ళేటప్పుడు కాళ్ళు తగలకుండా దగ్గరకి లాక్కుంది. తర్వాత తీరిగ్గా సీటు మీద బశాపట్లు వేసుకుని ఉన్న కొద్ది జుత్తుని హాండ్ బాగ్ లోంచి దువ్వెన తీసి దువ్వుకుని క్లిప్ మరో సారి పెట్టుకుంది. కూర్చుని మెడలో బంగారు గొలుసులని, చేతి గాజులని, పొట్టమీదికి చిరని సర్దుకుంది. అతగాడి తాపత్రయాన్ని గమనించి ఇక లాభం లేదని, అతను చదువుతున్నట్లు నటిస్తున్న పుస్తకాన్ని 'ఒక్క సారి చూసి ఇస్తాను ' అని అడిగి మరి తీసుకుంది. అది చాలు అతను అల్లుకు పోయాడు .తెనాలి వచ్చేసరికి ఇద్దరు ఒకే కుపెలో ఎదురెదురుగా ఎన్నో మాట్లాడు కోవటం, విజయవాడ లో కొన్న ఆరటి పళ్ళు ఆమెకి ఇవ్వటం ఆమె అందుకోవటం, అతను 'తన' గురించి మైక్రోస్కోప్ లోనూ ఆమె అతని గురించి విప్పరిన కళ్ల తోను మాట్లాడుకోవటం, సెల్ నెంబర్లు మార్చు కోవటం జరిగింది. ట్రైన్ లో వాష్ రూమ్ లో నీరు లేని పరిస్తితిని ఆమె ఉదహరిస్తే, అతడు మినరల్ వాటర్ బాటిల్ ఆఫర్ చేశాడు. "అవసరానికి ఎంత డబ్బైనా వాడుకోటానికే గదా ?" నవ్వాడతాను . కొద్దిసేపు మొహమాటం తర్వాత బాపట్ల దాటి చీరాల వైపు ట్రైన్ పరిగెత్తేటప్పుడు ఆమె ఆ బాటిల్ అందుకుని ఇప్పుడే వస్తాను అన్నట్లు గా అతని వైపు చూసి వాష్ రుము వైపు వెళ్లింది.
****
ఆమె బైటకి వచ్చి చూసే సరికి ట్రైన్ చీరాల వదిలింది. అతను లేడు. ఆమె లగేజీ లేదు. తనతో ఉంచుకున్న ఫోన్ నుండి కంగారుగా అతని నెంబరుకు రింగ్ చేసింది. కొద్ది సెకండ్లకే అటునుండి ఫోను లిఫ్ట్ అయిన శబ్దం. " హలో సువర్టు పురం SI స్పీకింగ్ " అటునుండి వినబడింది. ఈమె ఫోన్ కట్ చేసింది.
frown emoticon smile emoticon tongue emoticon 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...