Sunday 13 September 2015

డంబెల్ విత్ గొడుగు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉన్న రైల్వే రెస్ట్ హౌస్ కేర్ టేకర్(వాచ్ మెన్) ఉదయాన్నే వచ్చిన క్లీనింగ్ చేసే ఆవిడతో చెప్పాడు తాళం చేతులు ఇస్తూ.. “రాత్రి 12 వ రూము లో రెండురోజుల నుండి ఉన్న బాబుగారు ఖాళీ చేశారు. ముందు ఆ రూము శుభ్రం చెయ్యి “
ఆవిడ రుము తుడిచే సామాను, పినాయిలు సీసాతో మొదటి అంతస్తులో ఉన్న 12 వ నెంబరు రుము కి వెళ్లింది. రెండు బెడ్ రూములు, చిన్న కిచెన్ , పెద్ద బాత్ రుము ఉన్న ట్రాంసిట్ రెస్ట్ హౌస్(బదిలీ పై వచ్చిన ఉద్యోగులు తాత్కాలికంగా కొంత కాలం ఉండటానికి సరిపడే క్వార్టర్) అది. ఆమె రెండు రూములు శుబ్రం గా ఊడ్చి తడి బట్ట పెట్టేటప్పుడు అక్కడ ఉన్న టేబుల్ మీద ఉన్న ఘనపు అడుగు అట్ట పెట్టేని గమనించింది. 
ఖాళీ పెట్టె అనుకుని కదిపే ప్రయత్నం చేసింది. కానీ బరువుగా ఉండటం అన్నీ మూలలా పార్సిల్ టేప్ అంటించి ఉండటం తో ఆ ప్రయత్నం మానుకుంది. ఆవిడకి తెలుసు అలాటి గుర్తు తెలియని వస్తువులను తెరిచే ప్రయత్నం చేయకూడదని. వెంటనే కిందకి వెళ్ళి కేర్ టేకర్ అయిన ముసలాయన కి చెప్పింది. ఆయన అప్పుడే స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాడు . హడావిడిగా బట్టలు వేసుకుని ఇద్దరు రుము లోకి వచ్చారు . వెంటనే డి ఆర్ ఏం కి ఫోన్ చేశాడు.
‘ బాబుగారు , ఒక బాబు గారు తమ పాపతో రెండు రోజుల నుండి మన 12 నెంబరు రెస్ట్ హౌస్ లో ఉన్నారండి రాత్రి 11 కి ఖాళీ చేసి, బండి(train) కి వెళ్ళి పోయారండి. పొద్దుటే చూస్తే ఒక సీలు చేసిన అట్టపెట్టే ఉండండి. అది బరువుగా ఉందండి. మేమేమి ముట్టుకోలేదండీ . తమరికి చెబుతున్నానండీ “
జాగింగ్ చేస్తూ ఇయర్ ఫోన్ లో వింటున్న డి‌ఆర్‌ఎం గారు ఒక్క నిమిషం లో అలెర్ట్ అయ్యారు.
“పెట్టె ఎంత సైజుది ?”
“ఎటుచూసినా ఒక అడుగు ఉంటాదండీ. దాని మీద రెండు మూడు ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయండి. రంగు పెన్ను తో రాసి ఉన్నవి “
“చదువు ?” ఫోన్ లోనే అడిగాడాయన.
“ ఆర్ డి ఎక్స్ “ ఒక్కో అక్షరం కూడబలుక్కుని చదివాడాయన.
(బాంబుల తయారీ లో వాడే పేలుడు పదార్ధం)
అటునుండి వెంటనే అలెర్ట్ అయ్యాడు డి‌ఆర్‌ఎం గారు. నేను వస్తున్నాను ఏమి ముట్టు కోకండి రూము తలుపు వేసి బయటే ఉండండి ఎవరిని లోపలికి పోనివ్వద్దు “
సరిగ్గా 20 నిమిషాలలో రైల్వే పోలీస్ అదికారి తో కలిసి అక్కడికి వచ్చాడాయన.
ట్రైన్ అయిన కుక్కజూలీ ని కూడా వెంట తీసుకొచ్చారు . అందరినీ దూరంగా ఉండమని తమ ట్రైనేడ్ జూలీ ని లోపలికి పంపారు. ఈ లోగా రుము లో గత రెండు రోజులుగా బస చేసిన వ్యక్తి వివరాలు ఫోన్ నెంబరు తెప్పించాడు డియారెమ్ . ఆనెంబరు కి ఫోన్ చేస్తే ‘అందుబాటులో లేడని’ వినిపిస్తూ ఉంది. 
రెండు మూడు సార్లు జూలీ జాలిగా తోక ఊపుకుంటు వచ్చాక ప్రమాదమేదీ లేదని నిర్ధారించుకుని ఆ పెట్టెను ఓపెన్ చేయించాడు పోలీస్ అదికారి.
వ్యాయామం చేసుకునే ఒక డంబుల్, ఫోల్డింగ్ సౌకర్యం ఉన్న లేడీస్ గొడుగు ఉన్నాయందుల. ఒక చిన్న చీటి మీద “వీటిని నా వంతు గిఫ్ట్ గా ఇక్కడే ఉంచండి. బస చేయబోయే తరవాత వారికి ఉపయోగ పడతాయి” అని వ్రాసి ఉంది. 
అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. 


హటాత్తుగా వచ్చే వర్షాలకు, బయటకు వెళ్ళటానికి పనికి వస్తుందని గొడుగు , ఉదయాన్నే వార్మ్ అప్ వ్యాయామం కోసం డంబెల్ కొని బహుకరించి నట్లున్నాడు ‘ అదికారులు ఇద్దరు సమాదాన పరుచు కున్నారు. ఈ లోగా వాచ్ మెన్ వెళ్ళి ఫ్లాస్క్ లో టి తీసుకు వచ్చాడు .
వరండాలో రెండు కుర్చీలలో కూర్చుని వారిద్దరు టి సిప్ చేయసాగారు. కుడివైపు రైల్వే స్టేషన్ , ఆకాశం లో చాలా దగ్గరగా వెళ్తున్న విమానాలు, తుంపర వర్షం .. అద్బుతమయిన వాతా వరణం. 
ఇంతలో డియరెమ్ గారి ఫోన్ మోగింది . ఇందాక ఆయన ప్రయత్నించిన నెంబరు నుండి.
“ నమస్తే .. ఈ నెంబరుకు ఫోన్ చేశారండి? ఇప్పుడే సిగ్నల్ వచ్చింది మిస్డ్ కాల్ చూశాను ”
“నేను వైజాక్ రైల్వే డియరెమ్ ని మాట్లాడు తున్నాను. యు లెఫ్ట్ ఆ డంబుల్ అండ్ ఆన్ అంబరిల్లా ఇన్ ఆ క్లోజ్డ్ బాక్స్ .. “
ఆయన మాట పూర్తి కాకుండానే అటునుండి సమాదానం వచ్చింది. “డంబుల్ ని గడియ లేని బాత్ రుము డోరు కి అడ్డంగా ఉంచుకోటానికి , గొడుగుని పై బాత్రూము నుండి సరిగ్గా క్లోసెట్ మీద కూర్చున్నప్పుడు కారే నీటి నుండి కాపాడు కోటానికి అవసరమని పించి కొని ఉంచాను. స్వీకరించండి. “ 


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...