Tuesday 31 May 2016

ఫామిలి .. ఫామిలీ :)

.అప్పటికి అరగంట నుండి వార్డెన్ ని మాటల గారడీ లతో మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాను.
మా అమ్మాయి పి‌జి చేస్తున్న కాలేజీ , ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ ఆమె. శెలవులకి ఇంటికి తీసుకు వెళదామని నేను మా ఆవిడా వెళ్ళాం. అమ్మాయి బట్టలున్న బాగ్ లు రెండు బయట కారులో సర్ధి ఉన్నాం. వార్డెన్ పర్మిషన్ కోసం నేను అమ్మాయి వెళ్ళాం. మా ఆవిడని కొద్దిసేపు హాస్టల్ ముందున్న పార్కు లో వైట్ చెయ్యమని చెప్పి.
అప్పటిదాకా మనమ్మాయి కి అన్ని క్రెడిట్స్ ఉన్నాయని మనకి మాత్రం ఏం తెలుసు.
ఆమె చండ శాసనురాలని, కనీసం అరగంట క్లాసు కి ప్రిపేర్ కమ్మని ముందుగానే నన్ను సిద్దం చేసింది. అందుకే లోక్యం గా నన్ను పిలుచుకు వెళ్లింది.
“మీరెనా? ఫాదర్? “ అందామే.
నేను చుట్టూ కలియ చూశాను నాటకీయంగా..
ఆ రూములో మగ పురుగుని నేనొక్కడినే.
“మేడమ్ ఔట్ పాస్ కావాలి. పేరెంట్స్ తో సెలవులకి వెళ్తున్నాను” మమ్మాయి ఎలియన్స్ తో మాట్లాడినంత జాగర్తగా అంది.
“కూర్చోండి “ అందామే.
ఆమె రూములో ఎదురుగా సి సి కెమెరా మానిటర్స్ ఉండటం గమనించాను.
ఎక్కడ ఏమూల ఏమి జరిగినా ఆమెకి తెలియకుండా ఉండటం అసాద్యం.
ఇక ఆమె మా పాప లీలలు చెప్పటం మొదలెట్టింది.
“ వై ఫై  పాస్వర్డ్స్, హక్ చెయ్యటం, శాకాహార హాస్టల్ లోకి పార్సిల్స్ తేవటం. ఒక గాంగ్ ని మైన్టైన్ చెయ్యటం, హాస్టల్ లో వంటలకి సాకులు పెట్టటం, టి‌వి రూము టైమింగ్స్ మీద అల్లరి చెయ్యటం ..ఇలా చాలా “
“మా అమ్మాయి మోస్ట్ ఇన్నోసెంట్ మొహం తోను నేను మాటల గారడీ తోను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాను.
ఇంతలో మా అమ్మాయి నన్ను  మోచేత్తో పొడిచింది.
మానిటర్ చూడమన్నట్టు కళ్ళతో సైగ చేసింది.
సరిగ్గా కెమెరా ఉన్న చోటే నిలబడి మా ఆవిడ పూల మొక్కలు పీకి తనతో తెచ్చుకున్న కారి బాగ్ లో సర్దుతుంది


మిత్రులందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు :
*****************************************************
హనుమాన్ చాలీసా
దోహా-
శ్రీగురు చరన సరోజ రజ నిజ మను ముకుర సుధార
బరణౌం రఘువర విమల యశ జో దాయకు ఫలచార ||
బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహిఁ హరహు కలేస వికార ||
చౌపాయీ-
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహుం లోక ఉజాగర || ౧ ||
రామ దూత అతులిత బల ధామా |
అంజనిపుత్ర పవనసుత నామా || ౨ ||
మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ || ౩ ||
కంచన బరన విరాజ సువేసా |
కానన కుండల కుంచిత కేశా || ౪ ||
హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేఊ సాజై || ౫ ||
సంకర సువన కేసరీనందన |
తేజ ప్రతాప మహా జగ వందన || ౬ ||
విద్యావాన గుణీ అతిచాతుర |
రామ కాజ కరిబే కో ఆతుర || ౭ ||
ప్రభు చరిత్ర సునిబే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా || ౮ ||
సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా |
వికట రూప ధరి లంక జరావా || ౯ ||
భీమ రూప ధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || ౧౦ ||
లాయ సజీవన లఖన జియాయే |
శ్రీరఘువీర హరషి ఉర లాయే || ౧౧ ||
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ || ౧౨ ||
సహస వదన తుమ్హరో యస గావైఁ |
అస కహి శ్రీపతి కంఠ లగావైఁ || ౧౩ ||
సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || ౧౪ ||
యమ కుబేర దిక్పాల జహాం తే |
కవి కోవిద కహి సకే కహాం తే || ౧౫ ||
తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా || ౧౬ ||
తుమ్హరో మంత్ర విభీషన మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా || ౧౭ ||
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || ౧౮ ||
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీఁ |
జలధి లాంఘి గయే అచరజ నాహీఁ || ౧౯ ||
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || ౨౦ ||
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైసారే || ౨౧ ||
సబ సుఖ లహై తుమ్హారీ సరనా |
తుమ రక్షక కాహూ కో డర నా || ౨౨ ||
ఆపన తేజ సంహారో ఆపై |
తీనోఁ లోక హాంక తేఁ కాంపై || ౨౩ ||
భూత పిశాచ నికట నహిఁ ఆవై |
మహావీర జబ నామ సునావై || ౨౪ ||
నాశై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || ౨౫ ||
సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || ౨౬ ||
సబ పర రామ తపస్వీ రాజా |
తిన కే కాజ సకల తుమ సాజా || ౨౭ ||
ఔర మనోరథ జో కోయీ లావై |
తాసు అమిత జీవన ఫల పావై || ౨౮ ||
చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |
హై ప్రసిద్ధ జగత ఉజియారా || ౨౯ ||
సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || ౩౦ ||
అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |
అస బర దీన జానకీ మాతా || ౩౧ ||
రామ రసాయన తుమ్హరే పాసా |
సదా రహో రఘుపతి కే దాసా || ౩౨ ||
తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై || ౩౩ ||
అంత కాల రఘుపతి పుర జాయీ |
జహాఁ జన్మి హరిభక్త కహాయీ || ౩౪ ||
ఔర దేవతా చిత్త న ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ || ౩౫ ||
సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా || ౩౬ ||
జై జై జై హనుమాన గోసాయీఁ |
కృపా కరహు గురు దేవ కీ నాయీఁ || ౩౭ ||
యహ శత బార పాఠ కర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ || ౩౮ ||
జో యహ పఢై హనుమాన చలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీసా || ౩౯ ||
తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || ౪౦ ||
దోహా-
పవనతనయ సంకట హరణ
మంగల మూరతి రూప ||
రామ లఖన సీతా సహిత
హృదయ బసహు సుర భూప ||

Friday 27 May 2016

విలువైనవి పాతేస్తున్నామా?

బ్రెజిల్ దేశంలో ఒక కోటీశ్వరుడు...తన One Million Dollar ఖరీదుగల
బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు..!!
నేను ఈ కారుని ఎందుకు పాతి పెడుతున్నానంటే..
నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికివస్తుంది అని చెప్పాడు..!!
అప్పుడు ఈ కోటీశ్వరుడుని అందరూ..ఈయన ఒక పెద్ద అవివేకి అని...
One Million Dollar కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు..!!
మీడియా మరియు మిగిలిన ప్రజలు అతనికి చాలా తిట్టారు కూడా..!!
అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని..
చాలామంది చూడటానికి ఆత్రంగా జనం అంతా పోగై ఆ చోటికి వచ్చి ఉన్నారు..!!
పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి పెట్టారు..!!
ఆ తతంగాన్నిఅందరూ ఉత్సుకతతో మరియు ఆత్రుతతో చూస్తూ ఉన్నారు..!!
కారుని పాతిపెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి..ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు..!!
అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా..
ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు..??
మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికి రాదు..!!
దీనిని వేరోకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా..అని పదిమంది పదిరకాలుగా ప్రశ్నించారు..!!
అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు..!!
"నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమి అవివేకిని కాను..!!
దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను..!!
ఈ కారు ధర కేవలం 1 మిలియన్ డాలర్.. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం
తీసుకున్నందుకు మీ అందరికి నా మీద మీకు ఇంత కోపం వచ్చింది..!! నిజమే..!!


కానీ మీరు మాత్రం...
వెలకట్టలేని...
మీ(మన) గుండె...
కళ్ళు...
ఊపిరితిత్తులు..
మూత్రపిండాలు..etc..
ఇలా మన శరీరంలోని ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడతాయి..!!
ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా..వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి..!!
వాటి గురించి మీకు ఏ మాత్రం చింతకాని..ఆలోచన కాని లేదు..!! ఎందుకు..??
కారు పోయినా..డబ్బు పోయినా మళ్ళి తిరిగి వస్తుంది..!!
మరి మన అవయవాలు తిరిగి వస్తాయా..?? వాటికి విలువ కట్టగలమా..??
.
మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చెయ్యలేము..!!
కొన్ని లక్షలమంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు..!!
మనం అంతా ఎందుకు వారికి సాయం చెయ్యకూడదు..??
ఆలోచించండి..!! అవయవదానం చెయ్యడానికి నడుం బిగించండి..!!
మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడాను..!! "


( ఎంత అద్భుతమైన సందేశం కదా.మిత్రులు వాట్స్ ఆప్ ద్వారా షేర్ చేశారు)

Thursday 26 May 2016

యోగి సందేశం

రామకృష్ణ పరమహంస అనే యోగి తన శిష్యులతో కలసి దేశాటనం చేస్తూ ఉన్నారు.
ఆ క్రమంలో వారు ఒక గ్రామం చేరారు..
గ్రామ పొలిమేరలకి గ్రామ పెద్దలు వచ్చి, సాదరంగా ఆహ్వానం పలికి, తమ వెంట తీసుకుని వెళ్ళి వారికి బస ఏర్పాట్లు , బోజనాది వసతులు కల్పించారు. రాత్రికి దేవాలయం ఆవరణలో వారి ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. పొద్దు పోయేంత వరకు పరమహంస గారి ప్రసంగం విన్నారు. సందేహ నివృత్తి చేసుకున్నారు.
ఉదయాన్నే గురు శిష్య బృందం మరో గ్రామం బయలు దేరింది. ఊరి పొలిమెర్ల వరకు మొదటి గ్రామస్తులు వెంట వచ్చి వీడ్కోలు చెప్పారు.
వారు వెళ్ళాక పరమహంస గారు భగవద్యానం చేసి “ ఈ గ్రామం లో కరువు కాటకాలు సంభవించి ప్రజలందరూ దేశ నలుమూలలకు వలస వెల్దురు గాక అని ఆశీర్వచనం చేశారు. శిష్యులు ఆశ్చర్య చకితులు అయ్యారు.
రెండో గ్రామం లో వారికి ఎలాటి ఆదరణ  లభించలేదు. ప్రజలు వీరిని పట్టించుకోలేదు. కనీసం బిక్షాటన చేసుకున్న వస్తువులని వండుకొటానికి కూడా సహకరించలేదు. గుడి మెట్ల మీద ఆ రాత్రి గడిపిన పరమహంస బృందం యదావిది గా మరో గ్రామం బయలు దేరింది.
మళ్ళీ పొలిమేర దాటేటప్పుడు పరమహంస వారు “ఈ గ్రామం సస్యశ్యామలంగా ఉండాలి. గ్రామస్తులందరికి ఇదే గ్రామంలో బుక్తి జరగాలి. ఇక్కడే వారు శేష జీవితం గడపాలి” అని దీవించారు.
ఈ సారి శిష్యులు ఇంకా ఆశ్చర్యపోయారు.
సందేహ నివృత్తి కోసం దైర్యం చేసి గురువు గారిని ప్రశ్నించారు. ఈ పూర్తి వ్యతిరేఖ ఆశీర్వచనం లోని అంతరార్ధం వివరించ మని.
“మొదటి గ్రామం లోని వారు సజ్జనులు.. వారి మంచి తనం దశదిసలా వ్యాపించాలి. వారి గొప్పమనసు తో దేశం నలుమూలలా సుగంధం ప్రభవించాలి. రెండవ గ్రామం వారి మూర్ఖత్వం వారితోనే నశించాలి” అని సందేహ నివృత్తి చేశారు.
వికసించిన మోముతో గురు శిష్య బృందం మరో గ్రామం వైపు ప్రయాణం సాగించింది.

(చిన్న వయసులో మా నాన్న గారు ఇలాటి మంచి కదలు బోలెడు చెప్పారు. మీరెప్పుడయినా మీ పిల్లలకి చెప్పారా?)

Wednesday 25 May 2016

మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఛాతీ లో నొప్పి వస్తే ఏం చేస్తారు??

This is from Cardiology Please give your 2min and read this:-
1 Let’s say it’s 7.25pm and you’re going home (alone of course) after an unusually hard day on the job.
2 You’re really tired, upset and frustrated.
3 Suddenly you start experiencing severe pain in your chest that starts to drag out into your arm and up in to your jaw. You are only about five km from the hospital nearest your home.
4 Unfortunately you don’t know if you’ll be able to make it that far.
5 You have been trained in CPR, but the guy who taught the course did not tell you how to perform it on yourself.
6 HOW TO SURVIVE A HEART ATTACK WHEN ALONE?
Since many people are alone when they suffer a heart attack without help, the person whose heart is beating improperly and who begins to feel faint, has only
about 10 seconds left before losing consciousness.
7 However, these victims can help themselves by coughing
repeatedly and very vigorously. A deep breath should be taken before each cough, and the cough must be deep and prolonged, as when producing sputum from deep inside the chest.
A breath and a cough must be repeated about every two
seconds without let-up until help arrives, or until
the heart is felt to be beating normally again.
8 Deep breaths get oxygen into the lungs and coughing
movements squeeze the heart and keep the blood circulating. The squeezing pressure on the heart also helps it regain normal rhythm. In this way, heart attack victims can get to a hospital.
9 Tell as many other people as possible about this. It could save their lives!!
10 A cardiologist says If everyone who gets this mail
kindly sends it to 10 people, you can bet that we’ll save at least one life.
11 Rather than sending jokes, please..contribute by forwarding this mail which can save a person’s life….
12 If this message comes around you ……more than once…..please don’t get irritated……U need to be happy that you have many friends who care about you & being reminded of how to tackle….Heart attacks….AGAIN…
From:
DR.N Siva
(Senior Cardiologist)
Copy and paste...u might save lives 😊Pl don't mind repetition

Tuesday 24 May 2016

మూడో పొట్లం

మహారాష్ట్ర లో SBI లో పి ఓ గా చేసే శ్రీదర్ కి, 
విష్ణు కాలేజీ లో బి డి యెస్ చేసిన సుమిత్రకి ఆర్నెళ్ళ క్రితమే వివాహం అయింది. అప్పటి నుండి అత్తగారింట్లోను, తల్లి తండ్రులతోనూ గడిపిన సుమిత్ర, 
శ్రీధర్ కి మచిలీపట్నం బదిలీ తో ఊపిరి పీల్చు కున్నట్లయింది. 
కొత్తగా కాపురానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాక, 
ఇష్ట దైవం తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి కొత్త జంట ఇద్దరు వచ్చారు. 
...
తొలినాళ్లలో అన్నీ శ్రద్దగా ఉంటాయి కాబట్టి శ్రీదర్ దర్శనం& కాటేజీ వసతులు అన్నీ ఆన్లైన్ లో చేయటం తో షెడ్యూల్ ప్రకారం ఏమాత్రం ఆటంకాలు లేకుండా ట్రిప్ పూర్తయింది. ...
తిరుగు ప్రయాణం లో తిరుమల లో బోజనమ్ చేసుకుని 3.50 కి బయలు దేరే ట్రైన్ అందుకోటానికి ఆటొ లో రైల్వే స్టేషన్ కి వచ్చేశారు. 
ఇంకా అరగంట మించి టైమ్ ఉంది.
..
మొదటి ఫ్లాట్ ఫార్మ్ మీద నుండి మూడో దానికి వెళ్ళేటపుడు escalator ఎక్కారు. నాలుగు మెట్లు ముందున్న వ్యక్తి చేతిలో ఉన్న ప్లాస్టిక్ బాగ్ చినిగి టక్కున అందులో ఉన్న పార్సిల్ బోజనమ్ పాకెట్టు కదిలే మెట్ల మద్య పడి పోయింది. ..
..
అతను వెంటనే సర్దుకుని మిగిలిన రెండు పాకెట్లు జారీ పోకుండా కాపాడు కున్నాడు. శ్రీదర్ సాయం చేయబోయే లోపే ఆ బోజనమ్ పాకెట్ పనికి రాకుండా అయిపోయింది. మెట్లు పైకి రాగానే, తమ బాగ్ లో సైడ్ ఉంచుకున్న గట్టి కెరీ బాగ్ ఒకటి తీసి మిగిలిన రెండు పాకెట్లు అందులో వేసి అతనికి ఇచ్చాడు.
.. ..
అతను పలకరింపుగా నవ్వాడు. సంచి బరువు మోయలేక పోయిందిఅన్నాడు. తన పొరపాటు ఏమి లేదని చెప్పుకుంటున్నట్టు. ..
..
అతని పేరు వెంకట్రామయ్య అని, చాలా దూరం నుండి బార్యా పిల్లలతో వచ్చానని, తిరుమల మొక్కు తీర్చుకుని వెళ్తున్నామని. ..11 గంటలకి రావాల్సిన పాసింజర్ రైలు లేటు అయ్యిందని. ఒక క్విక్ పరిచయం చేసుకున్నాడు.
..
మేము అందరం మూడో నెంబరు ఫ్లాట్ ఫార్మ్ మీదకి చేరాము...
.. 
అతను కొద్ది దూరం లో ఉన్నతమ కుటుంబం దగ్గరకి వెళ్ళాడు. ..
వారి 10,12 ఏండ్ల వయసు ఉండే పిల్లలు ఇద్దరికీ గుండ్లకి గందం రాసి ఉంది. పిల్లలిద్దరి నుదుటు కి శ్రీనివాసుని నామాలు ఉన్నాయి. 
కొద్ది దూరం లో ఉన్న శ్రీధర్ సుమిత్ర లకి ఆ కుటుంబం కనబడుతూనే ఉంది. 
సుమిత్ర కి తాము కూడా కొన్నాళ్ళకి ఇలానే పిల్ల పాపలతో .. 
అనే ఆలోచన వచ్చి, శ్రీధర్ తో మాట్లాడుతూనే ముచ్చటగా ఉన్న ఆ కుటుంబాన్ని ఒరకంట గమనించ సాగింది.
..
వెంకట్రామయ్య బార్య పిల్లల వద్దకి వెళ్ళగానే ..
నేను అక్కడే తినేశాను మీ వరకు పొట్లం కట్టించుకొచ్చాను. తినెయ్యండి"

అని చెప్పి పేట్ బాటిల్లో మంచి నీరు కోసం ఫ్లాట్ ఫారం మీద వెతుక్కుంటూ వెళ్ళాడు.
..
సుమిత్ర కి ఆశ్చర్యం వేసింది. అతను బార్యతో ఎందుకలా చెప్పాడో అర్ధం కాలేదు. 
ఈలోగా వెంకట్రామయ్య బార్య ఒక పొట్లం విప్పి, అన్నం కూరలు కలిపి పిల్లలిద్దరికి ముద్దలు చేసి పెట్ట సాగింది. ..
పిల్లలు బాగా ఆకలి తో ఉన్నట్టు వారు తినే పద్దతిని బట్టి సుమిత్రకి అర్ధం అయింది.
..
పిల్లలిద్దరి చేతులు కడిగాక రెండో పార్సిల్ విప్పి ఆమె ఒక ప్లేటు లో అన్నం, కూరలు సర్ది వెంకట్రామయ్య కి తినమని ఇచ్చింది.
నేను తినే వచ్చానే .. నువ్వు తిను. లేకపోతే ఇంకో పొట్లం తచ్చేవాడిని కదా?” వెంకట్రామయ్య నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు.

...
ఆమె ఏమాత్రం వినిపించు కోకుండా మేం తినకుండా నెవెప్పుడన్నా తిన్నావా? ఇద్దరం చెరో ముద్ద తిందాము.అంది....
..
తలకి చుట్టు కున్న తువాలు తో నేల మీద దుమ్ము విసిరి, అతను ఆమె పక్కన కూర్చున్నాడు. ..
..
ఇద్దరినీ గమనిస్తున్న సుమిత్ర పక్కనే కూర్చుని ఉన్న శ్రీధర్ చేతిని బలంగా పట్టుకుంది. ఏదో అర్ధమయిన భావం శ్రీధర్ ని కూడా చుట్టు ముట్టింది.
***
(ఎన్నో జీవితాలని దగ్గరనుండి చూస్తుంటాను. ప్రతి సంఘటన వెనుక ఉన్న జీవితాన్ని గమనిస్తూ ఉంటాను. అందులో 'ఎస్సెన్స్' పట్టుకునే ప్రయత్నం చేస్తుంటాను కొందరికి ఇవి నాటు గాను, మోటు గాను లేదా సిల్లీ గాను అనిపించవచ్చు. కానీ చాలా గొప్ప మేనేజ్మెంట్ పాఠాలు మనం పరిసరాలనుండి నేర్చుకోవచ్చు)

Saturday 21 May 2016

ఏ తల్లి బిడ్డో

మొన్న మేం వైజాక్ వెళ్తుంటే జరిగింది ఈ సంఘటన.. 
(18-5-16 రాత్రి తిరుపతి పూరీ express )

***
రేజర్వేషన్ బోగీ లోకి ఒక మహిళా ఆరేడు నెలల పసిబిడ్డతో ఎక్కింది. 
ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చుంటూ ..
విజయవాడ దాటేసరికి నేలమీద పసిబిడ్డని పడుకోబెట్టుకుని నిద్ర పోతుంది. 
అర్ధ రాత్రి దాటింది.
..
భీమవరందాటేసరికి బయట వర్షం.. ..
తలుపు సందుల్లోంచి చల్లటి గాలి 
బిడ్డ ఏడుపు మొదలిట్టింది. 
సన్నగా మొదలయ్యి గుక్కపట్టి ఏడుస్తుంది. 
కంపార్టుమెంటు అంతా ఇబ్బంది వాతావరణం.
**
మాతో పాటు మా బోగీలో ఒక నడి వయసు మహిళ,ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం చేరనున్న కుమారుడుని తోడుగా తీసుకుని అరసవెల్లి దేవాలయానికి వెళుతుంది. వారి వెంట ఆమె తల్లి కూడా ఉన్నారు.
..
పసిబిడ్డ ఏడుస్తూ ఉంది. బాగా ఇబ్బందిగా ఉంది. ..
నేను పై బెర్తు నుండి అసహాయంగా చూస్తున్నాను. 
..
ఆ యువకుడి తల్లి ఆమెతో మాట్లాడుతుంది. ..
'
తల్లి పాలు లేనప్పుడు కనీసం పాల డబ్బా లేకుండా ఎలా బయలుదేరావు' అని కోప్పడుతున్నట్లు గా మాట్లాడుతుంది. 
..
ఈ లోగా పసిబిడ్డ తల్లి వాష్ రూమ్ వైపుగా వెళ్ళి రెండంటే రెండు నిమిషాల్లో వచ్చింది. బిడ్డ ఏడుపు మానేసి ఉంది. వళ్ళు తెలియకుండా నిద్ర పోతుంది. 
..
మళ్ళీ అందరూ నిద్ర లోకి జారుకోబోతున్నప్పుడు 
ఏమయిందో ఏమో ఆమె ఠక్కున లేచి కొడుకు సాయం తో TC ని పిలిపించింది...
..
సప్ష్టంగా ఈమె వైఖరి నాకు అనుమానంగా ఉంది అంది.
నేను ఆసక్తిగా లేచి కూర్చున్నాను. ..
ఈ లోగా మా శ్రీమతి కూడా..
టి సి మా శ్రీమతి బెర్త్ మీద కూర్చుని ఆమెని టికెట్ అడిగాడు. 
శ్రీకాకుళం వరకు ఉన్న జనరల్ టికెట్ అది.
..
ఆమె ..చెప్పిన సమాదానం ప్రకారం తాను చిన్న ఉద్యోగం చేస్తుంది. బిడ్డని తీసుకుని శ్రీకాకుళం బర్త దగ్గరకి వెళ్తుంది.
..
ఆమె లగేజీ చూపించమంటే ఏమి లేదు అంది 
మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చెయ్యి అన్నాడు టి సి 
నా ఫోన్ లో బెలాన్స్ లేదు. అంది నిర్లిప్తంగా...
..
ఆయన ఫోన్ నెంబరు గద్దించి అడిగి తన ఫోన్ నుండి కాల్ చేశాడు. 
అటునుండి మగమనిషి తమకి ఒకటే కుమార్తె అని ఆరేళ్ళ వయసని చెప్పటం మేమందరం విన్నాం...
..
'
నేను ఏదో చిల్లర దొంగ అని మాత్రమే అనుకున్నాను' మా ఆవిడ తోటి ఆమెతో అంది.
అయిదు నిమిషాల్లో రైల్వే పోలీస్ అక్కడికి రావటం ఆమెని వెంటబెట్టుకుని వెళ్ళటం జరిగి పోయింది.
..
ఆమె మెడ మీద నల్ల మందు(గంజాయి) తినిపించిన ఏతల్లి బిడ్డోఘాడంగా నిద్ర పోతూ ఉంది. ..
***
(20
వ తేది ఉదయం, దర్శనం అయ్యాక 'సింహాద్రి అప్పన్న' వద్ద ప్రసాదాలు కొనుక్కుంటుంటే ..మేం ఎప్పటికీ మరువలేని ఆ తల్లి కొడుకులు కనిపించారు. ఆవిడ చొరవ మరో తల్లి ని కడుపు కోత నుండి కాపాడింది. వారికి,వారి కుటుంబానికి ఆ 'సింహాద్రి అప్పన్న'కటాక్షం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. )

Tuesday 17 May 2016

అమ్మ కొట్టింది

1997-98 కాలం లో నేను కురిచేడు లో పని చేస్తూండే వాడిని.
దగ్గర్లో ఉన్న మా అత్తగారి ఊరు దరిశిలో ఒక మాస్టారి ఇంట్లో అద్దె కి ఉంటుండే వారిమి.
గజం పొడుగు భావన అప్పుడప్పుడే స్కూల్ కి వెలుతుండేది.
అరగజం పొడవు జీవన ఇంట్లో మా ఆవిడని ఆడుకుంటూ ఉండేది.
..
ఒకరోజు నేను నా ఉద్యోగం విదులు నిర్వహించుకుని సాయంత్రం ఆరు అవుతుండగా బజాజ్ M-80 బండి మీద ఇంటికొచ్చేసరికి మేముండే ఇంటి కు ముందు విశాలంగా ఉన్న స్థలం లో చెట్టు కింద మా చిన్నది కూర్చొని తీరిగ్గా బిస్కెట్ నములుతూ ఉంది..
..
బండి ఇంటి దగ్గరకి వచ్చేసరికి ఏదో కుట్టినట్టు పెద్దగా ఏడుపు లంకించుకుంది. 
..
వస్తున్ననవ్వు కనబడ నీయకుండా బండి కి ముందు బాగం లో ప్రత్యకంగా చేయించిన సీటు మీద కూర్చో బెట్టుకుని ఏమయిందమ్మాఅని బుజ్జగింపుగా అడిగాను. 
..
సమాదానం తెలిసిందే .. రోజు చెప్పేదే మళ్ళీ చెప్పింది.
అమ్మ కొట్టింది” 
..
నిజమా కొట్టిందా చిట్టి తల్లిని? పిలువ్ బయటకి ఇవాలా ఆటో ఇటో తేల్చేద్దాం
నేను గట్టిగా చెప్పాను. బండి పార్కింగ్ చేసి తనని దించగానే,
గబగబా వాకిలి వద్ద కెళ్ళి
అమ్మా రామాంజమ్మా నువ్వు బయటికి రామ్మా .. మా నాన్న వచ్చాడు. నన్ను కొట్టావుగాఅంది మిగిలిన బిస్కెట్ తింటూ ..
..
మా ఆవిడ మంచినీరు తేచ్చి ఇచ్చి ఎడం మోచెయ్యి దగ్గర చూపించి
చూడండి ఎట్లా కొరికిందో ?” అంది.
సన్నటి బియ్యం పళ్ళు దిగి ఎర్రగా కమిలి ఉంది.
..
ఒక్క నిమిషం బిస్కెట్ తినటం ఆపి నా రియాక్షన్ కోసం చూసింది అర గజం.
..
అయితే మా అమ్మాయిని కొడతావా? నువ్వే కోరుక్కుని ఉంటావు. చిట్టి తల్లి మీద అభాండాలు వేస్తావా?” నేను గదిమి నట్లు మాట్లాడాను.
..
ఫ్రెష్ అయిన వెంటనే దాన్ని తీసుకుని ట్యూషన్ కి వెళ్ళిన పెద్దమ్మాయి దగ్గరకు వెళ్ళి తనని కూడా బండి మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చాను.
..
పిల్లలు నిద్రపోయాక దాన్ని గారాబం చేస్తున్నావు. అది నన్ను కర్రముక్కతో కొట్టింది.అంది మా ఆవిడ.
..
సర్లేవే. చిన్న దాన్ని కొప్పడితే నాకు అదే పరిస్తితి. నా జాగర్త నాది
..
(
పాత డైరీ తిరగేస్తుంటే .. ఈ ఇన్సిడెంట్ కనబడింది. )

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...