Wednesday, 9 September 2015

సన్ ఒఫ్ బిచ్

తమ ఒక్కగానొక్క పిల్లాడు విపరీతంగా చదివేసి రాత్రికి రాత్రి రెండు మూడు జిల్లాలకి కలెక్టర్ కావాలని ఒక.' కే‌జి తో పి‌జి కార్పొరేట్ కాలేజి' లో చేర్పించారు ఆ దంపతులు ..
పిల్లాడు కూడా ఈ ప్రపంచం లో కంటే ఆ జైల్లే నయమన్నట్టు అక్కడే దారాళంగా చదవటం మొదలెట్టాడు.
ఒక ఆది వారం దంపతులిద్దరూ పిల్లాడిని చూడ టానికి వచ్చారు.
ఇప్పుడే వస్తా మమ్మీ మా మిస్ ఇచ్చిన వర్క్ పూర్తి చేసి వస్తా అన్నాడా పిల్లాడు. తల్లి మురిసిపోయింది. నేను వస్తా అని వెళ్ళి పక్కనే కూర్చుంది.
వాడు నోట్సు తెరిసి
1+1 ది సన్ ఒఫ్ బిచ్ ఈస్ 2,
1+2 ది సన్ ఒఫ్ బిx ఈస్ 3,
1+3 ది సన్ ఒఫ్ బిx ఈస్ 4
అని చదువుతూ హోంవర్క్ రాయసాగాడు .
వాడి మాటలకి ఆమె బిత్తర పోయింది.
"ఎవర్రా నీకు లెక్కలు నేర్పేది?"
"కౌసల్య మిస్"
వాడిని లాక్కుని వెళ్ళి హెడ్ మిస్ దగ్గర విషయం చెప్పింది .
వెలకి వేలు పోసి చదివిస్తుంది బూతులు నేర్పటానికా?
హెడ్ మిస్ మరోసారి వాడి చేత వర్క్ చేయించింది.
" పిల్లలందరిలో కూర్చుని చదవటం కదండీ 1+1 the sum of which is 2 అని నేర్పి ఉంటుంది టీచర్, వాడిని ఎవరు కరెక్ట్ చెయ్యక పోవటం తో ఇలా నేర్చుకున్నాడు."
పిల్లాడిని హాస్టల్ మాన్పించి దగ్గరలోని స్కూల్ లే వేశారు.
వాడేం చదువుతున్నాడో తల్లి గమనిస్తూ ఉంది. వీలయితే తాను చదువుతుంది. పిల్లాడు బాల్యం .. బాల్యం లానే గడుస్తుంది.
పిల్లోడు ఖుష్ , పెద్దోల్లు ఖుష్ .. smile emoticon


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...