Thursday, 31 December 2015

HAPPY NEW YEAR

ఒక ధీరోదాత్తమయిన ప్రయోగం -1 :(మెల్ వెర్షన్)
**
ఇంటావిడని , పెంపుడు కుక్కని చెరో రూములో వేసి
నాలుగు గంటల పాటు బంధించండి.
తరవాత తలుపు తీయండి.
**
ప్రేమగా మీ చుట్టు ఎవరు ఎవరు తిరుగుతారో :p
పైన పడి ఎవరు రోక్కుతారో ;) .. మీకు తెలుసా???
**
హెచ్చరిక:-
++++++
(ఇది బాగా ప్రొఫెషనల్స్ చెయ్యగలిగిన ప్రమాదకరమయిన ప్రయోగం.
మీరు ఇంటివద్ద ప్రయత్నం చేయకండి. ఇన్సూరెన్స్ ఆఫీసు వాళ్ళకి పని పడొచ్చు ;)
ప్రస్తుతం తమ కుక్కలతో ఆనంధంగా ఉంటున్న
కొంత మంది మోనగాళ్ళూ ఈ ప్రయోగాలు చేశారు)
*****
ప్రయోగం - 2 (ఆడ లేడీస్ వెర్షన్ )
-----------------------------------
మీ ఇంటాయన్ని, పెంపుడు కుక్కని చెరో రూములో వేసి
నాలుగు గంటల పాటు బంధించండి.
తరవాత తలుపు తీయండి.
***
కుక్క మీకోసం ప్రేమగా ఎదురు చూస్తుంటుంది.
మనాడు ఇదే సందు అని కమ్మగా నిద్రపోతుంటాడు :) :D
***
HAPPY NEW YEAR FRIENDS.
LET GOD BLESS YOU ALL._/|\_

2015 లో మగాళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్

దీనెమ్మ జీవితం L
ఎవడినయినా అడుగు అందరూ చెప్పేమాట.
కట్టుకున్న దాన్ని సుఖపెట్టు -- అనే 
సాద్యమా? ఆహా సాద్యమా? అని.....
ఉదాహరణకి ఈ కింద ప్రశ్నలు మార్కులు చూడండి. 
..
ఇంట్లో సాయం 
+++++++++
మంచం మీద దుప్పట్లు సర్దుతాం . (+1 మార్కు )
మాచింగు దిండు గలీబులు మార్చడం మరుస్తాం (-10 మార్కులు)
దుప్పటి పరుపు అంచులు వద్ద సర్దటం బద్దకిస్తాం (-3)
ఆమెకి కావాల్సినవి తే టానికి బజారుకి వెళ్తాము (+5)
అది వర్షం లో (+8)
అలవాటయిన క్వార్టర్ తెచ్చుకుంటాం (-20)..
గెస్ట్ లు /స్నేహితులు 
++++++++++++
ఆదివారం మిత్రులు పలకరించడానికి వస్తారు (0)
కర్టెన్స్ ని, సోఫాని, గోడమీద పెయింటింగ్ ని పొగుడుతారు (+9)
టి తెస్తాను కూర్చోండి అన్నయ్యాఅనగానే దేబ్యమ్ ముఖం వేసుకుని కూర్చుంటారు (-8)
పింజారి వేదవలకి ఆ బిస్కెట్ ముక్కలు కూడా ప్లేట్లో పెట్టి ఇవ్వు వంటగదిలో మనం బయంగా సలహాలిస్తమ్ (-15)
కాలేజీలో మన సాహసాలు గుర్తు చేస్తారు (+1)
సరోజ పాస్ కావటానికి మనమే కారణం అని చెబుతారు (-24)
బందువులు 
+++++++
అత్తగారి తరఫు వాళ్ళు అర్ధరాత్రి వస్తారు (+5)
మనమే చలిలో స్టేషన్ కి వెళ్ళి తీసుకోస్తాం (+12)
మధ్యాన్నం బోజనానికి మంచి హోటల్ నుండి రొయ్యల కూర పార్సిల్ తెస్తాము (+18)
మరదలి తో దబ్బపండు లాగా ఉన్నావు అంటాం  (-38)
మన బందువులు వస్తారు (-7)
టిఫిను చేసి వస్తారు, ఏదో ఆఫీసులో పని ఉంది చూసుకుని సాయంత్రం వెళతామ్ అంటారు (0)
ఇంటి వద్ద నుండి రావాల్సిన పొలం కవులు డబ్బులు తీసుకొస్తారు (+12)
మధ్యాహ్నం పప్పు జాడీ పచ్చడి తో బోజనమ్ చేస్తారు (-32)
..
సాహసాలు 
+++++++
రాత్రి పూట హల్లో చప్పుడు కి లేచి వెళ్ళి చూస్తాం (+5)
కాలెండర్ ఊగటం వల్ల అని తేలుస్తామ్ (0)
లేదు మరేదో జరిగింది అని కనిపెడతాం (+5)
రోకలి బండతో ఒకటి ఇస్తాం (+10)
ఆమె పెంపుడు కుక్కని తెలుసుకుంటాం (-20)..
..
సామాజిక పనులు 
++++++++++++
పార్టీకి వెళ్లినప్పుడు పూర్తిగా తన పక్కనే ఉంటాం (+1)
కొద్దిసేపు ఉండి, పాత మిత్రులని కలిసి గప్ అండ్ గాస్ కొడతాం (-5)
వాళ్ళలో కనకం ఉంటుంది (-10)
కనకం ఫోన్ నెంబరు తీసుకుంటాం (-30)
ఆమె ఇంకా ఒంటరిగానే ఉన్నట్టు తెలుసుకుంటామ్  (-80)..
..
ఆమె పుట్టినరోజు 
++++++++++
సాయంత్రం బోజనానికి తీసు కెళ్తాము (+5)
మందు మాట ఉండని రెస్టారెంట్ అది (+3)
క్రికెట్ మ్యాచ్ వచ్చే టి‌.వి ఉంటుంది (-3)
వీలయినంత ఎక్కువ సేపు తింటూ .ఉంటాం (-4)
మీ ఫవరేట్ ప్లేయర్ సిక్స్ కొట్టినప్పుడు పెద్దగా అరుస్తాం ఆటలో లినమయిపోతాం (-18)...
..
సినిమా కి వెళ్ళిన రోజు 
+++++++++++++
ఆమెని సినిమాకి తీసుకెళ్తాం (+3)
ఆమెకి ఇష్టమయిన సినిమా (+5)
మనకు అసలు నచ్చనిది (+8)
ఒకవేళ మనకి ఇష్టమయిన సినిమా అనుకోండి (-5)
హీరోయిన్ కొంచెం విశాలంగా ఉందనుకోండి (-13)
అబ్బే డ్రస్ డిజైనర్ బలహీనం, పైగా హీరోయిన్ కడు బీదది అని చెప్పామనుకోండి (-26)..
..
...
మన ఆకారం 
+++++++
గమనించగలిగిన బొజ్జ కూడపెట్టామనుకోండి (-15)
గమనించి, వ్యాయామం గట్రా మొదలెట్టామను కోండి (+10)
బొజ్జ కి ఉటంగా బాగి ఫాంటు, బాగి హవాయి చొక్కా లు వేశామనుకోండి (-30)
నోటి దూల కొంది .. నీకు పొట్ట ఉంది అన్నామనుకోండి (-100) ..
..
లావు ప్రశ్న 
++++++
నేను లావుగా ఉన్నానా ? అని ఆమె అడిగితే (-5)
అవును మనమేమీ చెప్పక పోయినా మార్కులు తగ్గుతాయి. నిబందనలు అలా ఉంటాయి.
సమాదానానికి తటపటాయించేటప్పుడు (-10)
మనం దైర్యంగా "ఏ బాగం లో " అన్నామా ?ఆహా అన్నామా? (-74)
మరే సమాదానం అయినా సరే (-38)
..
కమ్యూనికేషన్ 
+++++++++
ఆమె మనతో మాట్లాడదలుచు కున్నప్పుడు శ్రద్దగా వింటూ ఉంటే (+3)
అరగంట మించి విని . వింటున్నట్టు కనిపించడం కూడా చేస్తే (+50)
మొహం లో విసుగు లేకుండా, టి‌వి/ మొబైల్ చూడకుండా వింటుంటే (+500)
మనం కళ్ళు తెరిచి నిద్ర పోతున్నాం అని ఆమె కనిపెట్టింది (-1101)
ఇప్పుడు పేపరు మొత్తం కూడుకుని మార్కులు చూసుకుందాం .
xxxx
అది మనకు మిగిలింది.
ఈ లెక్కన మగాడు పరీక్ష ఎప్పుడు పాసవ్వాలి.???
***
కనుక మిత్రులారా వైను గోపాల, వారి సన్నిధిలో జరగనున్న 
N E W Y E A R P A R T Y 
కి వచ్చి శక్తి వంచన లేకుండా పాల్గొని 'తీర్ధ' & 'ప్రసాదాల' తో
2 0 1 6 
కి స్వాగతం పలక ప్రార్ధన.(-111)
***
‪#susri 311215


Wednesday, 30 December 2015

బస్సులో బాంబు

కాళ్ళు బార చాచి కూర్చున్నా డిపో మేనేజర్ టేబుల్ మీదున్న లాండ్ లైన్ ఫోను .
ఉదయం 9-45 కి మోగింది.
**
"మీ డిపో నుండి 9.30 కి బయలు దేరిన పొదిలి - దరిశి - వినుకొండ బస్సులో డ్రైవర్ వెనుక ఉన్న రో లో ఎనిమిదో సీటు కింద 10.40 కి పెలెట్టుగా సెట్ చేసిన బాంబు ఉంది,"
ఫోను కట్ అయ్యింది.
**
రమ్యా హోటల్ లో తిన్న సాంబారు ఇడ్లీ మత్తు వదిలింది అతనికి. 
వెంటనే లేచి డ్యూటీ షీట్ తీశాడు. .
**
బస్సు కరెక్టు టైమ్ కి డిపో నుండి వెళ్ళినట్టు ఫోర్మెన్ సంతకం 
ఫ్లాట్ ఫార్మ్ నుండి బయలు డేరుతున్నట్టు కండెక్టర్ కామేశ్వరి సంతకం ఉన్నాయి.
***
ఆయన కాళ్ళు చేతులు వణక సాగాయి. పక్కనే ఉండి రంధ్రాన్వేషణ చేయటం మినహా మరేమీ చెయ్యని యూనియన్ నాయకుడో కరు గమనించి 
" ఏం, అయింది సార్ ?" అన్నాడు. వినడానికి సార్ అన్నా అర్ధం మాత్రం 'భే' అని రావటం ఆ 
పలకటం లో ఉన్న ప్రత్యేకత . 
***
"బాంబు .. బాంబు.. దరిశి.. వినుకొండ బస్సు .." తెలుగు లో మాట్లాడే హింది విలన్ లాగా తడబడి మాట్లాడాడు. డిపో అంతా గుప్పమంది వ్యవహారం.
"పోలీస్ లకి ఫోన్ చేయండి."ఎవరో చెప్పారు.
***
అప్పటికే గ్లాసు నీళ్ళు తాగి కోలుకున్న అతను సంత నూతల పాడు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు " ఇంకా బస్సు సంతనూతలపాడు దాటి ఉండదు. వెంటనే ఆపేయండి" చెప్పాడు.
అటునుండి స్టేషన్ హౌస్ ..ఆఫీసర్ కూల్ గా అడిగాడు 
" కేటగిరీ లో వచ్చారా? మీరు?"
" అవును.బాక్ లాగ్ పోస్టులో ."
"అనుకున్నాను. ముందు డ్రైవర్ కి గాని కండెక్టర్కి గాని ఫోన్ చేసి బస్సు ఆపేయ మని చెప్పండి.ప్రయాణికులని దించి వేయమని చెప్పండి. వెంటనే .. ఈ లోగా నేను సి ఐ గారితో మాట్లాడతాను. బస్సు నెంబరు చెప్పండి."
***
ఆ ఆలోచన తనకి ఎందుకు రాలేదో అర్ధం కానీ డిపో మేనేజరు బస్సు నెంబరు చెప్పాడు 
వెంటనే కండెక్టర్ కామేశ్వరికి ఫోన్ చేశాడు...
"సార్ హాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్ గా అంది ఆమె మర్నాడు సెలవు కోసం ముందు నుండి అతన్ని సిద్దపరుస్తూ "
"నీ హాపీ న్యూ ఇయర్ మండిపోను. బస్సులో బాంబు ఉంది వెంటనే ఖాళీ చేయించు"
***
బస్సు ఇంకా ఎండ్లూరు దాటి SSN ఇంజనీరిగు కాలేజీ ముందుకు వచ్చి ఉంది. 
డ్రైవర్ చురుకయిన వాడు బస్సు లోంచి అందరినీ దించి, బస్సుని రోడ్డు వారగా ఆపేసి దూరంగా వచ్చి ఉన్నాడు.
**
పది నిమిషాలలో అక్కడికి సి ఐ గారి కారు, వచ్చింది. 
పోలీసులు ప్రజలని దూరంగా ఉండేట్టు నియంత్రణ చేస్తున్నారు. 
వెనక మరో బస్సులో డిపో మేనేజరు వచ్చాడు.
ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు విషయం ఇంట్రెస్టింగ్ గా ఉండటం తో రోడ్డు మీద కి చేరీ సెల్ ఫోన్ లు వీడియో షూటింగ్ కి రెడీ చేసుకుంటున్నారు. 
వేరొక సైరన్ జీపులో బాంబు స్వాడ్, మరికొంత మండి పోలీసు అదికారులు, ఆఘమేఘాల మీద అక్కడికి చేరారు. 
ఇక మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనేల?
**
బుల్లెట్ ఫ్రూఫ్ దుస్తులతో బాంబు స్వాడ్ అదికారి ఒకరు తన పరికరాలతో బస్సులో కి జాగర్తగా ఎక్కారు. 'డ్రైవర్ వెనుక ఎనిమిదో సీటు' మేనేజరు మరోసారి గుర్తు చేశాడు. 
చుట్టూ జనం ఉత్సాహంగా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు.
రెండు నిమిషాల్లో ఆ అదికారి బస్సు లోంచి బయటకి వచ్చాడు. 
**
డిపో మేనేజరు తో "బాంబు డిస్ ఫ్యూజ్ చేశాను. అయినా డిపోలోంచి బస్సు బయటకి వచ్చేటప్పుడు బస్సు శుభ్రం చేస్తారు కదా వాళ్ళు గమనించలేదా, గమనించి మీకు చెప్పలేదా? అసలు శుభ్రం చేయించే అలవాటే లేదా ?" అన్నాడు .
..
మొత్తం మీడియా అంతా తనవైపే చూస్తుండగా పూల చొక్కా సర్దుకుంటూ 
" సర్ నేను దగ్గరుండి మరి శుబ్రమ్ చేయించాను సార్. నేను జాయిన్ అయ్యాక శుబ్రత మీద ప్రత్యక శ్రద్ద పెట్టాను సర్. ప్రతి బస్సు శుభ్రంగా ఉండాలని కాదు డిపో మొత్తం నా టేబుల్ అంత శుబ్రంగా ఉండాలది నా లక్షం సార్ "
****
మీరోసారి లోపలకి రండి. చెప్పడతాను.
**
బస్సులో ఎనిమిదో సీటు వద్ద ఎవరో క్రితం రోజు చేసుకున్న వాంతి ఉంది. 
పొరపాటున చూసుకోకుండా ఎవరో కూర్చున్నట్లు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి.
‪#‎susri‬ 30/12/15

ఆమె అనుమానం.

అమ్మావాస్య అర్ధరాత్రి .
రాంగోపాల వర్మ తన కి ఇష్టమయిన 
సినిమా షూటింగి చేస్తున్న వేళ 
నగరం లో ఒక మూల ...
****
చీకటి గదిలో సన్నటి కొవ్వొత్తి వెలుతురు.
మద్యలో సన్నటి దారానికి వేలాడగట్టిన శైశవ పుర్రె ...
దాని వైపు దీక్షగా చూస్తున్న ఒక మాంత్రికుడు ..
ఎదురుగా ఆమె..
****
ప్రేతాలని ఆవాహనం చేసిన అతను ..
దిర్గమయిన ఉత్చ్యాస నిశ్చ్యాశాల, మంత్ర తంత్రాలలో
భూతం నుండి భావిషత్తులోకి ..
జ్ణాన నేత్రం తో చూసి ...
****
"నీకోసం ఒక దుర్వార్త తల్లి .. ని బర్త మీద విష ప్రయోగం జరుగుతుంది.
అతను ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవటం ఖాయం."
***
ఆమె ముఖం లో అనేక రంగులు మారాయి.
గొంతు దుఖం తో పూడుకు పోయింది.
"పోలీస్ కేసు నుండి తప్పించుకుంటానా లేదా?"
ఆమె అనుమానం.
‪#‎susri‬
(అందరూ ఎప్పుడో కప్పుడు విన్న జోకు.. నా మాటల్లో wink emoticon )

Tuesday, 29 December 2015

సియెస్టా

జూనియర్ కాలేజీ లెక్చరర్ గా పని చేసే నేను 
ఒక రోజు మద్యాన్నం దగ్గరలో ఉన్న మా ఇంటికి బోజనానికి వెళ్ళినపుడు 
పార్క్ లో ఒక ముసలి కుక్క తూలుతూ కనబడింది.
**
దాని మెడ మీద చేయి వేసి నిమరాలని పించింది.
ఆ పని చేశానో లేదో నా వెనుకే వచ్చింది.
మా ఇంటి బయట ఉన్న మెట్ల కింద చేరి కునికి పాట్లు పడింది.
**
గంట తర్వాత నేను మళ్ళీ నేను కాలేజీ కి వెళుతుంటే నాతో పాటు వచ్చి పార్కు వద్ద మాయమయింది.
***
మర్నాడు మళ్ళీ అదే కుక్క. అదే తీరు ..
నాతో ఇంటి వద్దకు రావటం కొద్ది సేపు నిద్రపోవటం తిరిగి పార్కు మూల తిరిగేటప్పుడు మాయమవటం.
మెడలో బెల్టు బట్టి అది ఎవరిదో పెంపుడు కుక్క అయి ఉంటుందని పించించిది.
కుతూహలం తో " రోజు నాతో వచ్చి చిన్న కునుకు తీస్తున్న ఈ కుక్క ఎవరిది?" అని ఒక చీటి రాసి దాని బెల్టు కి అతికించి పంపాను.
**
మర్నాడు తిరుగు టపా లో సమాదానం వచ్చింది.
"మా ఇంటావిడ వాగుడికి నసుగుడి కి పాపం దానికి కూడా నిద్ర పట్టటం లేదట్టుంది.
మీరేమీ అనుకోక పోతే నేను దాని తో పాటు వస్తాను."

టెంపుల్ రన్

'టెంపుల్ రన్' ఆడటానికి 
ధోవతి కట్టుకుని ఉత్తరీయం  వేసుకోనక్కర్లేదు ..
చెప్పులు విప్పి, కుంకుమ పెట్టుకుంటే చాలు grin emoticon
గుడ్ మార్నింగ్ ;)

smile emoticon 

Sunday, 27 December 2015

కొత్త యాడాది నిజమయిన స్నేహితులు ?

నిజమయిన స్నేహితులని కొత్త సంవత్సరం లో కనిపెట్టాలనుకునే వారికీ 
.. 
మీకు దమ్ము లేదా కలేజా ఉంటే .. ఆహా ఉంటే ...
..
దమ్ము
-------- : ..
31 రాత్రి మిత్రులతో కలిసి పార్టీ చేసుకోండీ.,
తినండి .. తాగండి .. ఇంటికి రండి ..
చీపిరితో తలుపు తీసిన ఆవిడ బుగ్గ మీద చిటికెసి
"ఈ టైమ్ లో క్లీనింగ్ ఏంటి డియర్ " ఆనండి ..
**
కలేజా :
-------
పై వాటి తో పాటు సెంటు కొట్టుకుని .. చేతికి పూలు చుట్టుకుని
తలుపు తీసిని ఆవిడ తో "నీతో పని బడింది డియర్ " ఆనండి .
వీలయితే .. మీకు ఇష్టమొచ్చిన చోట చిన్నదెబ్బ వేయండి.
***
జనవరి 1 వ తేదీ హాస్పిటల్ కి వచ్చి ఏవరయితే పరామర్శిస్తారో
వాళ్ళే నిజమయిన స్నేహితులు ...

గొట్టం లోకి గాలి

ఆమె కార్లో బుక్ ఫైర్ నుండి ఇంటి కొచ్చేటప్పుడు 'చండీ యాగం' ఫలించి పెద్ద వర్షం పడసాగింది.....
..
ఎంత వర్షం అంటే. పెద్ద వడిగల్లు పడటం మొదలయ్యాయి ...
..
ఆమె ఫ్లాట్ చేరే సరికి కారు వడిగల్ల దెబ్బకి అక్కడక్కడా చొట్టలు పడింది...
....
ఇంటికి రాగానే ఆమె భర్త కి ఫోన్ చేసింది.
..
చొట్టల గురించి చెప్పింది...
..
మంచి మూడ్ లో ఉన్న మొగుడు , "పొగ గొట్టం లోంచి గట్టిగా గాలి ఊదీ చూసావా ? " అన్నాడు నవ్వు ఆపుకుంటూ సీరియస్ గా ...
..
..
ఆమె సెల్లార్ లోకి వచ్చి గొట్టం లోకి గాలి ఊదటం మొదలెట్టింది. ..
..
బయట నుండి  వస్తున్న ఆమె స్నేహితురాలు ఇది చూసి ఏం చేస్తున్నావు అంది ...
..
కారు సొట్టలు తీస్తున్నాను. ఇందులోంచి గాలి ఊదితే సొట్టలు పోయి నార్మల్ అవుతుంది .
స్నేహితురాలు పెద్దగా నవ్వి చెప్పింది...
..
కారు అద్దాలు క్లోజ్ చెయ్యి. అవి క్లోజ్ చేయకుండా ఎంత ..ఊదినా ఉపయోగం ఉండదు.
‪#‎susri‬

శ్రీవారి యాశేష్

మొదటిసారి ఇంటి కొచ్చిన స్నేహితురాలికి ఇల్లు చూపించింది తొమ్మిదో తరగతి చదివే మాన్విత..
ఖరీదయిన టీపాయ్ దాని మీదున్న, అరేబియన్ ఫ్లవర్ వేజ్ చూపించింది.
అందులో ఉన్న బూడిదను చూసి స్నేహితురాలు ఏమిటన్నట్టు ముఖం చిట్లించింది.
“ఆదా మా నాన్న గారి యాశ్ “ మాములుగానే ఎప్పటినుండో అలవాటు కనుక పెద్ద ఫిలింగ్స్ ఏమి లేకుండానే.
“ఐ యామ్ సారి” అందా పిల్ల.
అదేమీ పట్టించుకోకుండా మాన్విత స్నేహితు రాలితో కలిసి ఆడుకో సాగింది.
ఇద్దరు కలిసి కొద్ది సేపు టి‌వి చూశారు. న్యూస్ పేపర్ల తో వచ్చే సండే పుస్తకాలలో పజిల్స్ పూర్తి చేస్తారు. తన కొత్త డ్రెస్సులు చూపించింది. ఈ హడావిడిలో ఫ్లవర్ వేజ్ కింద పడి పగిలి పోయింది.
కొత్త స్నేహితురాలు ఒక్క సారి గా బిగుసుకు పోయింది భయం తో..
శబ్దానికి వంటింట్లోంచి హల్లో కి వచ్చిందావిడ.
పగిలిన ఫ్లవర్ వెజ్ ని చెల్లా చేదురయిన “ ....బూ డి ద ..” ని ఒక్క క్షణం దీర్గంగా చూసి
"జాగర్తగా ఉండాలి కదమ్మా" అంటూ కూతుర్ని మందలించింది..
డస్ట్ ఎత్తడానికి చిన్న ప్లాస్టిక్ చాటలో మెత్తటి బ్రష్ తో ఫ్లోరింగ్ తుడుస్తుంటే..
ఆ స్నేహితురాలు “సారి ఆంటీ” అంది
” పర్లేదు లేమ్మా అది ఇక్కడ మెట్రో లో కొనిన్దే లే మరోటి కొనుక్కోవచ్చు “
“మరి ఆ యాష్ “
“ఏం చేస్తాం ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళ డాడి యాష్ ట్రే వాడరు. సిగిరెట్టు నుశి ఫ్లవర్ వేజు లో నే విదిలిస్తాడు”

లూట్కే గయా

ఉదయం నుండి డీజీపీ గారి ఫోను మూడో సారి అందుకున్న సీ ఐ గారు 
రొటీన్ వర్క్ పక్కన ఉంచి నిజాం పెట క్రాస్ రోడ్డు కి రెండు కిలోమీటర్ల పరిధిలో 
కిక్కిరిసిన కాంక్రీట్ జంగిల్ లో ఉన్న ఐశ్వర్య అపార్ట్మెంట్ మూడో అంతస్థులో ఉన్న
డబుల్ బెడ్ రూము ఫ్లాట్ కి చేరాడు క్లూస్ టీమ్ తో కలసి.
,,**
మెయిన్ బజారు లో జ్యువెలరి షాపు నడిపే అగర్వాల్ కుటుంభం లోని
సభ్యులందరూ చిరుకూరు 'వీసా బాలాజీ గుడి 'కి వెళ్లి
116 ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని వచ్చే సరికి ఆ దోపిడీ జరిగింది.
**
సి ఐ గారు లోపలి ప్రవేశించే సరికి అగర్వాల్ గారి భార్య ముసుగు కొద్దిగా తొలగించి
ముక్కు చీదుతూ బాధపడుతుంది.
**
రొటీన్ గా క్లూస్ టీము ఆధారాలు సేకరించడం మొదలయ్యింది.
..
సి ఐ గారు డైనింగ్ టెబులు కుర్చీ లాక్కుని కూర్చుని FIR రాయటం ప్రారంభించాడు..
క్రైమ్ ఎన్ని గంటల మధ్య జరిగినది రికార్డు చేసాక ..
ప్రాపర్టీ లాసు స్టేట్మెంట్ తయారు చేయటం మొదలెట్టాడు.
..
"ఏమేం పోయాయి?"..
..
"పెద్దగా డబ్బులు ఇంట్లో లేవు ....
ఉన్నవాటిని కూడా దొంగలు తాకలేదు "'అగర్వాల్ చెప్పాడు.
..
"వెండి/ బంగారం ?"..
..
"అబ్బే అవి ఏమి తాకలేదు."..
..
"మరి? "సి ఐ గారి ఆశ్చర్యం
**
రేపు మా మేరేజ్ డే అండి. ఆ .రోజన్నా తల స్నానం చేద్దాం అని రెండు బక్కెట్ల నీళ్ళు
దాచి ఉంచింది మా ఇంటావిడ, వాటిని దొంగలు దోచుకు పోయారు.
స్పాంజి స్నానానికి కనీసం రెండు మగ్గులు నీళ్ళు కూడా మిగల్చలేదు"
అగర్వాల్ గొంతు వణికింది.
...
" సారా పాని ల్యూటీకే లేగాయారే. అరె భగవాన్..
కితనేముష్ఖిల్ దిన్ ఆయా??"అగర్వాల్ భార్య పెద్దగా రోదించ సాగింది. 

Thursday, 24 December 2015

లెట్స్ ప్లే ఉమ్మచ్చు

ఈ అందమయిన సాయంత్రం అతను ఆమె సముద్రపు ఒడ్డున
కూర్చుని ఉన్నారు. తెల్లటి వెన్నెల ..సముద్రపు అలల మీద ఉయ్యాలలు ఊగుతూ
చుట్టూ ఎవరు లేని ఏకాంతం. ఒకే ఒక్క అందమయిన టెంటు .. దాని ముందు పడక కుర్చీలో అతను. ఆమె చేతిలో చెయ్యెసి .. పక్కనే చిదుగుల మంట..
అతను ఆమెని తదేకంగా గమనించడం చూసి " ఏమిటి?" అన్నట్లు చూసింది కళ్ళతోనే..
" లెట్స్ ప్లే ఉమ్మచ్చు" చెప్పడతాను.
ఆమె సిగ్గుల మొగ్గ అయ్యింది. "ఊహూ అప్పుడే కాదు అంది"
మరి కొద్ది సేపు గడిచింది. అతని కళ్లలోకే చూస్తూ చిన్నప్పుడు విన్న చందమామ కధ ఒకటి చెప్పింది. అతను సంగీతం లా వింటున్నాడు. నిప్పుల్లో కాల్చిన వేడి దుంపలు తింటూ.
" లెట్స్ ప్లే ఉమ్మచ్చు " మళ్ళీ అడిగాడతాను. ..
..
"లేదు ని కళ్లలోకి చూస్తూ ఉండిపోవాలని ఉంది "
మరి కొద్ది సేపు గడిచింది...
..
ఆమె చేతులు అతని చేతుల్లో గట్టిగా దృడంగా ..
"లెట్స్ ప్లే ఉమ్మచ్చు"..
..
"ఊహూ .. ..చంద్రుడుని చూడు ఎంత బాగున్నాడో "
**
"లెట్స్ ప్లే ఉమ్మచ్చు " ఈ సారి తప్పదన్నట్లు చెప్పాడతను.
లేచి టెంటు లోకి వెళ్ళి ఆమెని కూడా పిలిశాడు.
**
**
**
గిటారు అందుకుని వాయిస్తూ పాడసాగాడతాను.
"లెట్స్ ప్లే ఉమ్మచ్చు "
ఏ హపి హేపీ ఉమ్మచ్చు..
ఆన్ ది డే ఆఫ్ క్రిస్మస్ ఈవ్
లెట్స్ ప్లే ఉమ్మచ్చు
....
మెర్రి మెర్రి ఎక్స్ మాస్ డే
లెట్స్ ప్లే ఉమ్మచ్చు " ఆమె కూడా గొంతు కలిపింది.
--
(వాళ్ళని డిస్ట్రబ్ చేయకుండా తిని పడుకోండి ..merry x-mas మిత్రు లందరికి :p)

Wednesday, 23 December 2015

ఫస్ట్ పార్టు

యబై లక్షలిచ్చి మొగుడుని కొనుక్కున్నావిడ ..
పోను చేసింది. 
"ఎక్కడున్నావు?? ఇంకా ఇంటికి రాలేదు??"
..
"కొంచెం బిజీ గా ఉన్నాను?"..
..
"అదే ఏమిటని?"..
..
"ఇన్కమ్ టాక్స్ రిటన్స్ "..
..
"ఓ ఆలానా.. మొదటి పార్టు ఎప్పుడు రిలీజ్ అయ్యింది?"
..**
నాయనా .. తండ్రి .. దీంతో ఎలా రా వేగటం.. 
"నువ్వు ఫోను పెట్టు బంగారం .. పోను పెట్టు frown emoticon "

Tuesday, 22 December 2015

ఎందుకని అలాగ ??

మొన్న వైకుంఠ ఏకాదశకి గుడి కెళ్ళినప్పుడు..
జనరల్ మెడిసిన్ డాక్టర్ సదాశివం గుళ్ళో ప్రదక్షణాలు చేస్తూ కనిపించారు.
విష్ చేసి ప్రదక్షణాలు .. దర్శనం .. ప్రసాదాలు అయ్యాక 
గుడి ఆవరణలో కూర్చుని ఉన్నామా ...
మా ముసలాయన ఆయన దగ్గర చేరాడు.
"
డాక్టర్ గారు నడుము పూర్తిగా కిందికి వంచి రెండు చేతులని ఎడంగా చేసి ఏకాలు ఎత్తినా తుంటి దగ్గర ఒకటే నొప్పి గా ఉంటుంది .. ఎందుకని అంటారు "
"
హాస్పటల్ కి రండి ఒకసారి స్కానింగ్ చేయించి చూద్దాం "
"
రెండు చేతులు ఎత్తి ఎడంగా అని తలని కదిలించేటప్పుడు కూడా గూడలు ఒకటే నొప్పి మాస్టారూ "
డాక్టర్ గారు నా వైపు అయోమయంగా చూసి .. " అయినా ఈ వయసులో ఈయన ఈ పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నట్టు ??" అడిగారు.
"
కొత్త పైజమా , లాల్చీ వేసుకున్నారు లెండి ఇవాళ .. అది సంబడం " ఆయనకి చెప్పాల్సి వచ్చింది. 

వాట్స్ అప్


మా మూడేళ్ళ అమ్మాయిని నాతో వదిలి వెళ్తూ 
మా ఆవిడ "పెరంటానికి వెళ్తున్నాను ఒక్క గంట పాపని చూస్తుంటారా?" అంది.
వినేవాళ్ళకి పర్మిషన్ అడిగినట్లు ఉంటుంది కానీ అది ఆర్డర్ అని హోల్ మగజాతికి తెలుసు,
అలాటి ప్రశ్నకి మూడు ఆప్షన్ లు ఉంటాయి. 
మొదటిది ' సరే' 
రెండోది 'అలానే ' 
మూడోది 'మౌనం ..(అంగీకారం)' :) :)
ఇవేవీ కాకుండా అమ్ములు నేను ఆడుకుంటాం పోయిరా అన్నాను హుషారుగా.
"
జాగర్త స్మార్ట్ ఫోను చూసుకోకుండా .. కాస్త పిల్లని గమనిస్తుండండి"
దీనికి కూడా పై మూడు ఆప్షన్లే ..
***
అమ్మూ ఆడుకోటానికి టీ కెటిల్ , కప్పులు షో కేస్ లోంచి తీసి ఇచ్చాను.
అమ్ములు ఒక పక్కన కూర్చుని ఆడుకోవటం మొదలెట్టింది.
నేను యదావిడిగా వాట్స్ అప్ లో మునిగి పోయాను.
రెండు నిమిషాల్లో టి వచ్చేసింది.
"
పప్పా నీకు టి చేశా తాగు" అంది.
టాయ్ కప్పులో నీళ్ళు ఉన్నాయి. అవి తాగేసి "బాగున్నాయి నాన్నా .. అమ్మ కంటే నువ్వే బాగా చేశావు "
అమ్ములు ముఖం లో సంతోషం.
మొత్తానికి మా ఆవిడ వచ్చేసరికి మా అమ్ములు అయిదారు కప్పులు టి తాగించింది.
***
ఈసారి అన్నట్టుగానే మా ఆవిడ గంట లో ఇంటి కొచ్చింది.
వచ్చి రావటం తో అమ్ములు ఏం చేస్తుంది.
"
బ్రమ్మాండంగా ఆడుకుంటుంది. అసలు పిల్లల్ని ఆడించడం ఒక కళోయ్ .. అది అందరికీ రాదు"
"
కదా అమ్ములు" మా అమ్మాయి వయిపు చూశాను. 
"
అమ్మకి కూడా టి ఇవ్వమ్మా " చెప్పాను.
చూడవోయ్ "మా చిట్టి తల్లి అయిదు కప్పులు టి ఇచ్చింది. నువ్వు రెండో కప్పు ఇమ్మంటేనే కేకలేస్తావు ??"
ఈ లోగా అమ్ములు టి కప్పుతో మళ్ళీ వచ్చింది. ఈ సారి వాళ్ళ అమ్మ కిచ్చింది .
ఆమె పాప గమనించకుండా వాష్ బేసిన్ లో కి వంచి. బెడ్ రూములోకి వెళ్ళి వాష్ రూము తలుపు మూసి వచ్చింది.
***
."
అయితే అయిదు కప్పులు తాగారా? .. 
ఆ వాట్స్ అప్ నుండి కొంచెం ఈ లోకం లోకి వస్తే మూడేళ్ళ పిల్లకి బాత్రూములో 
కుళాయిలు అందవని అర్ధమయ్యేది."

tongue emoticon