Tuesday 8 September 2015

పనికొచ్చే మాట

సోమవారం రోజు కాంపౌండ్ వాల్ కలిగిన 5 ఎకరాల మండల కాంప్లెక్స్ లో వాయువ్య మూలాగా ఉన్న నా ఆఫీసులో లో చార్జి హండోవర్ లిస్ట్ తయారుచేసుకునేటప్పుడు , రంగు రంగుల చీరలు కట్టుకున్న కొంత మంది ఉద్యోగినులు కాంప్లెక్స్ కాంపౌండ్ అంతా కలియదిరగటం గమనించాను.
ఇంతలో మండల విధ్యా శాఖదికారి (MEO) ఫోను . 
మండలం లోని ఉపాద్యాయులందరికి మూడురోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము మొదలెడుతున్నాము . 
ప్రారంభ ఉపన్యాసం ఎం‌పి‌డి‌ఓ గారు చేస్తారు, మీరు ఉపయోగపడే రెండు మాటలు చెబితే బాగుంటుంది. అని. 
వస్తున్నాను అని చెప్పి వెంటనే వెళ్ళాను.
ఎం‌పి‌డి‌ఓ గారు మాట్లాడాక నన్ను పరిచయం చేసి,
రెండు నిమిషాలు మాట్లాడి రెండు ఉపయోగ పడే మాటలు చెప్పమన్నారు.
నేను ఒక్క నిమిషమే తీసుకుని
ఉపయోగపడే ఒక్క మాటే చెప్పాను.
" ఆ కిటికీ లోంచి చూస్తే కనబడే ఆఫీసు మాది .
దానికి అటువైపున నీటి సౌకర్యం ఉన్న వాష్ రూము ఉంది.
ఈ మూడు రోజులు సోదరిమణులు ఉపయోగించుకుని తాళం వాచ్మేన్ కి చేరిస్తే చాలు " అని.
గోడల మీద 'స్మార్ట్' గ్రామాల పోస్టర్ ల రంగు ఇంకా మెరుస్తూనే ఉంది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...