Tuesday 26 April 2016

కంచు పళ్ళెం – 3 (రేగు పళ్ళు)



పెద్ద ఖర్మ అయ్యాక,
బోర్లించిన వెదురు బుట్ట కింద వెలిగించిన మట్టి ప్రమిద పక్కన
తెల్ల చిర లో కూర్చున్న తల్లి ని చూడటానికి పెద్ద పిల్లలిద్దరికి కి ఎందుకో మనస్కరించలేదు.
ఆరడుగుల ఎత్తు, సన్నగా దృడంగా ఉండే పెద్ద రోశయ్య ని చూసిన వాళ్ళెవరూ అతనికి పదహారు మాత్రమే నిండాయని చెబితే నమ్మరు.
మల్లమ్మ కి అతనే ఇప్పుడు ఆశాదిపం.
మరో రెండువారాలు గడిచాక పెద రోశయ్య వచ్చి తల్లికి చెప్పాడు
నేను ముఠా పనికి వెళ్తాను
బజార్లో లారీల్లో వచ్చిన సరుకు దించడానికి. ఎత్తడానికి హమాలీల ముఠా ఉంటుంది. ఒక గ్రూప్ గా ఉండే పనివారు సాయంత్రానికి వచ్చిన కూలి సమానంగా పంచుకుంటారు.
పిల్లాడిది ఆ వయసు కాదని మల్లమ్మకి తెలుసు.
కాని మరో మార్గం లేదు.
ఆమె అంగీకారం కోసం పెద రోశయ్య చూడలేదు.
ఎవరి ద్వారానో తల్లి ఈ విషయం వినటం ఆ పిల్లాడికి ఇష్టం లేదు.
ఆ రాత్రి, సంధ్య ముగిసే టప్పుడు పెద్ద రోశయ్య 12 అణాల రోజు కూలి ని తల్లి చేతిలో ఉంచినప్పుడు ఆమెకి కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి.
అప్పటికే ఆమె రైతుల జీవాలని(పశువులు) కొండకి వెళ్లి మేపుకు రావటానికి సిద్దపడి ఉంది.
..
ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై?
ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా
డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !!..
..
(
గజేంద్ర మోక్షం. నీటిలోని మొసలి, దాహం కోసం సరసులోకి డింగిన గజరాజు పాదాన్ని నోట కరచినప్పుడు, గజరాజు శ్రీ మహా విష్ణువుని కాపాడ రమ్మని వేడుకునే సన్నివేశం)..
..
చిన రోశయ్య తన మొలతాడుకి కట్టుకున్న చిల్లి కాణిలు రెండు విప్పి తల్లి కి ఇచ్చాడు,
నేను రోజు వెండి పట్టాలు మెరుగు పని రాత్రి పూట చేస్తానమ్మా షావుకారు జీతం ఇస్తానన్నాడు. కాని చదువు కుంటా నమ్మా. గురవారెడ్డి గారి అబ్బాయి ముండ కొడుకువినా సైకిలు ఎక్కొద్దు అంటున్నాడు. నేను రోజు స్కూల్ కి నడిచి అయినా వేళ్తానమ్మాఅన్నాడు.
ఆమె పిల్లలిద్దరిని దగ్గరకి తీసుకుని బోరున ఏడ్చింది.
పేద రోశయ్య చొక్కా విప్పి ఎర్రగా కమిలిన వీపుకి కొబ్బరి నూనె లో సున్నపు తేట కలిపి రాసింది.
వళ్ళంతా తడుముతూ వెక్కి వెక్కి ఏడిచింది.
మిగిలిన పసివాళ్ళు ఏమయిందో అర్ధం కాక తోడుగా తల్లిని కరుచుకుని ఏడవసాగారు.
ఇంట్లో ఏమి జరుగుతుందో వాళ్ళకి అర్ధం అయ్యే వయసు కాదు.
చిన్న పిల్ల బాగ్యం అయితే ఆటమద్యలో
"
నాయిన ఏడి?”
అని అడుగుతుండేది. మల్లమ్మకి సముదాయించడం కష్టమయ్యేది.

మర్నాడు ఉదయం తల్లి
పెద్ద అంచు ఉన్న కంచు పళ్ళెం లో అన్నకి సంకటి వడ్డించడం చిన రోశయ్య దృష్టి ని దాటి పోలేదు.

Sunday 24 April 2016

పార్టు -2 ..(రేగు పళ్ళు)

పార్టు -2 ..(రేగు పళ్ళు)
సైకిలు గురవారెడ్డి గారి అబ్బాయిది కాబట్టి, 
సామాజిక న్యాయం ప్రకారం ఆ అబ్బాయిని ఎక్కించుకుని అడ్డ తొక్కుడు తొక్కుకుంటూ స్కూల్ కి చేరాడు. రోశయ్య ..
..
తన క్లాస్ రూముని చిమ్మి, బోర్డు ని శుబ్రంగా పాత గుడ్డతో కుట్టిన సంచి తో తుడిచి అయ్యవారి బెంచీ మీద రెండు బెత్తం పుల్లలు విరిచి సిద్దంగా ఉంచడం చిన రోశయ్య పని.
..
పంతులు తెలుగు పద్యాలు చెప్పెటప్పుడు రోశయ్యకి ఎక్కడ లేని ఉత్చాహమ్ గా ఉండేది. శ్రావ్యమయిన పధ్యాలు మదురంగా పాడి, టీకా తాత్పర్యం తో సహా చెబుతుండే వాడు. అంతే శ్రావ్యంగా రోశయ్య కూడా బట్టి వేసినట్లు చెప్పేవాడు. 
ఎటొచ్చీ లెక్కలే అతని ప్రాణానికి ఒక పెద్ద గుదిబండ లాగా తయారయ్యాయి. 
స్కూల్ లో మరో అయ్యవారి కొడుకు సుదర్శనం ఉండే వాడు అతను లెక్కల్లో ఘనాపాటి ఎంతపాటి వడ్డీ లెక్కనయినా, బాగస్వామ్య లెక్కలయినా, 
లాబనష్టాల లెక్కలయినా అలవోకగా చేసేవాడు. 
..
ఔటు బెల్లు కొట్టాక సుదర్శనం రోశయ్య క్లాసులో ఒక మూల చేరారు. ..
రోశయ్య తన పుస్తకం లో రాత్రి కిరసనాయిలు దీపం ముందు కూర్చుని పెన్సిల్ తో చేసిన లెక్కలు సుదర్శనం కి చూయించాడు. 
..
రేగు పళ్ళు తెచ్చావా?” 

తెచ్చాను” ..

మరి ఇవ్వు

జేబులోంచి అమ్మ మల్లమ్మ ఇచ్చిన రేగుపళ్లు పొట్లం అలానే సుదర్శనానికి ఇచ్చాక అతని లెక్కల్లో తప్పులు సరిచేసి, ఎలా చెయ్యాలో చెప్పాడా పిల్లాడు. 
..
పొట్లం  విప్పి దొర రేగ్గాయ తొడిమ పట్టుకుని తింటూ.. 
బలే ఉన్నాయిరా. నువ్వు తిన్నావా?” అడిగాడు. 

..
రోశయ్యకి నోట్లో నీళ్ళు ఊరాయి.
తిన్నాను చెప్పాడు...

..
మద్యాన్నం కుండలో నీళ్ళు సత్తు చెంబు తో తీసుకుని వెళ్ళి ..
చెట్ల నీడన కూర్చుని కారేజి విప్పగానే ఒక గిన్నె లో చిక్కటి మజ్జిగ పోసిన కొర్ర అన్నం, పై గిన్నెలో సంకటి రోటి కారం తో పాటు చిన్న బెల్లం ముక్క ఉండటం గమనించాడు రోశయ్య. బెల్లం ముక్కని తీసుకుని గబాల్న బుగ్గన వేసుకుని, సంకటి తినడం మొదలెట్టాడు. 
..
మద్యాన్నం స్కూల్లో ఉన్నప్పుడు, తమ పంతులు కోసం ఎవరో వచ్చారు. ..
అయ్యవారు బయటకి వెళ్ళి వచ్చి తనని లేపి "ఒరేయ్ నువ్వు ఇంటికెళ్ళారా, గురవరెడ్డిగారి అబ్బాయి కూడా? సైకిలు వేసుకుని జాగర్తగా వెళ్ళండి." 
..
బడి గంట కాకుండా ఎందుకు ఇంటికి వెల్లమంటున్నాడో అర్ధం కానీ రోశయ్య తనేమయినా తప్పు చేశాదేమోనని భయం భయం గా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ....
మీ నాయన పేరు గురవయ్య కదా? నువ్వు వెంటనే ఇంటికెళ్లు. ..

సైకిలు ఉన్నవాడిని తోడు తీసుకుని వెళ్ళు
.
రోశయ్యకి ఏమి అర్ధం కాలేదు. పుస్తకాల సంచీ సర్దుకున్నాడు. .
లేచి క్లాసు బయటకి వస్తూ .పంతులు గారు బోర్డు మీద రాసిన పద్యం మరో సారి చదివాడు. 
..
క్షంతకుఁ గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్...
..
ఇంటికి చేరేంత వరకు ఇద్దరు ఏమి మాట్లాడుకోలేదు. ..
రజానగరం వాగు దగ్గరకి వచ్చేసరికి సైకిలు కి తగిలించిన సంచీ కాడ తెగిపోయింది. దాన్ని నెత్తిన ఉంచుకుని సైకిలు వెనుక పరిగెట్టుకుంటూ తుర్.. తుర్.. మని లారీ శబ్దం చేస్తూ గాందీ బొమ్మ వద్దకి చేరేసరికి ఒక కొత్త వాతావరణం అక్కడ గుమిగూడి ఉంది. దారిలో తారసపడ్డ వాళ్ళు తనని ప్రేమగా చూడటం, 
కాదు మరేదో గా చూడటం రోశయ్య గమనించాడు. 
..
అల్లంత దూరాన ఉన్న మండువా పెంకిటిల్లు అరుగుమిద జనం గుమి గుడి ఉన్నారు.
కలికాలం కాకుంటే ఎరువు దిబ్బలో నలకిందాసు కరిస్తే ఇంత అవుతుందని అనుకుంటామా?” దూరంగా ఉన్న వాళ్ళు మాట్లాడుకోవటం రోశయ్యకి వినబడుతూనే ఉంది. .
..
మద్యలో ఎవరో పడుకుని ఉన్నారు చుట్టూ బందువులు ఉన్నారు.. 
వీళ్ళేవరూ కాదు అమ్మ పెద్దగా ఏడుస్తుంది, 
అన్న కూడా, చెల్లెలు తమ్ముడు మాత్రం పెద్దమ్మ వాళ్ళ చంకలో ఎక్కి ఉన్నారు. 
వాళ్ళ బుగ్గలు మకిలిగా ఉన్నాయి. 
..
అరె రోశయ్యా ఎల్లి పోయాడ్రా.. మీ నాయనఅంటూ తల్లి మళ్ళీ శోకం లో మునిగి పోయింది. 

(ఇంకా ఉందా?)


Saturday 23 April 2016

రేగు పళ్ళు

రేగు పళ్ళు (పార్ట్-1)
=============
పొద్దుపోయేంత వరకు అంగడిలో వెండి పని చేసి వచ్చి పడుకున్న చిన రోశయ్యని తెల్లారగట్ల నిద్ర లేపింది మల్లమ్మ...
.
అప్పటికే పెద రోశయ్య, వసారాలో ఉన్న పెద్ద రోలు లో జొన్నలు దంచుతున్నాడు. చెల్లెలు, తమ్ముడు ఇంకా నిద్ర పోతున్నారు..
..
నిద్ర లేచి కావిడి తీసుకుని వెళ్ళి ఫర్లాంగు దూరం లోని చేద బావి నుండి నీరు తోడుకుని వచ్చి దొడ్లో ఉన్న రాతి తొట్టి నిండా నీళ్ళు నింపాడు చిన రోశయ్య. 
..
అన్న తమ్ములిద్దరూ మైలు దూరం లోని పారే ఏటికి వెళ్ళి , వస్తూ స్నానం చేసి టవలు గట్టిగా పిండుకుని వచ్చేసరికి మల్లమ్మ పొయ్యి మీద జొన్న సంకటి తెడ్డు తో తిప్పుతుంది. ..
..
చెల్లెలు  అప్పటికే మల్లమ్మ కొంగు పట్టుకుని అమ్మా నాకు పండగ బువ్వ(బియ్యం అన్నం) కావాలే అంటూ గోము పోతుంది ..
..
మల్లమ్మ రోజు మాదిరి మాటలు చెబుతూనే తలాకొంచెం సంకటి సత్తు ప్లేట్లలో పెట్టింది. ..
పెద రోశయ్య చక్కి మీద పెట్టిన కంచు కంచం వైపు చూశాడు. 
అంచులు ఎత్తుగా ఉండే కంచు కంచం లో తండ్రి గురవయ్యకి మాత్రమే వడ్డిస్తుంది ఆమె. 
..
సాంబారు కారం లోకి లౌక్యంగా వంచిన నేతి ని కలుపుకుని చిన రోశయ్య గబగబా తినేశాడు. 
అప్పటికే తన స్నేహితుడు వచ్చి రోడ్డు మీద సైకిలు బెల్లు కొట్టటం విని ఉన్నాడు. 
రెండు కాడల కాకి సంచి చంకకి తగిలించుకుని, కాళ్ళకి తోలు చెప్పులు తొడుగుతుంటే తల్లి మల్లమ్మ వచ్చి రెండు గిన్నెల సత్తు కారేజి ఇచ్చింది. 
..
ఇంకేమీ లేవాఅడిగాడా పిల్లాడు. ..
..
మరి నా పధ్యం చెప్పు అంది మల్లమ్మ. 
..
అమితస్థావరజంగమం బయిన బ్రహ్మాండంబు దా నింతయున్
మమతాగోచర మీత్రిలోకములు నస్మద్బాహువజ్రానుపా
ల్యము లే నింద్రుఁడ నిట్టి న న్నుఱక లీలన్ జూదమాడంగ ను
త్తమసింహాసన మెక్క నీకుఁ జనునే దర్పించి నాముందటన్.”..
..
రాగయుక్తంగా మత్తేభాన్ని పాడాడు. 
..
మల్లమ్మకి చిన రోశయ్య పాడిన పధ్యం అర్ధం కాదు కానీ కొడుకు రాగ యుక్తంగా పాడుతూనే వినటం ఆమెకి ఎంతో ఇష్టం. 
..
పద్యం వింటూనే కాగితం లో పోట్లామ్ కట్టిన రేగు పళ్ళు చిన రోశయ్య చొక్కా జేబులో పెట్టింది. తలకి ఆముదం రాసి చక్క దువ్వెన తో తల నున్నగా దువ్వింది. ..
....'
"
దాని అర్ధం చెప్పు" ... 
..
ఇంద్రుడిని అయిన నన్ను గమనించకుండా జూదమాడుతూ ఉన్నావు సబబేనా ? అని “..
..
పూర్తి కాకుండానే బజార్లోకి పరిగెత్తి గురవారెడ్డి గారి అబ్బాయి సైకిలు చేరాడు.
సైకిల్ కి సంచి తగిలించి స్నేహితుడిని సైకిలు మీద కూచోబెట్టుకుని అడ్డ తొక్కుడు తొక్కుకుంటూ ఎనిమిది మైళ్ళ దూరం లో ఉన్న 'మారెళ్ల' అప్పర్ ప్రిమరీ స్కూల్ కి బయలు దేరాడు. ..
..
తల్లి తన జేబులో ఉంచిన రేగు పళ్ల విలువ చిన రోశయ్యకి బాగా తెలుసు. 
తండ్రి పొలం పనికి వెళ్ళాక. తల్లి పగటి పూట పశువులు మేపటానికి గంగవరం కొండకి వెళ్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికి నిండా ముల్లు ఉండే రేగు చెట్ల కాయలు పండినవి దోరగా ఉన్నవి ఎరుకుని మరీ కోసు కొస్తుంది. ..
పిల్లలందరికి పెడుతుంది. తను ఒక్కటి కూడా తినదు. 
..
పచ్చివక్క తో తమలపాకు కి అంతసున్నం రాసి పొగకాడ తుంపుకుని నోట్లో వేసుకుంటుంది. రోజంతా ఆమె కి అదే ఆహారం. 
..
చిన రోశయ్య  మాత్రం మల్లమ్మ కి ప్రత్యకం 
అందుకే రెగ్గాయలు కొంచె ఎక్కువ పెడుతుంది. 
వాడొక్కడే ఇంట్లో 8 మైళ్ళ దూరం లో ఉన్న స్కూల్ కి వెళ్ళి సెకండ్ ఫామ్ చదువుతున్నాడు. 
పొద్దుటే వెళితే సాయంత్రం దాకా రాడు, 
చిరుతిల్లు కొనుక్కోటానికి చిల్లీ కాణీ ఇవ్వటం తనకి చేత రాదని ఆమెకి బాగా తెలుసు.

బార్య?

ఎన్నయినా చెప్పండి ‘బార్య’ పురుషుడి నేస్తం.
మనం కష్టాల్లో ఉన్నప్పుడూ ఓదారుస్తుంది.
బాదల్లో ఉన్నప్పుడూ నేనున్నాను అంటుంది.
మనన్ని గర్వం తో నిలబడేలా చేయదు,
అందుకని మరీ కుంగిపోయేలాగా చేయదు.
తను పక్కనే ఉంటే మనం ఏ నిజాన్ని అయినా నిర్బయంగా చెప్పగలమ్.
కొత్త ఆవిష్కరణలు చేయగలం.
రాజ్యాంగం లో చెయ్యాల్సిన సవరణలు చెప్పగలమ్.
విజయ్ మాల్వా అప్పులు తీర్చే సలహాలు చెప్పగలమ్.
ఆమె మనన్ని గదిలో గొప్ప అందగాడిని చేస్తుంది.
మనలోని శ్రుంగారాన్ని వెలికి తీస్తుంది.
అత్యంత హాస్యప్రియత్వాన్ని బయట పెడుతుంది.
విచిత్ర వేషధారణ చేయిస్తుంది.
మనలో నమ్మకాన్ని పెంచుతుంది.
**
**
**
**
**
**
**
**
**
**
లెక్కల విధ్యార్డులు మొదటి సిద్దాంతం లో ‘బార్య’  బదులుగా మందు ప్రతిక్షేపించుకోండి.
మళ్ళీ షదువుకొండి..
Happy weekend.


Friday 22 April 2016

ఆర్ట్ ఆఫ్ లివింగ్

నిన్న సాయంత్రం మిత్రులతో కలసి చిన్న పార్టీ ఉంటే
ఇంటికి ఫోన్ చేశాను " ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంది. లేటవుతుంది"
..
యధావిదిగా అన్నీ ముగించుకుని ఇంటికెళ్లేసరికి డేటు మారింది.
బట్టలు కూడా మార్చుకోకుండా సోఫాలో పడి నిద్రపోయినట్లున్నాను.
..
ఉదయాన్నే సామరస్య పూర్వకంగా చర్చ నడిసింది.
Art of Living ఎఫక్ట్ అవోచ్చు.
ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లినప్పుడు అబద్దం చెప్పడం దేనికి
ఉన్నవిషయం చేపాల్సింది.
ఇకనుండి మనం అబద్దాలు మాట్లాడుకోవటం మానేద్దాము
పరస్పర అంగీకారం తో చర్చ ముగిసింది.
..
సాయంత్రం మాల్ కి వెళ్ళాం. ఏవో స్కిన్ టైట్ లేగ్గిస్ ట .
ట్రయల్ రుము లో మార్చుకుని వచ్చి నాకు చూపించింది.
వెనక వైపు లావుగా ఏమయినా కనబడుతున్నానా ??” అని అడిగింది.
****
వాచిన కన్ను తో రేపు ఆఫీసుకి ఏం వెళతామ్??
బాస్ కి ఫోన్ చేసి లీవ్ అడగాలి

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...