Wednesday 9 September 2015

మగధీర

పెళ్లాన్ని కొట్టిన ఒక ధీరోదాత్తుడి ని కోర్టులో ప్రవేశ పెట్టారు.
జడ్జి అతడిని ఈర్షగా చూస్తుండగా లాయర్ కోర్టుకి విన్నవించుకున్నాడు .
"ముద్దాయి సచ్చిలుడు , ఇదో క్షణిక ఆవేశం లో బార్య మీద చెయ్యి చేసుకున్నాడు .మొదటి తప్పుగా క్షమించి వదిలెయ్యవలసినదిగా కోర్టుకి విన్నవించుకుంటున్నాను."
జడ్జి గారు తాను చేయలేని పని చేసిన అతడిని లోపల మెచ్చుకున్నా, బయటకి మందలించి వదిలేశారు.
****
మూడో రోజు అదే దీరోదాత్తుడిని అదే కారణం తో అదే జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఈసారి జడ్జి గారు ఉపేక్షించ దలుచు కోలేదు.
అతడి కి శిక్ష విదించే లోపు " అయ్యా నేను ఏమయినా కోర్టుకి చెప్పు కోవచ్చా అని అడిగాడు "
కళ్ళజోడు లోంచి చూస్తూ " కానివ్వు " అన్నాడు జడ్జి .
"అయ్యా .. మొన్న మీరు వదిలేశారా ఆ ఆనందం తో కొద్దిగా ఒక్క బాటిల్ కొనుక్కుని, ఒక్క పెగ్గు తాగుదామని తాగానా?, దానివల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. అందుకని రెగ్యులర్ గా తీసుకునే మోతాదు తీసుకుని
ఇంటికి జగార్త గా వెళ్ళాను. "
జడ్జి శ్రద్దగా వినడం గమనించాడు దీరోదాత్తుడు .
"వాకిట్లోనే అందుకుందండి. బండ గొంతు వేసుకుని 'వచ్చావా ? మళ్ళీ తాగొచ్చవా? ఆ పనికి మాలిన తాగుడు మానవు గదా?' అని " నేనేమీ మాట్లాడ లేదండీ. గమ్మున లోపలికి వెళ్ళాను..
"పనికి మాలిన వెదవ, పని లేదు పాడు లేదు తాగటం , తిరగటం , సిగ్గా శరమా , దున్నపోతు మీద వాన కురిస్తే ఏమి? కుడితి పోస్తే ఏమి ?'
అప్పటికీ నేను ఏమి అనలేదు అయ్యా .. నా గదిలోకి పోతున్నాను ..
" ఆ జడ్గి గాడు ఒక పనికి మాలిన ఏబ్రాసి, సన్నాసి. వాడు సరయినోడు అయితే ఈ పాటికి నువ్వు జైల్లో ఉందువు. ఇత్తడి చెంబుకు జనప నార అతికించినట్లు వాడు వాడి మొఖం. ఎంగిలి బీడీలు ఎరుకుని తాగే యదవ,
వాడు కడుపుకి అన్నం తింటున్నాడా, పెంట ........................"
జడ్జి అతడిని ఆపి "ఇక నువ్వు వెళ్ళోచ్చు" అన్నాడు .
పోలీస్ వారి వైపు తిరిగి "ఈ సారి మర్డర్ చేసినా ఇతని మీద కేసు కట్టకండి"
కోర్టు వాయిదా పడింది. smile emoticon smile emoticon pacman emoticon pacman emoticon 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...