Monday, 7 September 2015

జిహాద్

..ఉల్లిపాయల ధర ఆకాశాన్ని అంటడం తో సులేమాన్ బాయ్ కి జీవితం అంటే విరక్తి వచ్చేసింది. 
ఇక ఎలాగయినా జీవితాన్ని ముగించాలని గట్టిగా తీర్మానించుకున్నాడు.
..
కుటుంబానికి ఏమి చేయకుండా వెళ్ళి పోవటం తప్పని ఆలోచించి....
ISI వాళ్ళ వద్దకి చేరాడు.....
"నేను ప్రాణం మీద ఆశ వదిలేశాను. కానీ నా కుటుంబానికి ఏమి చేయలేక పోయాను."
..
అలాటి వారిని చేరదీస్తున్న జిహారి అతన్ని వెంటనే ఆత్మాహుతి దళం లో చేర్చుకున్నాడు.
మీ కుటుంబానికి ఇల్లు, తిండి కి సరిపడే పంట భూమి, సరిపడే డబ్బు ఇస్తాం .
మా జిహాద్ లో పాలుపంచుకో .
సులేమాన్ బాయ్ అంగీకరించాడు.
అతని వంటి చుట్టూ బాంబులు పేర్చారు. నడుం వద్ద ఒక స్విచ్ ఏర్పాటు చేశారు .
నల్లటి బట్టలు తొడిగి బక్టులలో కలిపేశారు. ఒక వాకి టాకీ ఇచ్చి
నది వద్ద స్నానం చేసేచోట సులేమాన్ అడిగాడు
" ఇక్కడ 30 మంది దాకా ఉన్నారు నేను జిహాది కోసం ఖుర్బానీ అవనా?"
...
వెంటనే అటునుండి సమాదానం వచ్చింది....
" లేదు ఇంకా ఎక్కువ మంది కావాలీ అందరిలో కలిసి కొండ ఎక్కు "
..
మరో గంట తర్వాత సులేమాన్ బాయ్ " ఇక్కడ వందల మంది గుమిగూడి ఉన్నారు . ఇప్పుడు?"..
..
"అచ్చా.. ఇప్పుడు ఖుర్బానీ చేసుకో. జిహాద్ కోసం ప్రాణాలు విడుస్తున్నావు...
నీ కుటుంబానికి మేము చెప్పినవి అన్నీ ఏర్పాటు చేస్తాం."
....
సులేమాన్ బాయ్ ' జిహాద్ ' అని అరుస్తూ .. ఒక ఉన్మాదం తో వంగి దుస్తుల్లో దాచి ఉంచిన
..
..
..
..
..
..
..
..
..
..
చుర కత్తి తీసి గుండెల్లో గట్టిగా పొడుచుకున్నాడు ..
..

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...