Sunday, 6 September 2015

నిద్ర చాలటం లేదు

ప్రొద్దుటే ఓ పి బిగిన్ అవగానే మన కామేశమే మొదటి పేషంట్.
బాగా ముఖం వేలాడేసుకుని దైన్యంగా కనిపించాడు.
" ఏమయింది?"
"డాక్టర్ మా బజార్లో చాలా కుక్కలు ఉన్నాయి . రాత్రంతా అవి మొరుగుతూనే ఉంటాయి. నేను పగలంతా పని చేసుకుని అలసి పోయి ఇంటికొస్తానా?తెల్లవార్లూ వాటి అరుపులకి నిద్ర ఉండటం లేదు. నేను అలసి పోతున్నాను "
చెప్పాడు కామేశం 
" పగలు చాకిరీ చేసిన వారికి రాత్రి నిద్ర లేకపోతే కష్టమే " డాక్టర్ గారు ఒప్పుకున్నారు . "సగటున ఆరేడు గంటలు మంచి నిద్ర పోవాలి . అప్పుడే మన శరీరం లోని జీవ ప్రక్రియ సజావుగా ఉంటుంది."
డాక్టర్ టేబుల్ సొరుగు లాగి Rep లు ఇచ్చిన శాంపిల్ మెడిసన్స్ వెతికి ..
"ఇవి వాడండి. మార్కెట్ లోకి వచ్చిన మంచి స్లీపింగ్ టాబ్లెట్స్. మీ సమస్య తీరిపోతుంది." అని ఒక స్ట్రిప్ టాబ్లెట్స్ ఇచ్చి పంపారు .
*****
మరో వారం తర్వాత కామేశం మళ్ళీ వచ్చాడు .
మనిషి ఇంకా డీలా పడి పోయాడు పైగా ఒంటినిండా గాయాలు .
"ఏమయింది ?" డాక్టర్ గారి ఆదుర్దా ప్రశ్న .
" డాక్టర్ నా పరిస్తితి ఇంకా ఘోరంగా తయారయింది.పగలంతా పని చేసి వస్తానా? రాత్రిళ్ళు వీది కుక్కలని వెంటాడి పట్టుకోవటం, వాటి చేత టాబ్లెట్ మింగించడం చాలా కష్టం గా ఉంది. పైగా అవి వళ్ళంతా కొరికి గాట్లు పెడుతున్నాయి ." వాపోయాడు కామేశం . 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...