Sunday, 6 September 2015

గ్రీన్ టీ

యధావిదిగా ఒక పెద్ద కప్పు వేడినీళ్లలో గ్రీన్ టీ డిప్ బాగ్ వేసి 
నా టేబుల్ మీద ఉంచిందావిడ. 
పదినిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి చూసింది. కప్పు అలానే ఉంది . 
"టి త్రాగలేదా?" ప్రశ్న.
" ఇది టీ నా ? వేడి నీళ్లలో కుంకుడు కాయ పొడి వేసినట్లు ఉంది ? ఎవరే నీకు చెప్పింది ? పో పోయి చిక్కటి పాలతో లిప్టన్ టీ తీసుకురా..."
"ఈ వారం రోజులనుండి కిక్కురుమనకుండా తాగావు ?"
" పెద్దమ్మాయి ఇచ్చింది. తాగాను . అయితే నువ్వు కూడా ఇదే ఇస్తావా?"
"కూతురిస్తే తాగుతావు. అది ఉరేళ్ళగానే మళ్ళీ మామూలే?
" ఏం గొంతు లెగుస్తుంది. డిస్మిస్ చేసేస్తాను "
"నువ్వు చేసేదేమిటి నేనే వెళ్తా మానాన్న దగ్గరకి "
" లంచ్ ప్రిపేరే చేసి వెళ్ళి సాయంత్రం లోపు వచ్చేయి .."
"ఇంతోటి దానికి వెళ్ళటం ..రావటం ."
తర్వాత వంటింట్లోంచి ఏదో గిన్నెల చప్పుడు. పాపం చెయ్యి జారీ నట్టుంది.
ఇంతకీ లిప్టన్ టీ అవకాశం ఉందా? లేదా?
****
గృహస్థులందరికి గుడ్ మార్నింగ్ smile emoticon


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...