Wednesday 22 March 2017

ఇక పెంచేది లేదు.

కవితకి చిన్న సర్జరీ అవసరం అయింది.
ఆపరేషన్ ధియేటర్ లో నర్స్ “ మీ వయసు ఎంత?”
తలకి హెన్నా పెట్టుకుని నాలుగు రోజులు కూడా గడవలేదు.
“ ఇరవై “
“లోకల్ ఎనస్తీషియా ఇస్తాం. వయసుని బట్టి డోస్ ఇవ్వాల్సి ఉంటుంది.”
“ ఆలానా? అయితే 29”
ఈ లోగా డాక్టర్ లోపలికి వచ్చింది.
“కవితా . నేర్వస్ గా ఫీల్ అవాల్సింది ఏమి లేదు. లేప్రోస్కొపీ. మత్తు సరయిన డోసు ఇవ్వకపోతే ఒక్కోసారి ఆపరేషన్ మద్యలో నొప్పి తెలుస్తుంది. మగాళ్లు ఆల్కహాల్ ముట్టింది లేదని చెబుతారు. ఇక్కడికి వచ్చాక కానీ అసలు విషయం చెప్పరు. అన్నట్టు మీ వయసు ఎంతన్నారు?”
“నా తవికల మీద ఒట్టు. నలబై రెండు. ఇక మీరు ఎంత బయపెట్టినా పెంచేది లేదు.”

Sunday 19 March 2017

సమర్పణ

రాజు గారు మందీ మార్బలం తో అడవికి వెళ్లారు. వేట కోసం.
దారి తప్పారు.. అలసి పోయి ఉన్నారు. ఆకలి, దాహం..
హటాత్తుగా పులి ఒకటి దాడి చేసింది.
కత్తి తో పోరాటం మొదలెట్టారు. అలసిన శరీరం సహకరించలేదు.
పులి పంజా విసరబోతుంది. కత్తి జారి పోయింది.
పులి మీదకి ఉరికింది.
ఈ లోగా ముగ్గురు కుర్రాళ్ళు .. వాయు వేగం తో వచ్చారు.
బరిశలతో దాడి చేశారు. పులి తోక ముడిచింది. అడవిలోకి పారి పోయింది.
ప్రమాదం తప్పి పోయింది.
ఈ లోగా పరివారం రాజుగారిని చేరింది. రాజు గారు బడలిక తీర్చుకున్నారు.
ముగ్గురికి కృతజ్ఞత తెలిపారు. ఏం కావాలో కోరుకోమన్నారు.
“నాకో ఉద్యోగం కావాలి” అని ఒకరు, బోలెడు నగదు కావాలని మరొకరు ..
రాజు గారు ఇద్దరి కోరికలు తీర్చారు.
మూడో వాడు “నాకేం వద్దు మహారాజా” అన్నాడు.
రాజుగారి అహం దెబ్బతింది. “కాదు కోరుకోవాల్సిందే అన్నాడు”
“సరే .. సంక్రాంతి కి మా ఇంటికి వచ్చి బోజనం చేయండి” అన్నాడు.
రాజు గారు అంగీకరించాడు.
అసలు కధ అప్పుడు మొదలయ్యింది.
కుగ్రామానికి రాజుగారు వెళ్లలేరు.. రోడ్డు సిద్దం అయ్యింది.
పూరింట్లో వసతులు లేవు. భవనం తయారయింది.
అల్లా టప్పా వాళ్ళింట్లో రాజా వారు బోజనమ్ చేయలేరు.
రాజా వారి సంస్థానం లో కొలువు ఏర్పాటయింది.
రాజావారి ఆహార వ్యవహారాలు తెలిసిన మనిషి కావాల్సి వచ్చింది.
అల్లుడు హోదా వరించింది.
..
కనుక ఇందు మూలంగా యావన్మంది కి తెలియచేయునది ఏమనగా..
దైవ దర్శనం కోసం వెళ్ళినపుడు  ..
సమర్పణ తో ఉండండి.

మీకేం కావాలో ఆయనకి తెలుసు. 

Saturday 18 March 2017

లంగాలు

ఎర్రటి ఎండలో ఆఫీసు జీప్ లో దరిశి నుండి అద్దంకి వెళ్తూ ఉన్నప్పుడూ.
ముండ్లమూరు దాటాక ..
హటాత్తుగా డ్రైవర్ ని కారు ఆపమన్నాను. 
కూడా ఉన్న నా పై అధికారి (మా మద్య స్నేహం కూడా ఉంది) విస్మయంగా చూస్తుండగా నేను జీబు దిగి
ఎదురుగా సైకిలు మీద వస్తున్న ‘మాబు’ ని పలకరించాను. నన్ను చూసి నవ్వి అతను ఒక చెట్టు వారగా ఆగాడు. రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడి తిరిగి జీపు ఎక్కి పోనియ్యమన్నాను.
“ఎవరతను?” మా తారక రామారావు (పై అదికారి) అడిగాడు.
“మాబు అని రమణాలవారిపాలెం.. మంచి మిత్రుడు.. వాళ్ళింట్లో ఫంక్షన్ కి పలావు వండితే మొదటి గరిటె నాకే” నేను నవ్వుతూ సమాదానం చెప్పాను.
“మా ఇంట్లో కూడా అతను బాగా పరిచయం . వ్యాపారం నిమిత్తం తాళ్ళూరు వచ్చినపుడు మా తోనే తింటాడు”
ఇంకొంచెం వివరించాను.
“అయినా లంగాలు అమ్ముకునే వాడితో నీకు స్నేహం ఏమిటి శ్రీను?” అన్నాడు గమత్తుగా..
నేనేం మాట్లాడలేదు.
“ఏం మాట్లాడవు?” తను మళ్ళీ అడిగాడు.
“మనిద్దరం హోదాలు పక్కనపెడితే సమాదానం చెబుతాను”
“సరే చెప్పు” అన్నాడు తారకరామారావు.
“మనిద్దరికి 15 వేలు దాటి జీతం వస్తుంది. (సుమారుగా 16 ఏండ్ల క్రితం) ఎవడన్నా వంద కాగితం ఇస్తాడేమో అని నక్కల్లా చూస్తుంటాము. మనం స్నేహించు కోటానికి లేని ఇబ్బంది. ఎర్రటి ఎండలో సైకిలు మీద వందకి మూడు లెక్కన అమ్ముకుంటే సాయంత్రానికి యబయ్యో, అరవైయ్యో మిగుతాయేమో. అతనితో స్నేహానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు అర్ధం కాలేదు.”
ఆయనేం మాట్లాడలేదు.
‘మనిషి హోదా అనేది డబ్బు తూనికరాళ్లతో కొలవకూడదేమో” అన్నాను.
చాలా సేపు మౌనం తర్వాత మళ్ళీ నేనే వాతావరణం తేలిక చేస్తూ.. “మళ్ళీ మన ముసుగులు వేసుకుందామా” అన్నాను.
****
మొన్ని మధ్య ఆయన రిటైర్మెంట్ వేడుకలో అందరి ముందు ఈ విషయం ప్రస్తావించాడు.

Wednesday 15 March 2017

ప్రిపేర్

సరిగ్గా స్నానానికి వెళ్ళే ముందు ఫోన్ వస్తుంది.
బహుశా గమనిస్తూ ఉంటారో ఏమో.
..
“రేపు ఉదయం మండలం లో అదికార్ల మీటింగు పెట్టాం, బ్రదర్... మీరు అటండ్ అయ్యి నాలుగు మాటలు చెప్పాలి” అటునుండి ఎం‌పి‌డి‌ఓ మిత్రులు. 
..
“అలాగే .. అటెండ్ అవుతాను. 11 కి ఒకేనా? టాపిక్ ఏమిటిట ?”
..
“ ఎండలు – తీసుకోవాల్సిన జాగర్తలు. ప్రిపేర్ అయి రండి బ్రదర్” మళ్ళీ చెప్పాడాయన.
..
“షూర్. బాటిల్లో మజ్జిగ పోసుకుని, గొడుగు తీసుకుని వస్తాను. ఒకే నా?”

Sunday 12 March 2017

మూడో గొర్రే



ఒక ఊరు ఉంది. ఆ వూరి ప్రజలకి కావలసినవి అన్నీ ఆ ఊర్లో దొరుకుతాయి. ఎవరు బయటకి వెళ్ళేపని లేదు. మార్కెటింగ్ స్ట్రాటజీ లు పెరిగాయి.
కావల్సిన వస్తువుల సంఖ్య, కొత్త అవసరాలు కూడా పెరిగాయి.
బయట నుండి కొత్త వస్తువులు తెచ్చి ఇచ్చేవారు తయారయారు.
వారి మధ్య పోటీ కూడా ఉంది. సేవలు క్వాలిటీ పెరిగింది.
అయినా ప్రజలకి అసంతృప్తి., మరేదో కావాలని మరేదో లేదని..
ఒకరోజు వాళ్ళు కొన్ని గొర్రెలని చూశారు. వాటి మీద మెరిసే పేయింట్ తో అంకెలు వేసి ఉండటం గమనించారు.
అందరూ వాటిని చూశారు. 1 వ నెంబరు వేసిన గొర్రె, 2,4,5,6 వేసిన గొర్రెలు కనిపించాయి. కానీ ఎన్నిసార్లు చూసినా మూడో అంకె ఉన్న గొర్రె మాత్రం కనబడలేదు.
అందరికీ ఆసక్తి పెరిగింది. టెన్షన్ వచ్చేసింది. మూడో అంకె ఉన్న గొర్రె కోసం వెతకటం మొదలెట్టారు. పనిలేని వాళ్ళే కాదు, ఉన్నవాళ్ళు కూడా పని పక్కన పెట్టి వెతక సాగారు. కానీ గొర్రె కనిపించలేదు.
చివరికి ఆ గొర్రెలని ఊర్లో కి వదిలిన పెద్ద మనిషిని పట్టుకున్నారు.
మూడో గొర్రె విషయం నిలదీశారు.
“మనలో చాలా మందిమి ఉన్నదానితో సంతృప్తి పడము. కనబడని మూడో గొర్రె కోసం ఉన్నవి అనుభవించకుండా వెతుకుతూనే ఉంటాం. ఉన్న దానితో సంతృప్తి చెందకుండా లేని దాని కోసం చేతిలో సిద్దంగా ఉన్న ఆనందాన్ని పోగొట్టుకునే మూర్ఖులం.అసలు మూడో నెంబరు గొర్రే లేదు.” ముగించాడు ఆయన. (ఆధారం .. ఆంధ్ర జ్యోతి)

ఈ రోడ్లకి ఆహ్వానం


ప్లాస్టిక్ వ్యర్ధాలు .. ప్రస్తుత ప్రపంచపు సమస్య ..
తిరిగి ఉపయోగించలేని, భూమిలో కరగని ప్లాస్టిక్ వ్యర్ధాలు అనేక రకాలుగా చికాకులు కలిగిస్తున్నాయి.
వీది జంతువులు మరణాలు, డైనేజ్ వ్యవస్థ కి అడ్డంకులు, పర్యావరణానికి వీటిని కాల్చడం ద్వారా వచ్చే విష వాయులు, ఒకటేమిటి అనేకం. తెల్లటి హిమాలయాలనుండి, సముద్రగర్భాలవరకు అనేక చోట్ల ప్రకృతి ని నాశనం చేస్తున్న వ్యర్ధాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి.
తాత్కాలికంగా తిరిగి వినియోగించడం, లేదా కేరళ లాటి ప్రాంతాలలో బాటిల్స్ లో ఇసుక నింపి ఇటుకలుగా వాడటం మినహా ఈ రంగం లో పెద్దగా పురోగతి సాదించింది లేదని చెప్పాలి.
..
అయితే ఈ మధ్య కాలం లో ఈ సమస్యకి ఒక వినూత్నమయిన పరిష్కారం చూపిస్తున్న రంగం మాత్రం సివిల్ ఇంజనీరింగ్ విభాగమే. (సివిల్ ఇంజనీర్లు, కాలర్ ఎగరేసుకోండి) 












..
వొకర్స్ వెస్సెల్స్ అనే డచ్ బెసేడ్ సంస్థ దీనికో పరిష్కారం కనుగొనింది.
(volkerwessels అనే భవన నిర్మాణ సంష్ట 1854 లో డచ్ కేంద్రంగా ప్రారంభమయింది. 1978 లో stevin group ను 1997 లో kondor wessels అనే గ్రూప్ ని కలుపుకుని చివరికి ప్రస్తుతం పిలవబ్డుతున్న volkerwessels గ్రూప్ గా 2002 లో మారింది. బిల్డింగ్ ప్రాపర్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, టెలికాం, మెరైన్ సర్వీసెస్ లో యూ‌కే లోనూ కెనడా లోనూ స్తిరమయిన లాభాలతో నడుస్తున్న సంస్థ. )
..
టన్నుల్లో పెరుకున్న ప్లాస్టిక్ వ్యర్ధాలని, సేకరించి, చిన్న ముక్కలుగా చేసి కొన్ని ప్రత్యేక పద్దతులతో కరిగించి అచ్చులలో కి మార్చి, బ్లాక్స్ గా తయారు చేస్తున్నారు. మద్యలో హాలో గా ఉండే స్థలం ఉంటుంది.
(సింటెక్స్ డోర్స్ & పానెల్స్ పార్టిషన్ అవగాహన ఉందా?)
వీటన్నిటిని నిర్ణీత వెడల్పుతోనూ పొడవుతోనూ పోత పోసాక రోడ్డు అవసరమయిన చోటకి తరలిస్తారు.
మామూలు పద్దతులకి కొద్దిగా భిన్నగా, రోడ్డు నిర్మాణం జరిగే చేత ఒక వెడల్పాటి గోతిని ని ఏర్పాటు చేసి, ముందుగా దాన్ని కొంత ప్లాస్టిక్ కాంక్రీట్ తో ఒక లేయర్ వేసి కంప్రెస్స్ చేస్తారు.
తర్వాతే పోత పోసిన రోడ్డు ముక్కల్ని చదును చేసిన గోతిలో అమరుస్తారు. (వీడియొ చూడండి )
వీటి మధ్య రెండు పోరల్లా ఉండే భాగం లో కేబుల్స్, లాటివి అమర్చుకునే ఏర్పాటు ఉంటుంది. అదేవిధంగా వర్షం నీరు డ్రైన్ అవటానికి కూడా ఏర్పాట్లు ఉంటాయి. స్టాండర్డ్ సైజు బ్లాకుల తో జరిగిన నిర్మాణం కనుక రేపేర్లు కూడా సులభమే.
సాధారణ, తారు, సిమెంట్ రోడ్ల కన్నా, ఖర్చు, సమయము, ఆదా తో పాటు రెండు మూడు రేట్ల ఎక్కువ కాలం మన్నిక వీటి ప్రత్యకత.
ప్రస్తుతం నెదర్లాండ్స్ లో ఈ తరహా రోడ్ల నిర్మాణం ప్రయోగాత్మకంగా జరుగుతుంది.
ఈ విధానం విజయవంతం అయ్యి, ప్రపంచవ్యాప్తంగా ప్లాసిక్ రోడ్ల నిర్మాణం జరిగితే కానీ ఈ ప్లాసిక్ వ్యర్ధలకి ఒక మంచి పరిష్కారం దొరకదు.

Saturday 11 March 2017

హీరో క్రింద కూర్చోవటం ఏమిటి?

ఉత్తర ప్రదేశ్, నోయిడా లో ఉండే 14 ఏళ్ల ‘నిషా’ (Nisha Chaube) కి షారూఖ్ ఖాన్ అంటే పిచ్చి ప్రేమ.
తను తొమ్మిదో క్లాస్ లో ఉన్నప్పుడు ఒకసారి తన తాత గారి ఊరికి వెళ్తుంటే. రోడ్డు మీద నిలువెత్తు హోర్డింగ్ కనబడింది.
లగేజ్ బాగు పక్కన మెట్ల మీద స్టైల్ గా కూర్చుని ఉన్న షారుక్ .. అది లగేజ్ బాగ్ ల ప్రచార హోర్డింగ్.
అయితేనేం? అతను అలా కింద కూర్చోవటం ఆమెకి నచ్చలేదు.
బాగ్ ఎంత ఖరీదయినది అయితే ఏమి? తన హీరో క్రింద కూర్చోవాల్సి వచ్చినప్పుడు?
అదే మాట ఆమె తన తండ్రి తో చెప్పింది.
ముగ్గురు పిల్లల్లో రెండో అమ్మాయి ఆమె. తమ్ముడు 4 వ క్లాస్ లోనూ, అక్క 10 వ క్లాస్ లోనూ ఉన్నారు.
“ఆయన నవ్వి, మీ హీరోకి కూర్చునే ఏర్పాటు నువ్వే చెయ్యి అన్నాడు?”
నిషా నవ్వింది. కానీ తండ్రి మాటల్లో ప్రోత్చాహం వినిపించింది.
అక్కతోనూ, తమ్ముడి తోను సెలవు రోజుల్లో అనేక ప్రయోగాలు చేసింది.
చివరకి విజయం సాధించింది.
2009 సంవత్సరానికి గాను IGNITE అవార్డు కొట్టేసింది.
దానితో పాటు ఒక స్టేట్ అవార్డ్ సాదించింది.
రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డ్ అందుకుంది.
కొన్ని మార్పులు చేర్పుల తర్వాత ఆమె రెండు డిజైన్ లకి పేటెంట్ పొంది ఉంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ అయిన నిషా తనకి ఇష్టమయిన పరిశోధనా రంగం లోనే ఉంది.
చక్కటి భావ వ్యక్తీకరణ తో కవిత్వం వ్రాయటం ఆమె మరో హాబీ.
మచ్చుకి ఒకటి.


Solitude
------------
I never came to know
When I started loving solitude,
the pleasure of being in dark wood
No matter that the birds chirp
I was busy in a curb
Tried to stop my steps, But it was a memory lapse
Kept on going inside the cave
Where there was no life, no wave
Darkness inside appealed me
Curiosity of mine wanted to see
There was no looking back
Maybe I was a wack, But when I looked
I found a long way that I covered
No way to go back
I was stuck in a sack
But now I have started loving it all,
For I have a world of my own to call

కాలు నరుక్కున్న సైనికుడు.

ఆ సైనికుడు మంచం మీద పడి ఉన్నాడు. కాలు నుజ్జు నుజ్జయిపోయింది. ఎముకలు పొడి పొడి అయిపోయింది. రక్తం ధారాప్రవాహంగా కారిపోతోంది.
సైనికుడు స్పృహలోనే ఉన్నాడు.
నాకు మత్తు మందు ఇవ్వండి.అన్నాడతను.
యుధ్దం భయంకరంగా జరుగుతోంది. మత్తు మందు స్టాక్ లేదు.
పోనీ పెథిడిన్ ఇవ్వండి.
కానీ అదీ లేదు.
తన తోటి గూర్ఖా సైనికుడిని పిలిచాడు. ఈ నుజ్జు నుజ్జయిపోయిన కాలును నరికెయ్అని ఆజ్ఞాపించాడు.
సైనికుడు తెల్లబోయాడు. తన పై అధికారి కాలు నరకడానికి అతనికి చేతులు రాలేదు. నా దగ్గర కత్తి లేదుఅన్నాడు. అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది.
నా ఖుక్రీ ఇవ్వు.ఖుక్రీ అంటే గూర్ఖా సైనికుడి కత్తి.
సైనికుడు ఆయనకు ఖుక్రీ చేతికి ఇచ్చాడు. దీనితో ఈ కాలును నరికేయ్
మై నహీ కర్ సక్తా సాహెబ్అన్నాడు సైనికుడు. అతని ఒళ్లంతా కంపించిపోతోంది.
సరేఅన్నాడు ఆ అధికారి. తన ఖుక్రీతో తన కాలుపై ఒక్క వేటు వేశాడు. నుజ్జు నుజ్జయిన కాలు శరీరంనుంచి వేరైపోయింది.
దీన్ని తీసుకెళ్లు. ఖననం చేయిఅని ఆదేశించాడు ఆ అధికారి.
తన కాలును తానే తెగనరుక్కున్న ఆ వీర సైనికుడి పేరు మేజర్ ఇయాన్ కార్డోజో. అది 1971 భారత పాక్ యుద్ధం.
యుద్ధ భూమిలో పొరబాటున శత్రువు పెట్టిన ఒక మందుపాతరపై కాలు వేశాడు. అది పేలింది. అతని కాలు పూర్తిగా ముక్కముక్కలైపోయింది. దాని నుంచి మిగతా శరీరమంతా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తన కాలును తానే నరుక్కున్నాడు.

అయితే గాయానికి చికిత్స తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్డొజో ప్రాణం పోవడం ఖాయం.
కార్డొజోను పెద్ద ఆస్పత్రికి తరలించడానికి హెలికాప్టర్ అందుబాటులో లేదు.
మృత్యువు ముంచుకొస్తోంది.
అదృష్టవశాత్తూ మన సైన్యాలకు చిక్కిన పాక్ యుద్ధ బందీల్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చాడు.
కార్డొజో తన కమాండింగ్ ఆఫీసర్ తో నాకు పాకిస్తానీ చేతుల్లో చికిత్స చేయొద్దు అన్నాడు.
నువ్వు మూర్ఖుడివా?” కమాండింగ్ ఆఫీసర్ అడిగాడు. నీ ప్రాణం పోతుంది. ను్వ్వేం మాట్లాడకు. శస్త్ర చికిత్స జరుగుతుంది.
అయితే నావి రెండు షరతులుదృఢంగా అన్నాడు కార్డొజో.
షటప్నువ్వు షరతులు విధించడానికి వీల్లేదు.
పోనీరెండు అభ్యర్థనలున్నాయి. మొదటిది నాకు పాకిస్తానీ రక్తం ఎక్కించవద్దు.
నీకు పిచ్చా వెర్రా”?
నేను చావడానికిసిద్ధం. కానీ నాకు పాకిస్తానీ రక్తం వద్దు. రెండో షరతు. నాకు సర్జరీ చేసేటప్పుడు మీరు నా పక్కన ఉండాలి.
పాకిస్తానీ సర్జన్ మేజర్ మహ్మద్ బషీర్ ఆయనకు శస్త్ర చికిత్స చేశాడు. కాలు మెరుగుపడింది.
కానీ కార్డొజో కథ అయిపోలేదు. కార్డోజో తాను సైన్యంలోనే పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. కృత్రిమ కాలును అమర్చుకున్నాడు.
ఆ కాలితో నడక మొదలుపెట్టాడు. క్రమేపీ అది పరుగుగా మారింది. ఆ తరువాత కొండలు ఎక్కడం నేర్చుకున్నాడు. ఎత్తుల మీద నుంచి దూకడం నేర్చుకున్నాడు. రెండు కాళ్లు ఉన్న సైనికులు చేసే ప్రతి పనినీ చేయడం మొదలుపెట్టాడు. యుద్ధంలో చేసే పనులను చేయడం ప్రారంభించాడు.
కానీ పై అధికారులు ఒంటికాలు సైనికుడు యుద్ధానికి పనికిరాడని అన్నాడు. కావాలంటే పోటీ పడతానని చెప్పాడు.
పై అధికారికి కోపం వచ్చింది. ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా? శత్రువుకి దొరికిపోతే ఏం చేస్తావు?” అన్నాడు అధికారి.
నేను శత్రువుకి దొరకను.అన్నాడు కార్డొజో.
పోటీలో పాల్గొంటే నేను నిన్ను అరెస్టు చేస్తాను జాగ్రత్తఅన్నాడు అధికారి.
సర్మీరు నేను పాల్గొన్న తరువాతే అరెస్టు చేయగలుగుతారు. కాబట్టి ముందు నన్ను పోటీ పడనీయండి. ఆ తరువాత అరెస్ట్ చేయండి.అన్నాడు కార్డొజో ధీమాగా.
చివరికి అధికారి ఒప్పుకున్నాడు. పరుగు పందెం మొదలైంది. అందులో రెండు కాళ్లున్న ఏడుగురు ఆఫీసర్లను దాటి ముందుకు దూసుకెళ్లాడు కార్డోజో. అధికారి కార్డొజో భుజం పై ఆప్యాయంగా చెయ్యి వేశాడు. వెల్ డన్ సర్…” అన్నాడు అమిత గౌరవంతో.
ఆ తరువాత ఆ అధికారి సైన్యంలో ఉన్నతాధికారులు కార్డోజో పేరును అప్పని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ రైనాకి సిఫార్సు చేశాడు. అతని పట్టుదలను చూసిన జనరల్ ఆయనకు ఒక బెటాలియన్ కమాండర్ గా నియమించాడు.
రక్షణ శాఖ అధికారులు అడ్డం పడ్డారు. కుంటివాడు బెటాలియన్ ను కమాండ్ చేయడం ఏమిటిఅని కొర్రీలు పెట్టారు.
కానీ కార్డోజో పట్టుదల ముందు అభ్యంతరాలు ఆవిరైపోయాయి. కార్డోజో యుద్ధ భూమిలో, శత్రువు స్థావరాలకు ఛాతీ ఎదురొడ్డి కశ్మీర్ లోయలో పనిచేశారు. మేజర్ జనరల్ గా రిటైరయ్యారు. భారత సైన్యంలో వైకల్యాన్ని జయించి అత్యున్నత స్థాయికెదిగిన మొట్టమొదటి మేజర్ జనరల్ ఆయనే.
ఆయన తరువాత మరో ముగ్గురు యుద్ధంలో కాళ్లు పోయిన అధికారులు అత్యున్నత స్థాయికి ఎదిగారు. అందులో ఒకరికి రెండు కాళ్లూ లేవు.
రిటైర్ అయిన తరువాత కార్డోజో సైన్య చరిత్ర పై పరిశోధనలు చేశారు. పుస్తకాలు వ్రాశారు.
ఆయన ఎప్పుడూ నాలుగు మాటలు చెప్పేవారు. అవిః
ఉన్నది ఒకటే జీవితం. పూర్తిగా జీవించు.
ఉన్నది ఇరవై నాలుగు గంటలుక్షణం తీరిక లేకుండా గడుపు.
ఎప్పటికీ పట్టు సడలించకు. 


(ఆధారం .. రాకా సుధాకర్ )

Saturday 4 March 2017

టీ టైమ్

కొన్ని విషయాలు సాదారణంగా కనిపిస్తాయి.
వాటి ముగింపులు మాత్రం బీబత్సంగా ఉంటాయి.
కొన్ని విషయాలు సాదారణంగా కనిపిస్తాయి.
వాటి ముగింపులు మాత్రం బీబత్సంగా ఉంటాయి.
మాట్లాడే టప్పుడు అన్నీ ఆలోచించి మాట్లాడాలి. 
అసలు మాట్లాడకపోవటం బెటర్ అనుకోండి.
ఉదాహరణకి ఇది చూడండి.
..
సాయంత్రం ఇంటికొస్తామా? బహుశా కేబుల్ ప్రాబ్లం అనుకుంటా ..
టి‌వి ఆఫ్ లో ఉంటుంది. మద్యాన్నం ‘పతి బక్తి’ గురించి పాత సినిమా చూసి ఉంటుంది.
ఎదురోచ్చి నవ్వుతుంది. ఏం మాట్లాడకండి.
రెండు తౌడు బిస్కెట్లు, వేడి నీళ్ళు ఇస్తుంది.
నోర్మూసుకు తాగండి.
కాదూ మరేదయినా మాట్లాడదామనుకుంటున్నారా?
మీ ఇష్టం. నాకేం సంభందం లేదు.
 ...
"ఏమోయ్ ఈరోజు పేపరు చూశావూ? "
"లేన్దే. ఏమిటట?"
"ఈ నెల నుండి బైక్ వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలట.
కొత్త రూలు .."
పది నిమిషాల్లోబాగులో బట్టలు సర్దుకుని వస్తుంది.
“బయలుదేరండి” అంటుంది.
“ఎక్కడికి?” అంటారు మీరు జాలిగా..
“పదండి. వెళ్ళి మాచింగ్ హెల్మెట్స్ కొందాము”
**
ఇప్పుడు నన్ను చూసి ఏమి లాభం.
నే చెబితే విన్నారా?
లేవండి .. లేచి ఆ పని చూడుడు. :p

తవికలు

కవిత  వ్రాసి వినిపించే 'తవికల' గోల పడలేక బర్త శ్యామ్ ఒక నిర్ణయానికి వచ్చాడు  
పారాచూట్ అకాడమీ లో చేర్పించాడు.
ఒక్కోసారి అది ఓపెన్ కాదని బి బి సి న్యూస్ లో విని ఆశ పడ్డాడు.
మొదటి రోజు క్లాస్సెస్ జరుగుతున్నాయి.
Instructor చెప్పటం మొదలెట్టాడు.
“300 అడుగుల ఎత్తు కి తగ్గకుండా ఉన్నప్పుడు పారాచూట్ ఓపెన్ చెయ్యటం మంచిది”
“మనం సరిగ్గా 300 అడుగుల ఎత్తులో ఉన్నాం అని ఎలా తెలుస్తుంది.” కవిత డౌట్.
“మనం నేల మీద ఉన్న వారి ముఖాలు గుర్తుపట్టగలిగితే సుమారుగా 300 అడుగుల ఎత్తులో ఉన్నట్టు భావించాలి” ఆయన సమాదానం.
..
..
“కింద ఉన్న వారిలో మనకి తెలిసిన వారెవరూ లేరనుకోండి అప్పుడు ఎలా?” కవిత ప్రశ్న.
***
ఈల వేసుకుంటూ టి‌వి చూస్తున్న శ్యామ్ ముందు చెవుల వెంట రక్తం కారుతున్న అగంతకులు ఒక మూట తెచ్చి వదిలి వెళ్లారు.
అందులోంచి తవికలు వినబడుతున్నాయి.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...