Sunday, 6 September 2015

రోజు మార్చి రోజు

రిపోర్ట్స్ చూసి డాక్టర్ సత్యప్రసాద్ తృప్తి గా తలాడించారు.
" ఏమి పర్లేదు అంతా నార్మల్ గా ఉంది. 
బి పి లక్షణాలు కొద్దిగా ఉన్నాయి.. టాబ్లెట్స్ రాస్తున్నాను. 
ఇవాళ ఒకటి వేసుకుని రేపు స్కిప్ చేయండి.
ఎల్లుండి ఒకటి వేసుకుని మర్నాడు స్కిప్ చేయండి. 
అలా రోజు మార్చి రోజు వాడితే చాలు " బరోసా చెప్పి పంపారాయన.
***
రెండు వారాలకి హాస్పిటల్ అంబులెన్సే లో స్ట్రెచర్ మీద తీసుకొచ్చారు అతన్ని.
"ఏమయింది" ఈసారి ఆశ్చర్యపోవటం డాక్టర్ గారి వంతు అయ్యింది.
....
"మీరు చెప్పినట్టే రోజు మార్చి రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటున్నారు.
నిన్న కూడా వేసుకున్నారు. ఇవాళ స్కిప్పింగ్ చేస్తూ ..
పడి పోయారు . ఏమి మాట్లాడటం లేదు "
ఆమె కన్నీరు పెట్టుకుంది . 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...