Friday, 4 September 2015

మాట్లాడే చిలక

మిసెస్స్ రామనాధం బజార్నుండి ప్రొవిజన్స్ అన్నీ కొనుక్కుని వస్తుంటే 
ఒక పేట్ షాపు ముందు చాలా మంది గుమిగూడి ఉండటం గమనించింది.
ఆటో ఆపి తను కూడా ..వెళ్ళి చూసింది. 
చిన్న పంజరాలలో అనేక రంగుల పక్షులు అందరినీ అలరిస్తున్నాయి. 
ఒక పెద్ద బోనులో మాట్లాడే చిలక ఒక దాన్ని గమనించింది.
" ఆ చిలుక ఎంత?"
" అది 50 రూపాయలు."
"మాట్లాడే చిలుక అంత తక్కువ ధరకా?"
" అది పెరిగిన వాతావరణం అంతమంచిది కాదు. తప్పుడు మాటలు మాట్లాడుతుంది అందుకే వదిలించుకొదలుచు కున్నాను"
చెప్పాడతను .
" ఈ యాబై తీసుకొని ఇవ్వండి"
" ఒకసారి అమ్మాక తిరిగి తీసుకోం. దాని మాటలకి మాకు బాద్యత లేదు "
గట్టిగా చెప్పాక అతను పంజరానికి కూడా డబ్బు తీసుకుని ఇచ్చాడు .
త్రోవలో కొన్ని అపరాలు (జొన్నలు, సజ్జలు , లాటివి ) కొనుక్కుని ఇల్లు చేరిందావిడ.
హాల్లో ఇక ప్రక్కన సీలింగు హుక్ కి వేలాడ దీసింది. చిన్న గిన్నెలో నీళ్ళు ఉంచింది.
దాన్యం గింజలు వేసింది.
" హలో " చిలకని పలకరించింది.
" హలో " అంది అదికూడా.
మెస్సెస్ రామనాదం మురిసిపోయింది.
"కోత్త ఇల్లు , కొత్త మాడం చాలా బాగుంది." అది ముద్దు ముద్దుగా చెప్పింది.
మిసెస్స్ రామనాధం వెళ్ళి వెంటనే వెళ్ళి పక్క ఫ్లాట్ లో ఉండే స్నేహితురాళ్లని పిలుసుకు వఛ్చింది. మాట్లాడే చిలకని చూపించడం కోసం.
" కొత్త మాడం , కొత్త ఫిగర్లు " అందా చిలక . ఒకింత ఆశ్చర్య పోయినా అందరూ దాని మాటలు ఎంజాయ్ చేయ సాగారు .
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆఫీసు నుండి రామనాధం వచ్చారు .
హాల్లోకి రాగానే చిలక పంజరం లో ఎగురుతూ..
" హలో రామనాదం, ఏం కంపెనీ మార్చారు?? . ఇక్కడా మీకు డిస్కౌంట్ ఉందా!!? " అంది.
*******
అక్కడంతా నిశబ్దం . pacman emoticon pacman emoticon pacman emoticon
..

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...