ఒకానొక ఊరిలో బార్గవ ఒక పిల్లాడు ఉండేవాడు,
చాలా మందం గా చదువులో అందరికంటే వెనుకబడి ఉండేవాడు.
అతను ఎప్పుడు ఆటలతో కాలం గడిపే వాడు.
ఒక చొక్కా ఎండటానికి 10 నిమిషాలు పడితే, అయిదు చొక్కాలు ఎండ టానికి 50 నిమిషాలు పట్టుద్ది అని గంటా బజాయించి చెప్పేవాడు.
చాలా సార్లు టీచర్లు డైరీ లో తల్లి తండ్రులని కలవమని రాసేవారు.
వెళ్ళిన ప్రతిసారి అతను చదువులో ఫైల్ అవటం గురించి చెబుతుండేవారు.
**
ముఖ్యంగా సునందా టీచర్.
ఆమె కి అతడు ఏనాటికయినా గొప్ప వ్యక్తి అవుతాడని నమ్మకం.
ప్రతి విధ్యార్డికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అది వాడికి రాలేదని చెబుతుండేది.
కొన్నాల్టికి ఆమె బదిలీ అయ్యింది. దగ్గరలోని మరో చిన్న టౌన్ కి వెళ్లిపోయింది.
**
కాలం అనేక అనుభావాలని , మార్పులని తెస్తుంది. ఓడల్ని బండ్లు చేస్తుంది. బండ్లని ఓడలు చేస్తుంది.
**
కాల చక్రం కొంతకాలం నడిచాక. సునందా టీచర్ పదవి విరమణ చేసిన కొన్ని రోజులకి
ఆమెకి సివియర్ కార్డియాక్ ప్రాబ్లెమ్ వచ్చింది. గంటల్లో పేస్ మేకర్ అమరిస్తే గాని ఆమె కోలుకునే పరిస్తితి లేదు.
**
నగరం లో ఒకే ఒక సర్జన్ పేరు చెప్పారు అందరూ.
అతనొక్కడే ఆమెని కాపాడగలడు. అతను మాత్రమే అందులో స్పెషలిస్టు.
వెంటనే ఆమెని ఆ ఆసుపత్రికి తరలించారు.
మూడున్నర గంటల పాటు తన అనుభవాన్ని అంతా పోగుచేసుకుని ఆ కుర్ర డాక్టర్ ఆమెకి అపరేషన్ నిర్వహించాడు.
**
ఆరుగంటల తర్వాత సునందా టీచర్ కళ్ళు తెరిచింది.
అప్పుడప్పుడే వదులుతున్న మత్తు కి ఆమె కళ్ళు ఇంకా అలవాటు పడలేదు.
కళ్ళముందు ఒక అంధమయిన డాక్టర్ యువకుడు. అప్రోన్ వేసుకుని,
మెడలో కి వేలాడేసిన మాస్క్, రింలెస్ కళ్ళద్దాలు, కోటేసిన ముక్కు ,
చురుకయిన కళ్ళు , సూదంటు రాయి లాటి నవ్వు ..
**
ఆమె అతడిని చూడగానే ‘ సునందా మేడమ్ ‘ అంటూ అతను పలకరించాడు.
ఆమె అతడిని గుర్తు పట్టటానికి ప్రయత్నించింది.
అప్పుడే అతను ఆమె మొహం లోకి ఆశ్చర్యంగా చూశాడు .
ఆమె ముఖం బులుగు రంగు లోకి మార సాగింది. ఆమె అతనితో ఏదో చెప్ప టానికి ప్రయత్నించింది. గోడ వైపు చూపిస్తూ... పైకి లేచిన ఆమె చెయ్యి ..జారి పడిపోయింది. పల్స్ రేటు పడిపోసాగింది. అనుభవజ్ఞుడయిన ఆ డాక్టర్ తిరిగి ఆమెని వెంటేలేటర్ నుండి పేస్ మేకర్ మీదకి క్షణాల్లో మార్చి తిరిగి ఆమె గుండె కొట్టుకునేటట్టు చేశాడు..
**
ఆమె .ముఖం బులుగు రంగులోకి మారటం ఊహించని డాక్టర్ హతాశుడయ్యాడు.
ఏమి జరిగిందో అతను అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూ సునందా టీచర్ చెయ్యి చూపించిన వైపు చూశాడు . అక్కడ క్లీనర్ గా పని చేస్తున్న ‘మన భార్గవ ‘ తన వాక్కుమ్ క్లీనర్ ని కనెక్ట్ చేసుకోటానికి వెంటిలేటర్ కి పవర్ సప్లయ్ చేసే ప్లగ్ లాగి తన ప్లగ్ గుచ్చుతూ కనిపించాడు.
**
ఆవిదంగా కధ ముగిసింది. స్వస్తి .. స్వస్తి ... స్వస్తి.
No comments:
Post a Comment