Tuesday, 8 September 2015

ఇడియటుడు & ఫూలుడు

ఒకే అపార్ట్మెంట్ లో ఉండే వెంకట్ కి రమణ కి అనుకోకుండా 
చిన్న బాచులర్ పార్టీ దొరికింది.
ఊహించిన దానికంటే తక్కువమంది అటండ్ 
అవటంతో ఇద్దరికీ కొంచెం ఎక్కువ న్యాయం జరిగింది.
పార్టీ అయ్యేసరికి బాగా లేట్ అయ్యింది.
..
ఇంటి కి వెళ్ళటానికి రోడ్డు మీది కొచ్చారు .
చాలా సేపటివరకు ఏ ఆటొ రాలేదు ...
..
అలా వెతుక్కుంటూ చౌరస్తా దగ్గరకి వచ్చారు.
అయినా లాభం లేక పోయింది.
సరిగ్గా చౌరస్తా కి రెండో వైపు ఉన్న బస్ స్టాండ్ గారేజి లో
పార్క్ చేసిన బస్సులు కనిపించాయి.
..
గేటు తాళం లేక పోవటం గార్డు దగ్గరలో ఉండక పోవటం గమనించిన ..
రమణ, వెంకట్ కి ఒక అయిడియా ఇచ్చాడు.
లోపలికి వెళ్ళి బస్సు తోలుకురా మన అపార్మెంట్ దగ్గర వదిలేద్దాం అని.
సరే అని వెంకట్ లోపలికి వెళ్ళాడు.
..
పావుగంట దాటినా అతను బయటకు రాక పోవటం తో..
రమణ అతన్ని వెతుక్కుంటూ లోపలికి వెల్లాడు .
..
వరుసగా బస్సు నెంబర్లు గమనిస్తున్న వెంకట్ కనిపించాడు...
..
" ఇడియటుడా , ఫూలుడా ఏమి చేస్తున్నావు?"
" 23c కోసం చూస్తున్నానురా .. అదొక్కటే మన ఏరియాకి పోతుంది."..
..
" అందుకేరా నిన్ను మనాళ్ళు తిట్టేది . తెలివి తక్కువ సన్నాసి..
27 లో వెళ్ళి దియేటర్ దగ్గర దిగి , సందులోంచి ఫర్లాంగు పోతే మన అపార్ట్మెంట్ కి వెళ్తాము. ఆ మాత్రం తేలిక పోతే ఎలా?" smile emoticon grin emoticon pacman emoticon pacman emoticon


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...