Saturday, 26 November 2016

అభినందనలు

ఆర్మీ 'మేజర్' తన ట్రూప్ కి శిక్షణ ఇవ్వటం కోసం అడవిలోకి తీసుకెళ్ళాడు. 
క్లిష్టమయిన శిక్షణ లో ఉన్నప్పుడు సిగ్నల్ తక్కువగా ఉండటం వల్ల హెడ్ క్వార్టర్స్ నుండి కమ్యూనికేషన్ కట్ అయింది. 
**
రెండో రౌండ్ ప్రాక్టీస్ చేయిస్తుంటే,, హెడ్ క్వార్టర్స్ నుండి ఒక రైఫిల్ పేలటం వినిపించింది.
అత్యవసర పరిస్థితులలో ఇచ్చే సిగ్నల్ అది.
మేజర్ వెంటనే జీపు లోకి దూకి డ్రైవర్ ని వేగంగా వెళ్ళమని చెప్పాడు.
అరగంటలో అక్కడికి ఆఘమేఘాలమీద గమ్యం చేరుకున్నారు.
**
జీపు పార్క్ చేసి ఇద్దరు లోపలికి నడుస్తుంటే.. కల్నల్ ఎదురోచ్చి “ మీకో గుడ్ న్యూస్ ఓహ్ సరిగ్గా అరగంటలో వచ్చేశారు. గుడ్ . మీకు అభినందనలు “ చెయ్యి కలుపుతూ ..
“ నాదేముంది. అంతా డ్రైవరు గొప్పతనం. నిజానికి అతనినే అభినందించండి" అన్నాడు మోడెస్టీ గా
కల్నల్ డ్రైవరు బుజం తట్టి “ మీ మేజర్ కి అమ్మాయి పుట్టింది. మీకు అభినందనలు”

స్వైపింగ్ మిషను కావలెను.

ఉరిచివర ఇసోలేటెడ్ గా ఉన్న ఆ రెండు పోర్షన్ ల బిల్డింగ్ లో అర్ధ రాత్రి దొంగలు చొరబడ్డారు. 
ఉత్తరం పోర్షన్ బయట గడి పెట్టారు. ఏ‌సి పైపు లోకి క్లోరోఫామ్ ఎక్కించారు. దక్షణమ్ పక్క ఉన్న భాగం లో యజమాని ఉంటాడు అనే జనరల్ నాలెడ్జ్ తో దాని తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. ముందు గదిలో ఒక ముసలావిడ పడుకుని ఉంది. వెంట తెచ్చుకున్న ఆడ్హెసివ్ టేపు నోటికి అంటించారు. దానితోటే చేతులు రెండు కలిపి టేప్ చేశారు. 
మరో గదిలో ఇంటావిడ నిద్రపోతు ఉంది. పక్కనే మూడు అంకె వేసుకుని మగ వ్యక్తి కూడా. ముఖం మీద స్ప్రే చల్లి ఆమెని పూర్తిగా స్పృహ తప్పించారు. అతను మత్తుగా నిద్ర పోతున్నాడు.
ఒక దొంగ కాపలా ఉంటే మిగిలిన వాళ్ళు సోదా ప్రారంభించేరు.
హల్లో పెద్ద్ టి‌వి, దొడ్లో రాగి బాయిలరు తప్ప విలువయినవి ఏమి కనిపించలేదు. నగల కోసం వెతికారు. ఆమె వంటిమీద ఉన్నవి గిల్టు నగలు అని అనుభవం తో అర్ధం అయింది. మగ మనిషి చేతికి రంగు రాళ్ళ గిల్టు ఉంగరాలు ఎనిమిది ఉన్నాయి.
బీరువా తాళాలు తెరిచే ఉన్నాయి. చిరగటానికి సిద్దంగా ఉన్న పట్టు చీరలు రెండు, నాలుగు జతల బట్టలు, మూడు ఫోటో ఆల్బమ్ లు, డాక్టర్ బిల్లులు, మెడికల్ రిపోర్త్లు తప్ప మరేమీ కనిపించలేదు.
మగ మనిషిని కట్టేసి అతని ముఖాన నీళ్ళు చల్లారు.
“డబ్బు ఎక్కడ?” ముసుగుల్లోంచి అతన్ని అడిగారు.
అతనికి విషయం వెంటనే అర్ధం అయింది.
బారు మూసేటప్పుడు బేరర్ తెచ్చిన బిల్లు చెక్ చేసినట్టు వాళ్లందరిని పరకాయించి చూశాడు.
“డబ్బులా? కొత్తవా ? పాతవా?”
“ఎవయినా సరే?” గదమాయించారు దొంగలు.
“తిక్క సన్నాసుళ్ళారా.. ఇండియా లో ఎవడి దగ్గరయినా డబ్బులు మిగిల్చాడట్రా .. డిల్లీ లో పెద్ద దొంగ?”
దొంగలకి చిరాకు పుట్టింది. గత రెండు వారాల నుండి ఇదే పరిస్తితి. ఏ జేబు కొట్టినా ఖాళీ పర్సులే, ఏ ఇంటికి చొరబడ్డా ఖాళీ చేతులే?”
లాగి పెట్టి ఒకటి పీకారు.
అతను ప్రైవేట్ కాలేజీ లెక్చరర్. ఇలాటివి ఎలా పరిష్కరించాలో బాగా తెలుసు.
“అబ్బాయిలు మీకు చేతులు నొప్పి, తర్వాత పోలీసులకి మీడియాకి పని తప్ప ఏం ఉపయోగం లేదు. దీనికి మధ్య మార్గం ఒకటే ఉంది. మీదగ్గర స్వైప్ మిషన్ ఉంటే చెప్పండి. మీరు కష్టపడ్డందుకు, నష్ట పోకుండా క్రెడిట్ కార్డు లిమిట్ వరకు గీకుతా”
..
“ స్వైపింగ్ మిషనా ? అంటే? “ అన్నాడు కుర్ర దొంగ. ..
..
“అప్డేట్ కండి. వెళ్ళండి. టైమ్ వెస్ట్ చేసుకోవద్దు. వెళ్తూ తలుపులు దగ్గరగా వెయ్యండి. మంచి నిద్ర పాడు చేశారు. “

బ్యాంక్ రాబరీ (మోడి వెర్షన్)

పొద్దుటే ఫర్లాంగ్ ఉన్న 'క్యూ' లైన్ మధ్యానానికి పలచబడింది. 
లంచ్ బ్రేక్ కి ముందు కాషియర్ ముందున్న కస్టమర్ ఒకరు హటాత్తుగా బాగులోంచి తీసిన ఒక నాటు తుపాకిని గాల్లోకి పేల్చాడు. 
మొహమాటానికి తిరుగుతున్న ఫ్యాన్ రెక్క ఊడి పక్కనే ఉన్న మానేజరు టేబుల్ మీద పడింది.
“ఖబార్డర్ ఎవరన్నా కదిలారంటే కాల్చేస్తాను. అసలే నాకు షూటింగ్ రాదు. ఎవరికి తగులుద్దో బాలయ్య బాబు కూడా చెప్పలేదు. మూడు రోజుల నుండి క్యూ లో నిల్చుని ఉన్నాను. కౌంటర్ దగ్గరకి వచ్చే సరికి డబ్బు అయిపోయింది అని చెబుతున్నారు”
రెండో చేతిలో సిద్దంగా ఉంచుకున్న పాసు బుక్, అందులో 24000 సెల్ఫ్ చెక్కు లోపలికి నేట్టాడు.
“పిల్లాడికి పరీక్ష ఫీజు కట్టాలి. మా ఆవిడకి రెండు రోజుల నుండి జ్వరం. చేతిలో రూపాయి లేదు. మా మేనేజరు ఇచ్చిన శెలవు ఇవాళ తో ముగుస్తుంది. “
తుపాకి కాషియర్ కి గురి పెట్టాడు.
చెక్ పాస్ చేసి నోరుమూసుకుని లిమిట్ 24000 ఇచ్చేసెయ్. అన్నీ 2000 నోట్లు ఇచ్చావో ఖాతం. 100 రూపాయల కట్టొకటి ఇవ్వు. పాస్ బుక్ అప్డేట్ గా ప్రింట్ చేసి ఇవ్వు. ఖబర్దార్ ఎవరయినా అడ్డుపడ్డారో నా చేతుల్లో బలే.” పెద్దగా అరిచి చెప్పాడతను. 

Friday, 25 November 2016

అదే కధ

కాలేజీ పాత విధ్యార్డుల, సమావేశం జరిగింది. 
పాత రోజులు గుర్తు చేసుకుంటూ .. కళాశాల అంతా తిరిగి చూస్తూ హాస్టల్ వైపు నడిచాడు లంబోదరం.. 
..
30 ఏళ్ల నుండి ‘అదే భవనం’, ‘అవే తలుపులు’..
తను చదువుకున్నప్పుడు ఉన్న రూముకి వెళ్ళాడు. 
తలుపు తట్టాడు.
..
నలుగురు కుర్రాళ్ళు ఉన్నారు లోపల.
పరిచయాలు అయ్యాయి.,
..
“అవే కిటికీలు, అవే మంచాలు” అన్నాడు లంబోదరం.
గోడల మీద కాలెండర్లు చూశాడు. “అవే కాలెండర్” అన్నాడు నవ్వుతూ.
..
కుర్రాళ్ళు కంగారుగా వాటిని వెనక్కి తిప్పేశారు.
కుర్చీలో కూర్చుని వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతుంటే, మంచం కింద సీసాలు కనిపించాయి.
..
“ మాది ఫల  రసాయనం .. మా నాయినమ్మ పంపింది” అన్నాడు ఒక విద్యార్ధి కంగారుపడుతూ...
లంబోదరం నవ్వి “అదే కధ “ 

కుర్చీ తుడిచిన కాగితం

నేను టిఫిన్ చెయ్యటానికి ఆ చిన్న హోటల్ వద్ద ఆగగానే ఆవిడ నన్ను గుర్తు పట్టింది.
పొయ్యి వద్ద నుండి పక్కకి వచ్చి, ఒక పాత పుస్తకం నుండి బర్రున ఒక కాగితం చించి, ఇనపకుర్చీ శుబ్రంగా తుడిచింది.
నాలుగు ఇడ్లిలు, ఒక సాదా దోశె తిన్నాను.
..
నా కష్టం పగ వాడికి  కూడా వద్దు.
..
కుర్చీ తుడిచిన కాగితం లో నాకధ ఉంది. స్టైల్ గా బుగ్గన పెన్ను పెట్టుకుని ఉన్న ఫోటో ఉంది. 

Tuesday, 22 November 2016

వాత

బజార్లో ఏమి జరిగినా  సంపూర్ణ కి  అత్యవసరం.
ఆ వీధి లోకి కొత్తగా ఎవరు చేరినా? ఎవరింటి లో అయినా చిన్న గొడవ జరిగినా, పిల్లలు పరీక్షలు పాసయినా, ఫైల్ అయినా, ఎవరేం కొన్నా, ఆఖరికి ఏమి వండుకున్న సరే,  అన్నీ ఆమెకి తెలియాల్సిందే.
ఆ జబ్బు కొన్నాళ్ళకి ముదిరి పోయి, ఎదుటివారి గురించి ఊహాగానాలు చెయ్యటం  వాటి కి ప్రచారం కల్పించడానికి ఆమె అలవాటు పడి పోయింది.
ఈ మద్యే ఒక యువ జంట మా వీది లోకి కొత్తగా చేరారు.
పాపం అతను ఆటో వేస్తాడు. మంచి చురుకయిన వాడు. 
ఆమె బెల్దారు కులీ  పనికి వెళ్తుంది.  వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం మినహాయించి మరో విషయం లో జోక్యం చేసుకోవటం నేనేరగను.
ఎప్పుడయినా ఎదురయితే మర్యాద పూర్వకంగా నవ్వుతాడు, లేదా చెయ్యెత్తి పలకరిస్తాడు. అంతే.
ఒక రోజు అతని ఆటో ఒక బార్ వద్ద ఆగి ఉందట, బజారు మొత్తానికి అతడు తాగుబోతని, రోజు బారు వద్దే తాగి పడి పోతాడని.... మరో కొత్త వార్త ఊహించే వరకు చెబుతూనే ఉంది. 
ఆ మాటలు అతనికి చేరేలేదంటే నేను నమ్మను. కానీ అతను ఆ విషయం పట్టించుకోక పోవటం నాకు వింతే !!
..

ఆదివారం ఉదయం ఒక విశేషం జరిగింది. 
అతని ఆటో సంపూర్ణ ఇంటి ముందు నిలిచి ఉంది. 

రిబ్బను పొడవు ఎంత?

9 సెంటి మీటర్ల వెడల్పు ఉండే పొడవాటి రిబ్బను ఒకదాన్ని ఒక అవధూత బ్రహ్మీ డాక్టర్కి బహుమతి గా ఇచ్చాడు. 
'నీకు బాగా అవసరం అయినప్పుడు మనసులో ద్యానం చేసుకుని ఆ రిబ్బను చేతిలో తీసుకుని ప్రార్ధన చేస్తే' ఆ కోరిక నెరవేరుతుందని, 
ఒక్కో కోరిక కోరెకొంది ఆ రిబ్బను పొడవు లో సగానికి, వెడల్పులో మూడోవంతు కి తగ్గిపోతుందని చెప్పాడు. 
..
మనాడు ఎగురుకుంటూ వెళ్ళి నర్సు సిమ్రాన్ కి ఈ విషయం చెప్పాడు...
.. 
మొదటి కోరిక నాకు బస్తాడు 2000 నోట్లు కావాలిఅందామే...
వెంటనే ఒక పెద్ద బస్తా 2000 నోట్లు కట్టలతో ప్రత్యక్షమయింది. 
రిబ్బను పొడవులో సగానికి , వెడల్పులో మూడో భాగనికి తగ్గి పోయింది. 
..
వారం గడిచింది. ఇద్దరు ఊరంతా తిరిగినా ఒక్క నోటు కి కూడా చిల్లర దొరకలేదు...
.. 
రెండో కోరిక: ఈ మొత్తం డబ్బుకి చిల్లర కావాలిఅన్నారు ఇద్దరు...
.. 
రెండు బస్తాల నిండా 500/1000 నోట్లు ప్రత్యక్షం. 
రిబ్బను పొడవులో సగానికి , వెడల్పులో మూడో భా గనికి తగ్గి పోయింది...
భ్రమి ఆనందం ఏడుపు కింద మారటానికి ఎంతో సేపు పట్టలేదు. అవన్నీ రద్దయిన నోట్లు. 
..
మూడో కోరిక: ఈ చెత్త నోట్లు అన్నీ మాయం అయిపోవాలి”. తదాస్తు!! అన్నీ మాయం అయిపోయాయి...
.. 
రిబ్బను పొడవులో సగానికి , వెడల్పులో మూడో భాగనికి తగ్గి పోయింది...
.. 
మొత్తానికి ఎక్కడ బయలు దేరారో అక్కడే మిగిలి పోయారు. 
చేతిలో అవదూత ఇచ్చిన 4.0 చదరపు సెంటీమీటర్ల ముక్క మిగిలింది. 
***
అవదూత మొదట్లో ఇచ్చిన రిబ్బను వెడల్పు 9 సెంటీమీటర్లు, పొడవు ఎంత ఉందో గుర్తు లేదు. మీరేమయినా సాయం చేస్తారా? 
---------------------
పగలంతా శ్రమ చేసి, వేడి నీళ్ళు పోసుకుని రాగి అంబలి తాగిన వాడికి మల్లె నిద్ర ప్రాప్తిరస్తు. 

మార్నింగ్ చాయ్-బిస్కెట్.

కన్వేయర్ బెల్ట్ మీద 500,1000 నోట్ల కట్టలు, ప్రయాణం చేస్తూ ఉన్నాయి. 
రద్దయిన కోట్లాది నోట్లని ఎలెక్ట్రిక్ క్రిమేషన్ :) కి పంపిస్తున్నారు. 
మార్గం రద్దీగాను, ప్రయాణం మందం గాను సాగుతుంది. 
..
ఇంతలో పక్క పక్క నే ఉన్న ఒక 500 నోటుకి, మరో 1000 నోటుకి స్నేహం కుదిరింది.
రెండు వాటి జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని నిట్టూర్చాయి. ..
..
“నేను జీవితం లో అన్నీ అనీభవించేశాను” అంది వెయ్యి నోటు. ..
కళ్ళు విప్పార్చింది 500 నోటు.
..
“కంకార్డ్ విమానాల్లో తిరిగాను, నెలల తరబడి షిప్పులో ప్రయాణం చేశాను. నీకు తెలుసా ఏ‌సి కారు తప్ప మరోటి ఎక్కలేదు నేను. మాల్దీవ్స్ లో అందాలన్నీ చూశాను. గొప్ప అందగత్తెల పర్సు లన్ని తిరిగేశాను. షాంపైన్ ల రుచి చూశాను. “ తన్మయత్వం తో అంది...
..
500 నోటు నిట్టూర్చింది. ..
“ నా జీవితం ఎంతో పవిత్రం గా గడిచింది. నేను తిరగని గుడి లేదు, చూడని హుండీ లేదు, తిరపతి నుండి, షిర్డి, చార్ధామ్ లాటి అన్నీ పవిత్ర స్థలాలు చూశాను.., చాలా వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలు చూశాను.” అంది.
..
వెయ్యి నోటు అడ్డుపడింది. “ గుడా ??!! హుండీ నా?!! అంటే?!!”

Friday, 18 November 2016

45. మర్చి పోలేని జోక్

మూసివున్న తలుపుల వైపు వింతగా చూస్తూ మెట్లు దిగుతుంటే.. ఒక సన్నటి వాచ్ మెన్ మరో, నున్నటి పనావిడ కలిసి మెట్లు ఎక్కుతూ ఎదురొచ్చారు. 
నేను అతన్ని ఫాలో అయి వెనక్కి వచ్చి తలుపు తీసే దాకా ఆగాను. 
ఏం కావాలన్నట్టు చూసి “ ఇ ఇ ఇ వాళ సెలవు. సే సే సే సెకండ్ శా శా శాటర్ డే “ అన్నాడు. 
నేను కొత్తగా ఉద్యోగం జాయిన్ అవటానికి వచ్చానని, అతనితో చెప్పాను.
“సోమవారం రమ్మని. రెండు రోజులు ఎవరు దొరకరని.”
రెండు వాక్యాలు పదే పదినిమిషాల్లో చెప్పేసాడు.
నేను వెనక్కి తిరిగి వస్తుంటే పిలిచాడు. ఏమిటన్నట్టు చూసాను.
పాపం అప్పుడే అతనికి తల జిల పుట్టినట్టుంది. ఒక చేత్తో గోక్కున్నాడు.
అతనేం మాట్లాడక పోయేసరికి నేను ఏమిటన్నట్టు సైగ చేసాను. అతను చేత్తో మళ్ళి తల గోక్కున్నాడు.
నేను అయోమయంగా అతన్ని చూస్తూ మెట్లు దిగాను.
నేరుగా నా డిప్లోమో క్లాస్మేట్ ‘అల్లుడు రమేశ్’ దగ్గరకి వెళ్లాను.
“మామా ఇది ప్రబుత్వ ఉద్యోగం మామా. ఇలానే ఉంటాయి. మీ సూపరింటెండెంట్ ఫోన్ నెంబరు నాదగ్గర ఉంది అతనితో మాట్లాడి ఒకసారి చెబుదాం “ అంటూ నాతో బయలు దేరాడు.
జేబులో ఉంచుకున్న చిన్న ఫోన్ బుక్ తీసి పబ్లిక్ ఫోన్ నుండి ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడి “నే చెప్పానా? మామా? సోమవారం రమ్మన్నాడు.” అన్నాడు.
ఇద్దరం పిచ్చాపాటి మాట్లాడుకుని విడిపోయాం.
**
సోమవారం ఉదయం తీరిగ్గా వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను.
మద్దిపాడు AE, M. రమేశ్ ని కలిసాను. .
“ పెద కొత్తపల్లి, SC కాలానికి వెళ్లి వంటుఫోర్ (1:2:4 సిమెంటు, ఇసుక, కంకర రేషియో, కాంక్రేట్ అని కాబోలు) వేస్తున్నారు, దగ్గర ఉండి వేయింఛి రా” అన్నాడు.
..
వెంటనే బస్ స్టాండ్ కి వెళ్లి పెద కొత్తపల్లి బస్ ఎక్కాను. 10 లేదా 12 కిలోమీటర్ల ఉండే ఆ వూరు చేరటానికి గంట పైగా పట్టింది. ఊర్లో దిగి sc కాలని ఎక్కడో విచారణ చేసుకుని అక్కడికి నడుచుకుంటూ వెళ్లాను...
ఉరికి ఒక చివర అయిదు సెంట్ల స్తలం లో ఒక చిన్న బలిచిన వాడి బాత్ రూము అంత గది కి, సబుకు కర్రలు నిలబెట్టి, నల్ల మట్టి పోసి నునుపుగా చేసి పేడ అలికి ఉంది. దాని మిద నిలువుగా అడ్డంగా కొన్ని టార్ స్టిల్ రాడ్లు మొహమాటానికి కట్టి ఉన్నాయి. (shuttering వర్కు, ఇలా చేస్తారని నాకు అంతకు మునుపు తెలీదు.)
..
ఒక పది, పన్నెండు మంది కాయకష్టం చేసే వాళ్ళు పోగయి ఉన్నారు. నాప బండల తో చేసిన ఫ్లాట్ ఫారం మిద కాకర కుప్ప గా పోసి ఉంది ఆ పైన ఇసుక మరో పొరగా పోసి ఉంది.
నేను ఆ beneficiary (లబ్దిదారుడు అట. అదే వినటం ) ని కలిసి, AE పంపారని, ఇక్కడ ఎక్కడో ఇంటి స్లాబ్ వేస్తున్నారు చూడమని పంపాడని చెప్పాడు. ఆతను ఒక ఇనప మడత కుర్చీ సంపాదించి తెచ్చి అక్కడ నీడ లో వేసి కూర్చో మన్నాడు.
ఇదే ఇల్లు అన్నాడు. నేను నోరు తెరుచుకుని చూస్తూ ఉంటె ..
“ఇక మొదలెట్టండి.” అంటూ సిమెంటు బస్తాలు నేర్పుగా విప్పదీసి ఇందాకటి కుప్ప మిద పలచగా ఒక పోర లాగా పరిచాడు. తర్వాత, బుంగ లతో నీళ్ళు వంపుతూ మూడు కలిసేట్టు గా తిరగ గొట్టాడు. బోచ్చల్లో వేసిన దానిని మంచే మిద నిలబడిన ఇద్దరు పైకి చేరిస్తే పైన ఉన్న మరో ఇద్దరు దాన్ని చదరంగా పరవ సాగారు..
..
మూడు గంటల్లో అది పూర్తి అయింది.
మొత్తం పద్నాలుగు బస్తాలు కాంక్రీట్ !!
మర్నాడు AE ఆఫీసులో కలవగానే,
“నేర్చుకున్నావుగా వంటుఫోర్ ఎలా వేస్తారో “ అన్నాడు.
నా జీవితం లో మర్చి పోలేని జోక్ ఇప్పటి వరకు అదే.

Wednesday, 16 November 2016

కష్టం - సుఖం

మెడికల్ షాపు లో అమ్మ కోసం 'పైన్ బామ్' ఒకటి కొనటానికి ఆగినప్పుడు, బాల్య మిత్రుడు ఒకరు కలిశాడు. చదువు పెండలాడే ఆపేసి ఫ్సైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆడ పిల్లలు ఇద్దరు యూ‌.ఎస్ లో ఉన్నారట. 
పిల్లలు, చదువులు, లాటి పిచ్చాపాటి మాట్లాడాక, పెద్దమ్మాయి వివాహం దగ్గరలోనే ఉందని చెప్పాను. 
"మీ నాన్న, అమ్మ.. అంతెందుకు మీకుటుంబం నాకు బాగా తెలుసు. పెళ్ళికి అవసరం అయిన డబ్బు ఇస్తాను.(500,1000 నోట్లు). ఈ రోజే తీసుకో. చే ఉత్తరం వ్రాసి ఇవ్వు. చాలు. ఎప్పుడో జనవరి లో ఇద్దువు గాని. వడ్డీ కూడా పెద్దగా వద్దు" అన్నాడు ఆప్యాయంగా. ..
అతడి విశాలమయిన మనసుకి హనందించి.. నవ్వి."నాకు డబ్బు అంత అవసరం లేదు. మధ్యతరగతి వాడిని, నేను కష్టంగా ఏర్పాటు చేసుకోవాలిసినంత డబ్బు అవసరం అవలేదు. వద్దు థాంక్స్ " అన్నాను.
"కష్టం - సుఖం పంచు కొక పోతే స్నేహాలు ఎందుకు?" అతనే అన్నాడు.
'ఈ ముక్క వారం క్రితం 500,1000 నోట్లు రద్దుకు ముందు అనేవాడా?' చిన్న సందేహం.

Tuesday, 15 November 2016

హొ ఆర్ యు డూయింగ్ ?

ఒక బాసుడు ఆఫీసులోకి బాసిని వచ్చింది. తను స్టాఫ్ చేత ఎంత బాగా పని చేయిస్తాడో బాసిని కి వినిపించాలని అతని ఆరాటం. వెంటనే ఒక సబ్ ఆర్డినేట్ కి ఫోన్ చేశాడు. 
..
"How are you doing?" అన్నాడు స్పీకర్ ఫోన్ నుండి...
..
అటునుండి ఫోను మెడ వంపులో ఉంచుకుని మాట్లాడుతున్నట్టుగా ఉంది...
..
సమాదానం ఇలా ఉంది
"I was under a lot of pressure, but things seem to be flowing well now. I've got a firm grip on the situation and am seeing some good volumes & output. It may take a while before I achieve completion, but it's important to take one's time in order to stay focused on objectives.
I expect to wash my hands off the whole thing soon !"
**
బాసుడు బడాయిగా కళ్లెగరేశాడు.
..
..
..
"ఈ బడాయి కేం గాని అతను వాష్ రూములో ఉన్నట్టున్నాడు. "

Monday, 14 November 2016

పాతిక సీటు


బస్సులో 55 రూపాయల టికెట్ కి స్వైపింగ్ గాని, చెక్ గాని స్వీకరించక పోవటాన్ని ఖండిస్తుంటే... మరో నలుగురు నిలబడి ప్రయాణం చేస్తున్న బాదితులు  ప్రోగయ్యారు.  అప్పటికప్పుడు ఒక యూనియగా తయారయ్యాము.  
ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. తాత్కాలిక ప్రసిడెంటు గా 3-2 ఓట్లతో విజయం సాధించాను.
కొత్త 2000 నోటు లాగా నాజూగ్గా మొదలెట్టి, ఆదివారం చాపలు అమ్మే అవ్వ చేతి సంచిలో మిగిలి పోయిన పాత అయిదొందల నోటు లాగా తయారయ్యి, వాదిస్తూ ఉంటే.. బస్సులో ఒక సీటు ఖాళీ అయింది.
యూనియన్ నిభందనలని తుంగలో  తొక్కి, ఒలెంపిక్స్ ఆటగాడిలా నేర్పుగా బాగ్ సీట్లో కి విసిరి,  నైస్ గా సీట్లో
కూర్చున్నాను. మిగిలిన సబ్యులు రోషం గా  చూసి నట్టు ఉన్నారు. మా యూనియన్ వీగి పోయింది..
పక్కనే ఉన్న ప్రయాణీకుడు మిగిల్చిన  అర సీట్లో అమాయకంగా కూర్చిని మాటల్లో దించాను, మరో పాతిక సీటు సంపాదించాలని ఆశ “మాస్టారూ పిల్ల లెంతమంది?”
“ముగ్గురు.” అన్నాడు. మన లాగే కష్టజీవి అనమాట.
“ఏం చేస్తున్నారు?”
పెద్దోడు, యాక్సిస్ బాంక్, రెండో అమ్మాయి, బంక్ ఆఫ్ బరోడా, మూడోవాడు, ఆంద్రాబాంకు “
వార్ని బాంకు ఉద్యోగాలన్నీ టోకున కొన్నాడా అనుకుంటుంటే”
అతనే  పూర్తి చేశాడు. “ ఏ‌టి‌ఎం ల దగ్గర క్యూ లో నిలబడి ఉన్నారు. వాళ్ళకి అన్నాలు తీసుకెళుతున్నా” అని రెండు చేతుల్తో గవ్వలు ఊపినట్లు భళ్ళున నవ్వాడు.

మన అర లో   పాతిక సీటు  అప్పటికే నోక్కెశాడు. 

Sunday, 13 November 2016

ఎటువైపు?

తెల్లవారి 2.30 కి పిల్లాడికి ఫోన్ చేసింది.
బబ్లూ నిద్ర లేచావా? ఇంకో అరగంటలో స్టేషన్ వస్తుంది.”
3.00 కి నన్ను నిద్ర లేపింది.
నేను నెట్ లో ట్రైన్ ట్రెస్ చేసి ఫోన్ చేశాను “బబ్లూ ట్రైన్ 9 నిమిషాలు లేటు. 3-18 కి స్టేషన్ లో ఉంటుంది.”
సరే నాన్నా. ప్లాట్ ఫార్మ్ ఎటువైపు?”
వెంటనే ఈవిడ అందుకుంది. “సాయిబాబా గుడి కనబడుతుంది అటువైపు”
ఏ సి లో కూర్చున్న వాడికి అర్ధరాత్రి సాయి బాబా గుడి కాదే.. అయనే కనబడతాడు. రే బబ్లూ ట్రైన్ వెళ్తున్నా వైపు తిరిగి నిలబడు. ని లెఫ్ట్ హాండ్ వైపు ఫ్లాట్ ఫామ్.”
అంతలోకి వాళ్ళ చిన్న అక్క మొదలెట్టింది. జి‌పి‌ఎస్ ఆన్ చేసుకో, ట్రైన్ నార్త్ వైపు వెళ్తూ ఉంటుంది. వెస్ట్ వైపు ఫ్లాట్ ఫోమ్ వస్తుంది”
మళ్ళీ వాళ్ళమ్మ ఏదో చెప్పింది. స్పీకర్ ఆన్ చేసి “సాయి అర్ధం అయిందా? ఇప్పుడు చెప్పు ఫ్లాట్ ఫామ్ ఎటువైపు వస్తుంది “ అని ఒక మార్కు ప్రశ్న వేసింది.

వాడు అరక్షణం లో “డోరు వైపు” అని సమాదానం చెప్పాడు.

Friday, 11 November 2016

As father as son.

హాస్టల్ లో ఉన్న తమ్ముడి తో మా ఆమ్మాయి స్పీకర్ ఫోన్ లో మాట్లాడుతుంది.
“మొన్న సండే వ్రాసిన appsc ఎక్సామ్ ఏమయిందక్కా?”
“రిజల్ట్స్ రాలేదురా? కీ ఇచ్చారు. క్వాలిఫై దాటి మరో 30 మార్కులు వస్తాయి”
మళ్ళీ ఎక్సామ్ ఉందా?
“అవును రౌండ్ టూ మెయిన్స్ ఉంటుంది. డిసెంబరు ఎండింగ్ లో “
సబ్జెక్టేనా ?
“ అవును.. GK కూడా ఉంటుంది.”
“ఇంకా ఏం చదువుతావు లే అక్కా?”
“ రేయ్ స్పీకర్ ఆన్ చేసి ఉందిరా?”
“చెప్పవే.. అక్కా బాగా చదువు  అక్కా యు కెన్ డూ ఇట్ ”.
“రేయ్ నాన్న కూడా పక్కనే ఉన్నారు. వింటున్నారు”
 “రోజు న్యూస్ పేపర్ చూడు, రెండో పేజీ లో వ్యాసాలు చదువు. ..”
“రేయ్ ఇంక చాలు గాని. పిచ్చోడిలా ఆ గడ్డం ఏమిటి క్రాఫ్ చేయించు కోలేదా?? ఫోటో చూశాను “

“అక్కా.. సిగ్నల్ బాలేదు . మళ్ళీ చెయ్యనా?”

44. హరా జీన్స్

హిమాయత్ నగర్ లో ఉన్న 'లాల్ జి' గారి ఫ్లాట్ కి వెళ్ళేసరికి ఆయన మా కోసం చూస్తూ ఉన్నాడు.
తను సైన్ చేయాల్సిన ఫైల్ చూసి “ యే సబ్ ముజ్సే అబ్ నహి హోగా. వహా రఖ్ లో ఫిర్ కబీ దేక్ లెంగే “ అన్నాడు మా అక్కౌంటెంట్ తో.
అతను రెండువంతులు తమిళం, ఒకవంతు ఇంగ్లీష్ లో బ్రతిమాలాడు.
‘శామ్ తక్ రుక్నా. గాడి, డ్రైవరు కొ చోడ్ కె జానా .” అని అతనితో చెప్పి నన్ను తనతో రమ్మని సైగ చేశాడు.
జీపు నేరుగా ఒక మంచి హోటల్ వైపు వెళ్లింది. మంచి నాన్వెజ్ లంచ్ ఆర్డర్ చేశాడు.
“అబ్ ..బోలో .. తుమే జానా ముఝే పరేషన్ కర్తా భాయ్.
” ఛలో ఏ సబ్ కుచ్ ఇదర్ ఉదర్ చల్తా “ మళ్ళీ తానే అన్నాడు.
అక్కడి నుండి ఒక బట్టల షాపు కి తీసుకెళ్లి 800 ఖరీదు తో హరా స్ట్రెచ్ జీన్స్ 28” సైజు ది కొన్నాడు.
“రఖా లో ఏ మేరా తోఫా” అని నాకు కవర్ ఇచ్చాడు. రమారమి నా జీతం అంత ఖరీదు.
నేను వారించే లోపు. “ మై బొలా నా అప్ లోగోమ్ కొ జలక్ దియా.. శామ్ తక్ కవర్ ఆయెగా” నవ్వాడు.
బజార్లో నుండి బస్ స్టాప్ కి వెళ్ళి ఒంగోలు టికెట్ రిజర్వ్ చేయించు కున్నాం.
తిరిగి అతని ఫ్లాట్ కి వచ్చే సరికి మా అకౌంటెంట్ అతి వినయంగా నిలుచుని ఉన్నాడు. తోడుగా ఏదో బరువు ఉన్నట్టు ఉంది.
అతన్ని పట్టించు కోకుండా లాల్ జి, తను సైన్ చేయాలసిన కాగితాలు అన్నీ పూర్తి చేశాడు.
“యు కం ఎట్ 9.00 పి‌ఎం డ్రాప్ యువర్ ae సాబ్ ఎట్ థి బస్ స్టాండ్ బిఫోర్ యు గో” అని చెప్పాడు.
“ సూర్ సార్.. రొంబ నన్రి సార్ “ అన్నాడతను.
అతని వద్ద ఉన్న వారి కుటుంబం తాలూకు ఫోటో ఆల్బమ్ చూస్తూ చాలా సేపు ఉండి పోయాం.
సాయంత్రం నాకు వీడ్కోలు చెప్పాక కంపెనీ జీపు నన్ను MGBS వద్ద దించింది.
‘లాల్ జి ఇంకా సంతకాలు పెట్టని విషయం తను మణి గారికి టెలీఫోను బూతు నుండి ఫోన్ చేసినట్లు, ఆయన ‘రావ్ చూసుకుంటాడు’ నువు గమ్మునే ఉండు’ అని చెప్పినట్టు చెప్పాడు.
నేను బస్సు ఎక్కాను. తేల్లారేసరికి మిస్టర్ రావు నుండి శ్రీనివాస రావు గా మారి ఒంగోలు బస్టాండ్ లో దిగాను. అక్కడే అద్దంకి బస్ స్టాండ్ లో మరో బస్సు ఎక్కి 11 కిలోమీటర్ల దూరం లోని సీతారాం పురం అమ్మ, నాన్న వద్దకి వెళ్ళాను.
***
అలవాటు ప్రకారం టంచనుగా తయారయ్యి 10 గంటలకి, ఒంగోలు రామ్ నగర్ లోని apshcl ఆఫీసుకి చేరాను.
ఆఫీసుకి తాళం వేసి ఉంది.
****************
( 33 గ్రేడ్ మొదటి ఆద్యాయం .. సమాప్తం)

43. డిటాచ్ మెంట్


ఉదయం అందరి వద్దా వీడ్కోలు తీసుకున్నాను. జీవితపు విలువల్ని నేర్పిన, మణి మారెన్, కన్నడ శ్రీనివాస్, ఏకాంతప్ప, రామచంద్రన్, మా వంట మాస్టర్, సుపర్వైజర్లు, సైకిల్ మీద మా అందరికీ టీలు తెచ్చిచే బుడ్డోడు ఎవరిని వదల్లేదు.
మెకాన్ వాళ్ళ వద్ద సైన్ చేయించాల్సిన ఫైలు సిద్దంగా ఉంది. నా లాగేజ్ కూడా. లాగేజ్ అంటే ఒక పెట్టె. అంతే .
ఈశ్వర మణి ఎప్పటి లాగే తొమ్మిది కల్లా సైట్ కి వచ్చాడు. వస్తూనే నా పేరున ఒక ఎక్స్పెరియన్స్ సర్టిఫికేటు తయారు చేయించాడు. ఆఫీసు నుండి రావలసిన జీతం ఇప్పించాడు. ఒక కవర్లో ఎక్స్పీరియన్స్ సరిఫికేటు పెట్టి ఇచ్చాడు. తన జేబు నుండి కొంత స్వంత  పైకం కవర్లో పెట్టడం గమనించాను.
“ఎప్పుడయినా వర్క్ మీద, కోపం చేసి ఉంటే ఏమి అనుకోవద్దు.. “ అన్నాడు తమిళం లో.
నేను తెలుగు అని తెలిసి అన్నాడంటే అవి మనసు లోనుండి వచ్చిన మాటలు అని గ్రహించాను.
“ మీకు మంచి భవిషత్తు ఉంది. పని ప్రారంభం లో ఉన్న శ్రద్ద చివరి వరకు లేక పోవటం మీ మైనస్ పాయింటు. ప్రతి దాని చుట్టూ ఒక బంధం అల్లుకోవటం కూడా తప్పు. మనం అనుకున్న దానికి సమాంతరంగా ఇది నాది/శాశ్వతం  కాదు అనే వైరాగ్యం కూడా పెంచు కోవాలి. అలా పెంచు కొక పోతే మన జీవనం కష్టం అవుతుంది. నాకూ  ఈ విషయాలు తెలీదు. ఏనిమిదేళ్ళతర్వాత  పుట్టిన కొడుకు చని పోయినప్పుడు మేము ఓదార్పు కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం. అప్పుడే ఇది నేను చేయటం అలవాటు చేసుకున్నాను. “ అతను కొద్ది సేపు ఆగాడు. “ఏడు నెలల కాలం కలిసి పని చేశాము. మరెప్పుడు మనం కలవక పోవచ్చు. కానీ మీరు బాగుండాలి రావ్ “ అన్నాడు.
నేను విచలితుదిని అయి పోయాను. ఒక మెటీరియలిస్టిక్ వ్యక్తి, ఎనిమిది వ క్లాసు  డ్రాప్ ఔట్ అంత లోతుగా నన్ను విశ్లేసించడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను కవర్ అందుకుని బాగ్ లో పెట్టుకుంటుంటే, మీ అమ్మ గారికి ఏదయినా కొనుక్కెళ్లు అన్నాడు. నాకు ఎందుకో గాని ధూఖం తన్నుకు వచ్చింది. దగ్గరగా వెళ్ళి వాటేసుకుని ఏడ్చేశాను.
కంపెనీ జీపు లో మా అకౌంటెంట్ నాతో పాటు ఎక్కాడు, నా లగేజీ సర్దుకుని నేను ఎక్కి కూర్చున్నాక జీపు కదిలింది.
మా ఆఫీసు కాంపస్ దాటి వర్కర్స్ కాలనీ పక్క నుండి మైన్ రోడ్డు ఎక్కేటప్పుడు, దూరం నుండి సవారి సైకిలు మీద వచ్చాడు. జీపు ఆపించాను. ఒక కాశీ దారం నా చేతి కి కట్టాడు.
మణి గారు ఇచ్చిన కవర్ బయటకి తీసి, అందులో నుండి సర్టిఫికేట్ తీసి, మిగిలిన కవరు సవారికి ఇచ్చాను. అందులో ఎంత ఉందో తెలీదు. “ఇది అమినమ్మకి ఇవ్వు” 
జీపు దుమ్ము రేపుకుంటు .. RCI ప్రాజెక్ట్ దాటి పహడి  శరీఫ్ వైపు దూసుకెళ్లింది.Thursday, 10 November 2016

"సు శ్రీ 33 గ్రేడ్" -- అన్నీ పోస్టులు ఒకే చోట


42. చీకటి మింగేసింది.

అమీనమ్మ ..
ఆమె కళ్ళనిండా తడి. నేను విప్పరిన కళ్ళ తో ఆమెని చూస్తుండి పోయాను. 
తను ఉండే వర్కర్స్ కాలని నుండి రెండు కిలోమీటర్లు నడిచి అంత చీకట్లో ఎందుకు వచ్చినట్లు??
నాకేమి తోచలేదు. ఒక నడివయసు ప్రౌడ, 20 ఏండ్ల బక్క పిల్లాడి వద్దకి ఏమి ఆశించి వచ్చినట్లు?
“డబ్బులు ఏమయినా కావాలా?.. పిల్లలకి ఆరోగ్యం బానే ఉందిగా?” నేను పలకరించాలి కనుక ఎదో ఒకటి మాట్లాడాను.
“సారూ నువ్వెప్పుడు ఇంతే. నన్ను అర్ధం చేసుకుందే లేదు. పెనిమిటి పొయ్యాక నన్ను నోరారా పిలిచిన వాళ్ళే లేరు. ముగ్గురు పిల్లగాల్తో నేను బతికానా, పోయానా చుసినోల్లె లేరు. నీలాగా నాతొ మాట్లాడినోల్లు లేరు, పని దగ్గరకి పసి పిల్లల్ని తెస్తే కసురుకునే వాళ్ళే గాని, వాళ్ళ ని చుసినోల్లె లేరు. నువ్వు మంచాడివి. నాకు నచ్చావు. ని కోసం ఎన్ని రోజులు సబ్టేసన్ లో ఎదురు చూసాను.. నేను బిద దాన్ని నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమి లేదు. అందుకే నీ కోసం వచ్చాను. నువ్వు అర్ధం చేసుకున్నదే లేదు అంది”
నాకు మైండ్ బ్లాక్ అయి పోయింది. ఆమె భావం అర్ధం కానంత చిన్నాడిని ఏమి కాదు. ఆ రోజు సబ్ స్టేషన్ లో ఆమె చూపు లోని భావం ‘ఆహ్వానం’ అని నా కిప్పుడు అర్ధం అయింది. నా మిత్రులందరూ వారి గదుల్లోంచి ఇది వింటూనే ఉన్నారు.
‘ ఇవాళ నువ్వు వెళ్లి పోతున్నవని చెప్పారు. నేను వచ్చేస్తా నువ్వు పని చేయించే చోట కూలి ఇప్పించు. చేసుకుంటూ బతుకుతా .. ఆమె స్వరం ఏడుపు లోకి మారింది.
అసలు ఏమాత్రం ఉహించని పరిణామం. నాకు భయం వేసింది. నేను ఆమెతో ఆదరణగా మాట్లాడి తప్పు చేసానా? ప్రత్యకంగా ఆమెని ఏనాడు గుర్తించింది లేదు. అందరి తో మాదిరి గానే తనతో కూడా?? అంటే ఆ మాత్రం పలకరింపు కి కుడా ఆమె మొహం వాచీ ఉందా? అసలు అంత వయసు స్త్రీ ని మరో రకంగా ఉహించడం కుడా ఇబ్బందిగా ఉంది. ఒక ఉద్యోగి గా కంటే ఎక్కువ మానవత్వం ప్రదర్సించానా? నన్ను నేను చెక్ చేసుకో సాగాను.
మా మిత్రుల కొందరు ఈ సన్ని వేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కళ్ళతో ఆమెని కొలుస్తున్నారు.
ఇలాటి భయంకరమయిన, ఇబ్బంది కరమయిన సన్నివేశాన్నుండి సవారి భార్య నన్ను కాపాడింది. ఎలా చూసిందో కాని అమినమ్మ రావటం సవారి దంపతులు చూసారు. అమీనమ్మ మానసిక పరిస్థితి, సహచర స్త్రీ గా సవారి బార్య కి అవగాహన ఉండి ఉంటుంది. ఆమె పరుగు లాటి నడకతో అక్కడికి వచ్చింది.
“అమ్మి, పోదాం రా” అంది వచ్చి రావటం తోటే..
అప్పటికే ఆమె ఏడ్చి దుఖం నుండి తేలిక పడింది. నన్ను తన గాజు కళ్ళతో చూసింది. ఆ కళ్ళలో ఏ భావము లేదు. ఒక్క వీడ్కోలు తప్ప.
నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళిద్దరిని చీకటి మింగేసింది. 

#33 Grade

41. ఉహించినట్లే.. ఆమె.


నా పరిస్థితి కుడితి లో ఎలుక మాదిరి అయ్యింది. 
ఈ ఉద్యోగం చేరను అంటే నాన్న ఎగిరి తన్నేట్టు ఉన్నాడు. అక్కడ ‘పహాడీ షరీఫ్’ లో ఎన్నో భాద్యతలు ఉన్నాయి. 
ఒక వారం తర్వాత జాయిన్ అవోచ్చా? అని నేను ఆఫీసులో అడిగాను.
" చేరొచ్చు ఒక్క సారి మద్దిపాడు AE గారికి కనబడండి. మీకు ఇచ్చిన సంతనూతలపాడు వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టు ఆయన పరిది లోకి వస్తుంది" అని చెప్పారు.
అతని పేరు అడిగాను. “మెతుకు రమేశ్ “ అని చెప్పారు.
అతని కేరాఫ్ టి కొట్టు వద్ద, రింగులు తిరిగిన నల్లటి జుట్టు మీసాలతో గుండ్రంగా ఉన్న అతన్ని కలిసాను. సి ఏం గారిని బంట్రోతు కలిసినట్లు ఉంది అతని వ్యవహారం.
అతనికి విషయం చెప్పాను. చేస్తున్న ఉద్యోగం లో చార్జెస్ అప్పగించి వస్తానని వారం వ్యవది కావాలని.
“వీలయినంత త్వరగా జాయిన్ అవ్వమని “ ఆతను చెప్పాడు. రాజ్ దూత్ బండి మిద వెళ్ళిపోయాడు.
నేను అదే రాత్రి హైదరాబాదు వెళ్లి పోయాను. అమ్మ చేత ఉతికించు కోవటానికి వస్తూ తెచ్చుకున్న బట్టలు ఇంటివద్దే వదిలేసాను.
వెళ్ళగానే కన్నడ శ్రీనివాస్ తోను, మణి మారిన్ తోను విషయం చెప్పాను. ఇద్దరు వెళ్లి పొమ్మనే చప్పారు.
మణి మారిన్ మాత్రం ఒక సౌది లో ఒక ఉద్యోగ అవకాశం గురించి చెప్పాడు, ఒక గ్లోబల్ కంట్రాక్టర్ వద్ద సైట్ ఇంజనీరు పని పద మూడు వందల రియాల్స్ జీతం (13.5 రూపాయలు ఒక రియాల్)
నేను ఒంగోలు వెళ్ళిన వారం రోజుల్లో నా తరఫున కుడా తనే అప్లై చేసానని దానికి వెళ్తే జాబు లో గ్రోత్ ఉంటుందని చెప్పాడు.
“చాయస్ నీదే” అన్నాడు. నేను మళ్ళి ఆలోచనలో పడ్డాను.
రోట్లో పచ్చడి, ఆకాశం లో పిట్ట?? ఏది??
పచ్చడే గెలిసింది. ఈశ్వర మణి గారిని కలిసి ఉద్యోగం మానుకోబోతున్న విషయం చెప్పాను.
అయన నన్ను ‘దోడ్డప్ప’ గారి వద్దకు తీసుకెళ్ళాడు. “ఇక్కడ వర్క్ అయిపోతుందని మీకు పని ఉండదని అనుకోవద్దు. శరవణ కన్స్ట్రక్షన్స్ లో మీరు రెగ్యులర్ ఉద్యోగి” అని నచ్చ చెప్పారు.
నేను నెపం మా నాన్న మిద, అమ్మ మిద వేసాను.
ఒక్క సారి నేను వెళ్ళటం ఖాయం అని తెలిసాక, MECON సర్టిఫికెట్లు పని మొదలయింది. కేబుల్ చానెల్ వర్క్ కి సంభందించి చాలా వాటికి ముందస్తు చెక్ మెజర్మెంట్ కాగితాలు మిద సంతకాలు అవలేదు.
నేను ఫీల్డ్ మానేసి ఆఫీసులో కుర్చుని, నేను రోజు వారి పుస్తకం లో నమోదు చేసుకున్న వివరాలు చూసుకుంటూ ఆ కాగితాలు తయారు చేయటం లో బిజీగా ఉండి పోయాను.
లాల్ జి “కంగారు లేదు. మీ వాళ్లకి జలక్ ఇస్తాను. ప్రశాంతం గా చెయ్యి, తప్పులు దొర్లకుండా చూడు. అన్నిటి మీదా సైన్ చేస్తాను. నీకు మంచి ట్రీట్ ఇస్తాను. కంపెని జీప్ లో హిమాయత్ నగర్ రా “ భరోసా ఇచ్చాడు.
నేను ఉద్యోగం వదిలి వెళ్తున్న విషయం సవారి కి తెలిసింది. బార్యా బర్తలిద్దరు నా క్వార్టర్స్ వద్దకి వచ్చారు. సంతోషం, దుఖం కలగలసిన క్షణాలు అవి. సవారి, నేను ఆ ఆర్నెల్లలో ఎంతో అనుబంధం పోగుసుకున్నాం. అతన్ని వదలి వెళ్లి పోవటానికి చాలా బాధ అనిపించింది. నా లజేజి అంతా శుభ్రం చేసి నా సూట్ సేసు లో సర్దారు. నా వద్ద మిగిలి ఉన్న డబ్బులోంచి రెండు వంద కాగితాలు సవారి భార్య కి ఇచ్చాను. ‘పిల్లలకి ఏమయినా కొనండి.’ అని.
ఆ రాత్రి బోజనాలయి నిద్రకి సిద్దమవుతుంటే .. మణి మారిన్ లోపలి వచ్చాడు “ రావ్. See ..some lady came to see you” అన్నాడు.
నేను టక్కున లేసి వరండా లోకి వచ్చాను. నేను ఉహించినట్టు గానే ఆమె .......

#33 Grade

40 – సెలెక్టెడ్ లిస్టు


MGBS లో ముందస్తు రిజర్వేషన్ లేకుండా బస్సు పట్టుకుని, ఒంగోలు వచ్చి సీతారాంపురం (మారేల్లవారి పాలెం) చేరే సరికి తెల్లవారింది. ఇంట్లో మాములుగానే ఉంది అని తెలియగానే మా నాన్న మీద విరుచుకు పడ్డాను. ఆ టెలిగ్రాం ఏమిటి? అని. అయన ఏమి మాట్లాడకుండా నవ్వి మర్నాడు ఒంగోలు లో అటెండ్ అవాల్సిన ఒక ఇంటర్వ్యూ లెటర్ చూయించాడు. వర్క్ చార్జేడ్ సిబ్బంది (టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్) నెలకి 700 రూపాయలు వేతనం తో తాత్కాలిక సిబ్బంది నియామకానికి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ద్వారా వచ్చిన కాల్ లెటర్. ఆంద్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ, డిస్త్రిక్ మేనేజరు గారి కార్యాలయం, ఒంగోలు రామనగర్ లో హాజరవమని సారాంశం.
అప్పటికే నాన్న పలుచోట్ల విచారణ చేసి ఉన్నాడు. మంచి ఉద్యోగం అని తర్వాత రెగ్యులర్ అవుతుందని నమ్మకంగా చెప్పి ఉన్నాడు. పెద్దాయన మాట మిద గౌరవం తో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. మొత్తం పదిహేను మందిని పిలిచి నట్లున్నారు. 3 ఖాళీలు. కొందరు అప్పటికే ఉత్తరాలతో వచ్చి ఉన్నారు. ఉత్తరాల (recommendation letters ) వ్యవహారం నాకు అప్పటివరకు అంతగా తెలిదు. మాకు యేవిదమయిన పరిచయాలు లేనందున, ఆ ఉద్యోగం పట్ల పెద్దగా ఆసక్తి లేనందున నేను పట్టించు కోలేదు. వచ్చిన వాళ్ళలో శిరిగిరి శ్రీనివాసరావు అనే కుర్రాడు కుడా ఉన్నాడు. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అంతే ..
పేరు, ఉరు, దురదోస్తే ఎక్కడ? ఎప్పుడు? దేంతో గోక్కుంటావు ? ఇలాటివి. సర్టిఫికెట్స్ నకల్లు అడిగారు, క్రితం రోజే కాలేజికి వెళ్లి వాటిని తెచ్చుకుని ఉన్నాను.
అడిగినవన్నీ ఇచ్చేసి అక్క దగ్గరకి వెళ్లాను. ఆదివారం సాయంత్రం హైదరాబాదు కి టికెట్ బుక్ చేయించుకున్నాను.
‘అనుష’ తో ఆడుతుంటే కాలం తెలియటం లేదు. అక్క, బావ ఇద్దరు ఒక స్కూల్ లో పని చేసుకోవటం, తక్కువ ఆదాయంతో అయినా స్థిరంగా జీవించడం మొదలెట్టారు. ఇంక వారి గురించి కంగారు పడవలసిన అవసరం లేదని నాకు అర్ధం అయ్యింది.
డిప్లోమో మిత్రులు కొందరు కలిసారు. శ్రీవాత్సవ, అల్లుడు రమేశ్ (నన్ను మామా అంటుండేవాడు), వీరాంజి వాళ్ళంతా పంచాయితీ, మార్కెంటింగ్ యార్డు, ఇంకా అవకాశం ఉన్న చోట తాత్కాలిక సిబ్బంది గా చేరి ఉన్నారు.
“మామా ఇక్కడ నేర్చుకునేది ఏం ఉండదు. కంట్రాక్టర్ పనులు చేస్తాడు, మనం కొలతలు తీసి రాసి పెడతాం, ఎ ఇ వాళ్ళ మధ్య సర్దుబాటు బట్టి రికార్డ్ చేస్తుంటాడు. సైట్ లో టి, టిఫిన్, బోజనాలు ఖర్చులు నడుస్తుంటాయి “ అంటూ మొదలెట్టి క్లుప్తంగా ప్రభుత్వ ఉద్యోగం విదులు చెప్పు కొచ్చాడు.
“అంటే ధఫెదారు పోస్ట్ .. బలే ఉందిరా ? నేను ఈ ఉద్యోగం వచ్చినా చేరను అల్లుడూ. ఎటు మనకి రాదనుకో. చాలా మంది MLA ఉత్తరాలు తెచ్చినట్టున్నారు.” నేను వాడితో చెప్పాను . కొంతసేపు సరదాగా గడిపి సీతారం పురం నాన్న దగ్గరకి వెళ్లాను.
“సోమవారం, సెలెక్టెడ్ లిస్టు వస్తుందిట “ నేను కనుక్కున్నాను. నాన్న చెప్పాడు.
“సండే రాత్రి బస్సు కి నేను టికెట్ బుక్ చేయించు కున్నాను “
“సోమవారం లిస్టు తెలిసాక పోదువు “
నాకు రిజర్వేషన్ కాన్సిల్ చేయించుకోక తప్పింది కాదు. అనుకున్నట్టు గానే సోమవారం 12 గంటల ప్రాంతాల్లో (12-02-1987) ఇంటర్వ్యూ జరిగిన చోటకి వెళ్లాను. గోడకి ఒక లిస్టు అంటించి ఉంది. అందులో మూడు పేర్లు ఉన్నాయి.
1. పి.వి. నారాయణ
2. ఎస్.వి.వి.సత్యనారాయణ
3. సుంకర శ్రీనివాస రావు

#33 Grade

39. స్టార్ట్ ఇమిడియట్లి


ఆదివారం రోజు యూనిట్ 1818 వద్ద కొందరం పోగయ్యాం, ఏం చేస్తే బాగుంటుంది అని మణి గారు అడిగారు, కింద నుండి స్టీల్ కట్ చేసి, సువ్వలు వచ్చి ఇరుక్కు పోయిన రేకు తొలగించి యదావిదిగా స్టీల్ రాడ్లు వెల్డింగ్ చేసి అంతవరకూ కాంక్రీట్ చేద్దాం. అని చెప్పాను. మరి కొందరు వాళ్లకి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చారు. చివరకి మణి గారు చెప్పినట్లు పై నుండి ఆ భాగాన్ని దొల్లగా చేసి రేకు తీసి వేసి, కాంక్రీట్ స్లర్రి తో నింపాము. నింపే ముందు లీక్ ప్రూఫ్ ట్రీట్మెంట్ చేయించాం. ఇదంతా సాయంత్రానికి పూర్తి చేసాం.
సైట్ ఇంజనీర్లు అందరిని మణి ఆఫీసు ఓపెన్ జీప్ లో దగ్గ్గర గ్రామం లో ఉండే తన ఇంటికి తీసుకెళ్ళాడు ఆ సాయంత్రం. తన భార్యని పరిచయం చేసాడు. మా అందరికి భోజనాలు వడ్డించారు ఇద్దరు కలిసి. తర్వాత గాజు కప్పుల్లో సేమ్యా పాయసం ఇస్తూ ఆవిడ “ఆ రోజు తమ పెళ్లి రోజని చెప్పారు”
సైట్ లో ఉండే టప్పుడు ఎంత రాక్షసంగా ఉంటాడో దానికి భిన్నంగా ఇంట్లో ఉండటం గమనించాను. చాలా మర్యాదగా, చక్కగా పలకరిస్తూ, ఒక బంధువు లాగా... అతని ప్రవర్తన లో ఎటువంటి నాటకీయత లేదు.
నేను బెంగుళూరు వెంకట్రావు గారి వద్ద గమనించిన అదే విదానం. కంపార్ట్మెంటలైజేషన్ .. అది అదే.. ఇది ఇదే..
***
హనుమంతప్ప రిజైన్ చేసి వెళ్ళాడు. బెంగుళూరు లో మరో జాబ్ ఎదో చూసుకున్నానని చెప్పాడు. ఎందుకో గాని అతని నిష్క్రమణ ఎవరిని ప్రభావితం చెయ్యలేక పోయింది. అది ఆదివారం తర్వాత సోమవారం వచ్చినంత సాధారణ కార్యక్రమం లా జరిగింది.
యూనిట్ 1010 పని మళ్ళి కొనసాగించాను. నాతో ఎక్కువ గా అవసరం లేకుండానే అది నడుస్తుంది. నేను మిలటరీ మోటార్ వెహికల్ స్టాండ్ పని చూడటం మొదలెట్టాను. ఆ పనిలో విశేషంగా నేర్చుకోటానికి పెద్దగా ఏమి లేదు వరుసగా రో గా గోడలు కట్టించడం అర్ధ చంద్రాకారం లో స్లాబ్ లు వెయ్యటం అంతే. స్తిరియో వర్కు. మద్యాహ్నం వరకు ఇదే పని. సాయంత్రం కేబుల్ చానెల్ వర్కు చూసుకోవటం..
హనుమంతప్ప వెళ్లి పోయిన నాలుగయిదు రోజుల తర్వాత అనుకుంటా ఒక శని వారం తిరిగి అదే జరిగింది. కేబుల్ చానెల్ పర్యవేక్షణ చేస్తుండగా అమినమ్మ నన్ను దాటి వేగంగా సబ్ సెంటర్ భవనం వైపు నడవటం. నాకు ఆశ్చర్యం వేసింది. క్వార్టర్స్ వైపు నడుస్తూ సబ్ సెంటర్ వైపు చూసాను. మరేవరయినా ఉన్నారేమో నని. ఇంకా అద్దాలు బిగించని భవనం దాదాపుగా లోపల భాగం అంతా కనబడుతుంది. సబ్ సెంటర్ ఖాళి గా ఉంది. ఆమె ఒక్కతే ఉంది. ఆమె నన్నే చూస్తుంది.. నా కోసమే చూస్తున్నట్లు ఉంది. ఆ కళ్ళలో ఎదో ఉంది .. ఏమిటది?? ఆకలా? కాదు.
దూరం నుండి సవారి సైకిలు తొక్కుకుంటూ వచ్చాడు.. సార్ మీ కోసం వెతుకుతున్నాను. అని ఫ్లాస్క్ లో టి వంచి గ్లాసు ఇచ్చాడు. జేబు లోంచి ఒక కాగితం తీసాడు.
అది టెలిగ్రాం.. అప్పటి టెలిగ్రాం లలో కామన్ గా ఉండే మాటే...” స్టార్ట్ ఇమిడియట్లి”

#33 Grade

అమీనమ్మ -38

డ్యూటీ లోకి రాగానే వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి వర్క్ ప్రోగ్రెస్ చూసుకుంటుంటే ‘లాల్ జీ’ జీపు లో యూనిట్ 1515 వద్దకి వచ్చాడు. లిఫ్ట్ లో పైకి వచ్చి “క్యా బాయ్ హమే భూల్ గయే హో “ అంటూ పలకరించాడు. 
ఇద్దరం వాటర్ ట్యాంక్ గురించి, మధ్య మధ్య లో వ్యక్తి గత విషయాల గురించి మాట్లాడు కున్నాం. నేను లేని ఆ వారం రోజుల్లో జరిగిన విశేషాలు చెప్పుకొచ్చాడు. హిమాయత్ నగర్ mecon ఆఫీసు డ్రాఫ్ట్స్ ఉమన్ ఒకమ్మాయికి తను చాలా కాలం నుండి ‘బహుమతులు’ ఇస్తున్నట్లు, అవి ఎందుకు ఇస్తున్నాడో ఆమెకి స్పష్టంగా తెలిసినట్లు, కాని ఆమె తనని నిర్లక్షం చేస్తున్నట్లు చెప్పు కొచ్చాడు. 
‘It’s time to get married Lal jee “ నేను నవ్వుతు చెప్పాను. 
“హోగా .. వో భి హోగా” నిట్టూర్చాడు అతను. ముగ్గురు చెల్లెళ్ళ వివాహం కావాల్సి ఉందని గతం లో చెప్పి ఉన్నాడు. 
***
మద్యాన్నం భోజనం అయ్యాక క్వార్టర్స్ లో సిఎస్టా (మద్యాన్నపు కునుకు) లో ఉన్నప్పుడు, వర్క్ సూపర్వైజర్ వచ్చి ఈశ్వర మణి గారు రమ్మంటున్నాడు అని చెప్పాడు. “ఎక్కడున్నారు?”
“యూనిట్ 1818 వద్ద”
యూనిట్ 1818 అనేది RCI ప్రాజెక్ట్స్ లో అతి పెద్ద నిర్మాణం సుమారు 10 మీటర్ల ఎత్తు, 70మీటర్ల పొడవు, ౩౦ మీటర్ల వెడల్పు తో ఉంటుంది. పక్క పక్కనే అతికించి ఉన్న v ఆకారం లో 8 అంగుళాల మందం కలిగిన స్లాబు వేసి ఉంటుంది.(VVVVVVVVVV ఇలా folded roof ) చాలా ప్రిస్తేజియస్ నిర్మాణం. పోయిన నెలలోనే దాని స్లాబ్ వేసిన గుర్తు. ఇంకా పూర్తిగా సెంటరింగ్ తీయలేదు. 
“సరే పద” నేను షు లేసులు కట్టుకుని అటువైపు బయలు దేరాను. 
గేటు వద్ద ఒక సూపర్వైజర్ ఉన్నాడు. తలకి పెట్టుకునే సేఫ్టి టోపీ ఇచ్చి “సార్లు లోపల ఉన్నారు” అన్నాడు. 
నేను లోపలి వెళ్లాను. మూడు అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తయిన స్లాబు కింద ఉన్న సెంటర్రింగ్ ఇనుప రేకులు ఉడ దీయటానికి ఎత్తుగా తాత్కాలికంగా కదిలే మంచ ఏర్పాటు ఉంది. అక్కడ ఆ యూనిట్ ఇంచార్జ్ ఎ ఇ రామచంద్రన్, వర్క్స్ మేనేజర్ ఈశ్వర మణి ఉన్నారు. నన్ను చూడగానే మణి గారు పైకి రమ్మన్నట్టు సైగ చేసాడు. జిగ్ జాజ్ గా ఉన్న తాత్కాలిక మెట్లు ఎక్కుతూ నేను పైకి వెళ్లాను. 
రామచంద్రన్ ముఖం కంద గడ్డలా ఉంది. ఈశ్వర మణి ‘రావ్ అక్కడ చుడండి’ అన్నాడు.
కొద్దిగా తొలగించిన రేకు మీద స్లాబ్ కాకుండా కొంత హాని కుంబ్ కంకర (defective concrete) స్లాబ్, స్టీలు కనబడుతున్నాయి పైన మరో ఇనప రేకు 1x 0.5 మీటరు సైజు ది ఇరుక్కు పోయి ఉంది.
నాకు విషయం వెంటనే బోధపడింది. స్లాబ్ వేసే టప్పుడు చువ్వల మిద సౌకర్యంగా నడవటం కోసం కొన్ని రేకులు వేసుకుంటారు. కంకర వేసే కొంది వాటిని తీసివేస్తూ ఉంటారు. చాలాసార్లు రేకు సిమెంట్ పాలు తో కలిసి పోతుంది. గమనించక పోతే అది అలాగే ఉండి పోతుంది. కింద సువ్వలు మిగిలి పోతాయి. అదే జరిగింది. రాత్రిం బగళ్ళు వరుసగా పని చేసేటప్పుడు (సుమారు 2300 బస్తాల కాంక్రీట్ ) అలాటివి సహజం. సైట్ ఇంజనీరు జాగర్త గా ఉండాలి. 
దాన్ని ఎదో ఒకటి చెయ్యొచ్చు సమస్య అల్లా MECON వాళ్లకి తెలియకూడదు. తెలిస్తే క్వాలిటి సర్టిఫికేట్ ఇవ్వరు. లక్షల రూపాయల బిల్లు విడుదల కాదు. అది సమస్య. 
ఆదివారం రోజు mecon వాళ్ళు రాని శలవు రోజు దానిని పరిష్కరించాలని అనుకున్నాం. వారి కార్యాలయం లో నాకు మంచి రేపో ఉండటం వల్ల నన్ను అక్కడికి పిలిచి నట్లు నాకు అర్ధం అయ్యింది. ఎంత మెత్తగా టార్గెట్స్ కేటాయిస్తారో అనే దానికి ఇది మంచి ఉదాహరణ. 
సాయంత్రం ఒక్కడినే కేబుల్ చానెల్ వర్కు ఒక్కసారి చూసుకుని వెళ్తుంటే, అమీనమ్మ ఎదురయ్యింది. మా రెగ్యులర్ హమాలి ఆమె. ముగ్గురు పిల్లలు కుడా ఉన్నారు. విడో అని విన్నాను. ఆమె కి ఆ సమయం లో అక్కడ ఏమి పనో నాకు అర్ధం కాలేదు. “సబ్ సెంటర్లో చెప్పులు మర్చి పోయాను” అంది. కాని విషయం అది కాదు అని తెలుస్తుంది. ఉన్నంత లో శుభ్రంగా తయారయి ఉండటం, తను స్త్రీ అని ఇతరులు గమనించే టట్లు నడవటం నాకు వింతగా అనిపించింది.
#33 Grade

Tuesday, 8 November 2016

బుడగ

నేనో ప్రముఖుడు తో ఉన్న ఫోటో ఆమె చూసింది.
...
అలానే చూస్తూ ఉంది.
...
నా చొక్కా బిర్రు అయింది.
...
"మీ ఫోటో అతను కుడా ఇలానే దాచుకుని ఉంటాడా??"
..
"టప్"
ఎవడు రా బుడగ పగల గొట్టీంది ??

Sunday, 6 November 2016

శివ శివా !!

మీకు మళ్ళీ చెబుతున్నా, చిన గంజాం (మా పాత ఇళాఖా.. 6 ఏండ్లు పని చేసాను) లో 
మా మిత్రుడు 'సాయని శ్రీను' వాళ్ల ఇంట్లో నేను మా పెద్దమ్మాయి భావనా భోజనం చేసాం. 
..
కంద కూర, బ్రెడ్ ముక్కల కూర పులుసు బాగున్నాయి.
శుబ్రంగా తిన్నాం.
...
తెలంగాణా ఏర్పడ్డాక, ఇక్కడ వీటిని 
నాటు కోడి కూర, చాపల పులుసు అంటున్నారట..
ఏంటో కలి కాలం.
...
శివ శివా.. ఎంత ఘోరం.!!😁😁

Friday, 4 November 2016

రచనా సహకారం.

మొన్నో పాత స్నేహితుడు (చదువుకునే రోజుల ) FB లో గుర్తు పట్టి 
కనెక్ట్ అయ్యాడు. 
ప్రేమ వివాహం చేసుకుని చక్కగా ఉంటున్న దంపతులిద్దరూ చాలా సేపు ఫోన్ లో మాట్లాడారు. 
" అప్పటి ప్రేమలేఖ లకి సహా రచయిత మిరే నటగా?" అంది ఆమె.
"హలో .. హల్లో.. హల్లో.. మీరేదో చెబుతున్నారు. సరిగా వినబడటం లేదు. సిగ్నల్ సరిగా లేనట్టు గా ఉంది.. మరో సారి మాట్లాడతాను" ఫోన్ పెట్టేసాను. .
(ఒరేయ్ .. నికుందిరా నా చేతిలో )

Wednesday, 2 November 2016

కాట్ ??

నిండు బస్సు. 
గుండమ్మ లేడీస్ సీట్లో కూర్చుని ఉంది.
వెనుక నిలబడి నేను.
టికెట్లు తననే తీసుకొమఁన్నాను.
లేడి కండక్టర్ కి నన్ను చూపించి టిక్కెట్ తీసుకుంది తను.
"సార్ మిరేనా?? క్యాట్??" అరిచింది ఆవిడ.
***
RTC వారికి విన్నపం. Concessional Annual Travel Card పెరు మార్చ గలరు. 

ఇంట్లో విషయాలు పబ్లిక్ గా అడుగుతున్నారు.

యుద్దం తర్వాత!!

బురఖా లలో భర్త వెనుక నాలుగు అడుగుల దూరం లో ఫాలొ అయ్యే భార్యలు.. ఉండే ఇరాక్ లో..
..
ఆడవాళ్ళు నడిచిన బాటలోనే పడడుగులు వెనుక మగవాళ్ళు  నడవటం చూసి ఆశ్చర్య పోయాడు కొత్తగా అక్కడికి వచ్చిన మరో దేశపు జర్నలిస్ట్ .
..
స్థానిక జర్నలిస్ట్ తో ఈ పరిణామం గురించి విచారించాడు.
..
"ఇందులో ఆశ్చర్యం ఏముంది??" ఆంగ్లం లో నిట్టూర్చాడు ఆతను.
..
"యుద్ధం తర్వాత చాలా మార్పులు వచ్చాయి."
..
అర్ధం కాలేదు అన్నాడు ఇతను.
...
"ఏమో ల్యాండ్ మెయిన్స్ ఎక్కడయినా ఉండొచ్చు."

Tuesday, 1 November 2016

పులిహోర


గుళ్ళో ప్రసాదాల వినియోగం అప్పుడు ప్రపంచం మొత్తం రివ్యూ అవుతుంది.
అసలు కార్తీక మాసం మహిమ ఏమిటో తెలుసా?” మా వీది లో ఉండే పేపర్ డీలర్ కేశవ అడిగాడు.
మనం పురాణాల్లో సానా వీకు. పట్టుమని పాసు మార్కులు కూడా రావు. ఎందుకయినా మంచిదని ఒక చెవి అటువేసి ఆసక్తి గా చూశాను.
సంవత్సరం మొత్తం మీదా ఆడాళ్ళు ఇంటి మగమనిషిని గౌరవించేది ఈ నెలే?” అన్నాడు.
అదేందిరా సామి కార్తీక మాసం మొదటి రోజే గౌతమి అంత స్టేట్మెంట్ ఇస్తే? పేపరు ఏజంటూవీ. మిగిలిన పేపర్లు చదివే పనిలే ??”
అదెలా?” ఒకాయన నెత్తి తడుము కుంటూ అడిగాడు. అది అతని మేనరిజం అంది. అనవసరంగా నెత్తిన బుడిపెలు ఉన్నాయని అపార్ధం చేసుకోకండి.
ఏం లేదండీ. ఈ నేలంతా ఏ గుడి లో ప్రసాదం తిన్నా సరిపోతుంది. మద్యాన్నం పూట అయ్యప్ప స్వాములకి బోజనం సౌకర్యం చాలా గుళ్లలో ఉందనే ఉండే.


ఒక లుంగీ, చొక్కా, టవలు ఉంటే ఎక్కడయినా బతోకొచ్చు. పెద్దగా ఇంట్లో వాళ్ళతో పని ఉండదు. అందుకే చేతుల్లో నుండి జారీ పోకుండా జాగర్తగా కనిపెట్టుకుని ఉంటారు.
నిజమా?” అడిగాను నేను.
నిజం సార్.. కావాలంటే చూడండి. వందలు, వందలు పెట్టి మన చేత చీరలు కొనిపిస్తారా? ఎప్పుడు ఆ బొమ్మల గొట్టలు (నైటీలు కాబోలు) వేసుకుని జుట్టు విరబోసుకుని ఉంటారు. ఈ నెలలో చూడండి తెల్లవారగట్ల రెడీ అయ్యి రంగు రంగుల చీరలు కట్టి గుడికి వస్తారు. మన కి టయానికి టంచనుగా కారేజి రెడీ చేసి పెడతారు.రహస్యంగా చెప్పాడు.
పిల్లాడి దగ్గర చాలా విషయం ఉంది. రెండో రౌండ్ పులిహార, అలసంద గుగ్గిళ్ళు పెట్టించుకుని మళ్ళీ సంభాషణ మొదలెట్టాము.
ఏం సార్ ? ఈ విషయం లో మీ విలువయిన అభిప్రాయం ఏమిటి?” వచ్చే ఏడాది రిటైర్ అవబోతున్న మాస్టారిని అడిగాను.
అబ్బే .. దానికి దీనికి సంభందం ఏమి లేదు కేశవా .. మనం తెలివిగా ఉండాలిఅంతే అన్నాడాయన.
తెలివిగా అంటే?”
మనం ఇంట్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని , చిన్న చిన్న విషయాలు వాళ్ళకి వదిలేస్తే సరి. ఒకరి సబ్జెక్ లో మరొకరు ఇంటర్ ఫియర్ కాకూడదు.
మాస్టారు మాది లాస్ట్ బెంచ్. వివరంగా చెప్పండి.పులిహారలో ఇవాళ పచ్చి మిర్చి తగిలిందే లేదు. నా బాద ఎవరూ తీర్చేది కాదు.
ఏం లేదండీ. ఇప్పుడు అమెరికా లో ఎవరు ప్రెసిడెంటు గా గెలవాలి అనే విషయం నేను చూసుకుంటాను. ఆవిడ ఈ విషయం లో జోక్యం చేసుకోడు. అమ్మాయి పెళ్లి ఎవరితో చెయ్యాలి అనే చిన్న చిన్న విషయాలు ఆమె చూసుకుంటది. మనం జోక్యం చేసుకోం. ఇంక విలువల ప్రసక్తి ఏముంది?” చెప్పాడు మాస్టారు నవ్వుతూ.
అప్పటికే పులిహోర తినటం పూర్తయింది.
మాస్టారూ మీరు కదలకుండా కాళ్ళు దగ్గర పెట్టుకుని నిలబడి ఉండండి. చేతులు కడుక్కుని వచ్చి పాదాభి వందనం చేసుకుంటాను.గబ గబా డస్ట్ బిన్ వద్దకి నడిచాను.