Tuesday, 8 September 2015

బార్ లో ఉన్నవారందరికి

వెంకట్రావు వస్తూనే హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ..అంటూ అరిచాడు .
బార్ అండ్ రెస్టారెంట్ లో కూర్చున్న వారిలో చాలా మంది అతన్ని పట్టించుకోలేదు.
"బేరర్" పెద్దగా అరిచాడతను. 
"షాంపైన్ తీసుకురా .. " మళ్ళీ చెప్పాడు.
"బార్ లో ఉన్న వాళ్ళందరికీ .. తీసుకురా ఎందుకంటే నేను తాగిందే వీళ్ళంతా తాగాలి అదే నా కోర్కె".
చాలా మంది అతన్ని గమనించ సాగారు.
ఉత్సాహం తో ఉరకలేస్తున్నాడు అతను .
బార్లో అందరికీ షాంపైన్ సర్వ్ చేశారు.
“ బేరర్ .. తందూరి చికెన్ పట్రా .. అందరికీ కూడా ..
ఎందుకంటే నేను తినేదే అందరూ తినాలి అదే నా కోర్కె.”
ఎవరో విజిల్ వేశారు. కొంత మంది చప్పట్లు కొట్టారు .
అందరూ ఆసక్తిగా చూశారు.
వెంకట్రావు నవ్వుతూ అందరినీ చూశాడు.
నాకు కింగ్స్ పాకెట్ పట్రా .. అందరికీ కూడా ఎందుకంటే నేను తాగేదే ..”
బార్లో దాదాపు అందరూ కోరస్ గా పలికారు “అందరూ తాగాలి “
ఒక రెండు గంటల పాటు వెంకట్రావు విజ్రంభించాడు .
చాలా మంది అతని గురించి ఆరా తీశారు.
ఫోన్ నెంబరు నోట్ చేసుకున్నారు .
******
కధ క్లైమాక్స్ కి వచ్చింది.
“బేరర్ .. బిల్ పట్రా !!అంధరికి కి బిల్లు ఇవ్వు ఎందుకంటే అంధరు నేను కట్టినట్టే వాళ్ళు బిల్లు కట్టాలి “
వెంకట్రావు ఇంకా ఐ‌సి‌యూ లోనే ఉన్నాడు .tongue emoticon tongue emoticon pacman emoticon

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...