Thursday, 25 May 2017

ఇంటావిడ


మీ కిప్పుడు పన్నెండు లక్షలా యబైవేల రూపాయల ప్రశ్న. కంప్యూటర్ స్క్రీన్ మీద...
బంగారం ఏ ఫారన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది. 
(what is the melting point of the metal Gold?)
A) 2017 B) 1945 C) 1497 D) 3612
సుబ్బారావు సందేహం లో పడ్డాడు. ఈ ఒక్క ప్రశ్న చెబితే 12.5 లక్షలు అంటే టాక్స్ పోను సుమారుగా 9 లక్షలు తీసుకుపోవచ్చు. బాకీలన్నీ తీరతాయి.
సుబ్బులు కి మెడ లోకి ఏదయినా చేయించొచ్చు. ఆ సుబ్బులు. (y)
‘ఫోన్ ఏ ఫ్రెండ్’ తీసుకుంటాను.
"గుడ్ కంప్యూటర్ జీ ఫోన్ ఏ ఫ్రెండ్ కలపండి."
చెప్పండి మీరు ఎవరి సహాయం తీసుకోవాలంటున్నారు.
మా శ్రీ మతి సుబ్బలక్ష్మి . తను ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. షి ఈస్ ఏ జెమ్
ఫోన్ కనెక్ట్ అయింది.
“ హల్లో.. హి హి హి ---------------. మీరంటే ------- హి హి హి ------- చాలా సినిమాలు ----------- మా జేజి కూడా మీ ----- etc .,
“మిస్సెస్ సుబ్బారావు గారు మివారు ఇప్పుడు 12.5 లక్షలు  గెలుచుకోటానికి మీసాయం కోసం ఉన్నారు. ఆయన గొంతు వినబడుతుంది. కేవలం 45 సెకండ్స్ మాత్రమే టైమ్ ఉంటుంది. ఇప్పుడు సుబ్బారావు గారు ప్రశ్న ఆడుగుతారు .”
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
“హలో సుబ్బూ.. వాట్ ఈస్ ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఫారన్ హీట్. ఈస్ ఇట్ 2017,1945,1497 ఆర్ 3612. వీటిలో ఏది?
“--------“
“సుబ్బు టైమ్ ఈస్ రన్నింగ్”
“ ఈ డబ్బుల్తో అయినా నాకు రెండు పేటల దండ కొని పెడతారా లేదా? ఎనిమిదేళ్ళ నుండి కబుర్లు చెబుతూనే ఉన్నారు. అక్క చెల్లెళ్లకి దోచి పెట్టటమే కానీ ఏరోజున్నా? నా సంగతి పట్టించుకున్నారా? _______? ______?!#$” #$@^&%^@$^^&^#^%#&^ "
టైమ్ అయిపోయినట్లు బజార్ మోగింది:p :D

Tuesday, 23 May 2017

దీనెమ్మ

చలపతి రావు, కుటుంబం తో కలిసి బీచ్ కి కార్లో బయలుదేరాడు.
మరో పది నిమిషాల దూరం లో ఉండగా.. కారు టైర్ ఫ్లాట్ అయింది. 
అందరూ కారు దిగారు. కొడుకు రవి బాబు కారు డిక్కి నుండి స్టెఫీని తీసి, టైర్ మార్చ సాగాడు. 
జాకీ త్రేడ్స్ స్లిప్ అయి రవి కుడి కాలు మీద పడింది. “దీ నెమ్మ” బాధగా అరిచాడు అతను. 
చలపతి రావు సాయం పట్టి కాలు విడిపించాడు. 
మళ్ళీ జాకీ బిగిస్తుంటే.. కొడుకుతో చెప్పాడు. “పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఎంత బాదగా ఉన్నా బూతులు మాట్లాడవద్దు. ముఖ్యంగా స్త్రీ పరమయినవి.” నచ్చ చెప్పాడు. 
“నొప్పి తట్టుకోలేక అన్నాను” కొడుకు చెప్పాడు. 
“ కావాలంటే దేవుడా అనుకో లేదా ఒరయ్యా అనుకో” కొడుక్కి సాయం చేస్తూ చెప్పాడు. 
ఈ సారి మళ్ళీ జాకీ స్లిప్ అయి కొడుకు చేతి వెళ్ళు నలిగాయి. 
“దేవుడా?” బాధతో అరిచాడు. 
విచిత్రం కారు గాల్లోకి అడుగు ఎత్తు పైకి గాల్లో ఏ ఆధారము లేకుండా లేచి నిలబడింది. 

చలపతి రావు బిత్తర పోయాడు. “దీ నె మ్మ” గట్టిగా అన్నాడు. 

Saturday, 20 May 2017

పనికి మాలిన సలహా

భరించలేని తలనొప్పి, గుండె దడ, నీరసం, వళ్ళంతా ఎర్రగా దద్దుర్లు, 104 డిగ్రీల జ్వరం తో బాద పడుతున్న వ్యక్తి ని డాక్టర్ వద్దకి తీసుకు వచ్చారు.
“ఇవి వడదెబ్బ లక్షణాలు. ఎప్పటి నుండి ఇలా?”
“రెండు రోజుల నుండి “
“రెండు రోజులా? ఎవరికయినా చూయించారా?”
“ప్రగతి మెడికల్స్ షాపు రామయ్య గారికి చూపించాం”
“మెడికల్ షాపా? వాళ్లకేం తెలిసి చచ్చుద్ది. వెదవ సలహాలు ఇస్తారు. మీ ప్రాణాలు తీస్తారు” కొప్పడ్డాడు డాక్టర్.
పెషంటు ని వార్డ్ లోకి షిఫ్ట్ చేసి సెలైన్ పెట్టమని స్టాఫ్ కి సలహా ఇచ్చి...
“ఇంతకీ ఏం పనికి మాలిన సలహా ఇచ్చాడు” అడిగాడు డాక్టర్.
..
..
..
..
..
..
..
“వెంటనే మీ దగ్గరకి తీసుకువెళ్లమన్నాడు.” :p :p

ఇంకా నా?

తక్కువ అటెంప్ట్ లతో సెంచరీ కొట్టిన వారి పేర్లు చెప్పమన్న ప్రశ్నకి సమాదానం.
అజార్ 62, సెహ్వాగ్ 60, కోహ్లీ 52..
ఇంకా ?
జయసూర్య, లారా, బౌచర్ 44
ఇంకా?
అఫ్రిది 37, గేల్ 30
ఇంకా?
ఇంకా నా?
అవును. ఇంకా?
..
..
..
..
..
..
దృతరాష్ట్రుడు. :p

Friday, 19 May 2017

బడేమియా ఆశ

నజీరుద్దీన్ ముల్లా గురించి చదవని పిల్లలు పెద్దలు ఉండరు.
మనిషి లో మానసిక వైకల్యాలకి తనదైన బాణీలో సమాదానం చెప్పటం లో నజీరుద్దీన్ సిద్దహస్తుడు.
ఒకసారి ఏమయ్యిందంటే... (కల్పితం)
చొరస్తా రచ్చబండ వద్ద కూర్చుని ఉన్నప్పుడు. తమ ఇరుగున ఉండే ‘బడేమియా’__ ‘ఎక్కడయినా డబ్బు లు కాసే చెట్టు ఉంటే బాగుండు’ అన్నాడు.
దానికి నజీరుద్దీన్ ‘అలాటి కోరిక మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది’ అన్నాడు. “అందుకే మా పెరేడు లో ఉన్న వింత మారేడు చెట్టు గురించి ఎవరికి చెప్పలేదు . దాని మొదట్లో డబ్బు మూట పెడితే మర్నాటికి రెట్టింపు అవుతుంది.” అన్నాడు.
“నిజమా?” బడేమియా అడిగాడు.
"మరి?"
“నా దగ్గర ఉన్న వెండి నాణేలు మీ చెట్టు మొదట్లో పాతేస్తాను. రెట్టింపు కాగానే రేపు సాయంత్రం తీసుకెళ్తాను. నజీరుద్దీన్ మనం చాలా కాలం నుండి స్నేహితులం మర్చిపోకు.” అని బ్రతిమాలాడు.
కొద్ది సేపు ఆలోచించిన నజీరుద్దీన్ దానికి వప్పుకున్నాడు.
“మొత్తం ఎన్ని నాణేలు ఉన్నాయి?”
“__________” బడేమియా చెప్పాడు.
నజీరుద్దీన్ రెండు నిమిషాలు ఆలోచించి. “నేనా చెట్టుని చైనా నుండి తెప్పించు కున్నాను. బోలెడు ఖర్చు అయింది. అయినా నువ్వు స్నేహితుడివి. కాదనలేను. ఒక ఒప్పందం చేసుకుందాం. ఒక్క సారి చెట్టు మహిమ వాడుకున్నందుకు నాకు 120 నాణేలు కిరాయి చెల్లించాలి” అన్నాడు.
బడేమియా సంతోషం గా ఒప్పుకున్నాడు.
వెంటనే పరుగున వెళ్ళి తన వద్ద ఉన్న వెండి నాణేలు ఒక మట్టి ముంతలో తెచ్చి చెట్టు మొదట్లో పాతి పెట్టాడు.
“రేపు సాయంత్రం నమాజు చేసుకున్నాక వచ్చేయి. నీ డబ్బు తీసికెళ్లి పొదువు”. అన్నాడు
మర్నాడు సాయంత్రం అనుకున్నట్టుగా అక్కడ దాచిన ముంతలో నాణేలు లెక్కపెట్టి రెట్టింపు అవటం బడేమియా గమనించాడు.
సంతోషం పట్టలేక పోయాడు.
అనుకున్న ప్రకారం నజరుద్దీన్ కి 120 నాణేలు ఇచ్చేశాడు.
“ఇక సంతోషమేగా?” నజరుద్దీన్ అడిగాడు.
“ఎక్కడి సంతోషం మరో సారి నీ పెరడు వాడు కొనివ్వు అన్నాడు”
‘సరే నీ ఇష్టం.’ నజరుద్దీన్ అంగీకరించాడు.
మర్నాడు రెట్టింపయిన నాణేలు సరిగా లెక్కించుకోకుండానే నజరుద్దీన్ కి 120 నాణేలు చెల్లించాడు.
“మరొక్క సారి .. “ మళ్ళీ బడేమియా బ్రతిమాలాడు.
“ఇదే చివరి సారి” నజరుద్దీన్ చెప్పాడు.
మూడో రోజు ముంత లో నాణేలు రెట్టింపు అయ్యాయి.
బడేమియా నజరుద్దిని కి కిరాయి చెల్లించేసరికి ముంతలో ఏమి మిగలలేదు. నజరుద్దిని కి ఇచ్చిన 120 నాణేలు మాత్రమే మిగిలాయి.
బడేమియా లాబో దిబో మన్నాడు. ఎక్కడో మోసం జరిగింది అని ఏడుపు లంకించుకున్నాడు.
మర్నాడు ..పక్క ఊరిలో ఉన్న ‘ముల్లా” (న్యాయం చెప్పే పెద్ద మనిషి) వద్దకి వెళ్ళి మొత్తం గోడు చెప్పుకున్నాడు.
ముల్లా నజరుద్దీన్ గురించి విని ఉన్నాడు.
“నీ అశే అతని పెట్టుబడి. బుద్ది తచ్చుకో .. అందరికీ తెలియపరిచి పరువు పోగొట్టుకోకు” ముల్లా సలహా ఇచ్చాడు.
బడేమియా పట్టు వదల్లేదు.
అతన్ని విచారించాల్సిందే అని పట్టు బట్టాడు. సరే అతన్ని నా వద్దకి పిలుచుకు రండి అని నౌకర్ణి తోడుగా ఇచ్చి పంపాడు.
నజరుద్దీన్ ఎంత పిలిచినా ఇంట్లో ఉండి బయటకు రాలేదు.
బడేమియా తో “నాకు చలి జ్వరం గా ఉంది. చలికి వళ్ళు వణుకుతుంది. నీరసం గా ఉంది. నేను నడవలేను అన్నాడు”
“నేను దుప్పటి ఇస్తాను. కప్పుకుని నా గాడిద మీద ఎక్కి వచ్చేయి.” బడేమియా అడిగాడు.
నజరుద్దీన్ బయలు దేరాడు. **
“బడేమియాని మోసం చేశావు. అతని డబ్బు అతనికి తిరిగి ఇచ్చేయ్” అన్నాడు ముల్లా

"ఇందులో మోసం ఏముంది నా మారేడు చెట్టు పెరడుని రోజువారీ కిరాయికి ఇచ్చాను. మొదటి సారి సంతోషమేగా? అని అడిగాను కూడా.. ఇతనే అత్యాశ కి పోయి మళ్ళీ మళ్ళీ నాణేలు రెట్టింపు చేసుకున్నాడు. ఇతనే అత్యాశ పరుడు. ఇంకాసేపు ఉంటే నేను ఎక్కివచ్చిన గాడిద, కప్పుకున్న దుప్పటి కూడా తనదే అనేటట్టు ఉన్నాడు.”
బడే మియా కి స్పృహ తప్పింది.😀🤣😜

Thursday, 18 May 2017

పిల్ల మాంత్రికుడు

నరసరావు పేట లో నలబై ఏడు డిగ్రీలు టెంపరేచర్ నడుస్తుంది.
శ్రీకాంత్, కళా సాగర్ కి ఫోన్ చేశాడు. “ఎక్కడున్నావ్ ? ”
“షాపులో.. కూలర్ వేసుకుని కూర్చున్నాను. నీళ్ళల్లో ఇసు ముక్కలు వేయిస్తున్నాను.”
‘బిజీనా?”
“ఇంకెవరికయినా అయితే సమాధానం అదే.”
‘అర్జెంట్ పని బడింది. ఒకసారి మన 'డెన్' కి వస్తావా?”
“ఇప్పుడా?”
“ఇప్పుడే !!”
సూదుల్లా గుచ్చుతున్న ఎండలో బండి తీసి, తలకి టోపీ పెట్టుకుని బయలు దేరాడు. బస్ స్టాండ్ వద్ద మలుపు తిరుగుతుంటే.. రోడ్డు మీద ఒక సీసా కనబడింది. ఎవరయినా ప్రమాద వశాత్తు దాన్ని తొక్కితే పగిలి గాయం అవటం ఖాయం.
అతను బండి మీదే వంగి ఆ సీసా అందుకుని ముందు కవర్లో ఉంచుకున్నాడు.
శ్రీకాంత్ వద్దకి వచ్చేసరికి అతను ఎదురు చూస్తున్నాడు.
“ఏంటి విషయం?” కవర్లో సీసా విసిరేయ్యటానికి తీయబోతుంటే .. దానికి మూతగా ఉంచిన కార్క్ ఊడింది.
లోనుండి పొగ .. పిల్ల మాంత్రికుడు షరా మామూలే..
“డింబకా.. రెండు కోరికలు తీర్చేద హేమీ కావలెనో కోరుకొనుడు.” అని ఒక బాక్ గ్రౌండ్ లో వాయిస్సు...
“అదేంటి.. జనరల్ గా మూడు కోరికలు తీర్చాలిగా?” శ్రీకాంత్ లాజిక్ పీకాడు.
“ లాజిక్ కావాలా కోరికలు తీర్చాలా.. ఆ గడ్డం గీసుకుని ఎన్నాళ్లయింది ?. ఏమిటా అవతారం. రెండే రెండు .. కావాలా వద్దా అన్నట్టు నేను ట్రైనీ ని అధికారం లాటి పెద్ద కోరికలు వద్దు. మోయినమయినవి కోరుకోండి."
ఈ లోగా కళాసాగర్ బాగా ఆలోచించి .. “ఎంత వంపినా ఖాళీ అవని బీరు సీసా కావాలి” అన్నాడు.
అతని చేతి లోకి సీసా వచ్చి చేరింది.
దాన్ని చెరో మగ్గులో వంపుకుని ఖర్చు చేశారు. ఆశ్చర్యం సీసా మళ్ళీ నిండుగా ఉంది.
“రెండో కోరిక కోరు కొనుము. ఏదయినా ATM లో దూరి ఏ‌సి లో కూర్చుంటాను” తొందర పెట్టాడు. పిల్ల మాంత్రికుడు.
“ఇట్లాంటిదే ఇంకో సీసా పట్రా” కళా సాగర్ చెప్పాడు.

Sunday, 14 May 2017

బస్సు లో ఇంటికి

ఆదివారం నాకు ఇంట్లో ‘తడి’ పర్మిట్ ఉంది.
కార్ తీసుకుని బస్ స్టాండ్ దగ్గర ఉన్న నా ఫావేరేట్ ‘ఈగిల్’ బార్ కి వెళ్ళాను.
మూడు పెగ్గులకే పర్మిట్ ఉంది. అందుకని నాలుగు మూడో పెగ్గులు (? :p) తీసుకున్నాను.
బార్లోనుండి బయటకి వస్తుంటే.. మేనేజర్ కార్ తోలటం మంచిది కాదన్నాడు.
‘పొద్దుటే వచ్చి తీసుకెళ్ళండి. పార్కింగ్ లాట్ లోనే ఉంచండి”
బయటకి వచ్చి ఇంటికి వెళ్ళటానికి బస్సు పట్టుకున్నాను.
మంచిదయింది.
దారిలో ట్రాఫిక్ పోలీసులు కార్లు ఆపి బ్రీత్ టెస్ట్లు చేస్తున్నారు.
బస్సులో ఉండటం వల్ల ఎవరు నా జోలికి రాలేదు.
నేనే హుషారుగా చేతులు ఊపుతూ వచ్చేశాను.
..
..
..
..
..
..
..
..
..
తీరా ఇంటికొచ్చాక మా వీధిలో బస్సు ఎక్కడ పార్క్ చెయ్యాలో అర్ధం కాలేదు.

వీడేనా?

కొడుకు కార్లో సామాను జాగర్తగా దించే సరికి కోడలు “అనుసూయమ్మ’ ని జాగర్తగా నడిపించి వరండాలో కూర్చోబెట్టింది.
ముందుగానే ఫోన్ చెయ్యటం వల్ల ఆశ్రమ నిర్వాహకులు పరంధామయ్య గారు ఆఫీసు గదిలో కూర్చొని ఉన్నారు.
అనసూయమ్మ కి వెలుతురు బాగా ఉండే కార్నర్ గది కేటాయించేట్టు గట్టి సిఫారసు చేయించాడు కొడుకు. 
గది లోకి ఆమెని ఆమె సామానుని చేర్చాక, బాత్రూము సౌకర్యంగా ఉండటం, గదిలో తిరిగే ఫాను ఉండటం. మంచానికి దోమతెర కట్టుకునే ఏర్పాటు ఉండటం చూసి,కోడలు సంతృప్తి పడింది.
ఆశ్రమం లో వైద్య సౌకర్యాలు, బోజన వసతి, చుట్టూ ఆహ్లాదంగా ఉన్న పరిసరాలు చూసి తను చెల్లించే డబ్బు కి సరిపడేట్టు గా ఉండటం కొడుకుని సంతోషపరిచింది.
ఆశ్రమం రెండో వైపు అనాధ పిల్లల పాఠశాల, మరో వైపు గోవుల సంరక్షణ కేంద్రం విశాలమయిన కూరగాయల తోటలు.. అక్కడక్కాడా బెంచీలు, రాలిపోతున్న ఆకులకు తోడుగా వృద్ధులు
“నీకేం పర్వాలేదమ్మా, ఇక్కడ అన్నీ బాగున్నాయి. ఎంత ఖర్చు అయినా పర్లేదు. నేను పంపుతాను. తరచూ మేము వచ్చి చూస్తూ ఉంటాం.” అన్నాడు కొడుకు. అందులో కొంత మాత్రమే నిజం ఉండటం అన్నపూర్ణమ్మకి తెలుసు. మరికొంత కొడలికి తెలుసు. కొడుకు శ్లేషం లో ఈగలా కొట్టుకు మిట్టాడుతున్నాడు.
పరంధామయ్య గారు అనసూయమ్మకి కేటాయించిన గది వద్దకి వచ్చే సరికి కొడుకు, కోడలు లేచి నిలబడ్డారు.
“ఇక నుండి మా అత్తయ్య గారి బాగోగులన్నీ మీరే శ్రద్ధగా చూసు కోవాలి. మందుల వివరాలు ఈ పుస్తకం లో వ్రాసి ఉన్నాయి” అంది కోడలు.
పరంధామయ్య ఇలాటివి ఎన్నో చూశాడు. అనుసూయమ్మని సూక్షంగా చూస్తూ.. “నిన్నేక్కడో చూసి నట్టు ఉందమ్మా” అన్నాడు. అనసూయమ్మ గాజు కళ్ళతో నవ్వింది.
“జాగర్త బాబు” అంది కొడుకుతో .. “ఏదయినా విశేషం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పమ్మా.” అంది కోడలితో ..
వాళ్ళు వెళ్ళి పోతుంటే.. గేటు వద్దకు వచ్చి వీడ్కోలు చెప్పిందావిడ.
పొడవయిన దారి లో ఎండి న రాలిన ఆకుల మధ్య నెమ్మదిగా నడుస్తూ ఉంటే.. పరంధామయ్య గారు ఎదురోచ్చారు.
“ముప్పై ఏళ్ల క్రితం, మీ బర్త తో వచ్చి ఒక అనాధ శిశువుని దత్తత చేసుకున్నావు. వీడేనా?”

‘అమ్మలకి’ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు......