Sunday, 27 September 2015

గ్రూప్ ఇన్సూరెన్స్


ఇన్సూరెన్స్ కంపెనీ లో ఒక సామాజికవర్గపు ఆదిపత్యం కొనసాగటం మొదలెట్టాక అనేక మార్పులు జరిగాయి. ఏజంట్ ల కమిషన్ తగ్గించడం. సోంబేరి పాలసీలు డిజైన్ చెయ్యటం, డైరెక్ట్ ఆన్లైన్ పాలసీలు అమ్మటం, క్లైమ్స్ త్వరగా సెటిల్ చెయ్యకపోవటం,  ప్రజాదరణ పొంది పాలసీలకు మంగళం పాడటం, చెత్త పాలసీలకి పెద్ద హోర్దింగ్స్ పెట్టడం మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
చివరాఖర ఫైనల్ గా ఉత్శాహంగా పనిచేసే  ఏజంట్లు తగ్గి పోయారు.
ఇన్సూరెన్స్ కంపనీ వాళ్ళే మేళా ఒకటి ఏర్పాటు చేశారు పాలసీలు అమ్ముకోటానికి.
చాలా కాలం పాటు దుబాయ్ కి దొంగ వర్క్ పర్మిట్స్ ఇప్పించి, పాపం పండాక న్నులు తిని ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న 'నాగ రాజు ' మేళాకి వచ్చాడు. .
"ఉద్యోగం కావాలీ, మీ పాలసీలు ఎన్నయినా, ఎప్పుడయినా, ఎవరికయినా అమ్మి పెడతాను " స్తిరంగా చెప్పాడు కంపెనీ పెద్ద తో.
"సరే ఈ రెండు పాలసీలు 80000, 50000 ప్రీమియం వి అమ్మి తీసుకురండి. ఉద్యోగం సంగతి చూద్దాం  "
చెప్పడతను.
లంచ్ అవర్ లోపే పాలసీలు అమ్మి అప్లికేషన్ లు డబ్బు కౌంటర్ మీద పడేశాడు నాగరాజు.
బిత్తరపోయిన కంపెనీవాళ్లు అతన్ని కూర్చోబెట్టి మర్యాదలు చేశాక చెప్పారు .కంపెనీలో అందుబాటులో  ఉన్న వివిద పాలసీల బ్రోచర్లు మరికొన్ని అప్ప్లికేషన్లు నాగరాజుకి ఇచ్చారు.
"మీరు ఇక మా ఉద్యోగి."
 "ఇందాక పాలసీలు అమ్మటం మీవళ్ళ కాదని వివరంగా చెప్పలేదు. మన కంపెనీ నిబందనల ప్రకారం 30000 పాలసీ దాటిన వారికి మెడికల్ టెస్ట్ చేయించాల్సి ఉంది. వారిద్దరి యూరిన్ శాంపిల్స్ కావాలి ."
సాయంత్రానికి నాగరాజు మళ్ళీ ఆఫీసుకి వచ్చాడు రెండు బరువైన బక్కెట్లు పట్టుకుని. వచ్చి రాగానే ఒక కారీ బాగ్ లో విడి విడిగా పేర్లు రాసి పెట్టిన చిన్న సాంపుల్ సీసాలు అక్కడ ఉంచి చెప్పాడు ఇది 80000 పాలసీ ఆయన యూరిన్ శాంపిల్, అది 50000 పాలసీదారుడి యూరిన్ శాంపిల్ "
మళ్ళీ ఆశ్చర్యపోవటం కంపెనీ పెద్ద వంతు అయింది.
**
నాగరాజు మోసుకొచ్చిన బక్కెట్లు వంక చూస్తూ అవేమిటి? అడిగాడాయన.

"వస్తూ ఉంటే.. సిటీ హాల్లో టీచర్ల సమావేశం జరుగుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మాను "

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...