Friday, 25 September 2015

గురక

బాగా అలసిపోయి, మరో ఊరిలో ఇంకా పని మిగిలి పోయిన వెంకట్రావు ఒక సాదారణ డార్మెట్రీ కి వెళ్ళాడు. అప్పటికే బాగా లేట్ నైట్ అయ్యింది. 
"ఒక సింగల్ రూము కావాలి"
"లేవండి .. ఖలీలేవు .."
"మడత మంచమయినా చాలు . బాగా అల్సి పోయాను . రెస్ట్ తీసుకోవాలి"
"ఖాళీ లు లేవండి . "
కామన్ రూములో కి తొంగి చూశాడు వెంకట్రావు .
రూములో ఒక వైపు గోడవారగా నిద్ర పోతున్న ఒక అతను అతని పక్కన ఖాళీ మంచం కనిపించాయి.
"అక్కడ ఖాళీ ఉందిగా ?"
" ఆదా .. ఆయన పెద్దగా గురక పెడతాడు. పక్కోడు జడుసుకునెట్టు . మా రెగ్యులర్ కస్టమర్. రెండు మంచాలకి చార్జ్ పే చేస్తాడు."
" అదివ్వండి చాలు . ఒక్క రాత్రికి అడ్జెస్ట్ అవుతాను ?"
"మీరు నిద్ర పోలేరు . అయినా మీ ఇష్టం." రిజిస్టర్ లో రాసుకుని ఒక లాకర్ ఇచ్చాడు వెంకట్రావుకి "బాత్ రూము అటువైపు ఉంది. ఈ నడవాలోంచి వెళ్ళండి."
*****
తెల్లరింది. ఫ్లాస్క్ తో టీ అమ్ముకునే కుర్రాడు వచ్చి లేపెంత వరకు వెంకట్రావ్ నిద్ర పోతూనే ఉన్నాడు.
" రాత్రి నిద్ర పట్టిందా?" కౌంటర్ లో మనిషి అడిగాడు.
"ఆహా.. భ్రమ్మాండంగా "..
"అతని గురక భయంకరంగా ఉంటుందే ?"
" ఏమో తెలీదు. స్నానం చేసి వచ్చి అతడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని 'యు ఆర్ సో సెక్సీ ' అని చెప్పి పడుకున్నాను. రాత్రంతా అతను మంచం మీది బాశం పట్టు వేసుకుని కూర్చున్నట్టుంది." వెంకట్రావు నవ్వాడు.
Post a Comment