Sunday, 30 August 2015

బాసు ఆత్మ హత్య

ఒక కార్పొరేట్ సంస్థ యజమాని ఒక అందమయిన సెక్రయిటరి ని నియమించుకున్నాడు. సరిగ్గా పది రోజులకే ఆదివారం ఉందయం 11 గంటలకి పన్నెండో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇన్స్పెక్టర్ కిశోర్.
"అతని గదిలో అతనితో పాటు ఇంకెవరూ ఉన్నారు" 
"నేను .. బాసు ఇద్దరిమే ఉన్నాం " సెక్రటరీ సమాదానం.
" మీ బాసుకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది?"
" బాస్ సార్ .. చాలా మంచి వాడు, చేరిన రోజే సాయంత్రమే యాపిల్ -6+ కొనిచ్చారు , మరో రెండురోజులకి డైమండ్ ఉంగరం, మొన్న శుక్రవారం ఆడి కారు కొనిచ్చారు .చాలా మంచి వాడు నేనంటే చాలా ఇష్టం " సిక్రటరీ కి కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి.
" తర్వాత ఏం జరిగింది" కిశోర్ ప్రశ్న.
"ఆదివారం శెలవు కానీ ముఖ్యమయిన పని ఉందని నన్ను మాత్రమే ఆఫీసుకి రమ్మన్నారు వచ్చే సరికి ఆఫీసులో కొత్త పర్ఫ్యూమ్ వాసన నిండి ఉంది. ఏ‌సి లాన్ని ఆన్ చేసి ఉన్నాయి. వెనిషింగ్ బ్లిండ్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి . బాస్ రూములో సోఫా లో కూర్చుని ఉన్నారు. "
కిశోర్ ఆసక్తిగా ముందుకు వంగి వినసాగాడు.
" తాను నాకోసం ఒక ఫ్లాట్ కొంటానన్నారు , ఏ ఏరియాలో కావాలో అడగమన్నారు. నాకు కళ్ళవెంట నీళ్లొచ్చాయి . ఏమిచ్చేసి ఆయన రుణం తీర్చుకోవాలి ? "
"తర్వాత?"
"ఇంతలో ఫోన్ వచ్చింది. మా నాన్నగారు. అటునుండి. బాసు పర్లేదు మాట్లాడమని సైగ చేశారు . "
" డాడీ . మీకు తెలుసా మా బాస్ కి నేనంటే ఎంత ఇష్టమో ఈ పది రోజుల్లోనే ఎన్ని గిఫ్ట్ లు ఇచ్చారో తెలుసా? ఇప్పుడు ఫ్లాట్ కొనిస్తాను అంటున్నారు . మీరు ఊరికే తిడుతూ ఉంటారు గా నేనెందుకు పనికి రాకుండా పోతాను అని .
ఎప్పుడు ఆడపిల్లలా డ్రస్ చేసుకుని తిరుగుతున్నానని కొప్పడే వాళ్ళుగా?..........."
" అంతే సార్ పన్నెండో అంతస్తు నుండి ఆయన ఎందుకు దూకారో నాకిప్పటికి అర్ధం అవలేదు " కన్నీళ్లు తుడుచుకున్నాడు సెక్రటరీ.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...