Tuesday, 21 June 2016

ఫుడ్ పాయిజన్ !!?

సువిధా ట్రైన్ లో తంజావూరు వెళ్తున్న అన్న ఫణికి, కొత్త కాలేజీ లో చదవబోతున్న  మేనల్లుడుకి విజయవాడ  స్టేషన్ లో బోజనం మూర్తిగారి చేత పంపిస్తానని చెప్పింది వైదేహి.
ఇద్దరు మనుష్యుల కి ఒక్క పూట బోజనం తయారీకి నానా హైరానా పడసాగిందామే.
పని పిల్లని పొద్దుటి నుండి ఒకటే హడావిడి పెట్టింది.
అక్కా“ అని వంటగదిలోంచి గావు కేక పెట్టింది పని పిల్ల.
“ఏమయింది.?
“పిల్లి కిటికీ లోంచి పారి పోయింది. పాల గిన్నె లో పాలు తాగినట్టుంది”
“ ఏం చేస్తాం వంచేసేయ్. పెరుగు ముట్టుకోలేదు కదా?”
“ఆ గిన్నె జోలికి వెళ్ళనట్టుగానే ఉందక్కా.” ఆ పిల్ల అనుమానం గానే చెప్పింది.
వంట పూర్తి చేసి మూర్తి తో కలసి స్టేషన్ కి వెళ్ళి లేటుగా వచ్చిన ట్రైన్ కోసం చూసి చూసి
వచ్చాక ఎస్1 బోగీ లో వెళ్తున్నా అన్నకి పార్సిల్ ఇచ్చి, మేనల్లుడికి జాగర్తలు చెప్పింది.
ఎందుకే ఇంత కష్టం? ఒక్క పూట కి ట్రైన్ లోనే ఆర్డర్ చేసి తినేద్దుము కదా?” అన్న మందలింపుగా అన్నాడు .
“కష్టం ఏముంది లేరా, ఇంటి బోజనమ్ ఇంటి బోజనమే . సమయానికి బావ కూడా ఖాళీగానే ఉన్నాడు కదా. అంతగా అయితే రాఖీ పండక్కి చూసుకుందాం లే” వైదేహి బరోసా ఇచ్చింది.
మూర్తి తో కలసి ఇంటి కొస్తుంటే ఫోను మోగింది..
పని పిల్ల “ అక్కా మనింట్లో పాలు తాగిన పిల్లి చచ్చి పోయింది”
వైదేహి వెంటనే మూర్తి గారి బండి ఆపించేసింది.
అన్నకి ఫోన్ చేసింది. “ఏం చేస్తున్నావు రా. తినటం మొదలెట్టావా?”
“మహా చెడ్డ ఆకలిగా ఉందే. నా కోసం పెరుగు చారు చేసినట్టున్నావు. మొదలెట్టబోతున్నాను.”
“సారి ఫణి “ వైదేహి మొత్తం స్టోరీ చెప్పింది. “ఫుడ్ పాయిజన్ అయ్యుంటుంది. బోజనం చేయకు.ట్రైన్ లో పండో, పాడో కొనుక్కుని తినండి”

పాపం వైదేహి మనసు పాడయి పోయింది..
ఇంటి కొచ్చి పని పిల్ల ని అడిగింది “ఎక్కడ ఉంది? చచ్చిన  పిల్లి”
“అదే అక్కా మన వీది మొదట్లో, మీరు వెళ్ళాక స్కూల్ బస్సు కింద పడి చని పోయింది. కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ....”

LLL

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...