Sunday, 20 December 2015

అంబానీ బ్రదర్స్

దుబాయ్ నుండి హైదరాబాదు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం లో
ఒక ఎయిర్ హోస్టెస్స్ యూసఫ్ షరీఫ్ అనే అతగాడికి బాగా నచ్చింది.
స్నాక్స్ సెర్వ్ చేస్తుంటే సరసమాడాడు.. సహకరించక పోతే కొనేస్తానన్నాడు .
“అట్ల కాదు గాని మరో మాట చెప్పు” ఫ్లైట్ సెక్యూరిటి ఆఫీసర్ రాజీ ప్రయత్నాలు మొదలెట్టాడు.
“ఆమె నాకు కావాలి “
“కుదరదు ఆమె ఎయిర్ ఇండియా ప్రాపర్టీ.”
“అయితే ఎయిర్ ఇండియా కొంటాను.”
“కుదరదు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ “
“అయితే ఇండియన్ గవర్నమెంటు నే కొంటాను “
ఇక తన వల్ల అయ్యే పని కాదని భావించిన అతను పైలట్ తో పి‌ఎం ఆఫీసుని సంప్రదించమని చెప్పాడు.
“దానికయితే పి‌ఎం ఆఫీసు లాభం లేదు.
అంబానీ బ్రదర్స్ ని సంప్రదిస్తే చాలు “ పైలెట్ ముక్తాయించాడు.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...