Monday 7 December 2015

ఎవరి పెత్తనమో తేలాలి

నిన్న సాయంత్రం మొగుడు పెళ్ళాలకి అభిప్రాయ బేదాలొచ్చాయి.
మాటలన్నీ వాడేసుకున్నారు.
'మీ అమ్మ సంగతి నాకు తెలుసే'.
'అసలు నిన్ను కాదే నీ బాబుని అనాలే '
'అబ్బో మీ వంశం లో కుదురుగా ఉన్నోడి ని ఒక్కడిని చూపించు' ఇలాటివి 
మాటల స్టాక్ అయిపోయాక పెళ్లాన్ని మోగుడు వంగబెట్టి వీపు మీద
సౌండ్ వచ్చెట్టుగా జాగర్తగా ఒక చిన్న దెబ్బవేశాదు.
పెళ్ళాం చాపల కూర వండే గిన్నెతో గుండు మీద ఒకటి పీకింది.
గిన్నెకి సొట్టబడింది. గుండు మీడికి బొప్పి  వచ్చింది.
ఈ లోగా ఆమె గడపమీద జారీ పడింది. ఇంటాయన నవ్వాడు.
టామ్ అండ్ జెర్రీ లాగా అయన కోసం ఆమె , తప్పించుకొటానికి ఈయన ఇల్లంతా తిరిగి మొత్తానికి బాత్రూం లో దూరి దైర్యంగా తలుపెసుకున్నాడు.
**
"ఇదిగో నిన్నే నువు బయటకి రా " అంది ఆమె రొప్పుతూ
"నేను రానే .." తలుపు గట్టిగా ఉందని నిర్ధారించుకుని మొగుడు.
"బయటకి వస్తావా ? రావా ??"
' సమస్యే లేదు "
ఆదివారం మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవకుండా బజార్లో చుట్టూ పక్కల అమ్మలక్కలు చేరారు. అప్పటికే పెళ్లాన్ని కొట్టిన మొగుడిని చూడటానికి కొంత మంది మగాళ్లు పొగయ్యారు.
"బజార్లో జనమంతా వచ్చారు .. బయట కి వస్తావా? తలుపులు విరగొట్టమన్నావా?" ఇటునుండి ఈవిడ ఏమాత్రం తగ్గకుండా ..
"వచ్చారా రానీ .. ఇవాళ బజార్లో అందరికీ తెలియాలి మన ఇంట్లో ఎవరి పెత్తనమో అని"
పెద్దగా అరిచాడు మొగుడు .
‪#‎susri‬

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...