Saturday, 12 December 2015

ఫస్ట్ ఎయిడ్

వీకెండ్ కి చల్లటి గాల్లో కొత్త గర్ల్ ఫ్రెండ్ తో . 
బుల్లెట్ లేడి బర్డ్ మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్తుంటే..
..
అతని హుడ్ ఉన్న జర్కిన్ కి ముందు పక్క జిప్ ఫైల్ అయ్యింది. 
చల్లటి గాలి ఛాతికి బలంగా తగులుతుండటం తో అతను బండి స్లో చేశాడు...
....
వాట్ డియర్ ఏమయింది.?
..
“చల్లటి గాలి .. తోలటం కష్టం గా ఉంది “..
..
“ఒక పని చెయ్యి ఓపెన్ వెనక్కి వచ్చేట్టు వేసుకో . వెనక నేను ఉంటానుగా గాలి చొరబడనికుండా” . నవ్వింది ఆమె ..
..
జల్సా సినిమాలో ఇలియానా గుర్తొచ్చింది అతనికి ఒక్క నిమిషం...
..
అయిడియా బాగుందనిపించి జర్కిన్ వెనక్కి వేసుకుని మళ్ళీ ప్రయాణం సాగించారు.
గర్ల్ ఫ్రెండ్ తన మాట నిలబెట్టుకునే ప్రయత్నం లో కొంచెం ముందుకి జరిగి గట్టిగా ఆనుకుని తాను అమ్మాయినని అతనికి తెలిసేట్టు కూర్చుంది...
..
బుల్లెట్ వాయు వేగం తో వెళ్తూ మలుపు తిరిగే చోట హైవే కి అడ్డుగా వేసిన ఫెన్సింగ్ కి గుద్దుకుంది.
..
మాటల్లేవు.. కదలికలు అసలే లేవు...
..
డాబా హోటల్ లో ఖీర్ తాగి, బీరు తాగిన ఫిలింగు తో ఎదురునుండి వస్తున్న వీరనారాయణ వెంటనే స్పందించాడు...
..
108 కి ఫోన్ చేశాడు. ..
..
అటునుండి కొన్ఫిర్మేషన్ కాల్ వచ్చాక “గుల్లపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ఒక జంట ఫెన్సింగ్ కి బండి గుద్దుకుని ఇద్దరు స్పృహ తప్పారు. పిల్ల పరిస్తితి పర్లేదు గాని. పిల్లాడి తల పూర్తిగా తిరిగి పోయింది. ఫస్ట్ ఎయిడ్ గా తలను గట్టిగా పట్టుకుని ముందు వైపు తప్పాను, ఇప్పుడే కొద్దిగా తల కదిలించి .. ప్రస్తుతం కోమా .. వెంటనే రావాలి “ పోను పెట్టేశాడు.
‪#‎susri‬

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...