Tuesday, 22 December 2015

చిల్లర మనసు


ఉదయాన్నే షాపు వద్దకి వచ్చాను.
పోయిన కార్తీక మాసం అంతా అమ్మకాలు లేవు.
షాపు తెరిచిన ఈ ఆరు నెలల్లో ఇంత తక్కువ అమ్మకాలు ఇదే.
హోల్ సెల్ గా గుడ్లు అమ్మే అయిడియా మా అబ్బాయిది. వాడు మార్కెట్ వద్ద పెద్ద షాపు స్వంతంగా నడుపుతాడు.
జెడ్ పి లో అటెండర్ గా రిటైర్ అయ్యాక ఏమి తోచక అందరికీ అనవసరపు సలహాలు ఇస్తున్నానని
మా అబ్బాయి కాలనీ మొదట్లో ఒక చిన్న బంకు ఏర్పాటు చేసి నాకు వ్యాపకం కలిపించాడు.
జెడ్ పి కాలనీ నగరానికి చివరగా ఉంటుంది. చాలా మంది నగరం లోనుండి పొద్దుటే బండ్లు మీద వచ్చి ఇక్కడ మూల మీద నున్న' టి స్టాల్' దగ్గర్లో పార్కింగ్ చేసి వాకింగ్ కి వెళ్తారు. వెళ్ళి వచ్చి టి తాగి అన్నీ రకాల పేపర్లు తిరగేసి వెనక్కి వెళ్ళి పోతారు . అది అలవాటు. కొంతమంది సైకిల్ల మీద కూడా వస్తుంటారు.
ఈ ఉదయం మా ఇంటావిడ నాకు చాదస్తం ఎక్కువయిందని .. ఊరికే సోనుగుగుతున్నానని పోట్లాట మొదలెట్టింది.
అలిగి టీ నీళ్ళు కూడా తాగకుండా బంకు తెరవటానికి వచ్చాను. నోట్లో పాన్ పరాగ్ నములుతూ ..
****
.
బంకు ముందే ఒక సైకిలు సైడు స్టాండ్ వేసి ఉంది.
బంకు తెరిచి చీపిరితో కొద్దిగా శుబ్రమ్ చేసుకుని బళ్లమీద కోడిగుడ్డు అట్టలు పేర్చుకోవాల్సి ఉంది.
బంకు తెరిచాను. ఎవరు వచ్చి సైకిలు తీయలేదు. తిని అరగక బొజ్జ లు కరిగించుకొటానికి వచ్చే వాళ్ళు పక్కనే సైడు కి పెట్టుకోలేరల్లే ఉంది. చుట్టూ చూశాను . సమీపంలో ఎవరు లేరు.
సైకిలు లాగి పక్కకి పెట్టాను. ఎంత దురుసుగా అంటే తాళం వేసిన రిమ్ము స్పైక్ లు వంగి ఉంటాయి. పక్కకి నెట్టేశానో లేదో మూలమీద నుండి ఒక పిల్లాడు పరిగెత్తుకు వచ్చాడు. నిండా పది పన్నెండు ఏళ్ళు ఉండవు.
"
అంకుల్ సైకిల్ నాది"
"
నిదయితే .. ఏం గొప్పా ?? కొట్టు ముందా పెట్టేది ? ఏం ఆమాత్రం బుద్ది లేదా నీకు? " కస్సుమన్నాను.
ఏమి మాట్లాడలేదు ఆ పిల్లాడు. బహుశా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ దురుసుగా మాట్లాడి ఉండక పోవచ్చు.
***
"
కోడిగుడ్ల షాపు మీదేనా? "
"
కాక మీ అయ్యదా ?" కోపం వచ్చింది.
"
నిన్న సాయంత్రం మీదగ్గర ఎర్ర రంగు మారుతి కార్లో వచ్చి ఎవరయినా 500 రూపాయల నోటు ఇచ్చి డజను గుడ్లు తీసుకున్నారా అంకుల్ " ఆ పిల్లాడు నా కోపాన్ని లక్ష పెట్ట కుండా అడిగాడు.
"
అయితే.?"
"
ఆయన మా డాడీ అంకుల్.. మీరు చిల్లర ఇచ్చేటప్పుడు పొరపాటున ఒక వంద కాగితం ఎక్కువ ఇచ్చారట. అది ఇచ్చి రమ్మన్నారు. మీరు ఇంకా షాపు తెరవలేదని అక్కడ పేపరు చదువుతూ కూర్చుని ఉన్నాను. మీరు వచ్చేటప్పుడు చూసా కానీ షాపు మీది అని తెలీదు, తెలిస్తే వెంటనే వచ్చి సైకిలు తెసేవాడిని. సారి .. మీకు కోపం వచ్చినట్లుంది "
దిబ్బతిన్న సైకిలు వైపు చూసుకుంటూ జేబు లోంచి వంద కాగితం తీసి ఇచ్చాడు ఆ అబ్బాయి.
Top of Form

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...