Thursday, 31 December 2015

2015 లో మగాళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్

దీనెమ్మ జీవితం L
ఎవడినయినా అడుగు అందరూ చెప్పేమాట.
కట్టుకున్న దాన్ని సుఖపెట్టు -- అనే 
సాద్యమా? ఆహా సాద్యమా? అని.....
ఉదాహరణకి ఈ కింద ప్రశ్నలు మార్కులు చూడండి. 
..
ఇంట్లో సాయం 
+++++++++
మంచం మీద దుప్పట్లు సర్దుతాం . (+1 మార్కు )
మాచింగు దిండు గలీబులు మార్చడం మరుస్తాం (-10 మార్కులు)
దుప్పటి పరుపు అంచులు వద్ద సర్దటం బద్దకిస్తాం (-3)
ఆమెకి కావాల్సినవి తే టానికి బజారుకి వెళ్తాము (+5)
అది వర్షం లో (+8)
అలవాటయిన క్వార్టర్ తెచ్చుకుంటాం (-20)..
గెస్ట్ లు /స్నేహితులు 
++++++++++++
ఆదివారం మిత్రులు పలకరించడానికి వస్తారు (0)
కర్టెన్స్ ని, సోఫాని, గోడమీద పెయింటింగ్ ని పొగుడుతారు (+9)
టి తెస్తాను కూర్చోండి అన్నయ్యాఅనగానే దేబ్యమ్ ముఖం వేసుకుని కూర్చుంటారు (-8)
పింజారి వేదవలకి ఆ బిస్కెట్ ముక్కలు కూడా ప్లేట్లో పెట్టి ఇవ్వు వంటగదిలో మనం బయంగా సలహాలిస్తమ్ (-15)
కాలేజీలో మన సాహసాలు గుర్తు చేస్తారు (+1)
సరోజ పాస్ కావటానికి మనమే కారణం అని చెబుతారు (-24)
బందువులు 
+++++++
అత్తగారి తరఫు వాళ్ళు అర్ధరాత్రి వస్తారు (+5)
మనమే చలిలో స్టేషన్ కి వెళ్ళి తీసుకోస్తాం (+12)
మధ్యాన్నం బోజనానికి మంచి హోటల్ నుండి రొయ్యల కూర పార్సిల్ తెస్తాము (+18)
మరదలి తో దబ్బపండు లాగా ఉన్నావు అంటాం  (-38)
మన బందువులు వస్తారు (-7)
టిఫిను చేసి వస్తారు, ఏదో ఆఫీసులో పని ఉంది చూసుకుని సాయంత్రం వెళతామ్ అంటారు (0)
ఇంటి వద్ద నుండి రావాల్సిన పొలం కవులు డబ్బులు తీసుకొస్తారు (+12)
మధ్యాహ్నం పప్పు జాడీ పచ్చడి తో బోజనమ్ చేస్తారు (-32)
..
సాహసాలు 
+++++++
రాత్రి పూట హల్లో చప్పుడు కి లేచి వెళ్ళి చూస్తాం (+5)
కాలెండర్ ఊగటం వల్ల అని తేలుస్తామ్ (0)
లేదు మరేదో జరిగింది అని కనిపెడతాం (+5)
రోకలి బండతో ఒకటి ఇస్తాం (+10)
ఆమె పెంపుడు కుక్కని తెలుసుకుంటాం (-20)..
..
సామాజిక పనులు 
++++++++++++
పార్టీకి వెళ్లినప్పుడు పూర్తిగా తన పక్కనే ఉంటాం (+1)
కొద్దిసేపు ఉండి, పాత మిత్రులని కలిసి గప్ అండ్ గాస్ కొడతాం (-5)
వాళ్ళలో కనకం ఉంటుంది (-10)
కనకం ఫోన్ నెంబరు తీసుకుంటాం (-30)
ఆమె ఇంకా ఒంటరిగానే ఉన్నట్టు తెలుసుకుంటామ్  (-80)..
..
ఆమె పుట్టినరోజు 
++++++++++
సాయంత్రం బోజనానికి తీసు కెళ్తాము (+5)
మందు మాట ఉండని రెస్టారెంట్ అది (+3)
క్రికెట్ మ్యాచ్ వచ్చే టి‌.వి ఉంటుంది (-3)
వీలయినంత ఎక్కువ సేపు తింటూ .ఉంటాం (-4)
మీ ఫవరేట్ ప్లేయర్ సిక్స్ కొట్టినప్పుడు పెద్దగా అరుస్తాం ఆటలో లినమయిపోతాం (-18)...
..
సినిమా కి వెళ్ళిన రోజు 
+++++++++++++
ఆమెని సినిమాకి తీసుకెళ్తాం (+3)
ఆమెకి ఇష్టమయిన సినిమా (+5)
మనకు అసలు నచ్చనిది (+8)
ఒకవేళ మనకి ఇష్టమయిన సినిమా అనుకోండి (-5)
హీరోయిన్ కొంచెం విశాలంగా ఉందనుకోండి (-13)
అబ్బే డ్రస్ డిజైనర్ బలహీనం, పైగా హీరోయిన్ కడు బీదది అని చెప్పామనుకోండి (-26)..
..
...
మన ఆకారం 
+++++++
గమనించగలిగిన బొజ్జ కూడపెట్టామనుకోండి (-15)
గమనించి, వ్యాయామం గట్రా మొదలెట్టామను కోండి (+10)
బొజ్జ కి ఉటంగా బాగి ఫాంటు, బాగి హవాయి చొక్కా లు వేశామనుకోండి (-30)
నోటి దూల కొంది .. నీకు పొట్ట ఉంది అన్నామనుకోండి (-100) ..
..
లావు ప్రశ్న 
++++++
నేను లావుగా ఉన్నానా ? అని ఆమె అడిగితే (-5)
అవును మనమేమీ చెప్పక పోయినా మార్కులు తగ్గుతాయి. నిబందనలు అలా ఉంటాయి.
సమాదానానికి తటపటాయించేటప్పుడు (-10)
మనం దైర్యంగా "ఏ బాగం లో " అన్నామా ?ఆహా అన్నామా? (-74)
మరే సమాదానం అయినా సరే (-38)
..
కమ్యూనికేషన్ 
+++++++++
ఆమె మనతో మాట్లాడదలుచు కున్నప్పుడు శ్రద్దగా వింటూ ఉంటే (+3)
అరగంట మించి విని . వింటున్నట్టు కనిపించడం కూడా చేస్తే (+50)
మొహం లో విసుగు లేకుండా, టి‌వి/ మొబైల్ చూడకుండా వింటుంటే (+500)
మనం కళ్ళు తెరిచి నిద్ర పోతున్నాం అని ఆమె కనిపెట్టింది (-1101)
ఇప్పుడు పేపరు మొత్తం కూడుకుని మార్కులు చూసుకుందాం .
xxxx
అది మనకు మిగిలింది.
ఈ లెక్కన మగాడు పరీక్ష ఎప్పుడు పాసవ్వాలి.???
***
కనుక మిత్రులారా వైను గోపాల, వారి సన్నిధిలో జరగనున్న 
N E W Y E A R P A R T Y 
కి వచ్చి శక్తి వంచన లేకుండా పాల్గొని 'తీర్ధ' & 'ప్రసాదాల' తో
2 0 1 6 
కి స్వాగతం పలక ప్రార్ధన.(-111)
***
‪#susri 311215


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...