Sunday, 20 December 2015

కుక్క పిల్ల మొండిది

శేషారావు పొద్దుటే మార్నింగ్ వాక్ కి వెళ్ళి వచ్చేసరికి ...
.
బార్య పెంపుడు కుక్క కి కూర్చోటం నేర్పుతుంది.
.
ఈవిడ 'టామీ సిట్ .. సిట్' అని కూర్చోవలసిన చోటుని ఒక కర్రతో చూపించడం
అది కూర్చోకుండా గుండ్రంగా తిరిగి తోక ఊపటం...
..
పది నిమిషాలు గడిచినయ్యి . షూ విప్పి ఒకేసారి ఆఫీస్ కి వేసుకెల్లే షూ పాలిష్ చేసుకుంటూ
.
"ఎందుకే అంత శ్రమ పడతావు? అది ని మాట వినదు గాని.. లోపలికి వెళ్ళి టీ పెట్టు."
..
ఆవిడ ఒక్క సారి వెనక్కి చూసి ఏదో గొణుగుతూ లోపలికి వెళ్లింది.
.
"మొదట్లో మీరు అంతే " అన్నట్లు గా శేషారావు కి వినిపించింది.
చుట్టూ ఒకసారి గాబరాగా చూశాడాయన. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...