మా మూడేళ్ళ అమ్మాయిని నాతో వదిలి
వెళ్తూ
మా ఆవిడ "పెరంటానికి వెళ్తున్నాను ఒక్క గంట పాపని చూస్తుంటారా?" అంది.
వినేవాళ్ళకి పర్మిషన్ అడిగినట్లు ఉంటుంది కానీ అది ఆర్డర్ అని హోల్ మగజాతికి తెలుసు,
అలాటి ప్రశ్నకి మూడు ఆప్షన్ లు ఉంటాయి.
మొదటిది ' సరే'
రెండోది 'అలానే '
మూడోది 'మౌనం ..(అంగీకారం)' :) :)
ఇవేవీ కాకుండా అమ్ములు నేను ఆడుకుంటాం పోయిరా అన్నాను హుషారుగా.
"జాగర్త స్మార్ట్ ఫోను చూసుకోకుండా .. కాస్త పిల్లని గమనిస్తుండండి"
దీనికి కూడా పై మూడు ఆప్షన్లే ..
***
అమ్మూ ఆడుకోటానికి టీ కెటిల్ , కప్పులు షో కేస్ లోంచి తీసి ఇచ్చాను.
అమ్ములు ఒక పక్కన కూర్చుని ఆడుకోవటం మొదలెట్టింది.
నేను యదావిడిగా వాట్స్ అప్ లో మునిగి పోయాను.
రెండు నిమిషాల్లో టి వచ్చేసింది.
" పప్పా నీకు టి చేశా తాగు" అంది.
టాయ్ కప్పులో నీళ్ళు ఉన్నాయి. అవి తాగేసి "బాగున్నాయి నాన్నా .. అమ్మ కంటే నువ్వే బాగా చేశావు "
అమ్ములు ముఖం లో సంతోషం.
మొత్తానికి మా ఆవిడ వచ్చేసరికి మా అమ్ములు అయిదారు కప్పులు టి తాగించింది.
***
ఈసారి అన్నట్టుగానే మా ఆవిడ గంట లో ఇంటి కొచ్చింది.
వచ్చి రావటం తో అమ్ములు ఏం చేస్తుంది.
"బ్రమ్మాండంగా ఆడుకుంటుంది. అసలు పిల్లల్ని ఆడించడం ఒక కళోయ్ .. అది అందరికీ రాదు"
"కదా అమ్ములు" మా అమ్మాయి వయిపు చూశాను.
"అమ్మకి కూడా టి ఇవ్వమ్మా " చెప్పాను.
చూడవోయ్ "మా చిట్టి తల్లి అయిదు కప్పులు టి ఇచ్చింది. నువ్వు రెండో కప్పు ఇమ్మంటేనే కేకలేస్తావు ??"
ఈ లోగా అమ్ములు టి కప్పుతో మళ్ళీ వచ్చింది. ఈ సారి వాళ్ళ అమ్మ కిచ్చింది .
ఆమె పాప గమనించకుండా వాష్ బేసిన్ లో కి వంచి. బెడ్ రూములోకి వెళ్ళి వాష్ రూము తలుపు మూసి వచ్చింది.
***
."అయితే అయిదు కప్పులు తాగారా? ..
ఆ వాట్స్ అప్ నుండి కొంచెం ఈ లోకం లోకి వస్తే మూడేళ్ళ పిల్లకి బాత్రూములో
కుళాయిలు అందవని అర్ధమయ్యేది."
tongue emoticonమా ఆవిడ "పెరంటానికి వెళ్తున్నాను ఒక్క గంట పాపని చూస్తుంటారా?" అంది.

No comments:
Post a Comment