Thursday, 24 December 2015

లెట్స్ ప్లే ఉమ్మచ్చు

ఈ అందమయిన సాయంత్రం అతను ఆమె సముద్రపు ఒడ్డున
కూర్చుని ఉన్నారు. తెల్లటి వెన్నెల ..సముద్రపు అలల మీద ఉయ్యాలలు ఊగుతూ
చుట్టూ ఎవరు లేని ఏకాంతం. ఒకే ఒక్క అందమయిన టెంటు .. దాని ముందు పడక కుర్చీలో అతను. ఆమె చేతిలో చెయ్యెసి .. పక్కనే చిదుగుల మంట..
అతను ఆమెని తదేకంగా గమనించడం చూసి " ఏమిటి?" అన్నట్లు చూసింది కళ్ళతోనే..
" లెట్స్ ప్లే ఉమ్మచ్చు" చెప్పడతాను.
ఆమె సిగ్గుల మొగ్గ అయ్యింది. "ఊహూ అప్పుడే కాదు అంది"
మరి కొద్ది సేపు గడిచింది. అతని కళ్లలోకే చూస్తూ చిన్నప్పుడు విన్న చందమామ కధ ఒకటి చెప్పింది. అతను సంగీతం లా వింటున్నాడు. నిప్పుల్లో కాల్చిన వేడి దుంపలు తింటూ.
" లెట్స్ ప్లే ఉమ్మచ్చు " మళ్ళీ అడిగాడతాను. ..
..
"లేదు ని కళ్లలోకి చూస్తూ ఉండిపోవాలని ఉంది "
మరి కొద్ది సేపు గడిచింది...
..
ఆమె చేతులు అతని చేతుల్లో గట్టిగా దృడంగా ..
"లెట్స్ ప్లే ఉమ్మచ్చు"..
..
"ఊహూ .. ..చంద్రుడుని చూడు ఎంత బాగున్నాడో "
**
"లెట్స్ ప్లే ఉమ్మచ్చు " ఈ సారి తప్పదన్నట్లు చెప్పాడతను.
లేచి టెంటు లోకి వెళ్ళి ఆమెని కూడా పిలిశాడు.
**
**
**
గిటారు అందుకుని వాయిస్తూ పాడసాగాడతాను.
"లెట్స్ ప్లే ఉమ్మచ్చు "
ఏ హపి హేపీ ఉమ్మచ్చు..
ఆన్ ది డే ఆఫ్ క్రిస్మస్ ఈవ్
లెట్స్ ప్లే ఉమ్మచ్చు
....
మెర్రి మెర్రి ఎక్స్ మాస్ డే
లెట్స్ ప్లే ఉమ్మచ్చు " ఆమె కూడా గొంతు కలిపింది.
--
(వాళ్ళని డిస్ట్రబ్ చేయకుండా తిని పడుకోండి ..merry x-mas మిత్రు లందరికి :p)

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...