మొదటిసారి ఇంటి కొచ్చిన స్నేహితురాలికి ఇల్లు చూపించింది తొమ్మిదో తరగతి చదివే మాన్విత..
ఖరీదయిన టీపాయ్ దాని మీదున్న, అరేబియన్ ఫ్లవర్ వేజ్ చూపించింది.
అందులో ఉన్న బూడిదను చూసి స్నేహితురాలు ఏమిటన్నట్టు ముఖం చిట్లించింది.
“ఆదా మా నాన్న గారి యాశ్ “ మాములుగానే ఎప్పటినుండో అలవాటు కనుక పెద్ద ఫిలింగ్స్ ఏమి లేకుండానే.
“ఐ యామ్ సారి” అందా పిల్ల.
అదేమీ పట్టించుకోకుండా మాన్విత స్నేహితు రాలితో కలిసి ఆడుకో సాగింది.
ఇద్దరు కలిసి కొద్ది సేపు టివి చూశారు. న్యూస్ పేపర్ల తో వచ్చే సండే పుస్తకాలలో పజిల్స్ పూర్తి చేస్తారు. తన కొత్త డ్రెస్సులు చూపించింది. ఈ హడావిడిలో ఫ్లవర్ వేజ్ కింద పడి పగిలి పోయింది.
కొత్త స్నేహితురాలు ఒక్క సారి గా బిగుసుకు పోయింది భయం తో..
శబ్దానికి వంటింట్లోంచి హల్లో కి వచ్చిందావిడ.
పగిలిన ఫ్లవర్ వెజ్ ని చెల్లా చేదురయిన “ ....బూ డి ద ..” ని ఒక్క క్షణం దీర్గంగా చూసి
"జాగర్తగా ఉండాలి కదమ్మా" అంటూ కూతుర్ని మందలించింది..
డస్ట్ ఎత్తడానికి చిన్న ప్లాస్టిక్ చాటలో మెత్తటి బ్రష్ తో ఫ్లోరింగ్ తుడుస్తుంటే..
ఆ స్నేహితురాలు “సారి ఆంటీ” అంది
” పర్లేదు లేమ్మా అది ఇక్కడ మెట్రో లో కొనిన్దే లే మరోటి కొనుక్కోవచ్చు “
“మరి ఆ యాష్ “
“ఏం చేస్తాం ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళ డాడి యాష్ ట్రే వాడరు. సిగిరెట్టు నుశి ఫ్లవర్ వేజు లో నే విదిలిస్తాడు”

No comments:
Post a Comment