Sunday, 27 December 2015

లూట్కే గయా

ఉదయం నుండి డీజీపీ గారి ఫోను మూడో సారి అందుకున్న సీ ఐ గారు 
రొటీన్ వర్క్ పక్కన ఉంచి నిజాం పెట క్రాస్ రోడ్డు కి రెండు కిలోమీటర్ల పరిధిలో 
కిక్కిరిసిన కాంక్రీట్ జంగిల్ లో ఉన్న ఐశ్వర్య అపార్ట్మెంట్ మూడో అంతస్థులో ఉన్న
డబుల్ బెడ్ రూము ఫ్లాట్ కి చేరాడు క్లూస్ టీమ్ తో కలసి.
,,**
మెయిన్ బజారు లో జ్యువెలరి షాపు నడిపే అగర్వాల్ కుటుంభం లోని
సభ్యులందరూ చిరుకూరు 'వీసా బాలాజీ గుడి 'కి వెళ్లి
116 ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని వచ్చే సరికి ఆ దోపిడీ జరిగింది.
**
సి ఐ గారు లోపలి ప్రవేశించే సరికి అగర్వాల్ గారి భార్య ముసుగు కొద్దిగా తొలగించి
ముక్కు చీదుతూ బాధపడుతుంది.
**
రొటీన్ గా క్లూస్ టీము ఆధారాలు సేకరించడం మొదలయ్యింది.
..
సి ఐ గారు డైనింగ్ టెబులు కుర్చీ లాక్కుని కూర్చుని FIR రాయటం ప్రారంభించాడు..
క్రైమ్ ఎన్ని గంటల మధ్య జరిగినది రికార్డు చేసాక ..
ప్రాపర్టీ లాసు స్టేట్మెంట్ తయారు చేయటం మొదలెట్టాడు.
..
"ఏమేం పోయాయి?"..
..
"పెద్దగా డబ్బులు ఇంట్లో లేవు ....
ఉన్నవాటిని కూడా దొంగలు తాకలేదు "'అగర్వాల్ చెప్పాడు.
..
"వెండి/ బంగారం ?"..
..
"అబ్బే అవి ఏమి తాకలేదు."..
..
"మరి? "సి ఐ గారి ఆశ్చర్యం
**
రేపు మా మేరేజ్ డే అండి. ఆ .రోజన్నా తల స్నానం చేద్దాం అని రెండు బక్కెట్ల నీళ్ళు
దాచి ఉంచింది మా ఇంటావిడ, వాటిని దొంగలు దోచుకు పోయారు.
స్పాంజి స్నానానికి కనీసం రెండు మగ్గులు నీళ్ళు కూడా మిగల్చలేదు"
అగర్వాల్ గొంతు వణికింది.
...
" సారా పాని ల్యూటీకే లేగాయారే. అరె భగవాన్..
కితనేముష్ఖిల్ దిన్ ఆయా??"అగర్వాల్ భార్య పెద్దగా రోదించ సాగింది. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...