Wednesday, 2 December 2015

తోక కట్ చేయండి.

పొద్దుటే వెటర్నరీ డాక్టర్ వద్దకి ముప్పై మూడేళ్ళ రాజ్ కుమార్ 
ఒక పేట్ డాగ్ ని తీసుకొచ్చాడు.
..
"చెప్పండి ఏంటి ప్రబ్లెమ్" దాన్ని పరిశీలనగా చూస్తూ అడిగింది డాక్టర్...
..
"దీని తోక కట్ చేయండి."
..
"వాట్ ?" ఆశ్చర్యపోయిండావిడ ..
..
"సరిగా వినలేదా? ఆశ్చర్యమా?" రాజ్ కుమార్ సందేహం...
..
"తోక కట్ చెయ్యమంటున్నారు. ఎందుకు ?" ఆవిడ అతన్ని సందేహంగా చూసింది...
..
"ఇది ఇంటికి ఎవరోచ్చినా తోక ఊపుతూ స్వాగతం చెబుతుంది"..
..
మంచిదేగా?..
..
"ఏం మంచిది. దీని తోక ఊపడం చూడటం కోసమే వారానికి రెండు సార్లు వస్తుంది ఆవిడ "..
..
ఆవిడా ? ఆవిడెవరు ?..
..
"మా ఆ త్త "..
‪#‎susri‬

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...