Friday, 4 December 2015

బయటకి లాగాడు

నిండు కోర్టు లో కేసు విచారణకి వచ్చింది...
..
పాతికేళ్ళ యువకుడు ని బోనులో నిలబెట్టారు.
..
"న్యాయానికి ప్రతీక అయిన మిలార్డ్ నేనేమయినా చెప్పుకోవచ్చా ??"..
..
"తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తావా? విశేషణాలు ఆపి విషయం చెప్పు?"..
..
"నేను నా గర్ల్ ఫ్రెండ్ తో టెలిఫోనే బూత్ లో మాట్లాడుతున్నాను సార్ ..
ముఖ్యమయిన విషయం కొంచెం ఎక్కువ సేపు మాట్లాడాను అనుకోండి .. 
ఈ కానిస్టేబుల్ నన్ను బయటకి లాగి. కింద పడేసి తిట్టాడు సార్."
..
జడ్జి గారు పోలీస్ వైపు చూశాడు...

..
"అంటే కాదు సార్ పక్కనే మరో టెలిఫోన్ బూతు ఉంది అందులో మాట్లాడుకోవచ్చు ..

అది ఖాళీగానే ఉంది. కానీ నన్ను చొక్కా పట్టుకుని బయటకి లాగి.. 
నానా ఆన్ పార్లమెంట్ భాష వాడాడు సార్ "
..
"నిజమేనా? " పోలీస్ వైపు చూస్తూ జడ్జిగారు...

..
" సార్ ఇంకా ఉంది నన్ను లాగి తిట్టినా పర్లేదు. నాతో ఉన్న..

 నా గర్ల్ ఫ్రెండ్ ని కూడా బయటకి లాగాడు సార్ " 

tongue emoticon tongue emoticon pacman emoticon pacman emoticon
‪#‎susri‬

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...