మొన్న వైకుంఠ ఏకాదశకి గుడి కెళ్ళినప్పుడు..
జనరల్ మెడిసిన్ డాక్టర్ సదాశివం గుళ్ళో ప్రదక్షణాలు చేస్తూ కనిపించారు.
విష్ చేసి ప్రదక్షణాలు .. దర్శనం .. ప్రసాదాలు అయ్యాక
గుడి ఆవరణలో కూర్చుని ఉన్నామా ...
మా ముసలాయన ఆయన దగ్గర చేరాడు.
" డాక్టర్ గారు నడుము పూర్తిగా కిందికి వంచి రెండు చేతులని ఎడంగా చేసి ఏకాలు ఎత్తినా తుంటి దగ్గర ఒకటే నొప్పి గా ఉంటుంది .. ఎందుకని అంటారు "
" హాస్పటల్ కి రండి ఒకసారి స్కానింగ్ చేయించి చూద్దాం "
"రెండు చేతులు ఎత్తి ఎడంగా అని తలని కదిలించేటప్పుడు కూడా గూడలు ఒకటే నొప్పి మాస్టారూ "
డాక్టర్ గారు నా వైపు అయోమయంగా చూసి .. " అయినా ఈ వయసులో ఈయన ఈ పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నట్టు ??" అడిగారు.
" కొత్త పైజమా , లాల్చీ వేసుకున్నారు లెండి ఇవాళ .. అది సంబడం " ఆయనకి చెప్పాల్సి వచ్చింది.

No comments:
Post a Comment