పల్లెటూరి నుండి కుక్క ఒకటి పట్నంలో బందువులని పలకరించడానికి
వెళ్లింది.
బంధు మిత్రులని కలిశాక అంధరూ కుశల ప్రశ్నలు పూర్తి అయ్యాయి.
కొత్త కుక్కకి సిటీ మొత్తం .చూపించాలని అనుకున్నాయి.
ఆదివారం సిటీ అంతా గుంపుగా తిరిగి చూశాయి.
టాంక్ బండ్ మీద నిలబడి 'మంచి నీటి సరస్సుగా' మారుస్తామన్న నాయకుల మాటలు విన్నాయి.
రోజంతా తిరిగాక ఇక పల్లెటూరి కుక్కకి బాగా ఆకలేసింది.
" అబ్బో చాలా ఉంది మీ షహర్ .. ఆకలి నకనకలాడుతుంది." బందు మిత్రులతో చెప్పింది.
"అయితే పార్టీకి వెళ్దాం మామా " కుర్ర కుక్క బారోసా ఇచ్చింది.
అన్నీ కలిసి బయలు దేరి ఒక బాచులర్ పార్టీ జరిగే చొట బయట కూర్చున్నాయి.
లోపల మందు నడుస్తుంది.
మొదటి పెగ్గు అవగానే ఒక లెగ్ పీసు తిని ఎముకని బయటకి విసిరాడు ఒకడు.
'ప కు' దాని మీదకి ఉరికింది.
పట్నం కుక్కలు లాగి కొర్చో పెట్టాయి. "వెయిట్ మామా వెయిట్ " చెప్పింది కుర్ర కుక్క.
మరో రౌండ్ మందు అయ్యాక ఈసారి లెగ్ పీసు కొంత మాంసం తో కలిసి బయట పడింది..
.కుక్క మళ్ళీ ఉరికింది. . అన్నీ లాగి కూర్చో బెట్టాయి.
"వెయిట్ మామాజీ .. వెయిట్ "
"ఆక లవుతుంది పైగా ఆ ఎముకకి మాంసం కూడా ఉంది "
"మామాజీ.. ఇంకెంత మరో రౌండ్ ..కాగానే మనమూ టేబుల్ మీదే కూర్చొని తీనొచ్చు ..
కొద్దిగా ఓపిక చేసుకో మామా " కుర్ర కుక్క సెలవిచ్చింది.
No comments:
Post a Comment