Monday, 28 September 2015

మందు పనిచేస్తుంది

ఆంధ్రా బాంకు అగ్రికల్చర్ ఆఫీసర్ అయిన శశిధర్ తమ బాంక్ నుండి లోన్ తీసుకుని డైరీ ఫామ్ నడుపుతున్న సుబ్బారావు వద్దకి వచ్చాడు.
..
"ఇంప్రూవ్మెంట్స్ కోసం అడిషనల్ లోన్ అడుగుతున్నారు. ఇంకా పశువులు పెంచితే తప్ప లోన్ ఇవ్వటం కుదరదు" చెప్పడతను...
..
"మంచి దున్నలని కూడా తెచ్చానండి, అవి తినటం తాగటం తప్ప మరేమీ పట్టించుకోవటం లేదు. ఉన్న గేదెలు ఎలా చూడు కట్టాలో అర్ధం అవటం లేదు. "..
..
" మన బాంకు కి సర్వీస్ చేసే వెటర్నరీ డాక్టర్ గారి నెంబరు ఇస్తాను ఆయన్ని పిలిపించండి . ఉపయోగం ఉంటుంది."
****
మరో ఆరునెలలు ఆగాక మళ్ళీ వచ్చాడాయన విజిట్ కి. చాలా మార్పులు వచ్చాయి డైరీ ఫామ్ లో. చాలా గేదలు చూడి కట్టి ఉండటాన్ని గమనించాడు ఆ అదికారి.
..
" డాక్టర్ గారు మంచి మందులే వాడి నట్లున్నారు ?"
..
"అవునండి.అవి వాడాక మా దున్న కంచె దాటి పక్క డైరీ ఫామ్ కి కూడా వెళ్తుంది. దాన్ని కంట్రోల్ చెయ్యటం కష్టం గా ఉంది." సుబ్బారావు నవ్వాడు...
...
" ఇంతకీ ఆయన దున్నలకి ఏమి మందు వాడాడు?" మరో డైరీ ఫామ్ రైతు కి చెప్పొచ్చని అడిగాడు శశిధర్.
..
..
..
..
..
"మందు పేరు తెలియడండి. వగరుగా ఉంది. చెట్టు బెరడు రసం లాగా ఉంది. గొంతు లోంచి మింగేటప్పుడు మాత్రం పిప్పరమెంటు రుచిగా అనిపించింది."
&*^%$#@

Sunday, 27 September 2015

మాధవి ఎవరు?

రెగ్యులర్ గా రావాల్సిన టైమ్ కి ఇంకా భర్త  ఇంటికి రాలేదు.
..
టైమ్ గడిచి పోయింది...
..
ఎన్నిసార్లు చేసినా ఫోన్ రింగ్ అవుతుంది గాని లిఫ్ట్ చేయటం లేదు ...
..
రాత్రి 9 అవుతుండగా అటునుండి పోను ..
...
"జానకీ .. ఆఫీసు నుండి వస్తుంటే బైక్ కి రోడ్డు మీద పరిగెడుతున్న దున్న ఒకటి తగిలింది.
నన్ను మాధవి హాస్పిటల్ కి చేర్చింది. ...
తల కి గట్టి గాయం అయింది. పదహారు కుట్లు పడ్డాయి.
పక్కటేముకలు మూడు విరిగాయి. కుడి కన్ను వాచింది. 
ఎడమ చేయి ఎముక బయటకి వచ్చింది.
కాలు మీద నుండి లారీ పోయింది. కాలు తీసేయాలని చెబుతున్నారు డాక్టర్లు.
 సోమాజి గూడా అపోలో లో ఉన్నాను . మూడో ఫ్లోర్ 306 రూము నెంబరు. " 
అత్యంత కష్టంగా చెప్పాడు అతను.
..
..
..
..
..
..
..
..
"మాధవి ఎవరు ?"
smile emoticon grin emoticon tongue emoticon tongue emoticon pacman emoticon pacman emoticon 

గ్రూప్ ఇన్సూరెన్స్


ఇన్సూరెన్స్ కంపెనీ లో ఒక సామాజికవర్గపు ఆదిపత్యం కొనసాగటం మొదలెట్టాక అనేక మార్పులు జరిగాయి. ఏజంట్ ల కమిషన్ తగ్గించడం. సోంబేరి పాలసీలు డిజైన్ చెయ్యటం, డైరెక్ట్ ఆన్లైన్ పాలసీలు అమ్మటం, క్లైమ్స్ త్వరగా సెటిల్ చెయ్యకపోవటం,  ప్రజాదరణ పొంది పాలసీలకు మంగళం పాడటం, చెత్త పాలసీలకి పెద్ద హోర్దింగ్స్ పెట్టడం మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
చివరాఖర ఫైనల్ గా ఉత్శాహంగా పనిచేసే  ఏజంట్లు తగ్గి పోయారు.
ఇన్సూరెన్స్ కంపనీ వాళ్ళే మేళా ఒకటి ఏర్పాటు చేశారు పాలసీలు అమ్ముకోటానికి.
చాలా కాలం పాటు దుబాయ్ కి దొంగ వర్క్ పర్మిట్స్ ఇప్పించి, పాపం పండాక న్నులు తిని ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న 'నాగ రాజు ' మేళాకి వచ్చాడు. .
"ఉద్యోగం కావాలీ, మీ పాలసీలు ఎన్నయినా, ఎప్పుడయినా, ఎవరికయినా అమ్మి పెడతాను " స్తిరంగా చెప్పాడు కంపెనీ పెద్ద తో.
"సరే ఈ రెండు పాలసీలు 80000, 50000 ప్రీమియం వి అమ్మి తీసుకురండి. ఉద్యోగం సంగతి చూద్దాం  "
చెప్పడతను.
లంచ్ అవర్ లోపే పాలసీలు అమ్మి అప్లికేషన్ లు డబ్బు కౌంటర్ మీద పడేశాడు నాగరాజు.
బిత్తరపోయిన కంపెనీవాళ్లు అతన్ని కూర్చోబెట్టి మర్యాదలు చేశాక చెప్పారు .కంపెనీలో అందుబాటులో  ఉన్న వివిద పాలసీల బ్రోచర్లు మరికొన్ని అప్ప్లికేషన్లు నాగరాజుకి ఇచ్చారు.
"మీరు ఇక మా ఉద్యోగి."
 "ఇందాక పాలసీలు అమ్మటం మీవళ్ళ కాదని వివరంగా చెప్పలేదు. మన కంపెనీ నిబందనల ప్రకారం 30000 పాలసీ దాటిన వారికి మెడికల్ టెస్ట్ చేయించాల్సి ఉంది. వారిద్దరి యూరిన్ శాంపిల్స్ కావాలి ."
సాయంత్రానికి నాగరాజు మళ్ళీ ఆఫీసుకి వచ్చాడు రెండు బరువైన బక్కెట్లు పట్టుకుని. వచ్చి రాగానే ఒక కారీ బాగ్ లో విడి విడిగా పేర్లు రాసి పెట్టిన చిన్న సాంపుల్ సీసాలు అక్కడ ఉంచి చెప్పాడు ఇది 80000 పాలసీ ఆయన యూరిన్ శాంపిల్, అది 50000 పాలసీదారుడి యూరిన్ శాంపిల్ "
మళ్ళీ ఆశ్చర్యపోవటం కంపెనీ పెద్ద వంతు అయింది.
**
నాగరాజు మోసుకొచ్చిన బక్కెట్లు వంక చూస్తూ అవేమిటి? అడిగాడాయన.

"వస్తూ ఉంటే.. సిటీ హాల్లో టీచర్ల సమావేశం జరుగుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మాను "

హృదయాన్ని తాకే కధ


ఒకానొక ఊరిలో బార్గవ ఒక పిల్లాడు ఉండేవాడు, 
చాలా మందం గా చదువులో అందరికంటే వెనుకబడి ఉండేవాడు.
అతను ఎప్పుడు ఆటలతో కాలం గడిపే వాడు. 
ఒక చొక్కా ఎండటానికి 10 నిమిషాలు పడితే, అయిదు చొక్కాలు ఎండ టానికి 50 నిమిషాలు పట్టుద్ది అని గంటా బజాయించి చెప్పేవాడు. 
చాలా సార్లు టీచర్లు డైరీ లో తల్లి తండ్రులని కలవమని రాసేవారు. 
వెళ్ళిన ప్రతిసారి అతను చదువులో ఫైల్ అవటం గురించి చెబుతుండేవారు. 
**
ముఖ్యంగా సునందా టీచర్. 
ఆమె కి అతడు ఏనాటికయినా గొప్ప వ్యక్తి అవుతాడని నమ్మకం. 
ప్రతి విధ్యార్డికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అది వాడికి రాలేదని చెబుతుండేది. 
కొన్నాల్టికి ఆమె బదిలీ అయ్యింది. దగ్గరలోని మరో చిన్న టౌన్ కి వెళ్లిపోయింది.
**
కాలం అనేక అనుభావాలని , మార్పులని తెస్తుంది. ఓడల్ని బండ్లు చేస్తుంది. బండ్లని ఓడలు చేస్తుంది.
**
కాల చక్రం కొంతకాలం నడిచాక. సునందా టీచర్ పదవి విరమణ చేసిన కొన్ని రోజులకి 
ఆమెకి సివియర్ కార్డియాక్ ప్రాబ్లెమ్ వచ్చింది. గంటల్లో పేస్ మేకర్ అమరిస్తే గాని ఆమె కోలుకునే పరిస్తితి లేదు. 
**
నగరం లో ఒకే ఒక సర్జన్ పేరు చెప్పారు అందరూ. 
అతనొక్కడే ఆమెని కాపాడగలడు. అతను మాత్రమే అందులో స్పెషలిస్టు. 
వెంటనే ఆమెని ఆ ఆసుపత్రికి తరలించారు. 
మూడున్నర గంటల పాటు తన అనుభవాన్ని అంతా పోగుచేసుకుని ఆ కుర్ర డాక్టర్ ఆమెకి అపరేషన్ నిర్వహించాడు. 
**
ఆరుగంటల తర్వాత సునందా టీచర్ కళ్ళు తెరిచింది. 
అప్పుడప్పుడే వదులుతున్న మత్తు కి ఆమె కళ్ళు ఇంకా అలవాటు పడలేదు. 
కళ్ళముందు ఒక అంధమయిన డాక్టర్ యువకుడు. అప్రోన్ వేసుకుని, 
మెడలో కి వేలాడేసిన మాస్క్, రింలెస్ కళ్ళద్దాలు, కోటేసిన ముక్కు , 
చురుకయిన కళ్ళు , సూదంటు రాయి లాటి నవ్వు ..
**
ఆమె అతడిని చూడగానే ‘ సునందా మేడమ్ ‘ అంటూ అతను పలకరించాడు. 
ఆమె అతడిని గుర్తు పట్టటానికి ప్రయత్నించింది. 
అప్పుడే అతను ఆమె మొహం లోకి ఆశ్చర్యంగా చూశాడు . 
ఆమె ముఖం బులుగు రంగు లోకి మార సాగింది. ఆమె అతనితో ఏదో చెప్ప టానికి ప్రయత్నించింది. గోడ వైపు చూపిస్తూ... పైకి లేచిన ఆమె చెయ్యి ..జారి పడిపోయింది. పల్స్ రేటు పడిపోసాగింది. అనుభవజ్ఞుడయిన  ఆ డాక్టర్ తిరిగి ఆమెని వెంటేలేటర్ నుండి పేస్ మేకర్ మీదకి క్షణాల్లో మార్చి తిరిగి ఆమె గుండె కొట్టుకునేటట్టు చేశాడు..
**
ఆమె .ముఖం బులుగు రంగులోకి మారటం  ఊహించని డాక్టర్ హతాశుడయ్యాడు. 
ఏమి జరిగిందో అతను అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూ సునందా టీచర్ చెయ్యి చూపించిన వైపు చూశాడు . అక్కడ క్లీనర్ గా పని చేస్తున్న ‘మన భార్గవ ‘ తన వాక్కుమ్ క్లీనర్ ని కనెక్ట్ చేసుకోటానికి వెంటిలేటర్ కి పవర్ సప్లయ్ చేసే ప్లగ్ లాగి తన ప్లగ్ గుచ్చుతూ కనిపించాడు.
**
ఆవిదంగా కధ ముగిసింది. స్వస్తి .. స్వస్తి ... స్వస్తి.

Friday, 25 September 2015

ము ప్పై .. ఎ ని మీ దే

ఆమె ఐ‌సి‌యూ లో ఉంది.
అతను కారిడార్లో..
హాస్పిటల్ బిల్లు లు పూర్తిగా కట్టాక ,
ఇక అతనివద్ద డబ్బులేమీ లేవని నిర్ధారించుకున్నాక 
ఆతడికి లోపలకి పిలుపు వచ్చింది..
" మేం చెయ్యగలిగినదంతా చేశాం. వైద్యానికి ఆమె శరీరం సహకరించడం లేదు. ఇంకా వెంటిలేటర్ మీద ఉంచడం అనవసరం. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ........" డాక్టర్లు.
అతను మోకాళ్ళ మీద కూలి పోయాడు.
చేతుల్లో మొఖం దాచుకుని మగాడినని కూడా మరిచి పోయి ఏడవ సాగాడు.
"నిండా నలబై ఏళ్ళు లేవు అప్పుడే నన్ను అన్యాయం చేసి వెళ్ళి .."
అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు.
" ము ప్పై .. ఎ ని మీ దే " ఆమె శరీరం స్పందించింది.
smile emoticon grin emoticon tongue emoticon pacman emoticon pacman emoticon 

ఇల్లాలి సందేహం

టీ టైమ్ ఇల్లాలి సందేహం.. శ్రీవారి వివరణ :
"ఏవండీ, సీతారాముల లో రాముల వారికి ధనస్సు ఉంది, 
శివ పార్వతులలో శివుని వద్ద త్రిశూలం ఉంది, 
విష్ణువు లక్ష్మి లలో విష్ణువు వద్ద చక్రం ఉంది."
..
"అయినచో నీ సందేహమేమి?"..
..
"మరి రాధా కృష్ణులలో కృష్ణుని వద్ద పిల్లన గ్రోవి ఉంది ఎందుకని?"..
..
" బాలా దీనికి సమాదానము చాగంటి వారి వద్ద కూడా లేదు. ..
కృష్ణుడు గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాడు ఆయనకు అయధములతో పనిలేదు. ..
మిగిలిన వారు బార్యలతో ఉన్నారు. 
సెల్ఫ్ డిఫెన్స్ కోసం వారి వారి జాగార్థ లో ఉండుట అనాదిగా 
వచ్చు చున్నది .. tongue emoticon "
..
"కప్పు లాక్కుంటా వెందే? నేనింకా టీ తాంగందే?"
frown emoticon frown emoticon frown emoticon 
నీతి :నోటి దూల ..కొన్ని విషయములు తె:లిసినను ఆడవారికి చెప్పరాదు frown emoticon

స్వేచ్చ అనగా

.పొద్దుటే వాకింగ్ వెళ్ళి వచ్చి వరండాలో కూర్చుని పేపర్ తిరగేస్తూ కాఫీ కోసం చూస్తున్న ఇంటాయనతో,వారం రోజులుగా రంగనాయకమ్మ నవల చదువుతున్న ఇంటావిడ అంది.
"స్వేచ్చ అంటే ఇంగ్లీష్ లో ఎలా రాయాలి?" అని 
"U N M A R R I E D " చెప్పాడు ఈయన.
కొన్ని నిజాలు ఆగవు. పైగా శుక్రవారం పొద్దుగాలే అబద్దాలు చెప్పలేక పోయాడు ఇంటాయన.

మంచాలు అమ్మేసింది.

ఒక అనుమానపు మొగుడు ని మానసిక వైధ్యుడి వద్దకు తీసుకొచ్చారు.
ఆయన ..ఎంతకీ నిజం చెప్పక పోవటం తో హిప్నటైజ్ చేసి అసలు రహస్యం రాబట్టారు. 
..
అతనికి ఎప్పుడు తమ మంచం కింద ఎవరో కాచుకుని ఉన్నట్టు అనిపిస్తుందిట . దిగి మంచం కింద వెతుకుతుంటాడు. 
అప్పుడు మంచం మీద ఎవరో పడుకుని ఉన్నట్టు ఉంటుందిట. 
తెల్లార్లు అలా కిందికి పైకి మారుతూ ఆమెకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఆమెని పల్లెత్తు మాట ఆనడు గాని తెల్లవార్లు ఈ దొబూచులాటలు ఆడుతూనే ఉంటాడు.
....
ఆతగాడిని బార్య, తమ్ముడి సాయం తీసుకుని వైద్యం కోసం తీసుకొచ్చింది.
" ఇదేమంత సమస్యేమి కాదు, ఆరు నెలల్లో మాన్పించేస్తాను. వారానికి రెండు సిట్టింగులు వేస్తే చాలు.
సిట్టింగ్ కి వెయ్యి ఫీజు తీసుకుంటాను"
డాక్టర్ గారు నమ్మకంగా చెప్పారు.
..
"అలాగే నండి; ఈ వారం నుండే ట్రీట్మెంట్ తీసుకుంటాం "
మళ్ళీ కనబడలేదు ఆ దంపతులు డాక్టరు గారికి .
******
మరో నాలుగు నెలల తర్వాత రైల్వే స్టేషన్ లో కనిపించిన అతన్ని పలకరించాడు డాక్టర్. " ట్రీట్మెంట్ కి రానే లేదు . యేలా ఉంది ఇప్పుడు?"
..
"బ్రమ్మాండమ్ .. మా ఆవిడ ఇంట్లో మంచాలన్నీ అమ్మేసింది. చాప మీద పడుకుంటున్నాం . బాగా నిద్ర పడుతుంది."
ఫ్లాట్ ఫారం మీద ఆగిన రైలు ఎక్కడానికి వెళ్తూ చెప్పాడు .
smile emoticon grin emoticon tongue emoticon tongue emoticon 

గురక

బాగా అలసిపోయి, మరో ఊరిలో ఇంకా పని మిగిలి పోయిన వెంకట్రావు ఒక సాదారణ డార్మెట్రీ కి వెళ్ళాడు. అప్పటికే బాగా లేట్ నైట్ అయ్యింది. 
"ఒక సింగల్ రూము కావాలి"
"లేవండి .. ఖలీలేవు .."
"మడత మంచమయినా చాలు . బాగా అల్సి పోయాను . రెస్ట్ తీసుకోవాలి"
"ఖాళీ లు లేవండి . "
కామన్ రూములో కి తొంగి చూశాడు వెంకట్రావు .
రూములో ఒక వైపు గోడవారగా నిద్ర పోతున్న ఒక అతను అతని పక్కన ఖాళీ మంచం కనిపించాయి.
"అక్కడ ఖాళీ ఉందిగా ?"
" ఆదా .. ఆయన పెద్దగా గురక పెడతాడు. పక్కోడు జడుసుకునెట్టు . మా రెగ్యులర్ కస్టమర్. రెండు మంచాలకి చార్జ్ పే చేస్తాడు."
" అదివ్వండి చాలు . ఒక్క రాత్రికి అడ్జెస్ట్ అవుతాను ?"
"మీరు నిద్ర పోలేరు . అయినా మీ ఇష్టం." రిజిస్టర్ లో రాసుకుని ఒక లాకర్ ఇచ్చాడు వెంకట్రావుకి "బాత్ రూము అటువైపు ఉంది. ఈ నడవాలోంచి వెళ్ళండి."
*****
తెల్లరింది. ఫ్లాస్క్ తో టీ అమ్ముకునే కుర్రాడు వచ్చి లేపెంత వరకు వెంకట్రావ్ నిద్ర పోతూనే ఉన్నాడు.
" రాత్రి నిద్ర పట్టిందా?" కౌంటర్ లో మనిషి అడిగాడు.
"ఆహా.. భ్రమ్మాండంగా "..
"అతని గురక భయంకరంగా ఉంటుందే ?"
" ఏమో తెలీదు. స్నానం చేసి వచ్చి అతడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని 'యు ఆర్ సో సెక్సీ ' అని చెప్పి పడుకున్నాను. రాత్రంతా అతను మంచం మీది బాశం పట్టు వేసుకుని కూర్చున్నట్టుంది." వెంకట్రావు నవ్వాడు.

ఐ కెన్ ఎక్స్ ప్లైన్

'ఐ కెన్ ఎక్స్ ప్లైన్ ' ఆమె స్తిరంగా చెప్పింది. ఆగంతకుడు 
జారుకున్నాక .. బర్త తో ..
..
"వాట్ ది హెల్ యు కెన్ ఎక్స్ ప్లైన్?" కేకేట్టాడు అతను...
..
'లిజన్ డియర్ . లెట్ మీ టాక్ "..
..
అతను వినటానికి సిద్దపడ్డాడు ఆమెని చెప్పమన్నట్టు గా చూశాడు.
..
"ఈ సాయంత్రం ఆ కుర్రాడు వచ్చాడు. బాగా ఆకలిగా ఉంది. ఏమయినా వంట మిగిలితే పెట్టమన్నాడు. నువ్వు ఉదయం డైనింగ్ టేబుల్ వద్ద చండాలంగా ఉంది అని వదిలేసిన ఉప్మా పెట్టాను.ఆవురావురు మంటూ తిన్నాడు ."....
..
'ఏమయినా మిగిలిన బట్టలు ఉంటే ఇవ్వమన్నాడు. నేను ని బర్త్ డే కి కొనిచ్చిన బుష్ కోటు రంగు నచ్చలేదని వాడటం లేదు కదా అదిచ్చాను . సరిగ్గా సరిపోయింది అతనికి సంతోషించాడు ."..
..
" చెప్పులు వాడనివి ఏమయినా ఉంటే ఇవ్వమని అడిగాడు; మన పిల్లలు కిడ్డి బాంక్ లో దాచుకున్న డబ్బు తో 'ఫాదర్స్ డే' నాడు నీకు కొనిచ్చిన కాన్వాస్ షూ నీకు నచ్చలేదు కదా ఆవిచ్చాను . చాలా సంతోషించాడు "
**
ఇందాకే నువ్వోచ్చే అరగంట క్రితమే "ఇంకా అయ్యగారు వాడనివి ఇంకా ఏమయినా ఉంటే ఇవ్వమన్నాడు " frown emoticon frown emoticon frown emoticon 

Wednesday, 23 September 2015

కార్బన్/శాండ్ పేపర్ !!?

బెజవాడ అబ్బాయిని కొత్తగా పనిలోకి పెట్టుకున్నారు ఒక పెద్ద చైన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ స్తోర్స్ లో ..
..
మొదటి రోజు స్తోర్స్ లోగో ఉన్న టీ షర్ట్ వేసుకుని హడావిడిగా అయిన దానికి కానీ దానికి బొంగరంలాగా తిరిగేశాడు. మేనేజర్ దృష్టి లో పడ్డాడు....
..
కనబడ్డ కస్టమర్స్ అందరికీ సలహాలు ఇచ్చేశాడు.
అదే క్రమం లో ఒకావిడ ' ఫైనాఫిల్ జామ్' కోసం వెతుకుతుంటే " ఔట్ ఆఫ్ స్టాక్ మాడమ్ " అని చెప్పడం మానేజరు విన్నాడు...
..
"కస్టమర్ల కి ఏది లేదని చెప్పకూడదు.ఇది చూడండి మాడమ్ , మేంగో ..జామ్..ఫ్రెష్ స్టాక్ మాడమ్ , ఆఫర్ కూడా ఉంది, ఇది చూడండి మాం స్ట్రాబెర్రీ జామ్ బాగా రుచిగా ఉంటుంది మాడామ్ కెలోరీస్ కూడా తక్కువ " అంటూ మరో ప్రాడక్ట్ వైపు వారిని మళ్లించాలి . అంతే గాని కస్టమర్ ని పోగొట్టు కోగూడదు.హితబోద చేశాడు.
..
బెజవాడ పిల్లాడు అల్లుకు పోయాడు. 
సాయంత్రం దాకా ఇరగదీశాడు...
..
పాపం స్టోర్ క్లోజ్ చేసే ముందే లావు పాటి మహిళా ఒకావిడ చంప పగలగొట్టి విస విసా వెళ్ళి పోయింది...
..
పిల్లాడు మానేజర్ వద్దకు చేరాడు. 
"ఏమయింది?"
.
"మీరు చెప్పినట్టే చేశాను. గూబ గుయ్యి మనిపించింది.".
.
" ఆమె ఏమి అడిగింది ? ..నువ్వేమి చెప్పావు ?.
.
" టాయిలెట్ పేపర్ అడిగారావిడ, స్టాక్ లేదు, కార్బన్ పేపర్ /శాండ్ పేపర్ .
ఉన్నాయని చెప్పి వాటివల్ల ఉపయోగాలు కూడా వివరంగా చెప్పేలోపు ....*&%$# " బావురు మన్నాడు బెజవాడ పిల్లోడు. pacman emoticon pacman emoticon tongue emoticon 

Monday, 21 September 2015

54 వ బస్సు

హాపీ అరవింద్ ఓసారి బాంకాక్ వెళ్ళాడు.
ఒంటరిగా కాసినోకి వెళ్లాలని అనుకుని, 
తను బస చేసిన హోటల్ నుండి కొద్ది దూరం లో ఉన్న బస్ స్టాప్ కి నడిచి వెళ్ళి నుంచున్నాడు.
..
చాలా సేపు మొహమాటం తర్వాత, ..
దేశం కానీ దేశం లో ఎవడేమీ అనుకుంటే ఏమి అనే ఫీలింగ్ కి వచ్చి
అటుగా వెళ్తున్న ఫ్యామిలి పాక్ ని ఆపి " సీ ఐ న్యూ బాంకాక్, 
హొ గో పింగ్ పాంగ్ మసాజ్?" అని అడిగాడు ఆంగ్లం లో స్టైల్ గా.
....
"కష్టపడకు! నాకు తెలుగు తెలుసు ..54 వ  బస్సు ఎక్కండి " 
..
అరవింద్ డిర్రు ..డిక్కిమ్.. చిమ్ము.. చికిమ్ , గిలి.. గిలి.. హే అనుకుంటూ ' థాంక్స్' అంటూ సిగ్గు పడ్డాడు.
****
మరో గంట తర్వాత అదే ఫ్యామిలి ఫాక్ మనిషి అటు వైపు వెళ్తూ అరవిందు ని చూశాడు. ..
"చిర్రు.. బుర్రుమ్.. లబ.. జబమ్" అనుకుంటూ మనాడు ఆ బస్ స్టాండ్ లోనే కాసుకుని ఉన్నాడు.....
..
" ఏం ఇంకా ఇక్కడే ఉన్నారు?" అడిగాడు అతను.
" ఊ దగ్గర్లోనే ఉన్నాను. ఇప్పటికీ 52 బస్సులు వెళ్లిపోయాయి " చెప్పాడు అరవిందు అర్ధం కానీ బీటు ఒకటి హామ్ చేస్తూ ..*&^%$#

Sunday, 20 September 2015

ఫస్ట్ ఎయిడ్

శివ రాచర్ల ఆమె ప్రొఫైల్ కి గొప్పగా ఇంప్రెస్ అయ్యాడు.
గొప్ప మానవతా వాది ఆమె. తన పోస్ట్ లు చాలా హ్యూమానిటీ తో ఉంటాయి.
అనుకోకుండా ఆమె తను పని చేసే ఆఫీసు వద్దకి వచ్చింది. 
" అనుకున్న దానికన్నా అరగంట లేటు అయినట్లుంది. " శివ పలకరించాడు.
"త్రోవలో ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఎవరో పిల్లాడు బైక్ మీద నుండి పడిపోయాడు, తలకి బాగా గాయం అయ్యింది. రక్తం కారుతుంది. కాలు ఫాక్చర్ అయింది. థాంక్ గాడ్ నాకు కొంత ఫస్ట్ ఎయిడ్ తెలియటం మంచిదయింది " 
శివ కి ఆమె మీద గౌరవం సమ్మర్ లో రాయలసీమ లో టెంపరేచర్ లాగా అయింది.
" మీరేమీ చేశారు ?" ఆసక్తిగా అడిగాడు.
" నా ఎడంచేయి బొటన వేలు గట్టిగా వత్తిపట్టుకున్నాను. వాంతి అవకుండా"
ఆమె జుట్టు సరిచేసుకుంటూ చెప్పింది.
శివకి బల్బులు పగిలాయి. grin emoticon tongue emoticon


బిజినెస్

ఆదివారం ఒక పెద్ద చర్చ్ ముందు గోడ వారగా ఇద్దరు బిక్షాటన చేస్తూ కూర్చుని ఉన్నారు. 
ఒకరి ముందు శిలువ వేసిన క్రాస్ నిలబెట్టి ఉంది. అతను తలమీది ముళ్ళ కిరీటం పెట్టుకుని ఉన్నాడు. ఉండలు చుట్టిన జుట్టు విరబోసుకుని ఉన్నాడు. దీనంగా శూన్యంలోకి చూస్తున్నాడు. 
మరొకరి ముందు కాళీమాత పటం పెట్టి ఉంది. అతడి నుదుటున తిలకం బొట్టు ఉంది. పద్మాసనం వేసుకుని ద్యానం లో కూర్చున్నాడు.
****
సహజం గానే అంధరు శిలువధారికి దానం చేయటం మొదలెట్టారు.
దానం చేసే అలవాటు లేని వారు కూడా జీసెస్ ని ఒప్పించే ప్రయత్నం లో అతనికి ఎక్కువ దానం చేయటం మొదలెట్టారు.
*****
సాయంత్రం నాలుగయ్యింది.
చర్చ్ ఫాదర్ తన విధులని ముగించుకుని వెళ్తూ వీరి దగ్గరికి వచ్చి. ఖాళీ గిన్నెతో ఉన్న అతని వద్ద నిలబడి " ఏసుని నమ్మిన వారికి మాత్రమే ఫలితముందునని గ్రహించిటివి గదా బిడ్డా?" అడిగాడు తన పొడవాటి గౌను సర్దుకుంటూ .
" భయ్యా దేఖ్నా , ఏ హమే బిజినెస్ శిఖా రహా హై " అన్నాడు ఈ మార్వాడి శిలువ పట్టుకు కూర్చున్న తమ్ముడితో .

Saturday, 19 September 2015

మనసు అదుపు తప్పుతుంది

ఎందుకో తెలీదు గాని 30 ఏళ్ల క్రితం నాతో కలసి ఒంగోలు 'గవర్నమెంట్ పాలిటెక్నిక్" మొదటి బ్యాచ్ (1982-86) లో చదువుకున్న ఒక పొడవాటి ఎర్రటి,ఉన్నింటి పిల్లాడు మోహన్ (కృష్ణా జిల్లా అని గుర్తు) అనుకుంటా గుర్తొచ్చాడు. 
రామనగర్ లో ఉంటుండేవాడు. కొత్త రాలి సైకిల్ వాడేవాడు (అప్పట్లో అది నా లైఫ్ టైమ్ అంభీషన్) రక రకాల డ్రస్ లు ఉండేవి. హంగర్ కి తగిలించి పూట కొకటి మార్చేవాడు. మగాళ్లు పర్ఫ్యూమ్ లు వాడతారని , విధ్యార్డులకి ఒక జత మించి చెప్పులుంటాయని, చేతి వాచీ లు రెండు మూడు రకాలు మాచింగ్ వి వాడొచ్చని, జుట్టు దువ్వు కోవటానికి గుండ్రటి దువ్వెనలు కూడా ఉంటాయని అతడిని చూసాకే తెలిసింది.
అలాంటి పిల్లాడి కి స్వాతి వారపత్రికలో ' దాంపత్య దీపం' అని సమరం డాక్టర్ గారి ప్రశ్నలు సమాదానాలు చదివి వాటిని బద్రంగా దాచుకునే అలవాటు ఉండేది. అప్పట్లో ఒక తమాషా జరిగింది.
" నా పేరు నిర్మల, కొత్తగా వివాహమయింది. నాకు మా వారు నచ్చలేదు. ఆయన నల్లగా ఉంటారు. కట్నం తక్కువని ఇష్టం లేని పెళ్లి చేశారు. నాకు మావారి ని తప్ప ఎర్రగా ఉన్న కుర్రాళ్ళని చూస్తే మనసు అదుపు తప్పుతుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోతున్నాను . ---- ఒక సోదరి, రామ్ నగర్, ఒంగోలు " అని ఒక ప్రశ్న.. దానికి డాక్టర్ గారి సమాదానం ప్రచురించారు ఒక వారం.
అంతే ........
అప్పటినుండి, ఆ కుర్రాడు నిద్రలేవటం,
రాలి సైకిల్ తుడుచు కోవటం, నీళ్లొసు కోవటం,
ఆవేవో క్రీములు రాసుకోవటం ,
పోలోమని రాంనగర్ అన్నీ వీదులు తీరగటం , ఎప్పుడన్నా కాలేజీ కి రావటం జరుగుతుండేది .
పాపం సైకిలు టైర్లు మార్చాడు,
సైకిల్ మీద తిరిగి రంగు తగ్గాడు గాని ఆ నిర్మలని మాత్రం కని పెట్టలేక పోయాడు.
ఎందుకో ఆ కుర్రాడు ఉదయాన్నే గుర్తొచాడు.
అరే నాయనా మోహన్ .. ఇంకా ఏమి దాస్తాం గాని, నేనే ఆ నిర్మల !!

Friday, 18 September 2015

పెనాల్టీ చలానా

కవిత కొత్తగా కారు నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంది.
ఎటూ శ్యాం కారు వాడటంలేదు కదా అని తను డ్రైవింగ్ చేసుకుంటూ హైదరాబాదు సెంట్రల్ ముందు నుండి టర్నింగ్ తీసుకుంటుంటే ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్త తాన ఫోటో ని ఫ్లాష్ చేయటం గమనించింది. 
వెంటనే స్పీడో మీటర్ చూసింది. 
తన కారు వేగం పరిమితిలో నే ఉన్నా ఫోటో క్లిక్ చెయ్యటం ఆమెని ఆశ్చర్యపరిచింది. 
చౌరస్తా నుండి యు టర్న్ తీసుకుని మరోసారి అదే పాయింట్ వద్ద మరింత చిన్నగా కారు నడిపి చూసింది. 
మళ్ళీ ఫ్లాష్ వెలిగింది.
తాను మొండిగా మూడో సారి రౌండ్ తీసుకుని లోడ్ గేర్ లో 10 కి. మీ ల వేగం లోపు మెల్లిగా వచ్చింది.
మూడో సారి ఫ్లాష్ వెలిగింది.
***
ఇంటికొచ్చి శ్యామ్ కి చెప్పింది.
" సెంట్రల్ వద్ద ట్రాఫిక్ వ్యవస్థ లో ఏదో లోపం ఉంది స్పీడ్ లిమిట్ దాటకుండానే పెనాల్టీ ఫ్లాష్ చేస్తుంది."
***
మూడో రోజు ఆఫీసు నుండి కవిత కి ఫోన్ చేశాడు శ్యాం
" తిక్క మొహం దానా సీటు బెల్టు పెట్టుకోలేదని మూడు పెనాల్టీ చలానాలు వచ్చాయి నా ఆఫీసు అడ్రెస్ కి " :) :v :v

Thursday, 17 September 2015

సీయింగ్ ఐ డాగ్ !

ఇద్దరు పేట్ లవర్స్ అయిన లవర్స్ స్సాయంకాలం వాహ్యాళికి వారి పెంపుడు కుక్కలతో వెళ్లారు..
విషయం ఆషామాషాది ఏమి కాదు. ఇద్దరి మధ్యా చర్చ సీరియస్ గా జరిగింది.
ఈ సారి కూడా ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు అలానే ఉంచుతారా? ఇంకా పెంచుతారా? 
వాదోపవాదాలు ఒక కొలిక్కి రాలేదు గాని ఇద్దరు నడుచుకుంటూ ఒక హోటల్ కి వెళ్లారు." ఏమైనా తిందామా?"
వెంటనే ఏకాభిప్రాయానికి వచ్చి ' సరే ' అనుకున్నారు.
"pets not allowed అని ఉంది" సందేహించింది ఆమె.
నన్ను ఫాలో అయిపో అతను బారోసా ఇచ్చాడు ...
అతను హోటల్ గేటు వద్దకి వెళ్తూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని వెళ్ళాడు. దాబర్ మెన్ ని కట్టిన గొలుసు పట్టుకుని.
" సారి సర్ pets not allowed "
" i cannot see. the Doberman Pinschar is my seeing-eye dog" గొంతులో బాద పలికిస్తూ చెప్పాడు అతను.
" సారి సర్ మీరు వెళ్ళండి "
మరో రెండు నిమిషాలకి ఆమె కూడా అలానే కళ్ళజోడు పెట్టుకుని తన పేట్ డాగ్ తో గేట్ వద్దకు వెళ్లింది.
" సారి మాం యువర్ ఎస్కిమో డాగ్ ఇస్ నైస్ అండ్ క్యూట్, బట్ సారి టు సే వి డూ నాట్ ఆలో పెట్స్ "
" i cann't see. this is my seeing-eye dog, btw cann't you see idiot its not eskimo its 'coton de tulear. look at that long bright white hair. see the eys."
smile emoticon grin emoticon pacman emoticon pacman emoticon

Tuesday, 15 September 2015

పొలం ఖరీదు !!

తను చేస్తున్న వృత్తి నుండి రిటైర్ అయి, 
డల్లాస్ నుండి విజయవాడ వెళ్ళిపోయి చుట్టుపక్కల 
కొంత పొలం కొనుక్కుని , ఒక కోళ్ళ ఫారం పెట్టుకుని ప్రశాంతమయిన జీవితం గడపాలని 6'3" అతని కోర్కె.
..
ఎప్పటిలాగే జనవరి లో ఇండియా వచ్చి,
NRI కోటాలో తిరుమలేశుని దర్శనం చేసుకుని,
మిత్రులందని వాయు వేగంతో పలకరించి తీరిక చేసుకుని
పరిసర ప్రాంతాలలో పొలం రేట్లు విచారణ కి బయలు దేరాడతను.
..
పోరంకి నుండి మరో ఏడెనిమిది కి మీ వెళ్ళాక ,
అక్కడ స్తలాలు తక్కువ రేటు ఉండొచ్చని అబిప్రాయం తో
ఒక మద్యవర్థిని సంప్రదించాడు.
..
" ఎకరా రేటు 14 నుండి 15 దాకా ఉంటుంది" చెప్పడతాను
..
" లక్షలేగా? కాన్ఫిర్మ్ చేసుకోటానికి ప్రశ్నించాడు ఇతను.
..
వెర్రి చూపు ఒకటి విసిరి
" లక్షలా ఎప్పటి మాట .. కోట్లు " మధ్యవర్తి జాలిగా చూశాడా కటౌట్ ని.
..
బిత్తర పోయిన అతను " డల్లాస్ లో ఆ డబ్బుకి కారు లో ఒక చుట్టు తిరగటానికి ముడుగంటలు పట్టేంత పొలం కొనొచ్చు" ..
ఉక్రోషంగా అన్నాడు...
..
ఆతను జాలిగా చూస్తూ...
" నాకు అలాటి కారు ఉండేది . మొన్నే అమ్మేశాను పాత ఇనుము వాడికి "
tongue emoticon pacman emoticon pacman emoticon


Monday, 14 September 2015

అతడు ఆమె ఒక రైలు ప్రయాణం

హుద్ హుద్ తర్వాత ఇంకా నార్మల్ అవని విశాఖ రైల్వే స్టేషన్ లో ట్రైన్స్ బొగిల నెంబర్లు డిస్ప్లే బోర్డు ల మీద వెలగటం ఇంకా మొదలవలేదు.
రాత్రి 11-26 కి మూడో నెంబరు ఫ్లాట్ ఫార్మ్ మీదకి 17821 వచ్చినప్పుడు,
S1 కోచ్ ని వెతుకుతూ వెళుతుంటే ' ఆమె' తారస పడింది 'అతనికి'.
చూడగానే మళ్ళీ చూడాలనిపించే ప్రౌడ అందం. ఎత్తుగా నిండుగా తెల్లటి సిల్క్ క్లాత్ మీద వంగరంగు చుక్కల చీర. క్లిప్ తో బందించిన పొట్టి రింగుల జుట్టు, చంకలో హండు బాగు, ట్రాలి బాగ్ ని లాక్కుంటూ 'ఆమె' రెండో వైపు నుండి S1 ఎక్కింది. 53 బెర్తు లో అతను రెండు కూపేళ ఇవతల 62 లో ఆమె.
పగలంతా అలిసిన అతను నిద్ర లోంచి మేలుకునే సరికి ట్రైన్ ఆకివీడు దాటింది. లేచి ప్రకృతికి సమాదానం చెప్పి వాష్ బెషిన్ వద్ద పళ్ళు అరగ దీస్తుంటే విండో సీటు వద్ద కూర్చున్న ఆమెని గమనించాడు అతను. గబాలున ముగించి సోప్ తో ముఖం కడుక్కుని తడి చేత్తో జుట్టు ముందుకు లాక్కుని , ఆమె ముందుగా బోగీకి రెండో వైపు నడిచాడు. విజయవాడ చేరేలోపు గా ఆమె ఒక్కతే ప్రయాణిస్తుందని కనిపెట్టేశాడు.
7-40 కి విజయవాడ చేరేసరికి ట్రైన్ చాలా వరకు ఖాళీ అయ్యింది.
అతని ఉనికిని ఆమె గమనించింది. మగాళ్ల బండ చాష్టాలు మూడో మనిషికి వెంటనే పట్టిస్తాయి గాని ఆడవాళ్ళ అంగీకారం ఒక పట్టాన అర్ధమని చావదు. ఇది తర తరాల సమస్య frown emoticon
అతను ఆమెను అతి తక్కువ జనం మిగిలిన బోగీ లో దగ్గరగా గమనించడానికి కొంత మొరటు ప్రయత్నం చేశాడు . మామూలుగా అయితే ఆమె ముఖం చిట్లించడం ద్వారా అతడిని ఆమడ దూరం లో ఉంచొచ్చు కానీ అలాటి ప్రయత్నం ఏమి చేయలేదు. అతను తనని దాటుకుంటూ వెళ్ళేటప్పుడు కాళ్ళు తగలకుండా దగ్గరకి లాక్కుంది. తర్వాత తీరిగ్గా సీటు మీద బశాపట్లు వేసుకుని ఉన్న కొద్ది జుత్తుని హాండ్ బాగ్ లోంచి దువ్వెన తీసి దువ్వుకుని క్లిప్ మరో సారి పెట్టుకుంది. కూర్చుని మెడలో బంగారు గొలుసులని, చేతి గాజులని, పొట్టమీదికి చిరని సర్దుకుంది. అతగాడి తాపత్రయాన్ని గమనించి ఇక లాభం లేదని, అతను చదువుతున్నట్లు నటిస్తున్న పుస్తకాన్ని 'ఒక్క సారి చూసి ఇస్తాను ' అని అడిగి మరి తీసుకుంది. అది చాలు అతను అల్లుకు పోయాడు .తెనాలి వచ్చేసరికి ఇద్దరు ఒకే కుపెలో ఎదురెదురుగా ఎన్నో మాట్లాడు కోవటం, విజయవాడ లో కొన్న ఆరటి పళ్ళు ఆమెకి ఇవ్వటం ఆమె అందుకోవటం, అతను 'తన' గురించి మైక్రోస్కోప్ లోనూ ఆమె అతని గురించి విప్పరిన కళ్ల తోను మాట్లాడుకోవటం, సెల్ నెంబర్లు మార్చు కోవటం జరిగింది. ట్రైన్ లో వాష్ రూమ్ లో నీరు లేని పరిస్తితిని ఆమె ఉదహరిస్తే, అతడు మినరల్ వాటర్ బాటిల్ ఆఫర్ చేశాడు. "అవసరానికి ఎంత డబ్బైనా వాడుకోటానికే గదా ?" నవ్వాడతాను . కొద్దిసేపు మొహమాటం తర్వాత బాపట్ల దాటి చీరాల వైపు ట్రైన్ పరిగెత్తేటప్పుడు ఆమె ఆ బాటిల్ అందుకుని ఇప్పుడే వస్తాను అన్నట్లు గా అతని వైపు చూసి వాష్ రుము వైపు వెళ్లింది.
****
ఆమె బైటకి వచ్చి చూసే సరికి ట్రైన్ చీరాల వదిలింది. అతను లేడు. ఆమె లగేజీ లేదు. తనతో ఉంచుకున్న ఫోన్ నుండి కంగారుగా అతని నెంబరుకు రింగ్ చేసింది. కొద్ది సెకండ్లకే అటునుండి ఫోను లిఫ్ట్ అయిన శబ్దం. " హలో సువర్టు పురం SI స్పీకింగ్ " అటునుండి వినబడింది. ఈమె ఫోన్ కట్ చేసింది.
frown emoticon smile emoticon tongue emoticon 

Sunday, 13 September 2015

ఫ్లైట్ S-369

విశాఖ ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూము నుండి  ఒక చిన్న టు మెన్ ట్విన్ ఇంజన్ ఫ్లైట్ S-369  నుండి కమ్యూనికేషన్ మిస్ అయ్యింది. మరో రెండు నిమిషాల్లో లాండ్ లైన్ కి ఒక ఫోన్ వచ్చింది.
లిఫ్ట్ చేయగానే అటునుండి “ కాపాడండి .. కాపాడండి “
మే ఐ నో హు యు ఆర్ ?”
“ అరె ని యమ్మ ఇక్కడ సచ్చేట్టు ఉంటే మే ఐ నో ఏంది రా బాడ్కోవ్?”
మళ్ళీ అదే డవులాగు మే ఐ నో హు యు ఆర్ ?”
“నేను S-369  ఫ్లైట్ లో పైలెట్ తో పాటు వచ్చిన వాడిని . పైలెట్ కి సివియర్ హార్ట్ ఎటాక్ వచ్చింది. అతడి జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఎమర్జెన్సీ 4 నొక్కమని చెప్పి అతను గుండె పట్టుకుని నొప్పితో విల విల లాడుతున్నాడు. మమ్మల్ని కాపాడండి.కాపాడండి  “
ఎయిర్ పోర్ట్ స్టాఫ్ వెంటనే కాల్ ని  స్పీకర్ ఫోన్ కి మార్చాడు.
ఏమి భయపడోద్దు. దైర్యంగా ఉండండి. మీకు డాల్ఫిన్ నోసే లైట్ కనబడుతుందా?”
“అయ్యా మేము 18000 మీటర్ల ఎత్తులో ఉన్నాం. గంటకి 180 మైళ్ళ వేగంతో ఉన్నాం; తల్లకిందులుగా మా ఫ్లైట్ పోతూ ఉంది.”
“ ప్రశాంతంగా ఉండండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను . సమాదానం చెప్పండి.”
“మీరు 18000 మీటర్ల ఎత్తులో ఉన్నారని మీకెలా తెలుసు?”
“ఎదురుగా ఉన్న ఆకుపచ్చ  మీటరు లో కనబడుతుంది.”
“180 మైళ్ళ వేగం తో అని ఎలా తెలుసు ?”
“ స్పీడో మీటరు రీడింగు చూపిస్తుంది”
“తల్లకిందులుగా ప్రయాణిస్తున్నట్లు ఎలా తెలిసింది?”

“ ఓరి ని యమ్మ ఫాంటు లోంచి ఉచ్చ చొక్కాలోకి వస్తున్నాయిరా !!”

డంబెల్ విత్ గొడుగు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉన్న రైల్వే రెస్ట్ హౌస్ కేర్ టేకర్(వాచ్ మెన్) ఉదయాన్నే వచ్చిన క్లీనింగ్ చేసే ఆవిడతో చెప్పాడు తాళం చేతులు ఇస్తూ.. “రాత్రి 12 వ రూము లో రెండురోజుల నుండి ఉన్న బాబుగారు ఖాళీ చేశారు. ముందు ఆ రూము శుభ్రం చెయ్యి “
ఆవిడ రుము తుడిచే సామాను, పినాయిలు సీసాతో మొదటి అంతస్తులో ఉన్న 12 వ నెంబరు రుము కి వెళ్లింది. రెండు బెడ్ రూములు, చిన్న కిచెన్ , పెద్ద బాత్ రుము ఉన్న ట్రాంసిట్ రెస్ట్ హౌస్(బదిలీ పై వచ్చిన ఉద్యోగులు తాత్కాలికంగా కొంత కాలం ఉండటానికి సరిపడే క్వార్టర్) అది. ఆమె రెండు రూములు శుబ్రం గా ఊడ్చి తడి బట్ట పెట్టేటప్పుడు అక్కడ ఉన్న టేబుల్ మీద ఉన్న ఘనపు అడుగు అట్ట పెట్టేని గమనించింది. 
ఖాళీ పెట్టె అనుకుని కదిపే ప్రయత్నం చేసింది. కానీ బరువుగా ఉండటం అన్నీ మూలలా పార్సిల్ టేప్ అంటించి ఉండటం తో ఆ ప్రయత్నం మానుకుంది. ఆవిడకి తెలుసు అలాటి గుర్తు తెలియని వస్తువులను తెరిచే ప్రయత్నం చేయకూడదని. వెంటనే కిందకి వెళ్ళి కేర్ టేకర్ అయిన ముసలాయన కి చెప్పింది. ఆయన అప్పుడే స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాడు . హడావిడిగా బట్టలు వేసుకుని ఇద్దరు రుము లోకి వచ్చారు . వెంటనే డి ఆర్ ఏం కి ఫోన్ చేశాడు.
‘ బాబుగారు , ఒక బాబు గారు తమ పాపతో రెండు రోజుల నుండి మన 12 నెంబరు రెస్ట్ హౌస్ లో ఉన్నారండి రాత్రి 11 కి ఖాళీ చేసి, బండి(train) కి వెళ్ళి పోయారండి. పొద్దుటే చూస్తే ఒక సీలు చేసిన అట్టపెట్టే ఉండండి. అది బరువుగా ఉందండి. మేమేమి ముట్టుకోలేదండీ . తమరికి చెబుతున్నానండీ “
జాగింగ్ చేస్తూ ఇయర్ ఫోన్ లో వింటున్న డి‌ఆర్‌ఎం గారు ఒక్క నిమిషం లో అలెర్ట్ అయ్యారు.
“పెట్టె ఎంత సైజుది ?”
“ఎటుచూసినా ఒక అడుగు ఉంటాదండీ. దాని మీద రెండు మూడు ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయండి. రంగు పెన్ను తో రాసి ఉన్నవి “
“చదువు ?” ఫోన్ లోనే అడిగాడాయన.
“ ఆర్ డి ఎక్స్ “ ఒక్కో అక్షరం కూడబలుక్కుని చదివాడాయన.
(బాంబుల తయారీ లో వాడే పేలుడు పదార్ధం)
అటునుండి వెంటనే అలెర్ట్ అయ్యాడు డి‌ఆర్‌ఎం గారు. నేను వస్తున్నాను ఏమి ముట్టు కోకండి రూము తలుపు వేసి బయటే ఉండండి ఎవరిని లోపలికి పోనివ్వద్దు “
సరిగ్గా 20 నిమిషాలలో రైల్వే పోలీస్ అదికారి తో కలిసి అక్కడికి వచ్చాడాయన.
ట్రైన్ అయిన కుక్కజూలీ ని కూడా వెంట తీసుకొచ్చారు . అందరినీ దూరంగా ఉండమని తమ ట్రైనేడ్ జూలీ ని లోపలికి పంపారు. ఈ లోగా రుము లో గత రెండు రోజులుగా బస చేసిన వ్యక్తి వివరాలు ఫోన్ నెంబరు తెప్పించాడు డియారెమ్ . ఆనెంబరు కి ఫోన్ చేస్తే ‘అందుబాటులో లేడని’ వినిపిస్తూ ఉంది. 
రెండు మూడు సార్లు జూలీ జాలిగా తోక ఊపుకుంటు వచ్చాక ప్రమాదమేదీ లేదని నిర్ధారించుకుని ఆ పెట్టెను ఓపెన్ చేయించాడు పోలీస్ అదికారి.
వ్యాయామం చేసుకునే ఒక డంబుల్, ఫోల్డింగ్ సౌకర్యం ఉన్న లేడీస్ గొడుగు ఉన్నాయందుల. ఒక చిన్న చీటి మీద “వీటిని నా వంతు గిఫ్ట్ గా ఇక్కడే ఉంచండి. బస చేయబోయే తరవాత వారికి ఉపయోగ పడతాయి” అని వ్రాసి ఉంది. 
అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. 


హటాత్తుగా వచ్చే వర్షాలకు, బయటకు వెళ్ళటానికి పనికి వస్తుందని గొడుగు , ఉదయాన్నే వార్మ్ అప్ వ్యాయామం కోసం డంబెల్ కొని బహుకరించి నట్లున్నాడు ‘ అదికారులు ఇద్దరు సమాదాన పరుచు కున్నారు. ఈ లోగా వాచ్ మెన్ వెళ్ళి ఫ్లాస్క్ లో టి తీసుకు వచ్చాడు .
వరండాలో రెండు కుర్చీలలో కూర్చుని వారిద్దరు టి సిప్ చేయసాగారు. కుడివైపు రైల్వే స్టేషన్ , ఆకాశం లో చాలా దగ్గరగా వెళ్తున్న విమానాలు, తుంపర వర్షం .. అద్బుతమయిన వాతా వరణం. 
ఇంతలో డియరెమ్ గారి ఫోన్ మోగింది . ఇందాక ఆయన ప్రయత్నించిన నెంబరు నుండి.
“ నమస్తే .. ఈ నెంబరుకు ఫోన్ చేశారండి? ఇప్పుడే సిగ్నల్ వచ్చింది మిస్డ్ కాల్ చూశాను ”
“నేను వైజాక్ రైల్వే డియరెమ్ ని మాట్లాడు తున్నాను. యు లెఫ్ట్ ఆ డంబుల్ అండ్ ఆన్ అంబరిల్లా ఇన్ ఆ క్లోజ్డ్ బాక్స్ .. “
ఆయన మాట పూర్తి కాకుండానే అటునుండి సమాదానం వచ్చింది. “డంబుల్ ని గడియ లేని బాత్ రుము డోరు కి అడ్డంగా ఉంచుకోటానికి , గొడుగుని పై బాత్రూము నుండి సరిగ్గా క్లోసెట్ మీద కూర్చున్నప్పుడు కారే నీటి నుండి కాపాడు కోటానికి అవసరమని పించి కొని ఉంచాను. స్వీకరించండి. “ 


www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...