Monday 18 May 2015

లాస్ట్ చాయస్

ఆరు నెలల కాలంగా పెండింగ్ లో ఉన్న ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్
సివిల్ బిల్లు ఈ ఉదయం అయ్యింది. యదావిదిగా ఒక బ్రౌన్ కవర్
సాయంత్రానికి రమేశ్ జేబులోకి చేరింది. 
నెత్తిన బరువు కి , కడుపుకు తిండి కి చాలు అనే పదం తెలుసెమో గాని ,,
చాలు అనే పదం వినిపించనిది.. ఇంజనీరింగ్ ఆఫీసుల్లో సాయంత్రాలు నడిచే బ్రౌన్ కవర్లకే..
(ఈ మధ్య కొన్ని సీసాలు కూడా కలసి ప్రయాణం చేస్తున్నాయి )
.
రమేశ్ నడిపే రాజ్ దూత్ బండికి ఆలాటప్పుడు ఎక్కడ ఆగాలో బాగా తెలుసు.
.
కింద లాన్ లోని బార్లో .. వాటర్ ఫాల్స్ తో తడుస్తున్న అర్ధనగ్నపు బొమ్మ ని
బాగా తడిసి మాటలు తడబడే టైమ్ లో గమనించాడు రమేశ్.
అదేమీ మాయో గాని తన కడుపులో ద్రవం చేరినప్పుడే ఆ బొమ్మ ని గుర్తిస్తాడు అతను.
.
బయటకొచ్చి తన బండిని తీయబోతు తూలిన అతనిని ,
దూరం నుండి గమనించిన వాచ్ మెన్ వచ్చి నిలవరించాడు.
“సార్ రేపు తీసుకెళ్ళండి ఇవాళ ఆటో లో వెళ్ళండి “
రమేశ్ పరిస్తితి గమనించిన అతను చెప్పాడు.
.
“నో ప్రాబ్లం మాన్ ,, ఆ యాం క్వయిటోకే “ మనోడు రెండో దశలోకి అడుగేట్టాడు.
మరోసారి బండి స్టాండు తీసి బండి తో పాటు అడ్డంగా పడిపోయాడు.
.
ఈసారి గట్టిగా చెప్పి అతడిని ఆటో ఎక్కించాడు వాచ్ మెన్ అలవాటయిన కస్టమర్ అవటంతో..
.
ఆటొ మైన్ రోడ్డు మీదికి రాగానే “ఎక్కడికి వెల్లమంటారు సార్ “ అడిగాడతాను.
.
“ చంద్రుడిని చూశావా .. బ్రదర్ చాతకాని వాడు చేసిన చపాతీలా ఉన్నాడు ?’”
.
“సర్ ఎక్కడికి వెళ్ళాలి ?”
.
“అంటే ఎక్కడికి వెల్లమంటే అక్కడికే వెళతావా? అంత విషయం ఉందా నీలో ?”
.
ఆటో ఆగింది.
.
“సరే ప్పో .. ముచ్చట పడుతున్నావుగా ,, సర్గానికి పోనీ,,
రంభ ఊర్వశి మేనక?ఎవరయినా పర్లేదు పోనీ “
.
ఆటో కదలలేదు.
.
“ఏమిటి బ్రదర్ డబ్బు లేదనా .. తీస్కో .. ఈ వందా తీస్కో ఎంజాయ్ బ్రదర్ .. ఎంజాయ్ “
.
మరో రెండు నిమిషాలు గొంతు లు మారుస్తూ అక్షరాలతో అనేక ప్రయోగాలు చేశాడతను.
.
“అనుభవం ఉన్న ఆటో వాలా గుండ్రంగా రెండు రౌండ్లు తిప్పి మేనక లాడ్జి ముందు దించాడు”
.
“దిగండి “
“ఎక్కడికి వచ్చాం బ్రదర్ స్వర్గానికేనా ?”
.
( అతను కోరుకున్న పనికి గది లోకి వచ్చిన ఆవిడ డబ్బు లాక్కున్నాక .
పోలీస్ విజిల్ వినిపించే సరికి పారిపోతుంది..
హోటల్ వాళ్ళు ఇతన్ని బయటకి పంపుతారు – వివరంగా రాయటానికి మనస్కరించటం లేదు.)
.
“నేనేం చేయలేదు బ్రదర్ నాకేమీ తెలీదు.” రిసెప్షన్ లో చెప్పాడు అతను.
.
“మీరిప్పటికే చాలా చేశారు ఇంటికెళ్ళండి .”
గ్లాసు మజ్జిగ తాపీ ఆటో మాట్లాడి
“సార్ ని ఇంటి దగ్గర దించ మని అడ్రెస్ చెప్పి సాగనంపారు హోటల్ వాళ్ళు.
.
నాలుగు కిలో మీటర్లు ఆటో లో కుడుపులలో ప్రయాణం చేసే సరికి రమేశ్ కొద్దిగా నెమ్మదించాడు.
.
మత్తుగా నిద్రావస్థలో మారాక ఇంటికి వెళ్ళే వీది మలుపులో స్ట్రీట్ లైట్ కింద
ఆటో ఆపి జేబులో చెయ్యి పెట్టి పర్సు తీశాడు ..
.ఆటో కి పోను పది రూపాయల కాగితం మిగిలింది.
.
మూల మీది షాపులో మూరెడు మల్లె పూలు కట్టించుకున్నాడు.
అపార్ట్మెంట్ వద్ద ఆటో దిగి. నృత్య రీతులు ప్రదర్శిస్తూ ఫ్లాట్ చేరి కాలింగ్ బెల్ నోక్కాడు.
.
.
సరిగ్గా ఆ మూరెడు మల్లెల కోసమే ఎదురు చూస్తున్న ఇల్లాలు తలుపు తీసింది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...