సింధూర చంద్రశేఖర్
గురించి ఇంట్లో చెప్పినప్పుడు తండ్రి
ఎగిరిపడ్డాడు.
ప్రేమలు దోమలు తమ వంశంలోనే లేవన్నాడు.
చదువు మాన్పించి ఇంట్లో ఉంచి తాళం
వేస్తానన్నాడు.
తల్లి బావిలో
దూకి చస్తానంది.
.
చెల్లెలు
పావని ఒక్కతే మౌనంగా ఉండి పోయింది.
.
ప్రేమించిన
యువకుడు గురించి ఓ ఆడపిల్ల చెప్పినప్పుడు
తల్లి తండ్రులు చేసే ఫార్సంత వాళ్ళు
చేశారు.
.
చివరికి సింధురే గెలిచింది.
చంద్రశేఖర్ సధ్గుణాలు, అతని అయిదంకెల
మంచి ఉద్యోగం కూడా వారి ఓటమికి ఒక కారణం.
.
చంద్రశేఖర్
కి సాంప్రదాయపు వివాహం మీద సదాభిప్రాయం లేదు.
వారిద్దరి
వివాహం ఈ ఆర్భాటం లేకుండా జరిగింది.
భర్త తో
కలిసి సింధూర బెంగళూరు వెళ్లిపోయింది.
..
ఇది జరిగిన
రెండు సంవత్సరాల తర్వాత,
.
పావని అక్కని
చూడాలని మరీ మరీ వ్రాసిన మీదట సింధూర పుట్టింటికొచ్చింది.
.
మనిషి బాగా మారింది.
శరీరచ్చాయ
మెరుగుపడింది.
చీరకట్టు
అందంగా మారింది.
స్స్లీవ్స్ పొట్టయిపోయాయి.
తలమీద
కట్టుకున్న కొప్పు ఎయిర్ హోస్టెస్ ని గుర్తుకు తెస్తుంది.
వీటన్నింటికీ
మించి ఆమె ఎడమవైపు చెక్కిలిమీద పెట్టుకున్న
కాటుకచుక్క ఆమె మేక్ ఓవర్ కి పరాకాష్ట.
.
రెండు రోజుల
పాటు అక్క చెల్లెళ్ళిద్దరూ ఊరంతా తిరిగారు.
చిన్ననాటి
కబుర్లన్ని చెప్పుకున్నారు.
.
సాయంత్రం
భోజనాల సమయంలో తండ్రి చిన్నకూతురి వివాహ ప్రస్తావన తెచ్చిన్నప్పుడు
పావనీ చాలా
అనీజి గా కదిలింది.
.
సముద్రపు
ఒడ్డున కట్టుకున్న ఇసకగూడు మరెవరో నిర్ధాక్షీణ్యంగా పాడుచేస్తున్నట్టు.
ఆ భావం సింధూర పసిగట్టింది.
.
భోజనాలయాక
మేడమీద పడకలు పర్చుకున్నారు.
సింధూర ఏవో
పుస్తకాలు వెతుకుతూ తీసింది.
పుస్తకం మధ్య
దొరికిన కాగితం విప్పింది...
.
“వెలుతురు
చీకటిని జయించే ప్రభాతవేళ
మన కలల
జలతారుని నీలిరంగు కాగితం కప్పుకుని
కొండ
చివరలనుండి జాలువారే మంచు క్రింద తడిచి తడిచి.....
ఆమె చప్పున
ఉత్తరం క్రింద సంతకం చూసింది... రాఘవ..
.
“పావనీ’ మేడమీదికొచ్చి చెల్లెల్ని పిలిచింది. ఏంటక్కా?
“ రాఘవ ఎవరు”
సూటిగా అడిగింది. .
.
పావనీ ఊహించినంత కలవరపడలేదు..
.
అసలు ఆమె ఆ
విషయం మాట్లాడడానికే అక్కని మరీ మరీ రమ్మని పోరుపెట్టింది..
.
“మా కాలేజీ, ఫైనల్ డిగ్రే ‘ నసిగింది.
“ప్రేమించు కున్నారా? ఆస్పస్టంగా తలుపింది పావని.
.
“నీ వయసెంత? చెల్లెల్ని దగ్గరిగా తీసుకుంటూ
సింధూర ప్రశ్నించింది.
”పద్దెనిమిది”
ప్రేమించడానికి సరైన వయస్సు” సింధూర నవ్వింది..
.
ప్రేమంటే
ఎమిటీ? ఏ ఉద్దేశంతో అతనిని ప్రేమించావ్’
“ అందంగా
ఉంటాడు. బాగా మాట్లాడతాడు.”.
.
పసిపిల్లలా
మాట్లాడకు, కొద్దిగా
చూడటానికి బాగుండి.
చక్కగా మాట్లాడితే అది ప్రేమవుతుందా?
ఇంఫాచ్యుయేషన్ అవుతుంది కానీ.
.
అక్క గొంతులోని కోపాన్ని పసిగట్టి పావని మరేం
మాట్లాడలేదు.
సింధూర లాలనగా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది.
ఆమె
కళ్ళనిండా బెరుకు ..
.
రెండు
హృదయాలు శూన్యంలో స్పృశించు కోవటం ప్రేమంటే ...
కదల్లో సినిమాల్లో చూపించి నంత
గొప్పగా ఉండదు.
ప్రేమంటే
భాద్యత .. అయినా చదువుకునే కుర్రడి ని చేసుకుని ఏమి చేద్దామని?
ప్రేమ
కోరుక్కుతిని ఎన్నాళ్లు బతుకుదామని?
చూడమ్మ ప్రేమ, స్నేహం లాటివి ఆర్ధిక
పునాది మీద లేవాల్సిన గోడలు లాటివి ఆ ట్రాప్ లోకి
జారకు .
..
నన్నిలా
డిజప్పయింట్ చేస్తావని అనుకోలేదు.’’ పావని నెమ్మదిగా
గొణీగింది...
..
ఇదేమాట
అతడితో అనే అవసరం రాకుండా జగార్త పడమంటున్నాను...
అర్ధం చేసుకో ..అంతకుమించి తాను
చెప్పటానికి ఏమీ లేనట్లు
సింధూర గొడవైపు
తిరిగి పడుకుంది.
..
ఆ రోజే ఆమె
ప్రయాణం...
అక్కకి తోడుగా పావని కూడా స్టేషన్కోచింది.
సింధూర కిటికీ పక్క సీట్లో కూర్చుంది. సింధూర
చెల్లెల్ని దగ్గరకు పిలిచింది.
“తొందరపడి రాఘవ విషయం లో ఒక నిర్ణయానికి రాకు”
స్వేచ్చ అంటే బాద్యత. ప్రేమ వివాహాలలో ముందడుగే కాని వెనకడుగు ఉండదు.
ముందు ఆర్ధికంగా నిలదోక్కొని, అసలు మీ మద్య ప్రేమ ఉందో లేక
మీ
పరిచయానికి అలా పేరు పెట్టుకొని గాబరా పడుతున్నారో తెలుసుకోండి.
రెండు మూడు
సంవత్సరాల గడువిచ్చి చూడండి.
ఒకరినొకరు
అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.
అర్ధం
చేసుకోవడానికి ఏకాంతాలు, శారీరక స్పర్శలూ అక్కర్లేదు.
ఒకరినొకరు
గమనిస్తూ , ఉంటే
చాలు.
వీటన్నింటికి
మించి అతను నిన్ను ప్రేమిస్తున్నాడో లేక
నీ వయస్సుని ప్రేమిస్తున్నాడో తెలివిగా తెలుసుకో ”
.
చివరి వాక్యం
అంటున్నప్పుడు సింధూర కళ్ళు చమర్చాయి. క్షణం లో ఆమె సర్ధుకుంది..
.
“ నీ బుగ్గ మీద ఆ బ్యూటీస్పాట్ బావుందక్కా.
వాతావరణం తేలిక పరచడానికి పావని అంది.
“ పిచ్చిపిల్ల..
నీకు ఈ బ్యూటీస్పట్ ల అవసరం రాదనుకుందాం!
నీ భర్తకి సిగరెట్లుతో కాల్చెంత సరదాలు ఉండవనే
ఆశిద్దాం!! “
మనసు లోనే అనుకుంది సింధూర..
.
అప్పుడే
సింధూర చెంపమీదకి కన్నీటి చుక్క ఒకటి జారింది.
చెల్లెలికి
ముఖం కనిపించకుండా సీటు వెనక్కి చేరగిలబడింది.
రైలు బండి కదిలింది.
(పల్లకి వార
పత్రిక .. 1990 )
No comments:
Post a Comment