సాయంత్రం హోమ్
మంత్రివర్గ సమావేశం జరిగింది.
డాటా కార్డ్ తో
పిసినారి తనంగా వాడుకునే ఇంటర్నెట్ స్థానే ..
కేబుల్ నెట్ కి
మారాలా వద్దా అన్న విషయం మీద తీవ్ర వాదోప వాదాలు జరిగాయి.
..
ఆన్ లైన్ టెస్ట్
లు , ప్రేపరేషన్ , మెటీరీయల్ మొదలయిన వి
విరివిగా వాడాల్సి రావటం తో మా పిల్లలు కావాలని ..
..
ఎక్కువగా నెట్
అందుబాటులో ఉండటం వల్ల అనార్ధాలు ,
పిల్లలు వాట్స్
అప్ వినియోగం , ఎవరి లోకం
లో వారు ఉండటం,
ఒంటరి గా గడిపే
నైజము ఎక్కువవుతాయని మా శ్రీమతి వాదన...
..
మొత్తానికి అరచేతిని
అడ్డు పెట్టటం ఎవడి వల్ల కాదు కనుక అదీ ఈ వేసవిలో
కొన్ని అత్యవసర
తీర్మానాలు చేశాం.. ఉభయకుశ లోపరిగా...
..
ఎట్టి పరిస్తితి
లోనూ వైఫై వాడక పోవటం.
బెడ్ రూమ్ లో
డస్క్ టాప్ ని హాల్లో కి మార్చడం.
కేవలం లాన్ ద్వారానే
కన్నెక్ట్ అవటం.
అందరం నెట్ కోసం
ఒకే సిస్టెమ్ వాడటం ..
..
తదుపరి బడ్జెట్
లో సవరణలు మీద చేర్చల్లో
న్యూస్ పేపర్
ఆపాలని , నెట్ లో అన్నీ పేపర్లు చదువుకోవచ్చు
అని
పిల్లల వాదన...
..
పేపర్ మానేస్తే
కుదరదని .. మద్యాన్నం పేపర్ చదివితే నే నిద్ర వీలవుతుందని.
మా ఆవిడ..
..
“ఇంకా పేపర్ ఎందమ్మా
నువ్వు టాబ్ లో చదువు కొమ్మా .. అప్డేట్ అవ్వు “ మా వాడు
..
పేపర్ చదవడానికి, గాలి విసురుకోవటానికి, పిండి జల్లించు కోవటానికి..
చంటి పిల్లల వి
శుబ్రమ్ చేయటానికి, ఆరామారాల్లో పరుచుకోటానికి.
వంటగదిలో తొక్కలు
వేసుకోవటానికి... మా ఆవిడ చెబుతూనే ఉంది.
...
“నాన్న పేపర్
మాత్రం ఆపకండి,, అమ్మ పేపర్
తో బొద్దింకలని చంపుద్ది
టాబ్ తో ఆ పని
చేసిందనుకో .. మన పని గోవిందా “ మావాడు
వోట్ ఆఫ్ థాంక్స్
తో ముగించాడు.
No comments:
Post a Comment