Monday, 18 May 2015

పిల్లల ప్రేమని తట్టుకోగలరా?

రాత్రి పన్నెండు అవుతుండగా క్లబ్ లోని లాండ్ ఫోన్ మోగింది..
(కొన్ని క్లబ్బుల్లో సెల్స్ వాడరు)
ఆఫోనే ఎవరికోసమో తెలుసు కనుక క్లబ్ లో కుర్రాడు
వైర్లెస్స్ రిసీవర్ ని తెచ్చి "ముని " కి ఇచ్చాడు.
.
" ఇంటికి బయలుదేరారా ? ఏమైనా తిన్నారా?
బయలుదేరేటప్పుడు ఒక్క రింగ్ ఇవ్వండి.
టిఫిన్ తయారు చేస్తాను మీరు వచ్చేసరికి,
చల్లారి పోకుండా ఉంటుంది"
.
ప్రతిరోజూ దాదాపు ఇదే సీన్ రిపీట్ అవుతుంది.
.
పెళ్ళయిన కొత్తలో అడిగినంత మర్యాదగా ఆమె అడుగుతుంది.
అందులో వ్యంగ్యం ఏమి ఉండదు. ఒక్క కేరింగ్ తప్ప.
25 ఏండ్ల వైవాహిక జీవితం తర్వాత కూడా
.
ఎగువ మధ్య తరగతి వారు పోగయ్యే క్లబ్ లో
బయటకి బిలియర్డ్స్ అని చెప్పినా లోపల మాత్రం జరిగేది చతుర్ముఖ పారాయణమే.
అంధరికి తెలిసిన బహిరంగ రహస్యమే.
.
ముని గురించి పరిచయం కావించడం తేలిక .
వెండి స్పూన్ తో పుట్టాడు.
సామాజికంగా మేము మాత్రమే అధికులం అనుకునే కులం లో పుట్టిన అతని కి
తల్లిదండ్రుల ఆస్తి తో పాటు ..ప్రమీల ఆస్తి కూడా కలిసి సోమరిని చేశాయి.
నెలకు రెండు లక్షలకు పైగా వచ్చే అద్దెలు, పొలం మీది ఆదాయం ..
సమర్ధవంతంగా ఖర్చు పెట్టడం ఒక్కటే అతనికి తెలిసిన ఏకైక విద్య..
యుక్త వయసుల్లోనే అన్నీ తెలుసుకున్న అతను .
అంధుబాటులో ఉన్న అన్నింటిని వాడటం మొదలెట్టాక ..
ఇద్దరు పిల్లల బార్య తో పెద్దగా అవసరం పడని స్థితి కి వచ్చాడు.
.
పిల్లలు ఎక్కడ ఏమి చదువుతున్నారో కూడా తెలియనంత
బిజీ జీవితం గడిపే ముని కి ప్రమీల ఒంటి చేత్తో కుటుంబాన్ని
నిర్వహించుకోవటం మరి అనుకూలంగా మారింది..
..

శరీరం లో పెరుకున్న వత్తిడి చక్కెర వ్యాది రూపం లో .
బయటపడ్డాక కూడా ప్రమీల దాన్ని లక్ష్య పెట్టలేదు.
పందులే కాదు ప్రాబ్లమ్స్ కూడా గుంపులుగానే వస్తాయి.
ఒకటి రెండు సార్లు రక్త పోటు తో సేరిబ్రల్ హెమరేజి లక్షణాలు పలకరించాయి.
పెరిగిన గుండె ఆమెని అసహాయ స్థితిలో ఆసుపత్రి పాలు చేసింది.
ఆమె హాస్పిటల్ లో చేరిన వారం రోజుల్లోనే ముని కి
లోకం తెలిసొచ్చింది. ఎప్పుడు బందువులతో పెద్దగా టచ్ లో ఉండని అతనికి
వాస్తవాలు తెలిసోచ్చాయి. ఇన్నేళ్లుగా ఆమె అనుభవించిన శూన్యత
ముని ని ఉక్కిరి బిక్కిరి చేసింది.
అదృష్ట వశాత్తు అతని తోడల్లుడు కొంత బాద్యత తీసుకుని
వెంటనే కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
చెన్నై తీసుకెళ్ళాక .. హార్ట్ రిప్లస్మెంట్ కి సిద్దపడి. అప్పటి కప్పుడు
కొంత ఆస్తిని తనఖా ఉంచి 30 లక్షలు పోగుచేసుకు వెళ్ళేసరికి
భాద్యత గా ఆమె కోమాలోకి వెళ్ళటం .. మరో రెండు రోజుల్లో నే
శాశ్వతంగా వెళ్లిపోవటం జరిగింది.
ఖర్మ కాండ రోజు ..అతన్ని ఓదార్చడం ఎవరి తరము కాలేదు.

రాత్రి పన్నెండు అవుతుండగా లాండు లైను రింగ్ అయ్యింది.
క్లబ్ కుర్రాడు ఆలవాటుగా కార్డ్లెలెస్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు.
ఎవరో అర్దమవని ఆ గుంపు లోంచి ఒకరు 
హండ్స్ ఫ్రీ బటన్ నొక్కిన వెంటనే ఓ పసి గొంతు వినబడింది.

" నాన్నా.. ఇంటికి బయలుదేరారా ? ఏమైనా తిన్నారా?
బయలుదేరేటప్పుడు ..ఫోను చేయండి..చపాతీ పిండి కలిపాను
చపాతీ తయారు చేస్తాను మీరు వచ్చేసరికి,
చల్లారి పోకుండా ఉంటుంది"
..
ఒక్క క్షణం అందరూ మౌనగా ఉండి పోయారు.
ముని తెరుకుని " మాన్వి నువ్వు ఇంకా మేలుకుని ఉన్నవా?" అడిగాడు ఆశ్చర్యంగా.
..
" నాన్న నేను కాలేజీ మానేశాను . ఇక నుండి ఇంటివద్దే ఉంటాను.
అమ్మ హాస్పిటల్ లో ఉన్నంతకాలం మిమ్మల్ని జాగర్తగా చూసుకొమ్మని చెప్పింది మాతో.
అమ్మ అంటే మాకు ఇష్టం నాన్నా ..అమ్మ చెప్పిన మాట దాటటం నాకు ఇష్టం లేదు నాన్నా
అందుకే చదువుతున్న ఫార్మసీ మానేస్తాను. తమ్ముడు మీరున్న క్లబ్ బయట బండి పెట్టుకుని
తొమ్మిదిన్నర నుండి ఉన్నాడు. మీరు బయటికి వచ్చాక ఇంటికి తీసుకురావటానికి.."
ఆ అమ్మాయి మరేదో చెప్పబోతుంది.
..
అతని మిత్రుడు కౌన్సిలర్ ఒకడు ..
చేతి లోని పేక ముక్కలని , టెబిల్ మీద వైను బాటిల్ని విసిరి కొట్టి
పెద్దగా అరచి చెప్పాడు.
..
" ఛీ ఛీ మా మునిసిపాలిటీ పందులకి మనకి ఏమైనా తేడాఉందా?"..
.
వడివడిగా అతను బయటకి నడిచాడు.
కొద్ది నిమిషాల్లో వారంతా మనుషులయ్యి బయటకి నడిచారు.


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...