Monday, 18 May 2015

అక్షయ తృతీయ

ఈ అక్షయ తృతీయ కి మా గుండమ్మ కి ,
లాకర్ లో ఉన్న ఏదో ఒక నగ తెచ్చి
తాను అలంకరించుకుని ఆనందిస్తే చూద్దామని అనిపించి
తనతో చెప్పకుండా ఒంటరిగా బాంకు లాకరుకు వెళ్ళాను.
.
మేము ఇద్దరం కాకుండా ఒంటరిగా లాకర్ కి వెళ్ళటం అత్యంత అరుదు.
.
ఈ మధ్య బాంకు ని ఆదేరోడ్డు లో మరో బిల్డింగ్ కి మార్చిన కారణంగా ..
లాకరు లో ఉన్ననగలని ఒకసారి వివరంగా చూద్దామనిపించి ,
లాకరు ముందు బాశా పట్లు వేసుకుని కూర్చున్నాను.
.
ఒక్కో ఐటెమ్ తీసి చూస్తూ వుంటే,
లోపల ఒక మీడియం సైజు జిప్ బాగు నిండుగా కనిపించింది.
క్యూరియాసిటీ తో దాన్ని ఓపెన్ చేశాను..
.
1988 లో మా పెళ్ళయిన కొత్తలో,
తాను పుట్టింట్లో ఉన్నప్పుడు నేను రాసిన ఉత్తరాల దొంతర.
చాలా శ్రద్దగా మడిచి పెట్టి కనిపించాయి .. వాటితో బాటు ..
ఇక చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ ..
అదీ నేను బహుమతిగా ఇచ్చిందే..
.
కొద్ది నిమిషాలు .. మనసు బరువెక్కింది.
ఎన్ని సంవత్స రాలు గడిచి పోయాయి.
దాదాపు 27 ఏండ్లు..
ఇన్నాళ్ళు తను ఎంత పదిలంగా దాచుకుంది.
నాకు పిల్లలకి తెలియకుండా?
.
నేను తిరిగి లాకర్లో అన్నీ సర్ది ,
ఏమీ తేకుండానే బయట కొచ్చాను.
అటునుండే నేరుగా ఆఫీసుకి వెళ్ళాను
.
మద్యాన్నం ఆఫీసులో తినటానికి తెచ్చుకున్న లంచ్ బాక్స్ ..
తినకుండానే బండి తీసి ఇంటి కొచ్చాను.
.
ఆశ్చర్య పోయిన తనని
“ బోజనమ్ చేశాక సాయంత్రం గోల్డ్ షాప్ కి వెళదామా?” అడిగాను.
.
“వద్దు.. పొద్దుటనగా వండి పెట్టిన చల్లటి అన్నం తినటం ఎందుకు.
ఒక్క పది నిమిషాలు టి‌వి చూస్తూ ఉండండి గిద్ద బియ్యం వండుతాను ..
మజ్జిగ పులుసు చేస్తాను.. ఇద్దరం కలిసి బోజనమ్ చేద్దాం “ అంది.
.
రాస్కోరా సాంబా “ సుశ్రీ కి .. గుండమ్మ అంటే గుండె కాయ లెఖ్ఖ .” ____feeling blessed. grin emoticon

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...