సాదారణంగా మా గుండమ్మ ముభావంగా ఉండదు.
ఉందంటే చాలా జాతీయ విపత్తు జరిగినట్లు!!
.
ఈ సాయంత్రం నేను ఇంటికొచ్చినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను.
ఎప్పట్లా చిరునవ్వు నవ్వకుండా..
.
ముభావంగా ఉంది. "వంట్లో నలతగా ఉందా?" అడిగాను.
.
కాదన్నట్టు వీడియో ప్లే అయ్యింది గాని ఆడియో లేదు.
.
కలిపించుకుని మరి " మురళీ కృష్ణ లో తెచ్చిన మిక్స్డ్ ఫ్రూట్ హల్వా" గురించి..
బాండి పక్కన స్టూల్ వేసుకుని కూర్చుని చేయించి తెచ్చినట్లు రుచి రుచి గా చెప్పాను
.
ఊహూ.. లాభం లేదు. తల ఊగింది.
నిలువు కాదు అడ్డం కాదు జల్సా లో చెప్పినట్టు ఐ మూలగా ..
.
ఏమయిందిరా ? మా వాడిని కళ్ళతో అడిగా.
తెలీదని కింద పెదవి తో చెప్పాడు.
..
నా కోకటే టెన్షన్....
" పిల్లలేమయినా ఫోన్ చేశారా?"
మా "గాంగ్ సుశ్రీ " గ్రూప్ మెస్సెజులు చెక్ చేస్తూ అడిగా..
"లేదు" అది విజువలే..
.
చివరి అస్త్రం ప్రయోగించా.. పట్టించుకోక పోవటం .. .
మనం పట్టించుకోక పోవటాన్ని మించి గుండమ్మలకి
మరో శిక్ష ఉండదు.
..
మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది.
..
సాయంత్రం వచ్చిన నాలుగు అంకెల కరెంటు బిల్లు నా ముందు పెట్టింది...
కళ్ల జోడు బోనస్ గా ఇస్తూ ..
..
నాయనా వెంకన్నా నాకు ఏ సి రిమోటే ముట్టుకోగలిగిన దైర్యం ప్రసాదించు స్వామీ ..
ఈ సారి తిరపతి వచ్చి మీ సేవలో బిల్లు కడతాను..

No comments:
Post a Comment