Monday 18 May 2015

ఆరాధన

1996 ఏప్రియల్ 27 నిన్ననే ఒంగోలు పార్లమెంటు బై ఎలక్షన్లు ముగిశాయి.
వైశాఖ శుద్ద దశమి ఈ రాత్రి కి ఆరాధన ఘడియలు ప్రారంభం.
(తిరిగి 19 యేండ్ల తర్వాత 2015 యెప్రియల్ 27 న కూడా రాత్రి 9-45 కి ప్రారంభం )
.
సాయంత్రం కాంపు నుండి రాగానే తాళ్ళూరు లో ఉన్న మా పాత పెంకుల ఇంటి నుండి
ఒంగోలు లో ఉన్న అమ్మా నాన్న వద్దకు వెళ్ళటానికి రెడీ అయ్యామ్.
జీన్సు పేంటు మీద పొడవాటి లాల్చీ వేసుకుని తలుపు వెనక ఉన్న
చెప్పులు కోసం వంగి తీసుకుని లేస్తుంటే ..
లాల్చీ జేబుకు ఇనప హుక్ పట్టుకుని నిలువుగా చినిగింది.
.
మరో చొక్కా మార్చుకుని బజాజ్ M-80 బండి మీద నేను, రమా,
గజం పొడవున్న మా పెద్దమ్మాయి , అరగజం ఉన్న చిన్నమ్మాయి ని తీసుకుని
ఒంగోలు వచ్చాను..రాత్రి ఎనిమిధి దాటింది.
.
నాన్న అమ్మ ఒంగోల్ శర్మా కళాశాల వెనుక కొంత బాగం అసంపూర్తిగా
ఎక్స్టెండ్ చేసిన ఇంటి లో ఉన్నారు. నాన్న కి GJ (అన్నవాహిక నుండి పెద్ద పేగు కి
మరో మార్గం ఏర్పాటు చెయ్యటం ) జరిగి ఎనిమిది నెలలు దాటింది.
ఆ గాయం పూర్తిగా మానలేదు. ముడునెలలు మించి ఆయన ఉండరు
అని చెప్పిన బేతున్ నర్సింగ్ హోమే డాక్టర్ రంగారావు గారి ఊహాను వమ్ము చేస్తూ.. ఆయన ఉన్నారు. నిత్యం ఆయన పూజించే వీరబ్రమేంద్ర స్వామి వారిని రోజు లో ఉదయం ,
సాయంత్రం అంత అశక్తత తోను పూజిస్తూనే ఉన్నారు.
.
మేము వెళ్ళేసరికి అమ్మ నాన్న కి మరో మారు శుబ్రమ్ చేస్తూ ఉంది.
ఆ ఎనిమిదిన్నర నెలల్లో ఆయన బట్టల్లో బయటకి వెళ్ళటం అదే ప్రదమం .
.
అమ్మ నేను ఇద్దరం కలిసి ఆయన పంచ మార్చి పడుకోబెట్టాము.
నాన్న మాట్లాడలేక పోయటం నేను గమనించాను.
.
ఆరాధన గడియలు వచ్చాయి.
వీరభ్రమ్మెంద్ర స్వామి వారికి నైవేద్యం పెట్టటానికి అమ్మ
మడి కట్టుకుని పొయ్యి మీద పొంగలి పెట్టింది.
రమ అప్పటికే అల్సిపోయిన పిల్లలిద్దర్ని నిదర పుచ్చుతుంది.
మద్య మధ్యలో అమ్మ నాన్న వద్దకు వచ్చి చూస్తూనే ఉంది.
నేను నాన్న రాసుకునే డైరీ చూశాను .. 24 వ తేదీ సాయంత్రం వరకు రాసి ఉంది.
.
హటాత్తుగా అమ్మ పిలిసింది ..వాసు అంటూ ..నాన్నని ముట్టుకుని చూడు అంది.
.
నాన్న చల్లగా అవుతున్నారు.
రమ దగ్గరకి వచ్చింది. మేము ఆయన వైపు చూస్తున్నాం.
నిస్తేజమయిన ఆయన కళ్ళలోంచి మెరుపు మమ్మల్ని వదలి వెళ్లిపోయింది.
.
మాకు అర్ధం అయ్యింది.
ఎనిమిది నెలలుగా ఆయన మమ్మల్ని వీడుతున్నారని తెలుస్తూ ఉండటం వల్ల
హటాత్తుగా మాకేవరికి ఏడుపు రాలేదు గాని ,,
ఒక విపరితమయిన బాధ ,,, ఒంటరితనం ఒక తీతువు పిట్టలా ..
.
నేను నిజాన్ని త్వరగా తీసుకుంటాను.
కనుక వెంటనే కోలుకున్నాను. బండి మీద నా ప్రాణ స్నేహితుడు మాదాల బ్రహ్మయ్య
ఇంటికి వెళ్ళాను. వాడు అప్పుడే ఇంటికొచ్చినట్లున్నడు.
చొక్కా విప్పి హంగర్ కి తగిలిస్తున్నాడు.
.
“రేయ్ బ్రహ్మం ..” నేనేమీ మాట్లాడ కుండానే వాడికి అర్ధమయి పోయింది.
అదే చొక్కని వేసుకుని చెప్పుల్లో కాళ్ళు దూర్చి పద అన్నాడు.
బండి నేను తోలబోతుంటే ..” వెనక కూర్చోరా” అని తానే బండి తీసి మా ఇంటి దారి పట్టాడు.
.
ఇంటికెల్లే సరికి చుట్టూ పక్కల వాళ్ళు కొంతమంది పోగయి ఉన్నారు.
నాన్న ని మంచం మీద నుండి నేలన దించి ఉన్నారు
తల వద్ద ఒక దీపం వెలిగించి ఉంది. ఆగరోత్తులు వెలుగు తున్నాయి.
.
అప్పుడు గమనించాను అమ్మ మొఖం లో దుఖం. .
అలాటి వేదన తల్లి ముఖం లో చూడాల్సి రావటం ఒక దురదృష్టం.
నాన్నని మా స్వగ్రామం తీసుకెళ్లాలి. అక్కడే ఆయన పార్ధివాన్ని ఉంచాలి.
.
నా మరో మిత్రుడు గోపి శ్రీనివాసరావు ని వినుకొండలో ఉండే అక్క, బావలని.
తాళ్ళూరు తీసుకురమ్మని పంపాను. అంత రాత్రి వేళ మరో మిత్రుడు ముజీర్ తో
కలసి వినుకొండ బయలు దేరాడు.
.
బ్రహ్మం నేను ఇద్దరం బజారు వెళ్ళాం. .
నిన్నటి వరకు ఎలక్షన్ కోసం తిరిగి డ్రైయివర్లు బాగా అలసి పోయి ఉన్నారు.
ఎంత ఇచ్చినా తాళ్ళూరు వచ్చేలా లేరు.
అతి కష్టం మీద రెట్టింపు బాడుగకి ఒక అంబాసిడర్ మాట్లాడాము .
.
నాన్నని వెనుక సీట్లో (డిక్కి లో కాకుండా ) పడుకోబెట్టు కోటానికి అతను అంగీకరించాడు..
ప్రతి పది నిమిషాలకి ఒక సారి ముఖం చల్లని నీటితో కడుక్కుంటూ.
అతి కష్టంగా, జాగ్రత్తగా కారు తోలుతున్నాడు.
.
కారు ముందు సీట్లో పిల్లలతో రమ , వెనుక సీట్లో అమ్మా నేను నాన్నతో ...
మా భ్రమ్మం గాడు నా m-80 బండి మీది ముందు త్రోవ చూపిస్తూ వెళుతుంటే ..
వెనుక మా కారు. ఆ చీకట్లో మా స్వగ్రామం తాళ్ళూరు వయిపు ...
.
వెల్లంపల్లి నుండి తెల్లపాడు దొడ్డ వరం మీదుగా వెళ్ళటానికి .
మెటల్ రోడ్డు మీదికి తిరిగే సరికి మా ముందు ఒక లారీ వెళుతుంది.
ఎంత సేపు డ్రయివర్ హరను కొట్టినా ఆ లారీ తప్పుకోలేదు.
ఆ లారీ వెనుక రాసి ఉన్న వాక్యాన్ని నేను చదివినదాకా ..
.
మానాన్ననాతో చెబుతున్నట్టుగా అనుకుంటూ ఉండగానే .
ఆ లారీ మాకు త్రోవ ఇచ్చింది. ఆ మాట
.
It’s my end. Not your’s

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...