నేను యెడవటం చాలా అరుదు..
మగవాడు ఏడవటం నామోషి అని విన్నందున కాదు.
నేను నిజాన్ని త్వరగా మనసులోకి తీసుకుంటాను కనుక..
బాద పడతాను,, కానీ ఏడవలేను..
.
అయితే నేను ఎడ్చాను. 30 వ యేట..
దాదాపు ఒక రోజంతా.. దిండు తడిచి పోయింది.
కన్నీరు కరగటం ఆగలేదు . అసలు అంతా వేదన నాలో ఉందని తెలీదు.
నాన్న ని నేను అంతలా ప్రేమిస్తున్నానని తెలీదు.
అసలు ప్రేమ కి ఇంత వేదనా బరితమయిన ముగింపు ఉంటుందని తెలీదు.
.
ఆయన పొట్టిగా ఉంటారు. కానీ గట్టిగా ఉంటారు .
వేగంగా నడుస్తారు. 40 ఏండ్లు ఉపాద్యాయ వృతి లో కొనసాగారు .
రెండు పూటలా స్నానం బగవత్ నామ స్మరణ
(శ్రీ మత్ విరాట్ పోతులూరి వీర భ్రమ్మెంద్ర స్వామి వారి వీర బక్తులు ),
నియమ నిష్టల జీవితం. కట్టుబాట్లు , మడి, ఆచార వ్యవహారాలు
మమ్మల్ని ఎవరు మా కులం చెబితే తప్ప ఊహించరు.
మా చిన్న వయసులో మా అమ్మ ని ఇంట్లోకి రానిచ్చే వారు కాదు.
ఆ కొద్ది రోజులు ఆయనే వంట చేసేవారు.
రిటైర్ అయ్యాక ASSIST అనే వాలంటరీ సంస్థ లో రాయవరం (మార్కాపురం )
వద్ద పలక కార్మికుల పిల్లలకి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుండేవారు.
ఎప్పుడు ఎంతో హుషారుగా ఉండే ఆయన మెత్త బడ్డారు 66 వ ఏట.
.
నల్లగా మారిన మలాన్ని పరీక్ష చేయించాక కానీ
రోజు లోపల ఎక్కడో రక్తం కలుస్తోంది అని అర్ధం కాలేదు.
నిపుణూలయిన వైద్యుల సలహాతో గాస్త్రోస్కోపీ చేయించాము.
అన్నవాహిక నుండి పెద్ద పేగు మొదలయ్యేచోట (డియోడ రిన్) కేలీఫ్లవర్ లాటి గ్రోత్..
ప్రాధమికంగాను , పలు పరీక్షల తర్వాత రంగారావు గారు నిర్ధారించిన వ్యాది
.
“C A N C E R”
.
ఆ సాయంత్రం యేడిచాను. రాత్రంతా యేడిచాను. మిగిలినది ఉదయం యేడిచాను ..
.
వెంటనే ఆయనకీ GJ చేయాల్సి ఉంది అని .
దానికి పూర్వమే పోయిన రక్తాన్ని హెచ్‌బి పర్సెంట్ కనీసం
50 శాతం ఉండేంత వరకు రక్తం ఎక్కించాలని డాక్టర్ గారు చెప్పారు.
నాన్న ఎప్పుడు చెప్పే మాటే ఆయన బ్లడ్ గ్రూప్ కావటం యాదృచ్చికం. బి పాజిటివ్ !!!
.
రెగ్యులర్ డోనర్ల వద్ద కాకుండా , RSS, NCC లాటి వారి సహకారం తో
దాదాపు ఎనిమిది బాటిల్ల రక్తం ఆరు వారాల్లో ఎక్కించి ఆయన్ని సర్జరీకి సిద్దం చేశాం.
సర్జరీ రోజు మా అక్క, నా ప్రాణ స్నేహితుడు మాదాల భ్రమయ్య, రక్త దానం చేశారు.
.
ఆ సాయంత్రం రంగారావు డాక్టరు గారు చెప్పారు.
పొట్టలో చాలా బాగం వ్యాప్తి చెంది ఉంది. సర్జరీ నుండి బయట పడతారు..
ఏది ఏమయినా మరో మూడు నెలలు మించి కష్టం.
.
ఒక కాలిన ఇనుప కడ్డిని శరీరంలో దుర్చి బయటకి లాగి నట్లు అనిపించింది.
.
నేను ఎడ్చాను. దాదాపు ఒక రోజంతా.. దిండు తడిచి పోయింది.

No comments:
Post a Comment