Monday, 18 May 2015

కర్ణ ట్రైనింగ్ సెంటర్

మొన్న ఏమీ లేదు అక్కడ.
నిన్నటికి నిన్న వెలిసింది ఆ ట్రైనింగ్ సెంటర్.
“కర్ణ ట్రైనింగ్ సెంటర్ “
------------------
రాత్రికి రాత్రే ఏర్పడినా అందులో అడ్మిషన్ కొరకు విపరీతమయిన రద్దీ.
రోడ్లు వాహనాలు తోను, రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు,
ఎటుచూసినా రద్దీ .. త్రోవ పొడుగునా స్వచ్చంద సంస్థల చలివేంద్రాలు,
మజ్జిగ సెంటర్లు ,, హడావిడి మామూలే..
ప్రత్యేక పోలీసు ధళాల సాయంతో పోలీసులు
ట్రాఫిక్ క్రమద్దికరణలో తల మునకలుగా ఉన్నారు.
.
నేను మా ముగ్గురు పిల్లల్ని ఉన్నపలాన చదువులు మానిపించి
అందరినీ తోలుకుని తెల్లవారు ఝామున
ప్రయాణమై అక్కడికి చేరుకునే సరికి చాంతాడంత క్యూ ఉంది.
.
అంత హడావిడి లోనూ సిఫ్ఫారసు ఉత్తరాలు
దాచుకునే బాగు తీసుకెళ్లటం మాత్రం మరవలేదు.
అందులోంచి తీసిన ప్రింటెడ్ సిఫారసు లలో
“ మాకు తెలిసిన డాష్ లు తిరుపతి వస్తున్నారు
నున్నగా గుండు చేయించి లడ్డు ఇచ్చి పంపండి అని రెండు ,
అర్జంటుగా హైదరాబాదు పోవాలి మా డాష్ కి నా సీటు కేటాయించండి..
మా డాష్ లు వస్తున్నారు ఒకే బంగారం సినిమాకి రెండు టికెట్లు ఇవ్వండి
అంటూ శాసన సబ్యుల సిఫారసు లు ఉన్నాయి గాని
ఇక్కడికి పనికి వచ్చే వి ఏవీ కనిపించలేదు.
.
ట్రైనింగ్ సెంటర్ ప్రధాన ద్వారానికి ఇరు వైపులా ,
మట్టి కుండలు ,ధోవతులు ,
రోకలి బండలు షాపులు వెలిసి ఉన్నాయి.
వారి రేట్లు మన్నిక గురించి హింది తారలు విపులంగా చెప్పే
నిలువెత్తు ప్రచార చిత్రాలు ఉన్నాయి.
.
అందరినీ తప్పుకుని మా వంతు వచ్చేసరికి సాయంత్రం నాలుగయ్యింది.
.
ఎంతో కొంత చాదస్తం ఇంకా విడవ నందున
నేను మెల్లిగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేశాను .
ధోవతి కట్టుకుని శిరస్త్రాణం పెట్టుకున్న అడ్మిషన్ ఆఫీసరు..
నా వయసుకి గౌరవం ఇచ్చి కొంత సమా చారమ్ ఇచ్చాడు.
.
పట్టిసీమ నుండి లిఫ్ట్ చేసిన నీరు ప్రభుత్వం వారు
ఇసుక నెలల్లో నిలవ ఉంచుతారు.
ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీటిని కుండల్లో నింపుకోవచ్చు.
కృష్ట్నా జిల్లాలే కాక రాయల సీమ కి కూడా నీటి సరఫరా చేయొచ్చు.
తాగు నీరు , సాగు నీరు పుష్కలంగా వాడు కోవచ్చు.
మిగులు జలాలు అరబ్బు దేశాలకు అమ్ముకోవచ్చు.
మేమిక్కడ ఇసుకనుండి నీటిని తిరిగి ఎలా పిండాలి
అనే విధానం మీద ట్రైనింగ్ ఇస్తాం ..
మా MD సీనియర్ కర్ణ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు.
.
మొత్తం మూడు సెమిస్టర్లు ఉండే ఈ ప్రోగ్రామ్ ఫీజు ఒకే సారి
చెల్లించిన వారికి కుండలు యూనిఫారాలు ఉచితం.
.
నేను మరో మాటకి అవకాశం లేకుండా పిల్లల పెళ్లిళ్ల కోసం పదేళ్ళు గా
దాచిన డబ్బు అడ్వాన్స్ గా చెల్లించాను.
.
మీరు ముగ్గురుని ఒకేసారి చేర్పించారు కనుక మీకో గిఫ్ట్ కూడా ఉంది
అంటూ ఒక పొడవాటి రోకలి బండ కూడా ఇచ్చారు.
.
సాయంత్రానికి సగర్వంగా రోకలి తలకి చుట్టుకుని తిరుగు ప్రయాణమయ్యాను.
.
వివరాలు కావాల్సిన వారు Siva Racharla టైమ్ లైన్ లో చూడొచ్చు.
Post a Comment