Monday, 18 May 2015

నుసి మీసాలు - తోక చాప

రెండు మూడు నెలలు గడిచే సరికి నేను శ్రీరామమూర్తి మాస్టారు కి ప్రియ శిష్యుడిని అయ్యాను.
శ్రద్దగా పాటాలు వినటం , వాటిని తక్కువ టైమ్ లోనే అవగాహన చేసుకోవటం,
అబద్దం చెప్పక పోవటం. 
తప్పు నా స్వంతమయితే దానిని own చేసుకోవటం
నాలో ఆయనకు నచ్చాయి.
.
కనుక ఉదయాన్నేఅందరితో పాటు నిద్ర లేవకపోవటం లో నాకు మినహాఇంపు అక్కడా దొరికింది.
ఒక్క ఆముదం విషయం లో తప్ప.
నాకు తలకి నూనే పెట్టటం చిరాకు, ఆయన నా కోసం ఆముదం సీసా తెప్పించి బయట వసారా లోని అరమరలో ఉంచి రోజు ఉదయాన్నే ఇంటికి వెళ్ళేటపుడు తలకి రాసుకుని చూపించి వెళ్లమనేవాడు.
ఈ విషయం లో మాత్రం ఆయన సీతయ్య.
మిగతా అంతా మాస్టారు నేను హాపీ.
.
సరిగ్గా వేసవి శలవులు అయిపోయే సరికి బసవన్నపాలెం నుండి బద్ర రావు కూడా ట్యూషన్ చేరాడు.
బ్లేక్ & వైట్ సినిమాలో రింగులు రింగులు తిరిగి పాత వైరం తిరిగి చిగురించింది.
(మేరీ నామ్ శ్రీనివాసరావు హై .. చదవండి ).
బద్ర రావు వాడి గుణం వీడలేదు. ..
వచ్చీ రావడం తోటి మాస్టారి వద్ద నా priority గమనించి తను ఒక టీం తయారు చేయ సాగాడు.
.
******************
యధావిదిగా ఆ ఉదయం శ్రీరామమూర్తి మాస్టారు నిద్ర లేచి
మంచం కింద నీళ్ళ చెంబు తేసుకుని వెళ్లారు.
పోలేరమ్మ గుడి వద్ద ముఖం పుల్ల తుంచుకుంటుదగా
ఎవరో ఆడవాళ్ళు సన్నగా నవ్వడం గమనించాడు.
కొంచెం ముందుకొచ్చాక ఒక రైతు “ పంతులు గారు ఏంది ముఖాన? “ అన్నాక
ఆయన అనుమానంగా ఇంటికొచ్చాడు.
.
వసారా లో పడుకున్న పిల్లల ముఖాలు తేరిపార చూశాడు.
అందరి ముఖాలకి నల్ల నుసి మీసాలు.
దీపం నూసి మూతనుండి ఇదిల్చి, ఆముదం తో కలిపి పెట్టిన మీసాలు.
తలుపు తట్టాక పంతులమ్మ గారు తలుపు తెరిచి ఫక్కున నవ్వి అద్దం తెచ్చి చూపించారు.
ఆయన ముఖాన కూడా నుసి మీసాలు.
ఆయనకి కోపం కట్టలు తెంచుకుంది.
వసారాలో అందరిని పరికించి చూశాడు .
అందరి ముఖాన నల్లని నుసి మీసాలు నాతో కలిపి
ఒక్క బద్ర రావు ముఖాన తప్ప.
-----------------------------------
'
సృష్టి లో చాలా ఉపద్రవాలు సాదా సీదా గా మొదల వుతాయి.
ఆయన చూరు లోంచి చాప తోక ( లోగడ పంతుళ్ళు వాడే అత్యంత చురుకైన బెత్తం) తీయడము ,
నిద్ర పోయే బద్ర రావు ని లేపి ఏమి జరిగిందో తెలిసే లోపు
ఒక అరగంటపాటు వీపు మీద జజ్జ నకరి జజ్జ నకరి జజ్జ నకరి జనారే .
.
బద్ర రావు గాడి పొలికేకలకీ అందరూ నిద్ర లేచారు,
ఒకరి ముఖాలు ఒకరు భయం భయం గా ఆశర్యంగా చూసుకుంటూ.
“నాకేం తెలీదు బాబోయ్” అని వాడు దీనంగా అరిచే అరుపులు పట్టించుకోకుండా
చేప తోక విరిగే వరకు వాడి వివాహ వేడుకలు జరిగాయి..
బద్ర రావు గాడి పొలికేక లతో వీది వీదంతా మార్మోగిపోయింది.
.
ఆలస్యంగా పడుకున్ననాకు బద్ర రావు కేకలతో మెళుకువ వచ్చేసింది.
నాకు మాత్రం చెవి లో spirit పోసినట్లు ఎంతో హాయి....
వాడి పోలి కేకలు ఇప్పటికీ గుర్తున్నాయి.
నా బాల్యం లో నేను అనుభవించిన ఆనంధ క్షణాలు అవి.
.
సాయంత్రానికి మా మాస్టరికి ,సదరు బద్ర రావు నిజంగా బండోడే అని,
ఈ మైండ్ గేమ్ మన పనే నని తెలిసింది.
.
పంతుల్లవద్ద పప్పులు ఉడుకుతాయా?
.
నే చెప్పినది అంతా విన్నాక ఆయన పెద్దగా నవ్వుతూ..వీపు మీద ఒక్కటిచ్చాడు.
ఈ తెలివి చదువులో చూపించరా భాడవా అని ముచ్చటగా దీవించారు.
నేను చదువు పట్ల ఆసక్తి . అనురాగం పెంచుకోటానికి ఆయన ప్రేరణే కారణం.
.
ఎస్‌ఎస్‌సి లో 1980 సంవత్సరం ఆ స్కూలో పరీక్ష వ్రాసిన అందరిలోకి టాప్ వచ్చాను.
457/600 కి అప్పట్లో అది రికార్డు.
కీర్తి శేషులు శ్రీ రామ మూర్తి మాస్టారుకి సదా ఋణపడి ఉన్నాను. __/|\__

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...